సాధారణంగా సినిమా నటీనటులని చూడగానే, వాళ్లకేంటి సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. కానీ అది అన్నిసార్లు నిజం కావాలని రూలేం లేదు. పలువురు హీరోయిన్లు.. బయటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల పలు సమస్యలతో బాధపడుతుంటారు. సందర్భం వచ్చినప్పుడే వాటిని చెబుతుంటారు. అలా హీరోయిన్ కాజల్ అగర్వాల్, తనకు ఎదుర‍్కొన్న డిప్రెషన్ గురించి ఇప్పుడు బయటపెట్టింది.
కాజల్ కెరీర్
'లక్ష‍్మీ కల్యాణం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. కెరీర్ ప్రారంభంలో పలు చిన్న సినిమాల్లో నటించింది. ఎప్పుడైతే 'మగధీర' చేసిందో ఆమె దశ తిరిగిపోయింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి లాక్‌డౌన్ ముందు వరకు దక్షిణాదిలో స్టార్ హీరోలతో కలిసి చాలా సినిమాలు చేసింది. 2020లో బిజనెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. గతేడాది ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో చాట్ చేస్తూ తన డిప్రెషన్ గురించి బయటపెట్టింది.
(ఇదీ చదవండి: తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం)
ఫ్యామిలీ అండతో
'ప్రసవం తర్వాత నేను కూడా డిప్రెషన్‌ని ఎదుర్కొన్నాను. అది సర్వసాధారణమైన విషయం. మహిళలు ఎవరైనా సరే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో ఇబ్బందిపడితే ఫ్యామిలీ వాళ్లకు అండగా నిలబడాలి. అలానే ఆడవాళ్లు.. పిల్లలు పుట్టిన తర్వాత తమకంటా కొంత టైమ్‌ని కేటాయించుకోవాలి. ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేయడం, ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని ఆస్వాదించడం, ఇలా కొన్ని పనులు చేసి డిప్రెషన్ దశని దాటొచ్చు. నన్ను ఎంతగానే అర్ధం చేసుకునే కుటుంబం ఉండటంతో దాన్ని దాటి త్వరగా బయటకొచ్చేశాను. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ టైంలో నా వల్ల భర్త గౌతమ్ కిచ్లూ చాలా క్లిష‍్టమైన పరిస్థితులు చూశారు' అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.
ఆ సినిమాలతో బిజీ
ప్రస్తుతం కమల్‌హాసన్ 'ఇండియన్ 2'లో హీరోయిన్‌గా చేస్తున్న కాజల్.. బాలకృష‍్ణ 'భగవంత్ కేసరి'లోనూ నటిస్తోంది. మరోవైపు 'సత్యభామ', 'ఉమ' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తోనూ బిజీగా ఉంది. ఇవన్నీ రాబోయే కొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో కొన్ని హిట్ అయినాసరే కాజల్.. మళ్లీ పుంజుకోవడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?)
Comments
Please login to add a commentAdd a comment