చెన్నై టు అమెరికా | Keerthy Suresh Teasing Ilayathalapathy | Sakshi
Sakshi News home page

చెన్నై టు అమెరికా

Published Fri, Jun 15 2018 12:57 AM | Last Updated on Fri, Jun 15 2018 12:57 AM

Keerthy Suresh Teasing Ilayathalapathy - Sakshi

అమెరికాకు హాయ్‌ చెప్పడానికి రెడీ అవుతున్నారు తమిళ హీరో విజయ్‌ అండ్‌ టీమ్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను తమిళనాడులోని ఓ టీవీ చానల్‌ ఆఫీస్‌లో జరిపారు.

నెక్ట్స్‌ షెడ్యూల్‌ను అమెరికాలో జరపాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని కోలీవుడ్‌ సమాచారమ్‌. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా నైట్‌ షూటింగ్‌లో వరలక్ష్మీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘కత్తి, తుపాకీ’ చిత్రాల తర్వాత విజయ్‌ అండ్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అలాగే ఈ నెల 22న విజయ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement