tupaki
-
తుపాకి రాముడుతో.. సరదా సంక్రాంతి
-
ఫిరంగి శబ్ధం.. తొణకని గజం
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ దసరా ఉత్సవాల కోసం మైసూరులో గజరాజులు వివిధ రకాల శిక్షణలో నిమగ్నమయ్యాయి. 14 ఏనుగుల తాలీము జోరుగా కొనసాగుతోంది. సోమవారం కుశాల తోపులో గజరాజులు, గుర్రాల ముందు ఫిరంగి పేలుళ్లను నిర్వహించారు. దసరా రోజున జంబూసవారీ ఊరేగింపులో ఫిరంగులను పేలుస్తారు, వాటి శబ్ధాలకు అలవాటు పడేలా ఇప్పటినుంచే శిక్షణ ఆరంభించారు. 30 మంది పోలీసు సిబ్బంది 7 ఫిరంగుల్లో మందుగుండును కూర్చి పేల్చారు. పెద్ద ఎత్తున పొగ, శబ్ధం వచ్చినా ఏనుగులు, గుర్రాలు ఏమాత్రం బెదరలేదు. 21 సార్లు పేలుళ్లు జరిపారు. (చదవండి: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..సంతోషం ఆవిరి) -
పోలీసుల కళ్లుగప్పి స్టేషన్లోనే పిట్టల వేటగాడు దొంగతనం
అనపర్తి: అనపర్తి పోలీస్ స్టేషన్లో గతేడాది సెప్టెంబర్‌లో మిస్సయిన తుపాకీ బుధవారం బయటపడింది. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ఓ వ్యక్తి దీనిని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. సీఐ ఎన్వీ భాస్కరరావు బుధవారం ఈ విషయం విలేకర్లకు తెలిపారు. 2019 సాధారణ ఎన్నికల సందర్భంగా కర్రి దొరయ్యరెడ్డి అనే వ్యక్తి తన రెండు తుపాకులను పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేశారు. వాటిని 2020లో అనపర్తి లాకప్‌లో భద్రపరిచారు. అందులో డీబీబీఎల్ తుపాకీ కనిపించలేదు. ఈ సంఘటనలో అప్పటి ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, ఏఎస్సై గురవయ్య, కానిస్టేబుళ్లు అబ్దుల్ దురాని, జె.వరప్రసాద్‌లు సస్పెండయ్యారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ ఇటీవల దీనిపై దృష్టి పెట్టారు. లోతుగా ఆరా తీశారు. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన సంగడాల శ్రీను, వెదరుపాక సావరానికి చెందిన వెలుగుపూడి లోవరాజుతో పాటు మరో మైనర్‌ను గతేడాది అక్టోబర్ 5న అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కరోనా సమయంలో తిరగవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. వీరిలో తుపాకీతో పిట్టలను వేటాడే సంగడాల శ్రీను లాకప్‌లో ఉన్న డీబీబీఎల్ తుపాకీని పోలీసుల కన్నుగప్పి తీసుకువెళ్లాడని తాజా విచారణలో తేలింది. తుపాకీ స్వా«దీనం చేసుకున్నారు. శ్రీనుతోపాటు మరో ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
పెళ్లి వేడుకలో గన్‌తో ఆటలు.. వరుడి సోదరుడు మృతి
లక్నో: సరదాగా సాగిపోతున్న వివాహ వేడుకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి హాజరైన పదో తరగతి విద్యార్థి అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. ఆగ్రాలోని ఖండౌలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఖండౌలిలో గురువారం వివాహ కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో అతిథిగా అక్కడకు వచ్చిన ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి తన వెంట లైసెన్స్డ్ గన్ తెచ్చుకున్నాడు. వివేక్ అనే యువకుడు.. ఓసారి గన్ చూస్తానని ఆర్మీ అధికారిని కోరాడు. అయితే, ఆ గన్ లోడ్ చేసి ఉండటంతో... వివేక్ అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కాడు. దాంతో ఒక బుల్లెట్ పెళ్లిలో ఉన్న ధర్మేంద్ర సింగ్ (16) ఛాతీలోకి దూసుకెళ్లింది. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో సందడిగా ఉన్న పెళ్లి వేడకలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, ఇది అనుకోకుండా జరగిన ఘటన కాదని, కావాలనే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. -
తుపాకి మళ్లీ పేల్చనున్నారు
2012లో దర్శకుడు మురుగదాస్ తమిళంలో ‘తుపాకి’ పేల్చారు. ఆ శబ్దం తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే వినిపించింది. ఇప్పుడు ‘తుపాకి’ను మరోసారి పేల్చడానికి సిద్ధమయ్యారాయన. విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన థ్రిల్లర్ ‘తుపాకి’. ఆ తర్వాత వీళ్ల కంబినేషన్లో ‘కత్తి, సర్కార్’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వీళ్ల కాంబినేషన్ రీపిట్ కానుందట. ‘తుపాకి’ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నట్టు మురగదాస్ హింట్ ఇచ్చారు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని కూడా స్టార్ట్ అయిందని పేర్కొన్నారాయన. ప్రస్తుతం రజనీకాంత్‌తో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు మురుగదాస్. ఆ సినిమా తర్వాత ‘తుపాకి’ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
మూగబోయిన..‘తుపాకి రాముడు’
కోరుట్ల: ‘మాకేం తక్కువ లేదు..సార్. రేపు పొద్దుగాల నిజాం రాజుకు అపాయింట్మెంట్ ఇచ్చిన. మా సిపాయిలు మధ్యాహ్నం అమెరికాకు విమానం బుక్ చేసిండ్రు. అట్నుంచి అటే ఎళ్లిపోవాలా. రాత్రి అక్కడే డిన్నర్ చేసి, మళ్లీ లండన్‌కు బిజినెస్ పని మాట్లాడుకుని వచ్చేస్తా. ఏదో మీరు కనపడ్డరని అడగకపోతే ఏమన్న అనుకుంటరని కొన్ని డబ్బులు అడుగుతున్న. కానీ.. మాకే మస్తు మాన్యాలు ఉన్నయి..’ అంటూ కడుపుబ్బ నవ్వించే తుపాకి రాముని మాటల గారడీ మూగబోయింది. సుమారు యాభై ఏళ్ల పాటు కోరుట్ల, మెటపల్లి, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో తుపాకి రామునిగా పేరుపొందిన కళాకారుడు కోదండం మల్లయ్య(73) సోమవారం మృతిచెందాడు. కోరుట్లలోని అల్లమయ్యగుట్టకాలనీలో నివసించే మల్లయ్య తరతరాలుగా వస్తున్న తుపాకి రాముని కళను నమ్ముకుని జీవించాడు. ఖాకీ డ్రస్సు, టోపీ, కట్టె తుపాకీతో విచిత్ర వేషధారణలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మల్లయ్య మృతిచెందాని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, టీఆర్ఎస్ నాయకులు జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు ఇందూరి సత్యం, గజెల్లి రాజేంద్రప్రసాద్‌లు సంతాపం తెలిపారు. -
మహేష్ మూవీ సీక్వలా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. గతంలో విజయ్ హీరోగా నటించిన తుపాకి సినిమాకు సీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాట ఈ ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్
ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటి. ప్రస్తుతం రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాతో పాటు మురుగదాస్ మహేష్ బాబుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది. అయితే మహేష్ సినిమా షూటింగ్ సందర్భంగా మురుగదాస్ చెప్పిన విషయం రకుల్ ను షాక్ కు గురిచేసిందట. మురుగదాస్ గతంలోనే తన సినిమాకు రకుల్ హీరోయిన్గా తీసుకోవాలని భావించాడట. అప్పట్లో రకుల్ చేసిన ఓ టివి కమర్షియల్ చూసిన మురుగ, తనను తుపాకీ సినిమాకు హీరోయిన్గా తీసుకోవాలని భావించాడు. అయితే రకుల్ కాంటాక్ట్ కోసం ఆ యాడ్ ఏజెన్సీని సంప్రదించగా, వారు ఆమెకు సినిమాల్లో చేసే ఇంట్రస్ట్ లేదని చెప్పారట. దీంతో తన ఆలోచనను విరమించుకొని కాజల్‌ను హీరోయిన్గా తీసుకున్నాడు మురుగదాస్. ఈ విషయం తెలిసిన రకుల్ ఇప్పుడు బాధపడిపోతోంది. -
నేనెప్పుడూ హద్దులు దాటలేదు
గ్లామర్ విషయంలో తానెప్పుడూ హద్దులు దాటలేదని అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. ఐరన్‌లెగ్ ముద్రను నెమ్మదిగా గోల్డెన్ నటిగా మార్చుకున్న నటి ఈ ఉత్తరాది భామ. ఆదిలో బొమ్మలాట్టం అంటూ కోలీవుడ్‌కు పరిచయం అయినా చందమామ చిత్రంతో తెలుగులోనే సక్సెస్ రుచి చూశారు. ఆ తరువాత మగధీర చిత్రం స్టార్ హీరోయిన్ అంతస్తును అందించింది. ఇక కోలీవుడ్‌లో తుపాకీ తన సినీ జీవితానికి వెలుగునిచ్చింది. అలా నటిగా ఎదుగుతూ వచ్చిన కాజల్ ఇప్పుడు ఏకంగా చిరంజీవి సరసన ఆయన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించే లక్కీ చాన్సను దక్కించుకున్నారు. ఇటీవలే నేను పక్కా లోకల్ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌తో ఐటమ్ సాంగ్‌లో లెగ్ షేక్ చేసిన కాజల్‌అగర్వాల్ గ్లామర్ గురించి ఇటీవల చాంతాడంత చెప్పుకొచ్చారు. అదేంటో చూద్దామా! హీరోయిన్లకు గ్లామర్ అన్నది అవసరమే. ఒక్కోసారి అందులో మోతాదు దాటాల్సివస్తుంది. అందుకే హీరోయిన్లు డ్రస్సులు, అలంకార సామగ్రిపై ఆసక్తి కనబరసాల్సి ఉంటుంది. నేనూ గ్లామర్ పాత్రలు పోషించాను. అయితే ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఇటీవల జనతాగ్యారేజ్ అనే తెలుగు చిత్రంలో సింగిల్ సాంగ్‌లో నటించాను కూడా. అది ఐటమ్ సాంగ్ అయినా గ్లామర్ విషయంలో ఎల్లలు దాటలేదు. అందాలారబోతలో నాకంటూ కొన్ని హద్దులు నిర్ణయించుకున్నాను. వాటినెప్పుడూ మీరను. నిజం చెప్పాలంటే స్త్రీకి చీరకట్టులోనే శృంగారం దాగుంటుంది. నేను నన్ను మోడరన్ దుస్తుల్లోనే ఎక్కువ చిత్రాల్లో చూసి ఉంటారు. అయితే అలాంటి చిత్రాల్లో కూడా ఒక్క సన్నివేశంలోనైనా చీరలో కనిపిస్తాను. ఎలాంటి దుస్తులు ధరించామన్నది ముఖ్యం కాదు. ఎంత అందంగా ఉన్నామన్నదే ప్రధానం.నన్ను చూసిన వారు గౌరవించాలి అని పేర్కొన్నారు కాజల్ అగర్వాల్. -
కదిరిలో నాటు తుపాకుల కలకలం
-
కదిరిలో నాటు తుపాకుల కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లాలో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని కదిరిలో సోమవారం తుపాకీ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
'అనంత' రైల్వే స్టేషన్ లో తుపాకీల కలకలం
అనంతపురం: అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలో తుపాకులతో సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. రైలులో వెళ్లేందుకు వారు స్టేషన్‌కు రాగా పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంకు చెందిన పుల్లారెడ్డి, రామగిరి మండలం పిచ్చిరెడ్డికోటకు చెందిన కె.భాస్కరాచారి, ఇదే మండలం కొత్తగాదెకుంటకు చెందిన డి.సూర్యనారాయణ, ఉరవకొండ మండలం పెద్దమస్తూరు గ్రామానికి చెందిన కె.కుమార్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. కర్ణాటకలోని బళ్లారిలో తుపాకులను కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేనొక అందమైన శిల్పాన్ని
నేనొక అందమైన శిల్పాన్ని అని అంటోంది నటి కాజల్ అగర్వాల్. తెలుగులో ఓ చందమామ, ఓ మగధీర, ఓ బిజినెస్ మ్యాన్ చిత్రాల్లో కాజల్ అగర్వాల్ అందమైన నగుమోము ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా గూడుకట్టుకుంది. ఇక కోలీవుడ్‌లో తొలి రోజుల్లో సరైన ఆదరణ లభించకపోయినా నాన్అవన్ అల్ల, తుపాకీ, జిల్లా చిత్రాలు ఈమెకు చక్కని విజయాలను కట్టబెట్టాయి. ఇక్కడి ప్రేక్షకులు కాజల్ అందానికి సమ్మోహనం అయ్యారు. అంతేకాదు ప్రస్తుతం కోలీవుడ్‌నే కాజల్‌ను అక్కున చేర్చుకుంది. ఇప్పుడీ బ్యూటీ ధనుష్ సరసన మారి, విశాల్‌కు జంటగా పాయుంపులి చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో విక్రమ్‌తోనూ జోడి కట్టబోతున్నారు. ఇలా తమిళ చిత్రాల అవకాశాలు వరుసగా తలుపుతడుతుండడంతో సంబరపడి పోతున్నారు. కాజల్ తనొక అందమైన శిల్పంతో పోల్చుకుంటున్నారు. అదేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. గొప్ప శిల్పులు లాంటి వారు రూపొందించిన చిత్రాలతో నేను ఒక అందమైన శిల్పం అయ్యాను. నేను సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చాను. నేనూహించని విధంగా ఇన్నేళ్లుగా ప్రముఖ హీరోయిన్గా రాణిస్తున్నాను. నేను ఒక ప్రముఖ నటినని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. అంతేకాదు నటిగా కాకుండా ఒక విద్యార్థినిగా పలు విషయాలు తెలుసుకుంటున్నానని భవిష్యత్తులో ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. -
తుపాకితో హల్చల్ చేసిన ముఠా అరెస్ట్
మెదక్ (చేగుంట): తుపాకీతో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంటలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గోవిందాపూర్‌కు చెందిన తిట్ల మల్లేశం కొంతకాలం క్రితం ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేపట్టడానికి మధ్యప్రదేశ్ వెళ్లాడు. అక్కడ అమిత్‌సింగ్ అనే వ్యక్తి నుంచి తుపాకి, 9 బుల్లెట్లు కొనుగోలు చేశాడు. వాటిని సొంతగ్రామంలోని మసీదుపల్లి మల్లేశం, ఉప్పల ఎల్లం అనే ఇద్దరికి అమ్మాడు. అప్పటి నుంచి వీరు తుపాకీ చూపిస్తూ బాటసారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా అదే మండలంలోని గువ్వలెగి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని అడ్డగించి తుపాకీతో బెదిరించి రూ.20 వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ముసుగుల్లో ఉన్న వ్యక్తులను గుర్తించిన రమేష్ చేగుంట పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు విచారణ చేపట్టి వీరిరువురితో పాటు వీళ్లకు తుపాకీ అమ్మిన తిట్ల మల్లేశంను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి తుపాకీతో పాటు 8 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
వారిద్దరిలో ఎవరు ఓకే అన్నా తెలుగులో సినిమా చేస్తా!
గజని, స్టాలిన్, తుపాకి... ఈ సినిమాలు చాలు దర్శకునిగా మురుగదాస్ ప్రతిభ ఏంటో చెప్పడానికి. నిర్మాతగా కూడా విజయబాటలో నడుస్తున్నారాయన. తమిళంలో మురుగదాస్ నిర్మించిన ‘రాజా-రాణి’ తెలుగులో అదే పేరుతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటిస్తూ అనేక విషయాలు చెప్పారాయన. ‘రాజా-రాణి’ ఏ తరహా చిత్రం? ‘ప్రేమ విఫలమైనా కృంగిపోనవసరం లేదు. జీవితం చాలా పెద్దది’ అనే పాయింట్ నాకు నచ్చి ఈ సినిమా నిర్మించాను. ఇందులోని హార్ట్ టచింగ్ సీన్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమాలోనూ చూసుండరు.కథ అంతగా నచ్చినప్పుడు రీమేక్ చేయొచ్చుకదా! డబ్బింగ్ చేయడానికి కారణం? ఈ కథను రీమేక్ చేస్తే ఫీల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే డబ్బింగ్ చేస్తున్నాం. నయనతార, ఆర్యలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది కదా. ఇక బాధేముంది? దర్శకునిగా భారీ సినిమాలు, నిర్మాతగా మాత్రం చిన్న సినిమాలు. కారణమేంటి? స్టార్లతో సినిమాలు చేయడం రిస్క్ అని చాలామంది అభిప్రాయం. నన్నడిగితే మాత్రం అదే శ్రేయస్కరం అంటాను. ఎందుకంటే... స్టార్లకు మార్కెట్ ఉంటుంది. కాస్త బాగా తీస్తే మన డబ్బుల్ని మనం రాబట్టుకోవచ్చు. కానీ చిన్న సినిమాలు అలాకాదు. అందులో నటించేవారందరూ దాదాపు కొత్తవాళ్లే అయ్యుంటారు. వాళ్లపై మూడు నాలుగు కోట్లు పెట్టడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కొత్త దర్శకుల్ని పరిచయం చేయడమంటే, మరీ రిస్క్. వాళ్లు ఎలా తీస్తారో తెలీదు. ఏ రకంగా చూసినా చిన్న చిత్రాలు ప్రమాదకరమే. అందుకే ఇకనుంచి తెలుగు, తమిళ భాషల్లో భారీ సినిమాలనే చేయాలనుకుంటున్నాను. అసలు నిర్మాణంలోకి రావాలని మీకెందుకనిపించింది? డబ్బు సంపాదన కోసం నేను నిర్మాత కాలేదు. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడానికి నిర్మాతనయ్యాను. హిందీ ‘గజనీ’ తర్వాత ఫాక్స్‌స్టార్ స్టూడియోవారు నా దర్శకత్వంలో సినిమా నిర్మించాలనుకున్నారు. నాకున్న కమిట్మెంట్స్ వల్ల అది సాధ్యపడలేదు. అయితే... కొత్తవారిని ప్రోత్సహిస్తూ చిత్ర నిర్మాణం చేపడితే బావుంటుందనే నా ఆలోచనను వారి ముందుంచాను. వారికి నచ్చింది. దాంతో నేను, వారు కలిసి నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ‘స్టాలిన్’ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. ఎప్పుడు చేస్తారు? త్వరలోనే. ఆ సినిమా ద్వారా తెలుగు స్టార్‌ని తమిళ చిత్రరంగానికి కూడా పరిచయం చేయాలనే ఆలోచన ఉంది. సదరు హీరో మార్కెట్, నా మార్కెట్లకు తగ్గట్టుగా ఆ సినిమా బడ్జెట్ ఉంటుంది. నాలుగువేల థియేటర్లలో ఆ సినిమాను విడుదల చేస్తే బావుంటుందనుకుంటున్నా. వచ్చే ఏడాది ఈ సినిమా ఉంటుంది. మీ దృష్టిలో ఉన్న ఆ తెలుగు హీరో ఎవరు? మహేశ్‌బాబు. ‘గజని’ సినిమాను ఆయన హీరోగా తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాను. కానీ కుదర్లేదు. ఆయనతో పాటు రామ్‌చరణ్‌కి కూడా ఈ కథ చెబుతాను. ఎవరు ఓకే అంటే వారే హీరో. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సామాజిక అంశాలు కూడా ఉంటాయి. దర్శకునిగా మీ బాలీవుడ్ ప్రస్థానం ఎలా ఉంది? చాలా బాగుంది. నిజానికి ‘తుపాకి’ కథను ముందు బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ హీరోగా చేద్దాం అనుకున్నాను. ఆయన డేట్స్ లేక అప్పుడు కుదర్లేదు. కానీ... ఇప్పుడు అక్షయ్‌తోనే ‘తుపాకి’ రీమేక్ చేస్తున్నాను. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తాం. ప్రేమ సన్నివేశాలను చాలా రొమాంటిక్‌గా, కొత్తగా తీస్తారు. స్వీయానుభవమా? (నవ్వుతూ...) అలాంటిదేం లేదు. నిజానికి నిజజీవితంలో నాకు అలాంటి అనుభవాల్లేవు. అలాంటి అనుభవాలుంటే... తీసే ప్రతి సినిమాలోనూ ఒకేలాంటి సన్నివేశాలుంటాయి. లేవు కాబట్టే కొత్తగా ఉంటున్నాయి. దేశం మొత్తం అభిమానించే దర్శకునిగా ఎదిగారు. ఈ అనుభూతి ఎలా ఉంది? కెమెరాను నేనేమీ కనిపెట్టలేదు కదా. గర్వంగా ఫీలవ్వడానికి. నేనిక్కడ సాధించింది ఏమీ లేదు. సినిమా అంటే ఇష్టం. ఆ ఇష్టమే నాకు మంచి పేరు తెచ్చింది. ‘రమణ’ తీస్తున్నప్పుడు తమిళంలో మంచి పేరొస్తే చాలనుకున్నాను. ‘గజని’ దేశం గుర్తించేలా చేసింది. ఇదంతా దైవనిర్ణయం. డ్రీమ్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? హిచ్‌కాక్, స్పీల్బర్గ్ తరహాలో థ్రిల్లర్స్, ఫాంటసీ సినిమాలు చేయాలని ఉంది. -
అవేవీ నన్ను బాధించవు
విజయాలు పారితోషికాన్ని పెంచుతాయి. ప్లాప్స్ అవకాశాల్ని దూరం చేస్తాయి. సక్సెస్‌ను ఆస్వాదించే వారు ప్లాప్లను భరించలేరు. ప్రస్తుతం నటి కాజల్ అగర్వాల్ ఈ పరిస్థితిలోనే ఉందట. ఈ బ్యూటీకి తొలుత కోలీవుడ్‌లో విజయం దోబూచులాడింది. టాలీవుడ్ ఆదుకుంది. మగధీర చిత్రం ఆమె ఊహించనంతగా అందలమెక్కించింది. బృందావనం, బిజినెస్మెన్ వంటి చిత్రాల ఘన విజయంతో కాజల్ క్రేజీ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. తుపాకీ చిత్రంతో తమిళంలోనూ హిట్ కథానాయికల కోవలో చేరిపోయింది. ప్రస్తుతం అవకాశాల వెంట పరిగెత్తాల్సిన పరిస్థితి. ఇటీవల ఈ బ్యూటీ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇది ఆమెను కలవరపెట్టే విషయం. కాజల్ మాత్రం అపజయాలు తనను బాధించలేవని బింకాలు పోతోంది. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సాధారణమని, సక్సెస్‌కు పొంగిపోవడం, ప్లాప్‌లకు కుంగిపోవడం ఉండదని అం టోంది. ఒక పక్క ఈ భామకు ఇంటిలో వరుడి వేటలో ఉన్నారట. కాజల్ మాత్రం సంక్రాంతికి విడుదల కానున్న జిల్లా చిత్ర విజయం కోసం ఎదురు చూస్తున్నానంటోంది. మరి జిల్లా ఆమెకు మళ్లీ పూర్వ వైభవాన్ని తెస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.