'ఫ్రెండ్ కూతురితో రొమాన్స్ ఎలా?!' | OMG! Salman Khan didn't want to do 'Prem Ratan Dhan Payo' with Sonam Kapoor | Sakshi
Sakshi News home page

'ఫ్రెండ్ కూతురితో రొమాన్స్ ఎలా?!'

Published Tue, Sep 20 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

'ఫ్రెండ్ కూతురితో రొమాన్స్ ఎలా?!'

'ఫ్రెండ్ కూతురితో రొమాన్స్ ఎలా?!'

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులకు అవకాశాలు వాటంతట అవే తలుపు తడతాయని, స్టార్ ఇమేజ్ తేలికగా వస్తుందని అందరూ భావిస్తుంటారుగానీ.. అదంతా ఒట్టి మాటే అంటోంది సోనమ్ కపూర్. తను అనిల్ కపూర్ కూతురిని అయినందుకే తనకు బోలెడన్ని అవకాశాలు చేజారాయని, చాలా సినిమాలు మిస్ అయ్యాయని వాపోతుంది. 

అంతెందుకు ఉదాహరణకు 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా విషయమే తీసుకోండి,  సల్మాన్ నాతో సినిమా చేయనంటే చేయనన్నారు. దానికి సల్మాన్ చెప్పిన కారణం ఒక్కటే.. 'అనిల్ కపూర్ చాలాకాలంగా నాకు క్లోజ్ ఫ్రెండ్.. అలాంటిది ఆయన కూతురితో నేను రొమాన్స్ ఎలా చేయగలను? నిజంగా అది చాలా కష్టం' అని.  ఇలా చెప్పుకుంటూ పోతే నేను అనిల్ కపూర్ కూతురు బ్రాండ్తో పోగొట్టుకున్న సినిమాలు చాలానే ఉన్నాయంటోంది సోనమ్ కపూర్.

అలాగే ఫరాఖాన్ మా అమ్మకు బెస్ట్ ఫ్రెండ్. కానీ ఇప్పటివరకు నేను ఆమె సినిమాల్లో నటించలేదు. దానికి కారణం.. మా మధ్య ఉన్న రిలేషన్ వల్ల ఆమె ఎప్పుడూ నన్ను ఓ నటిలా చూడరు.. అంటోంది. మరి అలియా భట్, శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హాలాంటి సెలబ్రిటీ వారసులు తేలికగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు కదా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..  ప్రస్తుతం టాప్ హీరోయిన్స్గా ఉన్న దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలు ఇండస్ట్రీకి స్వశక్తితో వచ్చినవారే.

ఇక ఆలియా గురించి మాట్లాడతారా.. ఆమె ఈ రోజు ఈ స్థానంలో ఉండటానికి కారణం ఆమె టాలెంట్ కాదంటారా.. అంటూ బదులిచ్చింది. అయినా బంధుప్రీతి, వారసత్వంలాంటివి అన్నిచోట్లా ఉంటాయి గానీ.. అవేమీ మన ప్రయాణాన్ని తేలిక చేయవు అంటూ ఓ న్యూస్ వెబ్సైట్కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సోనమ్ ఈ విషయాలన్ని చెప్పుకొచ్చింది.

తండ్రి పేరు ఎప్పుడూ ఉపయోగించుకోనని, కష్టపడి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాని సోనమ్ అంటోంది. స్టార్ వారసురాలు.. కష్టపడకుండానే తనకి అన్నీ తేలికగా వచ్చేస్తాయని అనుకోవడం చాలా తప్పని చెప్తుంది నీర్జా స్టార్.  ప్రస్తుతం ఆమె 'వీర్ దీ వెడ్డింగ్' సినిమాలో కరీనాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement