Thalapathy 66 Update: Rashmika Mandanna Female Lead In Actor Vijay New Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ఇట్స్‌ అఫీషియల్‌.. విజయ్‌తో రష్మిక, ట్వీట్‌ వైరల్‌

Published Tue, Apr 5 2022 6:51 PM | Last Updated on Tue, Apr 5 2022 9:01 PM

Rashmika Mandanna Joins Vijay Thalapathy 66 - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా తెలుగుతో పాటు పాన్‌ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతోంది. గతేడాది సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో శ్రీవల్లిగా ఆకట్టుకున్న రష్మిక వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీ అవుతుంది. పుష్ప సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప ది రూల్ సినిమాతో పాటు మరో క్రేజీ పాన్‌ ఇండియా సినిమా ఛాన్స్‌ కొట్టేసింది. కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నటిస్తున్న ఫస్ట్‌ స్ట్రెయిట్‌ మూవీలో రష్మిక నటించనుంది.

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించ‌బోతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రష్మిక ఇంతకంటే బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఏముంటుందంటూ ట్వీట్‌ చేసింది. మంగళవారం(ఏప్రిల్‌5) రష్మిక బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. కాగా గతంలో ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక స్థానంలో వేరే హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినా అవి ఒట్టి పుకార్లేనని అర్థమైపోయింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement