
‘‘అవును.. ఇకపై సినిమాల్లో నా క్యారెక్టర్ కోసం సిగరెట్ కాల్చను. ఎవరైనా అలాంటి క్యారెక్టర్ నాకు ఆఫర్ చేస్తే సింపుల్‌గా నో అని చెప్తా’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్. ఇంతకీ ఈ బ్యూటీ సిగరెట్ ఎందుకు వెలిగించారంటే ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా కోసం. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానీయా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. శిఖా తల్సానియా వెడ్డింగ్ చుట్టూ సాగనున్న ఈ సినిమాలో చైన్ స్మోకర్‌గా కనిపించనున్నారట స్వరా భాస్కర్.
ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇందులో ఓ సీన్ కోసం డైరెక్టర్ నన్ను స్మోక్ చేయమన్నారు. నా ఎంటైర్ లైఫ్‌లో మోస్ట్ వరస్ట్ టేస్ట్ అనిపించింది. కొన్నిసార్లు నువ్వు సరిగా స్మోక్ చేయడం లేదని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత ఆయన్ని ఎలాగో కన్విన్స్ చేయగలిగాను. కానీ ఇప్పుడు ఎవరైనా స్మోక్ చేసే క్యారెక్టర్ ఇస్తే.. నాకు అవసరం లేదని తేల్చి చెప్పేస్తాను’’ అని చెప్పారు స్వరా భాస్కర్. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా జూన్ 1న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment