మా ఇంట్లో నాకెవరూ ఫ్యాన్స్ లేరు: హీరో | In my family, no one is fan of each other, says Anil Kapoor | Sakshi
Sakshi News home page

మా ఇంట్లో నాకెవరూ ఫ్యాన్స్ లేరు: హీరో

Published Mon, Jun 20 2016 7:14 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మా ఇంట్లో నాకెవరూ ఫ్యాన్స్ లేరు: హీరో - Sakshi

మా ఇంట్లో నాకెవరూ ఫ్యాన్స్ లేరు: హీరో

దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ అనిల్ కపూర్ ది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన అనిల్ కు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి.

నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కు తన ఇంట్లో ఎవరూ ఫ్యాన్స్ లేరట. తాజాగా ఆయనే ఈ విషయాన్ని చెప్పారు. తన ముగ్గురు పిల్లలు తనకు ఫ్యాన్స్  కాదని, వారు తన పనితీరును ఎన్నడూ పొగడ్తల్లో ముంచెత్తలేదని తెలిపారు. అనిల్ పెద్ద కూతురు సోనం కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతోంది. చిన్న కూతురు రెహా నిర్మాత కాగా కొడుకు హర్షవర్థన్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఒకరి పనితీరు గురించి మరొకరు చెప్పుకొనేటప్పుడు ఎలాంటి పక్షపాతాన్ని చూపబోరని, నిజాయితీగా అభిప్రాయాలు వెల్లడిస్తారని అనిల్ చెప్పాడు.

'పనితీరు విషయంలో మేం చాలా నిజాయితీగా ఉంటాం. మాలో ఎవరు ఎవరికీ ఫ్యాన్స్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరులకు పని విషయంలో క్లాస్ ఇస్తారు. నా తండ్రిని చూడండి. ఆయనెంత గొప్పగా నటిస్తారో.. అని గొప్పలు చెప్పుకొనే రకం కాదు నా పిల్లలు. అలా అనాలని నేను కోరుకోను. అందుకే తమదైన శైలిలో సోనం, రెహా ముందుకు వెళుతున్నారు. ఇక వాళ్లు నా సినిమాల్ని పెద్దగా చూడలేదు. నా కొడుకు అయితే నా సినిమాలు ఒకట్రెండు కూడా చూసి ఉండడు' అని అనిల్ చెప్పారు. తన తాజా టీవీ సిరీస్ 24 ట్రైలర్, తన కొడుకు హర్షవర్ధన్ హీరోగా 'మిర్జియా' సినిమా ట్రైలర్ ఒకేరోజు విడుదల కావడం తనకు డబుల్ ఆనందాన్ని ఇస్తోందని అనిల్ కపూర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement