ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ సినిమాలో జగ్గూ భాయ్‌ | Jagapathi Babu Villain for NTR in Trivikram Film | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 10:40 AM | Last Updated on Sat, Mar 17 2018 11:29 AM

Jagapathi Babu Villain for NTR in Trivikram Film - Sakshi

జగపతి బాబు

జై లవ కుశ సినిమా తరువాత షార్ట్‌ గ్యాప్‌ తీసుకున్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించేందుకు కష్టపడుతున్నాడు ఎన్టీఆర్‌. ప‍్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ప్రతినాయకుడిగా కనిపించబోయే నటుణ్ని ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాలో విలన్‌గా నటించిన జగపతి బాబు మరోసారి ఎన్టీఆర్‌కు విలన్‌గా నటించనున్నాడట. ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్‌గా ఇప్పటికే భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాపై జగపతిబాబు ఎన్టీఆర్‌తో అంచనాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement