
బాలీవుడ్ నటి షెహ్నాజ్ గిల్ మోడల్, గాయని కూడా. ఆమె పలు మ్యూజిక్ వీడియోస్, టెవిజన్ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. షెహ్నాజ్ కౌర్‌గా కూడా పిలిచే ఆమె పంజాబీ, హిందీ టెలివిజన్ చిత్రాలలో నటిస్తుంది. అంతేగాదు ఆమె సోషల్ మీడియా సెన్సెషన్ కూడా. ఇటీవల బాలీవుడ్ టీవీ షో మిర్చి ప్లస్‌లో శిల్పా శెట్టి కుంద్రాతో జరిగిన సంభాషణలో తన డైట్ ప్లాన్ గురించి షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.
ఆమె దాదాపు 55 కిలోలు బరువు తగ్గారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ ఆమె ఫిట్‌నెస్ సీక్రెంటో ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు. అందరి కుతుహలానికి తెరపడేలా ఆమె తన డైట్ సీక్రెట్ ఏంటో బయటపెట్టింది. ఆమె ఏం చెప్పారంటే..
డైట్ ప్లాన్..
తాను సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరునెలల్లోనే ఇంతలా స్లిమ్‌గా మారిపోయానని చెప్పారు. తన రోజుని పసుపుతో ప్రారంభిస్తానని అంటోంది. పసుపు ఆరోగ్య నిర్వహణకు మంచిదే అయినప్పటికి సరైన మార్గంలో ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు పొందొగలమని అంటోంది.
తాను హైడ్రేషన్‌గా ఉండేలా తగినంత నీరు తాగిన తర్వాత పెసరట్టు లేదా మెంతీ పరాఠాలతో కూడిన అల్పహారాన్ని ఎంచుకుంటానని తెలిపారు. చాలావరకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ పరిమాణంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. ఒక్కోసారి అల్పాహారంగా పోహా కూడా తీసుకుంటానని అంటోంది.
ఇక తాను కూరగాయల రెసిపీనే ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. అలాగే వాటిలో తప్పనిసరిగా జీలకర్ర, ఆవాలు ఉండాల్సిందేనట. ఎక్కువగా మాత్రం బ్రకోలి, క్యారెట్, బెల్ పిప్పర్ వంటివి తీసుకుంటానని చెప్పింది. భోజనంలో ఎప్పుడు ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా మొలకలు, టోపు స్క్రాంబుల్, నెయ్యి, రోటీతో కూడిన పప్పు, సలాడ్‌లు ఉంటాయని చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమతుల్యత ఉండేలా చూసుకుంటానని వెల్లడించింది. అలాగే పార్టీ టైంలో డైట్ ప్లాన్ బ్రేక్ చేయకుండా ఎలా ఫుడ్ తీసుకుంటున్నామనే దానిపైనే బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందని నొక్కి చెబుతుంది.
ఇదేగాక డిన్నర్ టైంలో మఖానా తీసుకుంటానని అన్నారు. ఇది ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. పైగా ఇది బరువు తగ్గడం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మద్దితిస్తుందని చెబుతోంది షెహ్నాజ్. చాలావరకు తేలిక పాటి విందునే స్వీకరించడం ఉత్తమం అని అంటోంది. దీని వల్ల జీర్ణక్రియ, నిద్ర నాణ్యత తోపాటు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తందని చెప్పుకొచ్చింది. ఇలా ఆరోగ్యకరమైన రీతీలో డైట్ ప్లాన్ తోపాటు స్ట్రిట్‌గా పాటించే గట్స్ ఉంటే ఈజీ బరువు తగ్గగలరని చెబుతోంది.
(చదవండి: తలకు మర్దనా చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..! )
Comments
Please login to add a commentAdd a comment