ఆ విషయంలో ఎందుకు సిగ్గు పడాలి! | why i have shame in revealing my age, says Sonam Kapoor | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో ఎందుకు సిగ్గు పడాలి!

Published Sat, Jun 11 2016 11:55 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆ విషయంలో ఎందుకు సిగ్గు పడాలి! - Sakshi

ఆ విషయంలో ఎందుకు సిగ్గు పడాలి!

ముంబై: ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా మహిళలు తమ వయసును దాచేయాలని నానా తంటాలు పడుతుంటారు. ఇలాంటివి తరచూ గమనిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఎవరినైనా అడిగితే ఓ చిరునవ్వుతో ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తారు. లేనిపక్షంలో ఆడవాళ్ల వయసు ఎవరైనా అడుగుతారా అంటూ తిరిగి చిన్న ప్రశ్న వేస్తారు. కానీ తనకు మాత్రం అలాంటి భయాలు అక్కర్లేదని బాలీవుడ్ నటి సోనమ్ తేల్చేసింది. ఫ్యాషన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే కొందరు హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ జూన్ 9న పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. తన వయసు ఎంతో చెప్పడానికి ఎప్పుడూ సిగ్గుపడనంటూ, తనకు 31 ఏళ్లు అని గర్వంగా చెబుతానంటోంది ఈ ముద్దుగుమ్మ.

సావారియాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అనిల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కొన్నేళ్లపాటు సక్సెస్ అందుకోలేదు. లేటెస్ట్ మూవీలు ప్రేమ్ రతన్ ధన్ పాయో, నీర్జా మూవీలలో నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఎయిర్ హోస్టెస్ నీర్జా బోనోతు జీవిత కథాంశం ఆధారంగా తీసిన 'నీర్జా' తో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రతి ఏడాది మంచి ఏడాదే అవుతుందని ఇందులో మంచి, చెడు అంటూ ప్రత్యేకంగా ఉండవని వేదాంతం చెబుతోంది. ఏదేమైనా సరే చేసే పనిని ఎప్పుడూ ఎంజాయ్ చేయాలని, తనను ఆధరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. సోనమ్ ఒకే చెప్పిన ఓ మూవీలో కరీనాకపూర్ కూడా నటిస్తుందని కథనాలు వచ్చాయి. అయితే త్వరలో తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement