పుస్తక రూపంలో సల్మాన్ జీవితకథ | salman khna biography to release on his birthday | Sakshi
Sakshi News home page

పుస్తక రూపంలో సల్మాన్ జీవితకథ

Published Sat, Dec 5 2015 9:35 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

పుస్తక రూపంలో సల్మాన్ జీవితకథ

పుస్తక రూపంలో సల్మాన్ జీవితకథ

వరుస బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 27న తన 50వ పుట్టినరోజు సందర్భంగా తన జీవితకథను పుస్తక రూపంలో రిలీజ్ చేయనున్నాడు. ఇప్పటికే పూర్తయిన ఈ పుస్తకాన్ని జాసిం ఖాన్ రాశాడు. ఇందులో సల్మాన్ సినీజీవితం, కుటుంబంతో ఆయనకున్న అనుబంధంతో పాటు, సల్మాన్ మీద వచ్చిన విమర్శలు, కేసుల విషయాలను కూడా తెలియజేయనున్నాడు. 'బీయింగ్ సల్మాన్' పేరుతో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఇటీవల 'ప్రేమ రతన్ ధన్ పాయో' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సల్లూ భాయ్, ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల విషయంలో మాత్రం మరోసారి తన స్టామినా ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం 'సుల్తాన్' షూటింగ్ లో బిజీగా ఉన్న సల్మాన్ వచ్చే ఈద్కు ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement