Is Vijay Varisu Postponed What Makes Replied To Rumors - Sakshi
Sakshi News home page

Vijay Varisu : సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం

Jan 8 2023 11:11 AM | Updated on Jan 8 2023 11:54 AM

Is Vijay Varisu Postponed What Makes Replied To Rumours - Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తాజాచిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్‌ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్‌ చేయనున్నారు. రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది.సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాకపోవడంతో వారీసు సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మూవీ టీం రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే వారీసు విడుదల అవుతుందని, పుకార్లను నమ్మవద్దంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement