'త్రి ఇడియట్స్'ను దాటేసిన 'ధన్‌పాయో'! | Salman Khan's 'Prem Ratan Dhan Payo' surpasses lifetime collections of '3 Idiots' | Sakshi
Sakshi News home page

'త్రి ఇడియట్స్'ను దాటేసిన 'ధన్‌పాయో'!

Published Sat, Nov 28 2015 9:58 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

'త్రి ఇడియట్స్'ను దాటేసిన 'ధన్‌పాయో'!

'త్రి ఇడియట్స్'ను దాటేసిన 'ధన్‌పాయో'!

న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో' రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. తాజాగా 'త్రి ఇడియట్స్' సినిమా భారత్‌లో రాబట్టిన కలెక్షన్ల మొత్తాన్ని ఈ చిత్రం అధిగమించింది. దేశియంగా 'త్రి ఇడియట్స్' మొత్తంగా రూ.  202 కోట్లు వసూలు చేయగా, ఈ నెల 12న విడుదలైన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' ఇప్పటికే రూ. 203.53 కోట్లు వసూలు చేసి ఆ చిత్రాన్ని దాటేసింది.

దాదాపు 16 ఏళ్ల తర్వాత సల్మాన్-సూరజ్ బర్జాత్యా కలిసి తీసిన సినిమా 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో'. 'మైనే ప్యార్‌ కియా' 'హమ్‌ ఆప్కే హై కౌన్', 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై' వంటి సూపర్‌ హిట్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రావడంతో ఊహించినట్టే 'ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో' భారీ వసూళ్లు సాధిస్తున్నది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ ద్విపాత్రాభినయంతో తన అభిమానులను ఆకట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement