Thalapathy 66: Actor Vijay Shocking Remuneration For Vamshi Paidipally Movie - Sakshi
Sakshi News home page

Vijay 66 Movie: షాకింగ్‌ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిన విజయ్‌!

Published Sat, Jan 29 2022 1:36 PM | Last Updated on Sat, Jan 29 2022 5:17 PM

Thalapathy 66: Actor Vijay Shocking Remuneration For Vamshi Paidipally Movie - Sakshi

Thalapathy Vijay Shocking Remuneration For Vamshi Paidipally Movie: కోలీవుడ్‌ స్టార్‌ దళపతి విజయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్‌ త్వరలోనే తెలుగులో స్ట్రయిట్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా కోసం విజయ్‌ దాదాపు రూ.100కోట్ల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు తెలుస్తుంది. విజయ్‌కి తమిళం తర్వాత తెలుగులోనూ మాంచి మార్కెట్‌ ఉంది. చివరగా ఆయన నటించిన మాస్టర్‌ సైతం తెలుగులో సుమారు రూ.15 కోట్లు రాబట్టిందని టాక్‌. దీంతో తన మేనియాను దృష్టిలో ఉంచుకొని వంద కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. ఇక విజయ్‌ చేస్తున్న తొలి తెలుగు ప్రాజెక్ట్‌ ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement