వీరె ది వెడ్డింగ్ ప్రమోషన్‌లో కరీనా, సోనమ్ మరియు స్వర భాస్కర్
సాక్షి, ముంబై: బాలీవుడ్ చిత్రం వీరె ది వెడ్డింగ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఉద్యమం మొదలైంది. కథువా ఘటనపై స్పందిస్తూ ఈ చిత్రంలోని హీరోయిన్లు ఫ్లకార్డ్లతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే వారి చేష్టలు సమంజసంగా లేవంటూ ఆ సమయంలో విమర్శలు.. ట్రోలింగ్ ఎదురుకాగా... ఇప్పుడు ఆ ప్రభావం వాళ్లు నటించిన చిత్రంపై పడింది.
‘హిందువుల అత్మగౌరవం నిలవాలంటే ఈ చిత్రాన్ని(వీరె ది వెడ్డింగ్) బహిష్కరించండి. కరీనా, సోనమ్, స్వరభాస్కర్‌లు బీగ్రేడ్ హీరోయిన్లు. హిందువులపై అపవాదులు వేసే అలాంటి వాళ్ల చిత్రాలను ఆదరించాల్సిన అవసరం హిందువులకు లేదు. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే’ అంటూ ప్రముఖ కాలమిస్ట్ షెఫాలీ వైద్యా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీటర్‌లో బాయ్‌కాట్‌వీర్‌దేవెడ్డింగ్ పేరిట యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు.
ఇక హిందువులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఈ హీరోయిన్లంతా ఎక్కడికి పోయారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కథువా చిన్నారిపై ఘటనను తామూ ఖండిస్తున్నామని.. కానీ, సరిగ్గా సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలోనే వీళ్లు ఇలా డ్రామాలు ఎంతవరకు సరైందని మరికొందరు రీట్వీట్లు చేస్తూ షెఫాలీ నినాదానికి మద్ధతు ఇస్తున్నారు. హిందుస్థాన్‌లో పుట్టినందుకు సిగ్గు పడుతున్నామని.. ఆలయంలో హత్యాచారానికి గురైన 8 ఏళ్ల చిన్నారికి న్యాయం జరగాలంటూ ఈ ముగ్గురు ఫ్లకార్డ్లతో తమ ఫోటోలను ట్వీటర్‌లో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ను ఎదుర్కున్నారు.
Comments
Please login to add a commentAdd a comment