సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు..? | devi sri prasad sentiment for nannaku prematho, sardar gabbar singh | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు..?

Published Sat, Nov 28 2015 8:57 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు..? - Sakshi

సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు..?

సినీ రంగంలో సెంటిమెంట్ ను ఫాలో అయినంతగా మరే రంగంలోనే ఫాలో అవ్వరు అంటే అతిశయోక్తి కాదేమో. అందుకే హిట్ కాంబినేషన్లను, హిట్ ఫార్ములాలను పదే పదే రిపీట్ చేస్తుంటారు మన టాలీవుడ్ సినీ ప్రముఖులు. అలాంటి ఓ సెంటిమెంట్నే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్. గతంలో స్టార్ హీరోలతో తన సంగీతం దర్శకత్వంలో పాటలు పాడించి సక్సెస్ సాధించిన దేవీ, మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడట.

రెగ్యులర్గా తన సినిమాలో సింగర్స్తో పాటు గొంతు కలిపే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... 'అత్తారింటికి దారేది', 'గబ్బర్సింగ్' సినిమాల్లోనూ పాటలు పాడిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల సక్సెస్లో పవన్ పాడిన పాటలు కూడా తమ వంతుగా కలెక్షన్ల వేటకు సాయం చేశాయి. అదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అదుర్స్' సినిమాలో ఎన్టీఆర్తో ఓ పాటలో హమ్ చేయించాడు దేవీ శ్రీ. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఇది సెంటిమెంట్గా భావించిన దేవీ శ్రీ ప్రసాద్, మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' సినిమాతో పాటు, పవన్ హీరోగా తెరకెక్కుతున్న 'సర్థార్ గబ్బర్ సింగ్' సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు దేవీ శ్రీ. ఈ రెండు సినిమాల్లో మరోసారి పవన్, ఎన్టీఆర్లతో పాటలు పాడించాలని ప్లాన్ చేస్తున్నాడట. సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఈ రెండు సినిమాలు కూడా ఘనవిజయం సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement