సల్మాన్ సినిమాకు టైటిల్ వివాదం | salman khans preemleela in title troubles | Sakshi
Sakshi News home page

సల్మాన్ సినిమాకు టైటిల్ వివాదం

Published Fri, Nov 6 2015 12:56 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

సల్మాన్ సినిమాకు టైటిల్ వివాదం

సల్మాన్ సినిమాకు టైటిల్ వివాదం

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సినిమా చాలా కాలం తరువాత హిందీతో పాటు, తెలుగులోనూ ఒకేసారి రిలీజ్కు రెడీ అవుతోంది. గతంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన 'మైనే ప్యార్ కియా', 'హమ్ అప్కె హై కౌన్' సినిమాల తరువాత సల్మాన్ హీరోగా నటించిన సినిమా తెలుగు రిలీజ్ అవుతుండటంతో ఈసినిమా పై దక్షిణాదిలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలుగు వర్షన్ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంటగా సురజ్ బర్జాత్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'. ఈ సినిమాను 'ప్రేమలీల' పేరుతో తెలుగులో రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. తెలుగు సినిమా సెన్సార్ రూల్స్ ప్రకారం ఇతర భాషల్లో రూపొందించిన సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలంటే, ఆ భాషల్లో ఆ సినిమాకు పెట్టిన టైటిల్, ఏ అర్ధాన్ని ఇస్తుందో అదే అర్ధాన్ని ఇచ్చే టైటిల్ను తెలుగులోనూ పెట్టాలి. అయితే 'ప్రేమలీల' విషయంలో అలా జరగలేదంటూ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటానికి నిరాకరించారు.

ఇప్పటికే నవంబర్ 12న 'ప్రేమలీల' సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించిన చిత్రయూనిట్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement