పవన్ను దాటేసిన జూనియర్ | Ntr Breaks pawan kalyan record | Sakshi
Sakshi News home page

పవన్ను దాటేసిన జూనియర్

Published Wed, Jan 27 2016 2:16 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ను దాటేసిన జూనియర్ - Sakshi

పవన్ను దాటేసిన జూనియర్

ఒకప్పుడు సినిమా సక్సెస్ను ఎన్ని రోజులు ఆడింది అన్న దాన్ని బట్టి చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలు కూడా 15 రోజులకు మించి థియేటర్లలో ఉండే పరిస్థితి లేదు. దీంతో సినిమా సక్సెస్ను కలెక్షన్లతో లెక్కవేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల మధ్య ఈ కలెక్షన్ల రికార్డ్ల పోటి ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్ చేసిన ఓ రికార్డ్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ఓవర్సీస్లో సాధిస్తున్న కలెక్షన్లు సినిమా సక్సెస్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే స్టార్ హీరోలందరూ ఓవర్సీస్లో మిలియన్ మార్క్ కలెక్షన్ల కోసం ఆరాటపడుతున్నారు. ఈ లిస్ట్లో భారీ వసూళ్లతో బాహుబలి నెంబర్ వన్ స్థానంలో ఉండగా, మహేష్ శ్రీమంతుడు రెండో స్థానంలో ఉంది. ఇక మొన్నటి వరకు పవన్ అత్తారింటికి దారేది మూడో స్థానంలో ఉండగా, తాజాగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాతో ఆ పవన్ కలెక్షన్ రికార్డ్ను అధిగమించాడు.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన అత్తారింటికి దారేది ఓవర్ సీస్ మార్కెట్లో 11 కోట్ల 34 లక్షలు వసూళు చేసింది. అయితే ఎన్టీఆర్, ఈ రికార్డ్ను కేవలం పది రోజుల్లోనే దాటేశాడు. జనవరి 13న నాన్నకు ప్రేమతో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్, ఇప్పటికే  11 కోట్ల 51 లక్షలకు పైగా వసూళ్లు సాధించాడు. దీంతో ఓవర్సీస్లో పవన్ రికార్డ్ను అధిగమించి హైయస్ట్ కలెక్షన్లు సాధించిన మూడో హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement