నేనెప్పుడూ హద్దులు దాటలేదు | kajal agarwal about her glammour roles | Sakshi
Sakshi News home page

నేనెప్పుడూ హద్దులు దాటలేదు

Published Wed, Nov 2 2016 3:19 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

నేనెప్పుడూ హద్దులు దాటలేదు - Sakshi

నేనెప్పుడూ హద్దులు దాటలేదు

గ్లామర్ విషయంలో తానెప్పుడూ హద్దులు దాటలేదని అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. ఐరన్‌లెగ్ ముద్రను నెమ్మదిగా గోల్డెన్ నటిగా మార్చుకున్న నటి ఈ ఉత్తరాది భామ. ఆదిలో బొమ్మలాట్టం అంటూ కోలీవుడ్‌కు పరిచయం అయినా చందమామ చిత్రంతో తెలుగులోనే సక్సెస్ రుచి చూశారు. ఆ తరువాత మగధీర చిత్రం స్టార్ హీరోయిన్ అంతస్తును అందించింది. ఇక కోలీవుడ్‌లో తుపాకీ తన సినీ జీవితానికి వెలుగునిచ్చింది. అలా నటిగా ఎదుగుతూ వచ్చిన కాజల్ ఇప్పుడు ఏకంగా చిరంజీవి సరసన ఆయన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించే లక్కీ చాన్‌‌సను దక్కించుకున్నారు.

ఇటీవలే నేను పక్కా లోకల్ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌తో ఐటమ్ సాంగ్‌లో లెగ్ షేక్ చేసిన కాజల్‌అగర్వాల్ గ్లామర్ గురించి ఇటీవల చాంతాడంత చెప్పుకొచ్చారు. అదేంటో చూద్దామా! హీరోయిన్లకు గ్లామర్ అన్నది అవసరమే.  ఒక్కోసారి అందులో మోతాదు దాటాల్సివస్తుంది. అందుకే హీరోయిన్లు డ్రస్సులు, అలంకార సామగ్రిపై ఆసక్తి కనబరసాల్సి ఉంటుంది. నేనూ గ్లామర్ పాత్రలు పోషించాను. అయితే ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఇటీవల జనతాగ్యారేజ్ అనే తెలుగు చిత్రంలో సింగిల్ సాంగ్‌లో నటించాను కూడా. అది ఐటమ్ సాంగ్ అయినా గ్లామర్ విషయంలో ఎల్లలు దాటలేదు. అందాలారబోతలో నాకంటూ కొన్ని హద్దులు నిర్ణయించుకున్నాను.

వాటినెప్పుడూ మీరను.  నిజం చెప్పాలంటే స్త్రీకి చీరకట్టులోనే శృంగారం దాగుంటుంది. నేను నన్ను మోడరన్ దుస్తుల్లోనే ఎక్కువ చిత్రాల్లో చూసి ఉంటారు. అయితే అలాంటి చిత్రాల్లో కూడా ఒక్క సన్నివేశంలోనైనా చీరలో కనిపిస్తాను. ఎలాంటి దుస్తులు ధరించామన్నది ముఖ్యం కాదు. ఎంత అందంగా ఉన్నామన్నదే ప్రధానం.నన్ను చూసిన వారు గౌరవించాలి అని పేర్కొన్నారు కాజల్ అగర్వాల్. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement