sigaret
-
షాకింగ్: కండోమ్స్, గర్భనిరోధకాలతో స్కూల్‌కు విద్యార్థులు..!
బెంగళూరు: హైస్కూల్ విద్యార్థుల బ్యాగులను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. విద్యార్థుల బ్యాగుల్లో మొబైల్ ఫోన్స్, కండోమ్స్, నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు, లైటర్స్, సిగరెట్స్, వైట్నర్స్ వంటివి చూసి నివ్వెరపోయారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ బ్యాగులు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు చెందినవి కావటం గమనార్హం. విద్యార్థులు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారనే ఫిర్యాదుతో నగరంలోని పలు పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని పాఠశాలలను ఆదేశించింది కర్ణాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేఏఎంఎస్). ‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు(ఐ-పిల్) లభించాయి. అలాగే వాటర్ బాటిల్లో లిక్కర్ దొరికింది.’ అని కేఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్ తెలిపారు. ఆకస్మిక తనిఖీల అనంతరం కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులే షాక్‌కు గురయ్యారని నగరభావి స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో తేడా వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారని వెల్లడించారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు మానసిక చికిత్స అందించేందుకు 10 రోజుల పాటు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. పలువురు నెటిజన్లు తమ ఆలోచనలను ట్విటర్లో షేర్ చేశారు. తాము స్కూల్‌కి వెళ్లినప్పుడు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్లేవాళ్లం అంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఈ ఇంటర్నెట్ కాలంలో తల్లిదండ్రుల పాత్ర చాలా క్లిష్టమైనదని మరొకరు రాసుకొచ్చారు. ఇదీ చదవండి: Labour Union Protest: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్! -
పొగాకు ఉత్పత్తులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక కొత్తగా..!
న్యూఢిల్లీ: దేశంలో విక్రయించే పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌లపై డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ‘టొబాకో కాజెస్ పెయిన్ఫుల్ డెత్’ అనే కొత్త ఆరోగ్య హెచ్చరిక, కొత్త చిత్రం ముద్రితమవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అవి ఏడాది పాటు కొనసాగుతాయని వివరించింది. 2023 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ప్రమాదాన్ని తెలిపే మరో కొత్త చిత్రంతోపాటు ‘టొబాకో యూజర్స్ డై యంగర్’ అని ముద్రితమవుతుందని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ రూల్స్–2008 చట్టానికి 2022 జూలై 21వ తేదీన చేసిన సవరణ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. పొగాకు ఉత్పత్తుల తయారీదారు, దిగుమతి దారు, పంపిణీదారులు ఎవరైనా సరే ఈ హెచ్చరికలను ముద్రించకుంటే జైలు శిక్ష, జరిమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోందని హెచ్చరించింది. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
ఇష్టం లేకపోయినా చేశా.. నటిగా అన్నీ చెయ్యాల్సిందే : శ్రద్దా దాస్
హీరోయిన్ శ్రద్దా దాస్ రీసెంట్గా ఏక్ మిని కథ సక్సెస్‌తో జోరు మీదుంది. ఇప్పటివరకు శ్రద్దా పలు హిట్ సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. గ్లామర్ డోస్ పెంచినా ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో సరైన గుర్తింపు రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ గ్లామరస్ ఫోటోలతో నెట్టింట హల్చల్ చేస్తుంది ఈ భామ. తాజాగా సిగరెట్ కాలుస్తున్న ఓ ఫోటోను షేర్ చేస్తూ..నాకు సిగరెట్ తాగడం నచ్చదు. కానీ నటిగా మారినప్పుడు అన్నీ చేయాల్సిందే నచ్చకపోయినా సరే అంటూ సినిమా సెట్లోని ఈ ఫోటోను షేర్ చేసింది. కాగా ఇది నిజం సిగరెట్ యేనా లేదా డమ్మీదా అని నెటిజన్లు ప్రశ్నించగా..లేదు లేదు. ఇది నిజం సిగరెటే అని సమాధానమిచ్చింది. ఇక పొగతాడం ఆరోగ్యానికి హానికారం అంటూ ఓ క్యాప్షన్‌ను కూడా జోడించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అర్ధం, నిరీక్షణ ,కన్నడలో కోటిగొబ్బ వంటి సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) చదవండి : గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి గుండెపోటుతో నటి సురేఖ మృతి -
ఇదీ న్యూసేనా?
విజయ్, మురుగదాస్‌ల లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో విజయ్ సిగార్ పట్టుకొని పొగ తాగుతున్న స్టిల్ హాట్ టాపిక్‌గా మారింది. మోరల్‌గా ఇది కరెక్టా? కాదా అని తమిళనాడులో చాలా డిబేట్స్ నడిచాయి. ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తారా? లేదా? అనే విషయాన్ని నటుడు శరత్‌కుమార్‌ని అడగ్గా –‘‘హీరోలు స్మోక్ చేయడం తప్పా? కరెక్టా? అన్నది న్యూస్ అవ్వడం విశేషం. ఇది అసలు సీరియస్ ఇష్యూనే కాదు. ఇటీవల జరిగిన సర్వేలో స్త్రీలకు రక్షణ లేని దేశాల్లో భారతదేశం తొలిస్థానంలో నిలిచింది. అది సీరియస్ విషయం. దాన్ని ఎలా తగ్గించాలి. ఎలాంటి అవగాహన తీసుకురావాలి అనేది న్యూస్ అవ్వాలి, దాని మీద డిబేట్లు జరగాలి కానీ సినిమా పోస్టర్ల మీద, ఇంకో ఇంకో విష యాల్లో కాదు’’ అని ఘాటుగా స్పందించారు. -
మళ్లీ సిగరెట్ కాల్చను!
‘‘అవును.. ఇకపై సినిమాల్లో నా క్యారెక్టర్ కోసం సిగరెట్ కాల్చను. ఎవరైనా అలాంటి క్యారెక్టర్ నాకు ఆఫర్ చేస్తే సింపుల్‌గా నో అని చెప్తా’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్. ఇంతకీ ఈ బ్యూటీ సిగరెట్ ఎందుకు వెలిగించారంటే ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా కోసం. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానీయా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. శిఖా తల్సానియా వెడ్డింగ్ చుట్టూ సాగనున్న ఈ సినిమాలో చైన్ స్మోకర్గా కనిపించనున్నారట స్వరా భాస్కర్. ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇందులో ఓ సీన్ కోసం డైరెక్టర్ నన్ను స్మోక్ చేయమన్నారు. నా ఎంటైర్ లైఫ్‌లో మోస్ట్ వరస్ట్ టేస్ట్ అనిపించింది. కొన్నిసార్లు నువ్వు సరిగా స్మోక్ చేయడం లేదని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత ఆయన్ని ఎలాగో కన్విన్స్ చేయగలిగాను. కానీ ఇప్పుడు ఎవరైనా స్మోక్ చేసే క్యారెక్టర్ ఇస్తే.. నాకు అవసరం లేదని తేల్చి చెప్పేస్తాను’’ అని చెప్పారు స్వరా భాస్కర్. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా జూన్ 1న విడుదల కానుంది. -
క్షయవ్యాధి నివారణకు పాటుపడాలి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్,సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క రూ క్షయవ్యాధి నివారణకు పాటుపడాలనికలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్ర వైద్యశాలలో క్షయ నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్ర జల భాగస్వామ్యం, డాక్టర్ల అంకితభావంతో పనిచేస్తే క్షయవ్యాధిని సంపూర్ణ ంగా నిర్మూలించవచ్చునన్నారు. మసూ చీ, ప్లేగు, పోలియో వ్యాధులను శాశ్వతంగా నిర్మూలించగలిగామన్నారు. కానీ ప్రజలను చైతన్యపరచని కారణంగా మలేరియా, పైలేరియా, క్షయ వ్యాధుల ను నిర్మూలించలేకపోతున్నామని విచా రం వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపం, అవగాహన రాహిత్యం కారణంగా క్షయవ్యాధి పెరిగిపోతుందన్నారు. కొన్ని రకా ల వృత్తులు కూడా క్షయ, ఇతర అంటురోగాలకు కారణమవుతున్నాయని చె ప్పారు. సిగరేట్, గుట్కా, పొగాకు ఇత ర వ్యసనాలు విడిచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీలు నిజ మైన వైద్య సేవలు అందించాలన్నారు. సేవాభావంతో పనిచేసే ఆర్ఎంపీలకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే చైనా తర్వాత ఇండియా క్షయవ్యాధిలో 2వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 4 వేల మంది రోగులకు వైద్య సౌకర్యం అంది స్తున్నట్లు తెలిపారు. అనంతరం క్షయవ్యాధి నియంత్రణకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ మెమోంటో, ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ అరుంధతి, డీఐఓ డాక్టర్ ఎబీనరేంద్ర, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయ్‌కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ హరినాథ్, డాక్టర్ గౌరి శ్రీ, డెమో తిరుపతయ్య పాల్గొన్నారు.