'ఆ హీరోకు జోడీగా మా అమ్మాయి అదుర్స్' | Salman and Sonam look great together, says Anil Kapoor | Sakshi
Sakshi News home page

'ఆ హీరోకు జోడీగా మా అమ్మాయి అదుర్స్'

Published Wed, Sep 9 2015 5:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఆ హీరోకు జోడీగా మా అమ్మాయి అదుర్స్' - Sakshi

'ఆ హీరోకు జోడీగా మా అమ్మాయి అదుర్స్'

ముంబయి : బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తన కూతురు సోనమ్ కపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్కు జోడీగా తమ అమ్మాయి సోనమ్ చాలా బాగుంటుందని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'ప్రేమ్ రతన్ ధ్యాన్ పాయో' మూవీలో సల్మాన్, సోనమ్ జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యాషన్ను అనుసరించే బాలీవుడ్ హీరోయిన్లలో సోనమ్ ఒకరు. తండ్రిచాటు కూతురన్న ముద్ర కూడా సోనమ పై ఉంది.

సోనమ్కి జోడీగా సల్మాన్ నటించడాన్ని వెండితెరపై చూడాలని తాను ఉవ్విళ్లూరుతున్నట్లు అనిల్ కపూర్ పేర్కొన్నారు. సల్మాన్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, కుటుంబకథా చిత్రమని మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు. సోనమ్ ఫస్ట్ మూవీ 'సావారియా'లో సల్మాన్ నటించినప్పటికీ, ఇద్దరు జత కట్టలేదని గుర్తుచేశారు. సహజసిద్ధంగానే సల్మాన్, సోనమ్ అందంగా కనిపిస్తారు. వారిని వెండితెరపై జోడీగా చూస్తే అభిమానులు మరింత ఆనందం పొందుతారని అనిల్ కపూర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement