నేను  మీ ఫ్యాన్‌ మేడమ్‌ | Anil kapoor in front of sonam kapoor | Sakshi

నేను  మీ ఫ్యాన్‌ మేడమ్‌

Dec 27 2018 12:00 AM | Updated on Apr 3 2019 6:34 PM

Anil kapoor in front of sonam kapoor - Sakshi

మురిపెం: అనిల్‌ కపూర్, సోనమ్‌ అహూజా 

సినిమా హీరోల అవుట్‌‘స్టాండింగ్‌’ ఫొటోలు చూసి, చూసి మొహం మొత్తేసిన వాళ్లకు ఈ ఫొటోలో కొంత ఛేంజ్‌ కనిపించవచ్చు. అనిల్‌ కపూర్‌ తన కూతురి ముందు ఒక అభిమానిగా మోకాళ్లపై కూర్చున్న ఈ అపురూపమైన క్షణాలను సత్యజిత్‌ దేశాయ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ క్యాచ్‌ పట్టేశారు. సోమవారం ముంబైలోని అంథేరిలో ఒక ఫిల్మ్‌ ప్రివ్యూలో ఆ తండ్రికి ఈ కూతురు తారసపడింది! అప్పుడే ఇదిగో ఇలా ఆయన.. ‘నేను మీ ఫ్యాన్‌ మేడమ్‌’ అన్నట్లుగా నవ్వుతూ నేలపై కూర్చున్నారు. కూతుర్ని ఆయన ఇంకా గారాం చేస్తున్నట్లే ఉంది. ఈ ఏడాది మే నెలలో సోనమ్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆనంద్‌ అహూజాను సోనమ్‌కి ఇచ్చి పెళ్లి జరిపించారు అనిల్‌ కపూర్‌. అక్షింతలు వేస్తూ మామూలు తండ్రి లాగే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత ఇష్టం కూతురంటే. ఆయనకు మహారాణే. సోనమ్‌కి కూడా తండ్రి అంటే చెప్పలేనంత ప్రేమ. డిసెంబర్‌ 24న అనిల్‌ కపూర్‌ బర్త్‌డే. 62 ఏళ్లు నిండాయి.

బర్త్‌డేకి సోనమ్‌ కపూర్‌ తన తండ్రికి ఎలాంటి ట్రీట్‌.. (ట్వీట్‌) ఇచ్చారో చూడండి. ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే డాడ్‌. మన ఇద్దరికీ ఇది గుర్తుండిపోయే సంవత్సరం. నేను ఇండస్ట్రీకి వచ్చిన ఈ పదేళ్లలోనూ తొలిసారిగా మీరున్న చిత్రంలో నేనూ నటిస్తున్నాను. ఈ ఏడాది జరిగిన మరో విశేషం మీరు నా పెళ్లి చెయ్యడం. జీవితంలోని ప్రతి అడుగులోనూ మీరు నాపై చూపించిన ప్రేమకు, మీరు నేర్పిన ఆదర్శాలకు, విలువలకూ అన్నిటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఐ లవ్యూ సో మచ్‌’’ అని ట్వీట్‌ చేశారు సోనమ్‌. ఈ తండ్రీకూతుళ్లు.. నటించిన ‘ఏక్‌ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ (ఒక అమ్మాయిని చూసినప్పుడు నాకిలా ఉంటుంది) చిత్రం 2019 ఫిబ్రవరి 1న విడుదల అవుతోంది. ఆ సినిమా ప్రివ్యూలోనే  అనిల్‌ కపూర్‌ ఇలా తన డాటర్‌ స్టార్‌ని విష్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement