
వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. తన సొంత ఫ్యాన్స్‌నే కాకుండా తన కాపుల్ని, తనని తానే పవన్ వెన్నుపోటు పొడిచేసుకున్నాడని విమర్శించారు.
'ఆరోజు ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎన్నుపోటు పొడిచిన దానికంటే దారుణంగా ఈరోజు పవన్ తన జనసైనికులను, ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచి చంపేశాడు..వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి' అంటూ వర్మ ట్వీట్ చేశారు.
కాగా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదని, వచ్చే ఎన్నికల్లో లిసివచ్చే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఆ రోజు @ncbn #NTR ని వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు @PawanKalyan తన జనసైనికులని , తన ఫ్యాన్స్ ని
— Ram Gopal Varma (@RGVzoomin) May 11, 2023
వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి .
తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు. https://t.co/YqSzrhuPHX
— Ram Gopal Varma (@RGVzoomin) May 11, 2023