Keerthy Suresh Pairing With Thalapathy Vijay In Vamshi Paidipally - Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరో విజయ్‌తో జోడీ కట్టనున్న కీర్తి సురేష్‌?

Published Wed, May 26 2021 5:42 PM | Last Updated on Wed, May 26 2021 9:05 PM

Keerthy Suresh Pair Up With Vijay In Vamshi Paidipallys Film? - Sakshi

కీర్తి సురేష్‌ ఫ్రస్తుతం దక్షిణాదిన వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలిసారిగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సరసన జత కట్టనుంది. మరోవైపు గుడ్‌ లక్‌ సఖి, అన్నాతై సహా మైదానం సినిమాలో కీర్తి నటిస్తుంది. అయితే తాజాగా తెలుగులో మరో క్రేజీ ఆఫర్‌ వరించిందట. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ టాలీవుడ్‌లో  స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహర్షి డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమాకు రెడీ అయినట్లు టాక్‌ వినిపిస్తోంది.

తెలుగులో నటించనున్న తొలి సినిమాకే విజయ్‌ ఏకంగా రూ.90 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్. ఇక ఈ సినిమాలో విజయ్‌కు జంటగా కీర్తి సురేష్‌  నటిస్తుందని సమాచారం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయితే, కీర్తి న‌టించే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. 

చదవండి : మహేష్‌బాబుకు పిన్నిగా ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌!
మీకు ఏమైంది.. మరీ ఇంత సన్నబడ్డారు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement