Prem Ratan Dhan Payo
-
సినీ ప్రమోషన్లో లైంగికంగా వేధించారు: నటి
బాలీవుడ్లో మంచినటిగా అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర సంపాదించుకుంది స్వర భాస్కర్. మసాలా సినిమా అయినప్పటికీ మహిళల సమ్మతి కూడా ముఖ్యమనే విషయాన్ని ఆమె తాజా సినిమా ‘అనార్కలి ఆఫ్ ఆర్హా’ లో చెప్పింది. ఆ తర్వాత ఫెమినిస్టుగా తన గొంతు వినిపించింది. ఇప్పుడు ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా లైంగికంగా వేధింపులకు గురైన విషయాన్ని ధైర్యంగా వెల్లడించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ప్రేమ్‌రతన్ ధన్‌పాయో సినిమా ప్రమోషన్ సందర్భంగా రాజకోట్‌లో తన పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. 2015లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ’ప్రేమ్‌రతన్ ధన్‌పాయో’లో స్వర సల్మాన్ సవతి సోదరిగా నటించింది. ‘సినిమా ప్రమోషన్ సందర్భంగా నేను సల్మాన్ సర్‌తో కలిసి ప్రయాణించాను. రాజ్‌కోట్ విమానాశ్రయంలో ఆయనను చూసేందుకు దాదాపు రెండువేల మంది చుట్టుముట్టారు. ఈ సందర్భంగా మూగిన కొందరు నన్ను లైంగికంగా తాకేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ ఉన్నా లాభం లేకపోయింది. అల్లరిగా ఉన్న అక్కడి నుంచి బయటపడి నేను కారులో ఎక్కేందుకు అక్కడే ఉన్న అనుపమ్ ఖేర్ సహాయపడ్డారు’ అని స్వర తెలిపారు. అంతకుముందు ముంబై రైల్లో ఓ తాగుబోతు తనముందే లైంగిక అసభ్య చర్యలకు పాల్పడ్డాడని, మొదట భయపడినా అతన్ని పోలీసులకు పట్టించేందుకు ప్రయత్నించానని, కానీ అతను తప్పించుకొని పారిపోయాడని తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. -
'ఫ్రెండ్ కూతురితో రొమాన్స్ ఎలా?!'
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులకు అవకాశాలు వాటంతట అవే తలుపు తడతాయని, స్టార్ ఇమేజ్ తేలికగా వస్తుందని అందరూ భావిస్తుంటారుగానీ.. అదంతా ఒట్టి మాటే అంటోంది సోనమ్ కపూర్. తను అనిల్ కపూర్ కూతురిని అయినందుకే తనకు బోలెడన్ని అవకాశాలు చేజారాయని, చాలా సినిమాలు మిస్ అయ్యాయని వాపోతుంది. అంతెందుకు ఉదాహరణకు 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా విషయమే తీసుకోండి, సల్మాన్ నాతో సినిమా చేయనంటే చేయనన్నారు. దానికి సల్మాన్ చెప్పిన కారణం ఒక్కటే.. 'అనిల్ కపూర్ చాలాకాలంగా నాకు క్లోజ్ ఫ్రెండ్.. అలాంటిది ఆయన కూతురితో నేను రొమాన్స్ ఎలా చేయగలను? నిజంగా అది చాలా కష్టం' అని. ఇలా చెప్పుకుంటూ పోతే నేను అనిల్ కపూర్ కూతురు బ్రాండ్‌తో పోగొట్టుకున్న సినిమాలు చాలానే ఉన్నాయంటోంది సోనమ్ కపూర్. అలాగే ఫరాఖాన్ మా అమ్మకు బెస్ట్ ఫ్రెండ్. కానీ ఇప్పటివరకు నేను ఆమె సినిమాల్లో నటించలేదు. దానికి కారణం.. మా మధ్య ఉన్న రిలేషన్ వల్ల ఆమె ఎప్పుడూ నన్ను ఓ నటిలా చూడరు.. అంటోంది. మరి అలియా భట్, శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హాలాంటి సెలబ్రిటీ వారసులు తేలికగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు కదా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌గా ఉన్న దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలు ఇండస్ట్రీకి స్వశక్తితో వచ్చినవారే. ఇక ఆలియా గురించి మాట్లాడతారా.. ఆమె ఈ రోజు ఈ స్థానంలో ఉండటానికి కారణం ఆమె టాలెంట్ కాదంటారా.. అంటూ బదులిచ్చింది. అయినా బంధుప్రీతి, వారసత్వంలాంటివి అన్నిచోట్లా ఉంటాయి గానీ.. అవేమీ మన ప్రయాణాన్ని తేలిక చేయవు అంటూ ఓ న్యూస్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సోనమ్ ఈ విషయాలన్ని చెప్పుకొచ్చింది. తండ్రి పేరు ఎప్పుడూ ఉపయోగించుకోనని, కష్టపడి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాని సోనమ్ అంటోంది. స్టార్ వారసురాలు.. కష్టపడకుండానే తనకి అన్నీ తేలికగా వచ్చేస్తాయని అనుకోవడం చాలా తప్పని చెప్తుంది నీర్జా స్టార్. ప్రస్తుతం ఆమె 'వీర్ దీ వెడ్డింగ్' సినిమాలో కరీనాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ప్రేమ్ రతన్ ధన్‌పాయో
-
'విలువలు నిండిన ఫ్యామిలీ చిత్రాలు రావాలి'
ముంబయి: ఈ రోజుల్లో యువత కుటుంబ విలువలకు సంబంధించిన చిత్రాలపై దృష్టిసారించి రూపొందిస్తే బాగుంటుందని ప్రముఖ దర్శకుడు సూరజ్ బరజాత్య అన్నారు. ' 1990లో మైనే ప్యార్ కియా చిత్రంతో మాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు వంటి విభాగాల్లో అవార్డులు వచ్చాయి. అప్పుడు నేను యువకుడిని. పైగా ఇండస్ట్రీకి కొత్త' అని ఆయన గుర్తు చేసుకున్నారు. బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు 2015 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అనుభవాలు పంచుకున్నారు. 'ఈరోజుల్లో యువదర్శకులకు ఎంతో టాలెంట్ ఉంది. అందుకే వారు మరిన్ని మంచి చిత్రాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వచ్చే తరంవారికి మంచి కుటుంబ విలువలతో కూడిన చిత్రాలను అందించే బాధ్యత వారిదే' అని ఆయన అన్నారు. ఆయన తాజాగ రూపొందించిన చిత్రం ప్రేమ్ రతన్ దన్ పాయో ఈ ఏడాది బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నుంచి నాలుగు అవార్డు లను అందుకుంది. -
పుస్తక రూపంలో సల్మాన్ జీవితకథ
వరుస బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 27న తన 50వ పుట్టినరోజు సందర్భంగా తన జీవితకథను పుస్తక రూపంలో రిలీజ్ చేయనున్నాడు. ఇప్పటికే పూర్తయిన ఈ పుస్తకాన్ని జాసిం ఖాన్ రాశాడు. ఇందులో సల్మాన్ సినీజీవితం, కుటుంబంతో ఆయనకున్న అనుబంధంతో పాటు, సల్మాన్ మీద వచ్చిన విమర్శలు, కేసుల విషయాలను కూడా తెలియజేయనున్నాడు. 'బీయింగ్ సల్మాన్' పేరుతో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇటీవల 'ప్రేమ రతన్ ధన్ పాయో' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సల్లూ భాయ్, ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల విషయంలో మాత్రం మరోసారి తన స్టామినా ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం 'సుల్తాన్' షూటింగ్ లో బిజీగా ఉన్న సల్మాన్ వచ్చే ఈద్‌కు ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. -
'త్రి ఇడియట్స్'ను దాటేసిన 'ధన్‌పాయో'!
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. తాజాగా 'త్రి ఇడియట్స్' సినిమా భారత్‌లో రాబట్టిన కలెక్షన్ల మొత్తాన్ని ఈ చిత్రం అధిగమించింది. దేశియంగా 'త్రి ఇడియట్స్' మొత్తంగా రూ. 202 కోట్లు వసూలు చేయగా, ఈ నెల 12న విడుదలైన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' ఇప్పటికే రూ. 203.53 కోట్లు వసూలు చేసి ఆ చిత్రాన్ని దాటేసింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత సల్మాన్-సూరజ్ బర్జాత్యా కలిసి తీసిన సినిమా 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో'. 'మైనే ప్యార్ కియా' 'హమ్ ఆప్కే హై కౌన్', 'హమ్ సాథ్ సాథ్ హై' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో మళ్లీ సినిమా రావడంతో ఊహించినట్టే 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' భారీ వసూళ్లు సాధిస్తున్నది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ ద్విపాత్రాభినయంతో తన అభిమానులను ఆకట్టుకున్నాడు. -
‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’కు డాక్టర్ ఆర్థో ప్రమోషన్..!
సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రానికి కో-ప్రమోటర్‌గా వ్యవహరించనున్నట్లు ప్రముఖ నొప్పి నివారిణి డాక్టర్ ఆర్థో ఉత్పత్తి సంస్థ- ఎస్బీఎస్ బయోటెక్ ప్రకటించింది. కుటుంబం మొత్తం ఐకమత్యంగా మెలగడానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి చిత్రంలో కథానాయకుడు చేసే ప్రయత్నానికి సంబంధించిన కథాంశం సంస్థను ఆకర్షించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే స్ఫూర్తితో డాక్టర్ ఆర్థో కూడా పలు వయస్సుల వారికి వచ్చే నొప్పులను దూరం చేస్తూ... వారి సుఖ సంతోషాలకు పాటు పడుతోందని పేర్కొంది. ఎనిమిది రకాల సమర్థవంతమైన మూలికలతో కూడిన ఔషధం ద్వారా... నాసి రకం మందులు మనుషులపై ప్రభావం చూపకుండా తన వంతు కృషి చేస్తోందని వివరించింది. -
'ఈ గౌరవం పొందటానికి చాలా ఏళ్లు పట్టింది'
ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సల్లూభాయ్, ఫ్లాప్ సినిమాలతో కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించేస్తున్నాడు. తాజాగా ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ప్రూవ్ చేసుకున్న సల్మాన్, తన హాలీవుడ్ ఎంట్రీపై మాట్లాడాడు. 'హాలీవుడ్లో నటులు చాలా కష్టపడి సినిమా చేస్తారు. మన దగ్గర సక్సెస్ అవ్వడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. హాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి, అక్కడ ఈ స్థాయి గౌరవం పొందడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఇంత సక్సెస్, మర్యాద ఉన్నప్పుడు హాలీవుడ్‌కు వెళ్లాల్సిన పని ఏంటి..? ఇక్కడ ఈ స్థాయిని సాధించడానికి చాలా ఏళ్లు కష్టపడ్డాం.. మళ్లీ అక్కడ కూడా కష్టపడటం ఎందుకు..?' అంటూ తనకు హాలీవుడ్ వెళ్లే ఉద్దేశం లేదని తేల్చేశాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ కొత్త సినిమా తొలి వారంలోనే 130 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం సుల్తాన్ సినిమాలో నటిస్తున్న కండల వీరుడు, ఆ సినిమాలో మరింత భారీ ఖాయంతో కనిపించటం కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈసినిమాను 2016 రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
నాలుగు రోజుల్లో రూ.130 కోట్ల వసూళ్లు
ముంబై: క్లాస్ అయినా, మాస్ అయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అతడు తాజాగా నటించిన ఫ్యామిలీ డ్రామా 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' రికార్డ్ ఓపెనింగ్స్ కలెక్షన్ రాబట్టింది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 130 కోట్లు వసూలు చేసింది. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో రూ. 129.77 కోట్ల కలెక్షన్స్ సాధించింది. మొదటి మూడు రోజుల్లో 101.47 కోట్లు రాబట్టింది. ఆదివారం ఒక్క రోజే రూ. 28.30 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ కలెక్షన్లు బాగున్నాయని, తర్వాత వసూళ్లను బట్టి సినిమా ఏ రేంజ్ కు వెళుతుందో తెలుస్తుందని ట్రేడ్ ఎనలిస్టులు అంటున్నారు. ఈ సినిమాను రూ. 60 కోట్ల బడ్జెట్ లో తీశారు. 16 ఏళ్ల తర్వాత సూరజ్ ఆర్ బరజాత్య దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ బాషల్లో దీన్ని విడుదల చేశారు. -
వందకోట్ల క్లబ్బులోకి తొమ్మిదోసారి!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మధ్య నటిస్తున్న ప్రతి చిత్రం వందకోట్ల క్లబ్బులో చేరుతున్నది. తాజాగా ఆయన నటించిన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' కూడా మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తొలిమూడు రోజుల్లోనే వందకోట్ల కలెక్షన్ రాబట్టింది. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో సల్మాన్, సోనం కపూర్ జంటగా నటించిన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' దీపావళి కానుకగా ఈ నెల 12న విడుదలైంది. పండుగరోజు వసూళ్లు పెద్దగా ఆకట్టుకోకపోయినా వీకెండ్ కలెక్షన్లు భారీగా వచ్చాయి. దేశీయ మార్కెట్లో ఈ సినిమా రూ. 101.47 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో గురు, శుక్రవారాల్లో రూ. 25.58 కోట్లు వసూలు చేసింది. తొలిరెండు రోజుల వసూళ్ల విషయంలో ఈ సినిమా ఇప్పటికే సల్మాన్ బ్లాక్‌బ్లాస్టర్ హిట్ బజరంగీ భాయ్‌జాన్‌ను దాటేసింది. గతంలోనూ సల్మాన్‌ఖాన్ పలు సినిమాలు వందకోట్ల క్లబ్బులో చేరాయి. 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' ఈ క్లబ్బులో చేరిన ఆయన తొమ్మిదో సినిమా. అదేవిధంగా వందకోట్లు వసూలు చేసిన ఐదో సినిమా. 2015లో ఇప్పటివరకు భజరంగీ భాయ్‌జాన్, తను వెడ్స్ మను రిటర్న్స్, బాహుబలి (హిందీ), ఏబీసీడీ-2 సినిమాలు వందకోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చాయి. -
భజరంగీని దాటేసిన ధన్‌పాయో!
సల్మాన్‌ఖాన్, సోనంకపూర్ జంటగా నటించిన ప్రేమ్‌రతన్ ధన్‌పాయో చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించి.. సల్మాన్ గత సినిమా బజరంగీ భాయ్‌జాన్ రికార్డును అధిగమించింది. ప్రేమ్‌రతన్ ధన్‌పాయో తొలి రెండురోజుల్లో రూ. 71.38 కోట్లను వసూలు చేసినట్టు తెలిసింది. 2015 సంవత్సరంలో తొలిరెండురోజుల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఇంతకుమునుపు బజరంగీ భాయ్‌జాన్ చిత్రం రెండురోజుల్లో రూ. 63.75 కోట్ల వసూళ్లు రాబట్టింది. కుటుంబకథా చిత్రాలను అందంగా తెరకెక్కించే సూరజ్ బార్జాత్యా తీసిన ప్రేమ్‌రతన్ ధన్‌పాయో సినిమాకు మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ తొలిరోజు రికార్డుస్థాయిలో రూ. 40.35 కోట్లను వసూలు చేసింది. అయితే, రెండోరోజు ఈ సినిమా కలెక్షన్ 23శాతం పడిపోయింది. మొత్తానికి మూడు రోజుల్లో ఈ సినిమా వందకోట్ల మార్కును దాటే అవకాశముంది. -
ముంబాయిలో సందడి చేసిన సల్మాన్,సోనమ్
-
ఆ సినిమాకూ మూడు కత్తెరలు పడ్డాయి!
బాలీవుడ్లోనే క్లీన్ సినిమాలు తీసే దర్శకుడు సూరజ్ బర్జాత్యా. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఆయన తాజాగా తీసిన సినిమా 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో'. సల్మాన్‌ఖాన్, సోనంకపూర్ జంటగా నటించిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం పెట్టడం విస్మయం కలిగిస్తున్నది. తెలుగులో 'ప్రేమలీల'గా వస్తున్న ఈ సినిమాకు మూడు కత్తెరలు వేసిన తర్వాత సెన్సార్ బోర్డు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. గతవారం సినిమాను చూసిన పరిశీలన కమిటీ.. చిత్రంలో రఖైల్ (ఉంపుడుగత్తె) అనే పదాన్ని వాడటంతో పాటు మరో రెండు సీన్లకు కట్ వేయాలని సూచించిందని, ఇందుకు చిత్రబృందం కూడా అంగీకరించిందని చిత్రయూనిట్‌కు సంబంధించిన విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా రామ్-లీల స్వీకెన్స్‌లో పాత పాటలకు వృద్ధ దంపతులు డ్యాన్స్ చేసే సన్నివేశానికి కత్తెర వేసింది. ఒక వ్యక్తి ఉరి వేసుకునే సన్నివేశాన్ని లాంగ్ షాట్లో చూపించాల్సిందిగా సెన్సార్ కోరింది. ఇందుకు చిత్రబృందం అంగీకరించిందని సినీవర్గాలు తెలిపాయి. సెన్సార్ బోర్డు సినిమాలోని కొన్ని సీన్లకు అభ్యంతరం చెప్పడంపై చిత్రబృందం షాక్‌కు గురయింది. 'సూరజ్ బర్జాత్యా అత్యంత స్వచ్ఛంగా సినిమాలు తెరకెక్కిస్తారు. నిజానికి ప్రేమ్‌రతన్ ధన్పాయోలో కూడా ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవు. అయినా బర్జాత్యా సినిమాలకు సంబంధించి తొలసారి సెన్సార్ అభ్యంతరాలు రావడం మమ్మల్ని షాక్‌కు గురిచేస్తున్నది' అని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు తీరును ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శకులు తప్పుబట్టారు. ప్రముఖ దర్శకులు మహేశ్ భట్, శ్యాం బెనెగల్, సుభాష్ కపూర్, నీరజ్ ఘ్యావన్ సెన్సార్ బోర్డు తీరు మూర్ఖంగా ఉందని అభిప్రాయపడ్డారు. -
సల్మాన్ సినిమాకు టైటిల్ వివాదం
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సినిమా చాలా కాలం తరువాత హిందీతో పాటు, తెలుగులోనూ ఒకేసారి రిలీజ్‌కు రెడీ అవుతోంది. గతంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన 'మైనే ప్యార్ కియా', 'హమ్ అప్కె హై కౌన్' సినిమాల తరువాత సల్మాన్ హీరోగా నటించిన సినిమా తెలుగు రిలీజ్ అవుతుండటంతో ఈసినిమా పై దక్షిణాదిలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలుగు వర్షన్‌ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంటగా సురజ్ బర్జాత్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'. ఈ సినిమాను 'ప్రేమలీల' పేరుతో తెలుగులో రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. తెలుగు సినిమా సెన్సార్ రూల్స్ ప్రకారం ఇతర భాషల్లో రూపొందించిన సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలంటే, ఆ భాషల్లో ఆ సినిమాకు పెట్టిన టైటిల్, ఏ అర్ధాన్ని ఇస్తుందో అదే అర్ధాన్ని ఇచ్చే టైటిల్‌ను తెలుగులోనూ పెట్టాలి. అయితే 'ప్రేమలీల' విషయంలో అలా జరగలేదంటూ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటానికి నిరాకరించారు. ఇప్పటికే నవంబర్ 12న 'ప్రేమలీల' సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించిన చిత్రయూనిట్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. -
నా జీతం ఎంతైతే మీకెందుకు..?
మీడియాతో ఎప్పుడు మాట్లాడినా సరదాగా ఎంటర్టైన్ చేసే సల్మాన్ ఖాన్ ఈ సారి కాస్త వేడి పెంచాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా మీద సెటైర్లు వేస్తూ అలరించాడు. ప్రస్తుతం తన హీరోగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాతో పాటు తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్ 9' ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు సల్మాన్. వరుస ప్రమోషన్ ఈవెంట్లతో రెగ్యులర్ గా మీడియాతో కలుస్తున్న సల్మాన్ ఇటీవల ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'మీ జీతాల విషయంలో నాకు ఎలాంటి ఆసక్తి లేదు.. మరి మీకు మాత్రం నా జీతం విషయంలో అంత ఇంట్రస్ట్ ఎందుకు' అంటూ చురకలంటించాడు.'నా రెమ్యూనరేషన్ పెరిగినా అది నాతో ఉండదు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కే వెళ్తుంది. ఓ మంచి పని కోసం ఉపయోగపడుతుంది' అని వివరించాడు. బాలీవుడ్లో బ్యాడ్‌బాయ్ ఇమేజ్ ఉన్న సల్మాన్ 2007లో కొన్ని ఇతర సంస్థలతో కలిసి బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మందికి విద్యా, వైద్య సేవలు అందిస్తున్నారు. -
కండల వీరుడి కొత్త అవతారం
'బజరంగీ భాయిజాన్' విజయం కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కొత్త కిక్ ఇచ్చింది. చాలా రోజులుగా వివాదాలతో ఇమేజ్ పాడు చేసుకున్న సల్మాన్ ఈ మూవీ సక్సెస్‌తో ఒక్కసారిగా అభిమానులతో పాటు సినీ, రాజకీయవర్గాలకు చెందినవారి మనసు కూడా గెలుచుకున్నాడు. అందుకే తన తదుపరి సినిమాలు కూడా అన్ని వర్గాలను అలరించేవిగా ఉండాలని తెగ కష్టపడిపోతున్నాడు. దాంతో యాక్టింగ్‌తో పాటు మేకింగ్ విషయంలో కూడా తన మార్క్ కనిపిచేలా జాగ్రత్త పడుతున్నాడు సల్లూబాయ్.. ఇప్పటి వరకు నటుడిగానే కొనసాగిన కండల వీరుడు ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఇతర రంగాల మీద కూడా పట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. హీరోగా చాలా అనుభవం ఉన్న సల్మాన్ నిర్మాతగా కూడా సక్సెస్ సాదించాడు. తనకున్న మాస్ ఇమేజ్‌కు భిన్నంగా ఓ ఎమోషనల్ ట్రావెల్ డ్రామను నిర్మించి సమ్ థింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. బజరంగీ భాయిజాన్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాసిన సల్మాన్ తన ప్రొడక్షన్ లో వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ పంచోలిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్నచిత్రం కోసం సల్మాన్ ఖాన్ గాయకుడిగా కూడా మారాడు. అంతేకాకుండా ఎడిటింగ్‌ను కూడా తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. అలాగే సల్మాన్ హీరోగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఎడిటింగ్ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇటీవలే ఈ సినిమా రషెస్ చూసిన అతడు స్వయంగా ఎడిటింగ్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే హీరో నుంచి నిర్మాతగా మారిన సల్మాన్, గాయకుడిగా, ఎడిటర్‌గా కూడా మారటంతో ముందు ముందు ఇంకెన్ని అవతారాలు చూపిస్తాడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ... -
అమూల్యమైన ప్రేమ నాకు దక్కింది!
సూరజ్ బర్జాత్యా చిత్రంలో కథానాయికగా అవకాశం రావడమంటే సదరు హీరోయిన్‌కు సుడి తిరిగినట్టే. భాగ్యశ్రీ, మాధురీదీక్షిత్, కరిష్మాకపూర్, కరీనా కపూర్... వీరందరూ సూరజ్ సినిమాల్లో నటించి పేరు సంపాదించుకున్నవారే. త్వరలో ఆ జాబితాలోకి అనిల్‌కపూర్ కుమార్తె సోనమ్‌కపూర్ కూడా చేరబోతున్నారు. సూరజ్ బర్జాత్యా చిత్రంలో ఛాన్స్ కొట్టేశారామె. పైగా ఈ సినిమాలో కథానాయకుడు ఎవరనుకున్నారు? బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్. ఇందులో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తుండటం మరో విశేషం. ఇందులో ఓ పాత్ర పేరు ‘ప్రేమ్’. సూరజ్ దర్శకత్వంలో సల్మాన్ ఇప్పటికి మూడు సినిమాల్లో నటించారు. ఆ మూడింటిలో ఆయన పేరు ప్రేమ్. ఈ నాలుగో సినిమాలో కూడా సల్మాన్ పాత్ర పేరు ‘ప్రేమ్’ కావడం విశేషం. మరో పాత్ర ‘విజయ్’. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ అనే టైటిల్‌ని కూడా సూరజ్ ఖరారు చేశారు. ‘అమూల్యమైన ప్రేమ్ ప్రేమ నాకు దక్కింది’ అని ఈ టైటిల్‌కి అర్థం. ‘పాయోజీ రామ్ రతన్ ధన్ పాయో’ అని సాగే మీరాబాయి కీర్తన నుంచి స్ఫూర్తి పొంది ఈ టైటిల్‌ని ఖరారు చేశారాయన. ఈ సినిమాలో నాయికగా నటిస్తుండటంతో సోనమ్ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ‘‘‘హమ్ ఆప్కే హై కౌన్’లోని ‘దీదీ తేరా దేవర్ దీవానా’ పాట, ఆ పాటలో ఆకుపచ్చ డ్రస్‌లో మాధురీ దీక్షిత్.. నేను జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం అది. నేనే గనుక నటినైతే... ఎప్పటికైనా ఇలాంటి దుస్తుల్ని ధరించి, అంత మంచి పాటలో నర్తించి, మాధురిలా మన్ననలను పొందాలని కలలు కనేదాన్ని. ఆ కోరిక ఇంత తేలిగ్గా నెరవేరుతుందనుకోలేదు’’ అని ఆనందం వ్యక్తం చేశారు సోనమ్.