కాజల్‌ను వరించిన అదృష్టం | Kajal agarwal very lucky girl | Sakshi
Sakshi News home page

కాజల్‌ను వరించిన అదృష్టం

Published Wed, Dec 23 2015 8:26 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

కాజల్‌ను వరించిన అదృష్టం - Sakshi

కాజల్‌ను వరించిన అదృష్టం

చెన్నై : కలిసొచ్చే కాలంలో ఒక అవకాశం పోయినా మరోకటి వరిస్తుంది. దాన్నే అదృష్టం అంటారు. నటి కాజల్ అగర్వాల్‌ది సేమ్ టైమ్. ఆ మధ్య విశాల్‌తో పాయుంపులి చిత్రంలో నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. నృత్యదర్శకుడు, నటుడు లారెన్స్‌కు జంటగా మొట్టశివ కెట్ట శివ చిత్రంలో కాజల్ నాయకిగా ఎంపికయ్యారు. అయితే ఆ చిత్ర కథ మారిపోవడం, కాజల్ నటించాల్సిన చిత్రం వాయిదా పడటం జరిగింది. అదే విధంగా విక్రమ్‌తో నటించాల్సిన అవకాశం చేజారిపోయింది.
 
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మర్మమనిధన్ చిత్రంలో విక్రమ్‌తో రొమాన్స్ చేయనున్న కాజల్ అనే ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం చేతులు మారడంతో విక్రమ్ సరసన కాజల్‌ను తొలగించి నయనతారను ఎంపిక చేశారు. అదే విధంగా మరో నాయకిగా బిందుమాధవి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడా పాత్రలో నిత్యామీనన్ వచ్చి చేరింది. విక్రమ్ ఈ చిత్రంతో పాటు దర్శకుడు తిరు దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు.
 
ఇందులో ఆయనకు జంటగా కాజల్ అగర్వాల్ నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఆ విధంగా ఒకటి మిస్ అయినా మరో మైటీ అవకాశం కాజల్ అగర్వాల్‌ను ఖుషీ చేసిందన్న మాట.ప్రస్తుతం ఆమె తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన సర్ధార్ గబ్బర్‌సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే హిందిలో రణదీప్ హూడతో నటించిన దో లఫ్‌జోన్ కీ కహానీ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement