వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ చిత్రం శనివారం ఆర్జీవీ వరల్డ్ థియేటర్.కామ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై తెరకెక్కిన వ్యంగ్యాత్మక చిత్రం ఇది. అయితే ఈ చిత్రం విడుదలైనప్పటీ నుంచి ఆర్జీవీ.. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ‘పవర్ స్టార్’లోని పలు సన్నివేశాలను విడుదల చేస్తూ వరుస ట్వీట్‌లు చేస్తున్నాడు. ఆర్జీవీ సోమవారం మూడు వీడియోలను ట్విటర్‌లో పంచుకున్నాడు. ఇందులో మొదటి రెండు వీడియోల్లో వర్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. (చదవండి: ‘పరాన్న జీవి’ రాకతో మరింత రసవత్తరం!)
EX M C with POWER STAR..Watch in https://t.co/YpBOXfI9v7 pic.twitter.com/tJ1e8P9JhQ
— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2020
మొదటి వీడియోలో.. ‘2019 ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు, పవన్‌ను యువకులు, ఉత్సాహవంతులు అయ్యిండి ఇలా ఢీలా పడిపోయి మాట్లాడటం కరెక్టు కాదండి జయాపజయాలకు ఎవరూ అతీతం కాదంటూ ఓదార్చుతున్న ఓ సన్నివేశాన్ని.. ‘పవర్ స్టార్‌తో మాజీ సీఎం’ అంటూ షేర్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో మెగాస్టార్ రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘అన్నయ్య చేసినన్ని తప్పులు మీరెం చేయలేదు కదా సార్.. మీకు ఇలా ఎందుకు అయ్యింది. అన్నయ్యకు 18 సీట్లు వస్తే మీకు ఒక్కటే సీటు వచ్చింది’’ అంటూ పవర్‌స్టార్ సెక్యూరిటీ బాధపడుతుంటాడు. (చదవండి: పవర్ స్టార్‌పై అంచనాలు పెంచుతున్న ఆర్జీవీ)
Log in to https://t.co/YpBOXfI9v7 to watch POWER STAR pic.twitter.com/I6buSYSpX6
— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2020
ఇక మూడో వీడియోలో ఆర్జీవీ పవన్‌తో మీరు 2024 ఎన్నికల్లో లక్ష శాతం సీఎం అవ్వబోతున్నారని నేడు చెబుతున్న అంటూ చెప్పిన సన్నివేశం వీడియోను షేర్ చేశాడు. అయితే తమ అభిమాన హీరో పరువుకు భంగం కలిగేలా పవర్ స్టార్ సినిమా ఉందంటూ వర్మపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో పవర్ స్టార్ సినిమాలో ఆర్టిస్టుగా ఆర్జీవీ తన ఫొటోను షేర్ చేయడంతో పవన్ అభిమానులు ఆయనను ట్రోల్ చేశారు. అదే విధంగా ‘పవర్‌స్టార్’ సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
Rram Gropal Vrarma from POWER STAR pic.twitter.com/C0BRCUSaU3
— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2020
Comments
Please login to add a commentAdd a comment