'వరీసు' నుంచి విజయ్‌, రష్మికల క్రేజీ పోస్టర్‌ వచ్చేసింది.. | Vijay Rashmika Crazy Poster From Varisu Movie | Sakshi
Sakshi News home page

Varisu Movie: 'వరీసు' నుంచి విజయ్‌, రష్మికల క్రేజీ పోస్టర్‌ వచ్చేసింది..

Published Sat, Nov 5 2022 1:47 PM | Last Updated on Sat, Nov 5 2022 1:57 PM

Vijay Rashmika Crazy Poster From Varisu Movie - Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తెలుగులో నటిస్తున్న సినిమా వారసుడు. తమిళ వారిసుకు అనువాదంగా వస్తున్న ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రష్మిక, విజయ్‌ల ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయలేదు.

నేడు (శనివారం) సాయంత్రం రంజితమే సాంగ్‌ రిలీజ్‌ చేయనున్న సందర్భంగా ఈ సినిమా నుంచి క్రేజీ పోస్టర్‌ను వదిలారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మాస్‌ షేడ్స్‌తో కనిపిస్తున్న ఈ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement