తుపాకి మళ్లీ పేల్చనున్నారు | vijay thuppaki sequel starts shortly | Sakshi
Sakshi News home page

తుపాకి మళ్లీ పేల్చనున్నారు

Published Tue, Dec 18 2018 2:45 AM | Last Updated on Tue, Dec 18 2018 2:45 AM

vijay thuppaki sequel starts shortly - Sakshi

మురుగదాస్‌

2012లో దర్శకుడు మురుగదాస్‌ తమిళంలో ‘తుపాకి’ పేల్చారు. ఆ శబ్దం తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే వినిపించింది. ఇప్పుడు ‘తుపాకి’ను మరోసారి పేల్చడానికి సిద్ధమయ్యారాయన. విజయ్‌ హీరోగా మురుగదాస్‌ తెరకెక్కించిన థ్రిల్లర్‌ ‘తుపాకి’. ఆ తర్వాత వీళ్ల కంబినేషన్‌లో ‘కత్తి, సర్కార్‌’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వీళ్ల కాంబినేషన్‌ రీపిట్‌ కానుందట. ‘తుపాకి’ చిత్రానికి సీక్వెల్‌ రూపొందిస్తున్నట్టు మురగదాస్‌ హింట్‌ ఇచ్చారు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పని కూడా స్టార్ట్‌ అయిందని పేర్కొన్నారాయన. ప్రస్తుతం రజనీకాంత్‌తో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు మురుగదాస్‌. ఆ సినిమా తర్వాత ‘తుపాకి’ సీక్వెల్‌ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement