Muruga Das
-
తుపాకి మళ్లీ పేల్చనున్నారు
2012లో దర్శకుడు మురుగదాస్ తమిళంలో ‘తుపాకి’ పేల్చారు. ఆ శబ్దం తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే వినిపించింది. ఇప్పుడు ‘తుపాకి’ను మరోసారి పేల్చడానికి సిద్ధమయ్యారాయన. విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన థ్రిల్లర్ ‘తుపాకి’. ఆ తర్వాత వీళ్ల కంబినేషన్లో ‘కత్తి, సర్కార్’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వీళ్ల కాంబినేషన్ రీపిట్ కానుందట. ‘తుపాకి’ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నట్టు మురగదాస్ హింట్ ఇచ్చారు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని కూడా స్టార్ట్ అయిందని పేర్కొన్నారాయన. ప్రస్తుతం రజనీకాంత్‌తో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు మురుగదాస్. ఆ సినిమా తర్వాత ‘తుపాకి’ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
హై డ్రామా
గురువారం రాత్రి చెన్నైలో దర్శకుడు మురుగదాస్ ఇంటి వద్ద చిన్నపాటి డ్రామా నడిచింది. తన లేటెస్ట్ చిత్రం ‘సర్కార్’తో తమిళనాడులో పొలిటికల్ పార్టీల ఆగ్రహానికి గురయ్యారని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారని సమాచారం. ఈ విషయాన్ని ‘సర్కార్’ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ‘మురగదాస్‌ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్లారు’ అని ట్వీట్ చేశారు. ఆ వెంటనే ‘‘మా ఇంటికి పోలీసులు వచ్చారు. నేను లేనని తెలుసుకొని తిరిగి వెళ్లిపోయారు’ అని మురుగదాస్ ట్వీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో మురుగదాస్ ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 27 వరకూ ఆయన్ని అరెస్ట్ చేయకూడదని చెన్నై కోర్ట్ ఆదేశించింది. ఈ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ చేసి, మూడు సన్నివేశాల్లో చిన్న కట్స్ చేయమని ఆదేశించారు. -
భారీ కటౌట్
అభిమాన హీరో సినిమా విడుదలవుతోందంటే ఫ్యాన్స్‌కి పండుగే. హీరో కటౌట్లు పెట్టి, ఫ్లెక్లీలు కట్టి బాణసంచా కాల్చుతూ సందడి చేస్తుంటారు. తమిళ హీరో విజయ్‌కి అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. తమిళనాడులోనే కాదు.. కేరళలోనూ ఆయనకు అభిమానులున్నారు. తాజాగా విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కేరళకు చెందిన కొల్లం నన్బన్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు విజయ్ కోసం 175 అడుగుల భారీ కటౌట్‌ను రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. ‘తుపాకీ, కత్తి’ సినిమాల తర్వాత విజయ్– డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లు. కళానిధి మారన్ నిర్మాత. ఈ చిత్రాన్ని నిర్మాత అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు(మంగళవారం) విడుదల కానున్న ఈ సినిమాపై తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. కర్ణాటక, కేరళలో దీపావళి రోజున 24 గంటలు సినిమాను ప్రదర్శించేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంటే దీపావళి రోజున ఒక్కో థియేటర్లో ‘సర్కార్’ వరుసగా 8 షోలు ప్రదర్శించబోతుండటం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్. రెహమాన్. -
నేనే సీఎం అయితే..
నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను అని అన్నారు నటుడు విజయ్. ఈ స్టార్ నటుడికి రాజకీయాల్లోకి రావాలన్న ఆశ బలీయంగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకుచాలా కాలం క్రితమే తన సైన్యాన్ని (అభిమానుల్ని) బరిలోకి దింపారు. సామాజిక సేవ పేరిట సమావేశాలను నిర్వహించారు. ఆ తరువాత తన చిత్రాల విడుదల సమయంలో ఏర్పడ్డ అడ్డంకులు ఆయన రాజకీయ ఆశలపై నీళ్లు చల్లాయనే చెబుతారు. సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి అవ్వాలన్న తన కోరికను నటుడు విజయ్ మంగళవారం మరోసారి చెప్పకనే చెప్పారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ ఆడియో ఆవిష్కరణ మంగళవారం చెన్నై, తాంబరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించారు. ఆడియో ఆవిష్కరణ సందర్భంగా అందరి ప్రసంగం విజయ్ గురించి, రాజకీయాలపైనే సాగడం విశేషం. చివరకు విజయ్ కూడా రాజకీయాల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈయన ఏమన్నారో చూద్దాం. ‘అభిమానుల ఆదరణకు కృతజ్ఞతలు. ఈ వేడుకకు నాయకుడు ఏఆర్ రెహ్మాన్. ఆయన సంగీతం అందించడం ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించినట్లే. నేను, దర్శకుడు మురుగదాస్ కలిసి చేస్తే అది హిట్ చిత్రం అవుతుంది. సర్కార్ చిత్రంలో ప్రత్యేకత ఏమిటంటే మెర్శల్ చిత్రంలో కొంచెం రాజకీయం చోటుచేసుకుంది. ఇందులో రాజకీయం దుమ్మురేపుతుంది. సినిమాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ ఉత్తమ నటనను ప్రదర్శించారు. ఆమెకు అభినందనలు. నటి వరలక్ష్మి వద్దు అని ఎవరు అనలేని విధంగా ఈ చిత్రంలో ఆమె నటించారు. విజయం కోసం ఎంతగానైనా కష్టపడవచ్చు. అయితే మా చిత్రం విజయం సాధించకూడదని ఒక వర్గం త్రీవంగా శ్రమిస్తోంది. జీవితం అనే ఆటను చూసి ఆడండి. అసహ్యించుకునే వారిపై ఉమ్మేయండి. విసిగించేవారి వద్ద మౌనంగా ఉండండి. జీవితాన్ని జామ్‌జామ్‌గా గడిపేద్దాం అని అన్నది ఎవరో తెలియదు గానీ, ఆ వ్యాఖ్యలను నేను అనుసరిస్తున్నాను. మీరు అనుసరించండి. సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయనున్నాం. నేను చిత్రం గురించి చెబుతున్నాను. నచ్చితే ఈ చిత్రానికి ఓటేయండి. సర్కార్ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించలేదు. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను’ అని నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లోనే రాజకీయాలపై ఉన్న ఆసక్తి తెలిసిపోతుంది కదూ! రాజకీయ ప్రకంపనలు సర్కార్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొందరు నాయకులు స్వాగతిస్తున్నా, మరి కొందరు, ముఖ్యంగా అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ స్పందిస్తూ విజయ్, అజిత్ లాంటి ప్రముఖ నటులు రాజకీయాల్లోకి రావాలన్నారు. రాష్ట్ర మంత్రి ఉదయకుమార్ స్పందిస్తూ సర్కార్ సినిమాను సర్కస్‌తో పోల్చారు. విజయ్ చిత్రాలు చేసుకోవడమే మంచిదని, రాజకీయాల్లో ఆయన రాణించలేరని ఎద్దేవా చేశారు. -
మురుగదాస్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి పలువురు హీరోలు, దర్శక నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా ప్రముఖ దర్శకుడు స్టార్ హీరోలతో భారీ సినిమాలను తెరకెక్కించిన ఏఆర్ మురుగదాస్‌పై ఆరోపణలు చేశారు. హాయ్ మురుగదాస్ అంటూ మొదలెట్టిన శ్రీరెడ్డి గ్రీన్ పార్క్ హోటల్ విషయం మీకు గుర్తుందా అంటూ బాంబు పేల్చారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్ ద్వారా మనం కలిశామని, తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారని మురుగదాస్‌కు గుర్తుచేశారు. ఆ రోజు హోటల్లో మనం చాలా...అయినా ఇప్పటి వరకూ మీరు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు..మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ అంటూ ముగించారు.మరి తనపై చేసిన సంచలన ఆరోపణలకు మురుగదాస్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. పవన్ కళ్యాణ్, నాని సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. -
ఇదీ న్యూసేనా?
విజయ్, మురుగదాస్‌ల లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో విజయ్ సిగార్ పట్టుకొని పొగ తాగుతున్న స్టిల్ హాట్ టాపిక్‌గా మారింది. మోరల్‌గా ఇది కరెక్టా? కాదా అని తమిళనాడులో చాలా డిబేట్స్ నడిచాయి. ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తారా? లేదా? అనే విషయాన్ని నటుడు శరత్‌కుమార్‌ని అడగ్గా –‘‘హీరోలు స్మోక్ చేయడం తప్పా? కరెక్టా? అన్నది న్యూస్ అవ్వడం విశేషం. ఇది అసలు సీరియస్ ఇష్యూనే కాదు. ఇటీవల జరిగిన సర్వేలో స్త్రీలకు రక్షణ లేని దేశాల్లో భారతదేశం తొలిస్థానంలో నిలిచింది. అది సీరియస్ విషయం. దాన్ని ఎలా తగ్గించాలి. ఎలాంటి అవగాహన తీసుకురావాలి అనేది న్యూస్ అవ్వాలి, దాని మీద డిబేట్లు జరగాలి కానీ సినిమా పోస్టర్ల మీద, ఇంకో ఇంకో విష యాల్లో కాదు’’ అని ఘాటుగా స్పందించారు. -
చెన్నై టు అమెరికా
అమెరికాకు హాయ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు తమిళ హీరో విజయ్ అండ్ టీమ్. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను తమిళనాడులోని ఓ టీవీ చానల్ ఆఫీస్‌లో జరిపారు. నెక్ట్స్ షెడ్యూల్‌ను అమెరికాలో జరపాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ సమాచారమ్. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా నైట్ షూటింగ్లో వరలక్ష్మీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘కత్తి, తుపాకీ’ చిత్రాల తర్వాత విజయ్ అండ్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఈ నెల 22న విజయ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. -
ఒక్క సినిమా...రెండు కలలు!
‘‘ఏది ఎప్పుడు జరగాలో.. ఎలా జరగాలో.. ప్రతిదీ భగవంతుడు రాసి పెడతాడు. మనమంతా సరైన సమయం కోసం ఎదురు చూడాలంతే. తప్పకుండా కలలు నిజమవుతాయి. ఒక్క సినిమాతో నా రెండు స్వప్నాలు నిజమవుతున్నాయి’’ అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. మహేశ్‌బాబు హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో రకుల్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్, మురుగదాస్... ఇద్దరితోనూ ఈ ఢిల్లీ బ్యూటీకి ఇదే మొదటి సినిమా. రకుల్ నటించిన ఓ కమర్షియల్ యాడ్ చూసిన మురుగదాస్ తన ‘తుపాకీ’లో హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారట. ముంబైలోని కాస్టింగ్ ఏజెన్సీను సంప్రదించగా.. ‘కొత్తమ్మాయి. అప్పుడే సినిమాలో నటించడానికి రెడీగా లేదు’ అని చెప్పారట. దాంతో కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారాయన. ఆ విషయాన్ని తాజా సినిమా షూటింగ్ లొకేషన్లో రకుల్‌తో చెప్పారట మురుగదాస్. అప్పుడు షాకవ్వడం రకుల్ వంతు అయ్యింది. ఎందుకంటే, మోడల్‌గా ఉన్నప్పట్నుంచీ మురుగదాస్ సినిమాలో నటించాలని రకుల్ కోరిక అట. ‘హాయ్.. సర్! నా పేరు రకుల్. ఐయామ్ ఎ మోడల్. మిమ్మల్ని ఓసారి మీట్ కావాలి...’ అని అప్పుడెప్పుడో ఆమె మెసేజ్ కూడా పంపారట. ఆ విషయాన్ని మురుగదాస్‌కు చెప్పడంతో పాటు అప్పట్లో ఆయనకు పంపిన మెసేజ్‌ను చూపించారట. ‘‘మురుగదాస్ గత సినిమా విడుదల సమయంలో శుభాకాంక్షలు పంపిన పాత మెసేజ్ కూడా నా ఫోన్లో ఉంది. అది ఆయనకు చూపించగా.. నవ్వుకోవడం ఇద్దరి వంతైంది’’ అన్నారు రకుల్. గతంలో మహేశ్ సరసన రెండు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేక రకుల్ వదులుకున్నారు. ఈ సినిమాతో మహేశ్‌కు జోడీగా నటించాలనే రెండో స్వప్నం కూడా సాకారమైందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.