
శరత్‌కుమార్
విజయ్, మురుగదాస్‌ల లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో విజయ్ సిగార్ పట్టుకొని పొగ తాగుతున్న స్టిల్ హాట్ టాపిక్‌గా మారింది. మోరల్‌గా ఇది కరెక్టా? కాదా అని తమిళనాడులో చాలా డిబేట్స్ నడిచాయి. ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తారా? లేదా? అనే విషయాన్ని నటుడు శరత్‌కుమార్‌ని అడగ్గా –‘‘హీరోలు స్మోక్ చేయడం తప్పా? కరెక్టా? అన్నది న్యూస్ అవ్వడం విశేషం. ఇది అసలు సీరియస్ ఇష్యూనే కాదు. ఇటీవల జరిగిన సర్వేలో స్త్రీలకు రక్షణ లేని దేశాల్లో భారతదేశం తొలిస్థానంలో నిలిచింది. అది సీరియస్ విషయం. దాన్ని ఎలా తగ్గించాలి. ఎలాంటి అవగాహన తీసుకురావాలి అనేది న్యూస్ అవ్వాలి, దాని మీద డిబేట్‌లు జరగాలి కానీ సినిమా పోస్టర్‌ల మీద, ఇంకో ఇంకో విష యాల్లో కాదు’’ అని ఘాటుగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment