నో ఐటమ్ సాంగ్స్ | Kajal Agarwal says no to 'item number' | Sakshi
Sakshi News home page

నో ఐటమ్ సాంగ్స్

Published Sun, Sep 18 2016 1:45 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

నో ఐటమ్ సాంగ్స్ - Sakshi

నో ఐటమ్ సాంగ్స్

ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయనంటున్నారు నటి కాజల్‌ఆగర్వాల్. టాప్ హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్‌లో నటించడం అన్న సంస్కృతి తొలుత బాలీవుడ్‌లో మొదలై ఆ తరువాత దక్షిణాదికి పాకింది. ఇప్పుడిక్కడ అది సర్వసాధారణంగా మారింది. రెండు మూడు కాల్‌షీట్స్‌తో పాటను పూర్తి చేయడం, అందుకు సుమారు అర కోటికిపైగా పారితోషకం ముడుతుండడంతో టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సై అంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్రేజీ భామలు శ్రుతిహసన్, తమన్నా, అనుష్క లాంటి వారు ఐటమ్‌సాంగ్స్‌కు ఆడేశారు.
 
 తాజాగా నటి కాజల్‌అగర్వాల్ కూడా తానేమీ తక్కువాఅన్నట్టు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు అంగాంగ ప్రదర్శన చేసేశారు. కాజల్‌అగర్వాల్ ఐటమ్‌సాంగ్‌ను యువత బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కాజల్ అగర్వాల్ ఐటమ్ సాంగ్ చేయడాన్ని ఎగతాళి చేస్తున్నారట. ఈ విషయం ఆమె చెవిన పడింది. దీంతో కాస్త హర్ట్ అయిన కాజల్ తాను నటించిన సాంగ్ ను ఐటమ్ సాంగ్ అనడం సబబు కాదని, అది ప్రత్యేక గీతం అని వివరించే ప్రయత్నం చేశారు.
 
 అయినా ఆ పాటలో నటించడంలో మరిన్ని అలాంటి అవకాశాలు వస్తున్నాయన్నారు. తాను జనతాగ్యారేజ్ చిత్రంలో స్నేహం కోసమే ప్రత్యేక పాటలో నటించానని తెలిపారు. ఇకపై అలాంటి సింగిల్ సాంగ్స్‌లో నటించన ని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు జీవాకు జంటగా కవైలైవేండామ్ చిత్రంతో పాటు, అజిత్ తాజా చిత్రంలోనూ, అదే విధంగా తెలుగులో మెగాస్టార్‌తో ఖైదీ నంబర్ 150 చిత్రంతో పాటు దర్శకుడు తేజా దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఇక విక్రమ్‌కు జంటగా నటించే అవకాశం కాజల్‌ను వరించిందనే ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement