'పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. టేపులతో రండి' | Pawan Kalyan fans from all over should come with measuring tapes: Ram Gopal verma tweets | Sakshi
Sakshi News home page

'పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. టేపులతో రండి'

Published Wed, Apr 6 2016 10:39 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

బాహుబలి రిలీజైన రోజు టికెట్ల కోసం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర క్యూలైన్(ఫైల్ ఫొటో) (ఇన్ సెట్: ఎస్ జీఎస్ స్టిల్, వర్మ) - Sakshi

బాహుబలి రిలీజైన రోజు టికెట్ల కోసం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర క్యూలైన్(ఫైల్ ఫొటో) (ఇన్ సెట్: ఎస్ జీఎస్ స్టిల్, వర్మ)

'బివేర్.. మరో రెండు రోజుల్లో సమ్మర్ హీట్ పీక్స్ కు వెళ్లబోతోంది. ఆకాశంలో సూర్యుడి ప్రతాపంతోకాదు, బాక్సాఫీస్ దగ్గర పవన్ కల్యాణ్(పీకే) సినిమా'సర్దార్ గబ్బర్ సింగ్ (ఎస్జీఎస్)' సృష్టించబోతోన్న ప్రభంజనంతో!'.. ఫిల్మ్ నగర్ లోనేకాదు పీకే సినిమాతో రిలేట్ అయిన ప్రతిఒక్కరి నోటా ఇదే మాట! ఇక మెగా కుటుంబానికి వీరాభిమానినని(!) చెప్పుకునే రామ్ గోపాల్ వర్మదీ దాదాపు ఇదే మాట. మామూలుగానే పీకేపై ట్వీట్ల బాణాలు కురిపించే వర్మ.. ఎస్జీఎస్ రిలీజ్ అవుతోందంటే ఊరుకుంటాడా! మళ్లీ వదిలాడు..

'పీకే ఫ్యాన్స్.. మీరంతా దూరాలు కొలిచే టేపులతో థియేటర్లకు రండి' అని సలహా ఇస్తున్నాడు వర్మ. ఎందుకు? ఇంకెందుకు.. ఎస్ జీఎస్ రిలీజ్ అవుతోన్న థియేటర్ల దగ్గర టికెట్లకోసం జనం కట్టిన క్యూ లైన్లు ఎంత పొడుగుంటాయో కొలవడానికి. 'బాహుబలి విడులైన రోజు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర టికెట్లకోసం జనం 1.5 కిటోమీటర్ల దూరం క్యూ కట్టారు. ప్రభాస్ కే అంత దూరం క్యూ కడితే, ఇక పీకే కోసం ఏ రేంజ్ లో క్యూకడతారో చూడాలని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల స్క్రీన్లపై ఉగాది(8న) పండుగనాడు విడుదలకానున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో భారీ స్థాయిలో విడుదలవుతోన్న రెండో చిత్రంగా రికార్డులకెక్కనుంది. ఓవర్సీస్ లో దాదాపు 800 స్క్రీన్లు, హిందీలో మరో 800 స్క్రీన్లపై చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక తెలుగులో రమారమి రెండున్నరవేల పైచిలుకు స్క్రీన్లపై సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలయ్యే అవకాశంఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement