పాస్ ల కోసం పవన్ ఫ్యాన్స్ లొల్లి | Pawan fans protest at Chiranjeevi Blood Bank | Sakshi
Sakshi News home page

పాస్ ల కోసం పవన్ ఫ్యాన్స్ లొల్లి

Published Sun, Mar 20 2016 4:41 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పాస్ ల కోసం పవన్ ఫ్యాన్స్  లొల్లి - Sakshi

పాస్ ల కోసం పవన్ ఫ్యాన్స్ లొల్లి

- చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద పవన్ అభిమానుల నిరసన
హైదరాబాద్

 పవన్‌కల్యాణ్ అభిమానులకు సర్దార్ గబ్బర్ సింగ్ ఫీవర్ పట్టుకుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం పాస్‌లు కావాలంటూ పవన్ అభిమానులు ఏకంగా ఆందోళనకు దిగారు. జూబ్లిహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు గేటు ముందు ఆదివారం పవన్ బ్యానర్ పట్టుకుని తమకు పాస్‌లు కావాలంటూ అభిమానులు కొద్దిసేపు నినాదాలు చేశారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది.

కాగా... భద్రతా కారణాల రీత్యా పాస్‌లు లేని వారు కార్యక్రమానికి రావద్దని పవన్‌కల్యాణ్ తన అభిమానులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ కు పాస్ లు కావాలని పవన్ అభిమానులు రోడ్డెక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement