Roy Lakshmi
-
జాగ్రత్త అంటోన్న అక్షయ్, అవి కూడా జీవితాన్నిఇస్తాయంటున్నా అరియాన
తక్కువ విచారించండి, ఎక్కువ నవ్వండి: ప్రగ్యా జైస్వాల్ కొన్ని సమయంలో జీవం లేని వస్తువులు కొత్త జీవితాన్ని ఇస్తాయంటున్న అరియాన గ్లోరీ రణ్వీర్ సింగ్‌కు అలియారేఅలియా స్టేప్పులేస్తున్న అక్షయ్ కుమార్. ఈ స్టెప్పులతో జాగ్రత్త అంటూ హెచ్చరిక ‘నేటి ఈ కష్టం రేపటి మీ బంగారు భవిష్యత్తుకు పునాది’ అంటున్న ప్రియమణి View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
వాళ్ల మైండ్‌సెట్ మారుతుందనుకుంటున్నా
‘‘ఇప్పటివరకూ ఫ్యామిలీ, హారర్, థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చేశా. చాలా రోజులుగా కామెడీ నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుండేది. అది ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ చిత్రంతో తీరింది. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రమిది’’ అని రాయ్ లక్ష్మీఅన్నారు. ఈ సినిమాతో కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సమర్పణలో ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాయ్ లక్ష్మీ పంచుకున్న విశేషాలు... ► గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’. ఇందులో వెంకటలక్ష్మి అనే చిన్నపిల్లల టీచర్ పాత్ర చేశాను. కామెడీ, హ్యూమర్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. ఈ మధ్య కామెడీ సినిమాలు వస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో రావడం లేదు. మా సినిమాలో వినోదంతో పాటు సస్పెన్స్ ఉంటుంది. అమలాపురం వద్ద షూటింగ్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ► రచయిత తటవర్తి కిరణ్ ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ కథ చెప్పగానే ఎగై్జట్ అయ్యా. కిషోర్ కుమార్‌కి ఇది తొలి చిత్రమైనా ఎక్కడా అలా అనిపించకుండా తెరకెక్కించారు. నిర్మాతలకు ఇది తొలి సినిమా అయినా ఖర్చు విషయంలో రాజీ పడలేదు. హరి గౌర పాటలు బాగున్నాయి. ఇందులోని ‘పాపా.. నీకు ఏదంటే ఇష్టం...’ నా ఫేవరేట్ సాంగ్. ఈ సినిమాలో ఎక్కువగా చీరలోనే కనిపిస్తా. చీరలోనూ ఎంతో గ్లామరస్‌గా కనిపించొచ్చని సుస్మితాసేన్గారు నిరూపించారు. ► నేను తెలుగు సినిమాలు తగ్గించలేదు. ప్రస్తుతం తమిళ్లో బిజీగా ఉన్నానంతే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నా. నాది లీడ్ రోలా? స్పెషల్ సాంగా? అని ఆలోచించను. ఏదైనా నాకు ఓకే. ప్రత్యేక పాటలతోనూ నేను హ్యాపీ. బాలీవుడ్లో ప్రత్యేక పాట అంటారు.. టాలీవుడ్లో ఐటమ్ సాంగ్ అంటారు. ‘బలుపు’ సినిమా నుంచి ప్రత్యేక పాటల్లో నర్తిస్తున్నా. ‘సర్దార్ గబ్బర్‌సింగ్, ఖైదీనంబర్ 150’ చిత్రాల్లో చేసిన ప్రత్యేక పాటలు గుర్తింపు తీసుకొచ్చాయి. ► తెలుగులో నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎక్కడికెళ్లినా ‘రత్తాలు’ అని పిలుస్తున్నారు. లక్ష్మీరాయ్ కంటే రత్తాలుగా బాగా ఫేమస్ అయిపోయా. ‘రత్తాలు’ పాట తీసే ముందు రోజు చిరంజీవిగారితో పాట అని రాత్రి ఫోన్ చేసి చెప్పారు. పొద్దున్నే హైదరాబాద్‌లో వాలిపోయా. ఈ పాటకు ప్రాక్టీస్ కూడా చేయలేదు. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ► బాలీవుడ్‌లోనూ అవకాశాలొస్తున్నాయి. అయితే ‘జూలీ 2’ సినిమా జోనర్ సినిమాలే కావడంతో చేయడం లేదు. ప్రస్తుతం 3 తమిళ సినిమాలు, ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్నా. చాలా రోజుల కిందట ఓ తెలుగు సినిమాకి సంతకం చేశా. ఇందులో నేను, అంజలి కలిసి నటిస్తాం. నా డేట్స్ లేకపోవడంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ సినిమా రిలీజ్ తర్వాత నన్ను అందరూ ‘పాప’ అంటారు. ఈ చిత్రంలో నా పాత్ర చూశాక ప్రత్యేక పాటలివ్వాలనే వారి మైండ్‌సెట్ మారుతుందను కుంటున్నా (నవ్వుతూ). ► ‘మీటూ’ ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. కొంత మంది ప్రతీకారం తీర్చు కోవడం కోసం, ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చారు. దాంతో ఆ ఉద్యమం అసలు లక్ష్యం నెరవేరలేదు. కొంతమంది వాళ్ల గళం విప్పిన విధానం మాత్రం అభినందనీయం. -
డబుల్ ధమాకా
రాయ్‌లక్ష్మికి నిన్న (ఆదివారం) స్పెషల్ డే. ఎందుకంటే ఆమె నటిస్తున్న రెండు సినిమాల ఫస్ట్ లుక్‌లు ఒకే రోజు విడుదలయ్యాయి. తమిళంలో రాయ్‌లక్ష్మి నటిస్తున్న ఫాంటసీ కమ్ హారర్ మూవీ ‘సిండ్రెల్లా’. ఈ సినిమాతో వినోద్ వెంకటేశ్ కోలీవుడ్‌కు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆమె తెలుగులో నటిస్తున్న హాస్య భరిత చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. ఈ సినిమాతో కిషోర్ కుమార్ దర్శకునిగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ‘సిండ్రెల్లా, వేర్ ఈజ్ ద వెంటకలక్ష్మి’ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్స్ ఆదివారం విడుదల అయ్యాయి. ‘‘నా రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ యాదృచ్ఛికంగా ఒకే రోజు రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ సినిమాలో ప్రవీణ్, మధునందన్‌తో కలిసి పనిచేయడం బాగుంది. సెట్లో చాలా సరదాగా ఉంటున్న ‘సిండ్రెల్లా’ టీమ్‌కి కూడా థ్యాంక్స్. త్వరలో విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు రాయ్‌లక్ష్మి. ఎలాగైతేనేం.. దీపావళికి ముందుగానే తన అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు రాయ్‌లక్ష్మి. -
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే!
...చాలే ఇది చాలే అంటూ ఫుల్‌గా ఆనందపడిపోతున్నారు హీరోయిన్ రాయ్‌లక్ష్మి. ఈ సాంగ్ ‘గీతగోవిందం’ లోనిదే కావచ్చు. కానీ ఆ మూమెంట్‌ను ఇప్పుడు రాయ్‌లక్ష్మి కూడా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. దాదాపు ఆరేళ్ల తర్వాత కన్నడలో ‘ఝాన్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మీ. పీవీఎస్ గురుప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా మొదలైంది. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ ఝాన్సీ పాత్రలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మి. ఈ సినిమా సెట్స్‌కు రాయ్‌లక్ష్మి తల్లి వెళ్లారు. అందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా? విషయం ఉంది. ‘‘నా సినీ కెరీర్ (దాదాపు పదకొండేళ్ల కెరీర్) లో ఫస్ట్ టైమ్ మా అమ్మగారు సెట్స్‌కు వచ్చారు. ఇంతకన్నా నాకు ఇంకేం స్పెషల్ ఉంటుంది. ఇది నా లైఫ్‌లో వన్నాఫ్ ది బెస్ట్ మూమెంట్స్’’ అని పేర్కొన్నారు రాయ్‌లక్ష్మి. ఇంతకు ముందు 2012లో వచ్చిన ‘కల్పన’ చిత్రంతో శాండిల్‌వుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు రాయ్‌లక్ష్మి. తమిళంలో వచ్చిన ‘కాంచన’ చిత్రానికి ఇది రీమేక్. అలాగే ప్రస్తుతం సౌత్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ‘వేర్ ఈజ్ వెంకట్‌లక్ష్మి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె టీచర్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు కిశోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. -
కనబడుట లేదు!
ఎవరో తెలుసా? వెంకటలక్ష్మి. కుటుంబ సభ్యులు కంగారుపడి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి.. వెంకటలక్ష్మిని ఎవరైనా దాచారా? లేక ఏదైనా సమస్య నుంచి తప్పించుకోవాలని పారిపోయి తనే దాక్కుందా? అనే ప్రశ్నలకు కొన్ని రోజుల తర్వాత వెండితెరపై సమాధానం దొరకుతుంది. వెంకటలక్ష్మిగా థియేటర్లోకి రాబోతున్నది రాయ్‌లక్ష్మీ. గతేడాది ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో ‘రత్తాలు రత్తాలు..’ స్పెషల్ సాంగ్‌లో నర్తించి యూత్‌ను ఉర్రూతలూగించారామె. ఇప్పుడు రాయ్‌లక్ష్మీ తెలుగులో హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. కిశోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీక్, ప్రవీణ్, మధునందన్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎమ్. శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మిస్తున్నారు. హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సూపర్ ఫన్
అతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ స్నేక్స్ అతని జీవితంలోకి వచ్చాయి. ఆ నెక్ట్స్ ఏం జరిగింది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్ లక్ష్మీ, కేథరిన్ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న సినిమా ‘నీయా 2’. సురేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. 1979లో వచ్చిన కమల్‌హాసన్ ‘నీయా?’ చిత్రానికి ఇది సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. ‘నీయా 2’లో హీరో జై సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. కొడైకెనాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా సెట్లోకి లేటెస్ట్గా జాయిన్ అయ్యారు వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రస్తుతం వరలక్ష్మి శరత్‌కుమార్, రాయ్ లక్ష్మీ, జై లపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ‘‘టామ్ బాయ్ వరలక్ష్మి శరత్‌కుమార్ సెట్లో జాయిన్ అయ్యారు (సరదాగా). సూపర్ ఫన్ను ఎంజాయ్ చేస్తున్నాం. ఆమె టాకింగ్ స్పీడ్‌ను జై, నేను అందుకోలేక పోతున్నాం. మాకు మరింత ఎంటర్టైన్మెంట్ కావాలి వరూ. అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్లకు’’ అని రాయ్‌లక్ష్మీ పేర్కొన్నారు. -
వేరే బాయ్‌ఫ్రెండ్స్ గురించి... అడగరెందుకు?
నేను ధోనీతో మాత్రమే డేటింగ్ చేశానా? గతంలో నలుగురైదుగురితో రిలేషన్షిప్స్లో ఉన్నా. వాళ్ల గురించి ఎవరూ అడగరెందుకు? వాళ్లూ ఫేమస్ పీపులే! కానీ, ధోనీ గురించే ఎందుకు?... ధోనీ గురించి ఎవరు ప్రశ్నించినా ఇలా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు రాయ్ లక్ష్మీ. అలాగని, ముంబయ్ మీడియా ఆమెను ధోనీ గురించి అడగడం మానడం లేదు. అదే రాయ్ లక్ష్మీకి నచ్చడం లేదు. హిందీలో ఈ హీరోయిన్ నటించిన ‘జూలీ–2’ వచ్చే నెల 6న విడుదలవుతోంది. ట్రైలర్, సాంగ్ ప్రోమోలు చూసినోళ్లు ఈ హీరోయిన్ ఎవరో? సన్నీ లియోన్‌కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేలా కనపడుతోందని కామెంట్ చేస్తున్నారు. ‘జూలీ–2’ ప్రమోషన్ కోసమని ముంబయ్ వెళ్లిన రాయ్ లక్ష్మీని చాలామంది ధోనీ డిస్కషన్‌తో రౌండప్ చేస్తున్నారు. ఓ సందర్భంలో చిరాకు ఎక్కువై, ‘ధోనీ ఎవరు?’ అని కూడా ప్రశ్నించారీ బ్యూటీ! ‘‘తనకు (ధోనీకి) పెళ్లైంది. నేనిప్పుడు ఎవరితోనూ రిలేషన్షిప్లో లేను. ప్రస్తుతానికి నాకు కెరీరే ముఖ్యం. ఇకపై ఎఫైర్స్ గురించి ప్రశ్నించొద్దు’’ అని రాయ్ లక్ష్మీ స్పష్టం చేశారు. -
ఎక్స్ఎల్ టు స్మాల్!
‘‘బాగా సన్నగా ఉన్నావు.. కొంచెం బరువు పెరుగు’ అని ఎవరైనా అంటే.. ఈజీగా పెరగొచ్చు. కానీ, పెరిగాక తగ్గమంటే మాత్రం అంత ఈజీ కాదు’’ అంటున్నారు రాయ్ లక్ష్మీ. ఆ మధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో ‘తప్పు తప్పే తప్పు తప్పే.. శుద్ధ తప్పే..’ పాటలో కూడా కనువిందు చేశారామె. ఇప్పుడీ బ్యూటీ హిందీ చిత్రం ‘జూలీ–2’లో నటించారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రెచ్చిపోనంతగా ఈ సినిమాలో గ్లామర్వైజ్గా రెచ్చిపోయారు. బికినీ ధరించారు. దాని గురించి చెబుతూ – ‘‘సౌత్ సినిమాల్లో నేను ‘సెమీ బికినీ’ వేసుకున్నా. ఫస్ట్ టైమ్ పక్కా బికినీ వేసుకున్నది ఈ సినిమాకే. కథ డిమాండ్ చేసినప్పుడు, ఫిజిక్ బాగున్నప్పుడు బికినీ వేసుకుంటే తప్పేంటి? అది తప్పు కాదు.. శుద్ధ తప్పు కాదు’’ అన్నారు. ఇక, బరువు తగ్గడానికి ఏం చేశారనే విషయం గురించి రాయ్ లక్ష్మీ చెబుతూ – ‘‘ఇండియాలో ఉన్న బెస్ట్ ట్రైనర్స్ 35 మంది ‘వెయిట్ లాస్’ విషయంలో నాకు ట్రైనింగ్ ఇచ్చారు. నా డ్రెస్ సైజ్ ‘ఎక్స్ఎల్’ (ఎక్స్ట్రా లార్జ్) అనుకోండి.. అక్కణ్ణుంచి ‘ఎమ్’ (మీడియమ్), ఆ తర్వాత స్మాల్ సైజ్‌కి చేరుకున్నా. అది అంత ఈజీ కాదండి’’ అన్నారు. రాయ్ లక్ష్మీ పడ్డ కష్టం ఊరికే పోదు.. ‘జూలీ–2’ పోస్టర్స్ చూసినవాళ్లు ‘కేక’ అంటున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. రాయ్ లక్ష్మీ నటన చూసి, కూడా అదే మాట అంటారని ఊహించవచ్చు. అన్నట్లు.. ఇది ఆమెకు 50వ సినిమా.