PK
-
కష్టం... నేనిప్పుడు ఏమీ చేయలేను
పేషెంట్‌ను పరుగుపరుగున ఆస్పత్రికి తీసుకొచ్చారు.. డాక్టర్ కూడా కంగారుగా వచ్చి చూశారు .. అన్ని పరీక్షలు చేశారు.. అన్నీ చెక్ చేశారు... బంధుమిత్రులు అందరూ ఆతృతతో చూస్తున్నారు.. డాక్టర్ ఏమి చెబుతారో... మా తాత ఎప్పటికి మామూలు మనిషి అవుతాడో అని ఆశగా చూస్తున్నారు. డాక్టర్ కళ్ళజోడు తీసాడు.. మెల్లగా సర్దుకుని.. లేదు.. అంతా అయిపొయింది.. లోపల సామాన్లు అన్నీ కుళ్లిపోయాయి.. మహా అయితే మూణ్నెల్లు ఉంటాడు... ఈలోపు అన్నీ సర్దేయండి.. అయన చివరికోరికలు ఏమైనా ఉంటే తీర్చేయండి.. అని చెప్పి బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోయారు. తెలుగుదేశానికి కూడా ఇదే సమాధానం ఎదురైంది. ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ను తమకు సాయం చేయాల్సిందిగా టీడీపీ కోరింది. ప్రస్తుతం తెలుగుదేశానికి రాబిన్ శర్మ వ్యూహకర్తగా ఉన్నారు.. బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ ఇలాంటి ప్రోగ్రాములన్నీ ఆయనే డిజైన్ చేశారు. కానీ సీఎం వైయస్ జగన్‌ను అడ్డుకోవడానికి అవేం పెద్దగా పనికిరాలేదు. దీంతో ఈసారి ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించాలని భావించారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నన్ని రోజులు లోకేష్ ఢిల్లీలో మకాం వేసి ప్రశాంత్ కిషోర్ ను కలవగలిగారు.. అయన వచ్చి ఇక్కడ లోకేష్ ఇతర పెద్దలతో మాట్లాడారు.. చంద్రబాబును, ఇతర సీనియర్లు.. ఇంకా రాబిన్ శర్మను సైతం కలిసి చర్చించారు. రానున్న ఎన్నికల్లో తమను ఎలాగైనా గెలిపించాలని, ఎంత బడ్జెట్ అయినా పర్లేదని, కొత్తకొత్త ఆలోచనలు, ప్లాన్లు వేసి వైఎస్సార్ కాంగ్రెస్‌ను బదనాం చేయాలని కోరారు. ఇంతవరకూ తాము చేస్తున్న పార్టీ ప్రచారం... ఇతర కార్యక్రమాలను వివరించి.. ఇంకేం చేయాలి.. ఎలా చేస్తే అధికారంలోకి వస్తామో సలహాలు.. సూచనలు చేయాలనీ, దీనికి ఎంత డబ్బు ఇమ్మన్నా ఇస్తామని అన్నారు. ప్రభుత్వంపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని కొంత ఎగదోస్తే చాలని, తాను సీఎం అయ్యాక ఏది కావాలంటే అది ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అంతా విన్న ప్రశాంత్ కిషోర్ సమయం మించిపోయిందని, తానిప్పుడు ఏమీ చేయలేనని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే పలు ప్రోగ్రాములతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల్లో ఉందని, ఆ పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటున్నారని చెప్పిన ప్రశాంత్ కిషోర్ .. ఈ తరుణంలో జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమని చెప్పినట్లు తెలిసింది. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయని, ఇప్పుడు మనం ఎకాఎకిన వ్యతిరేకతను పోగుచేయలేమని చెప్పడంతో తండ్రీకొడుకులు ఉసూరుమన్నారని తెలిసింది. -సిమ్మాదిరప్పన్న ఇదీచదవండి..కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు..? -
ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్? పీకే సమాధానమిదే..!
పట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెటుతున్నట్లు కొద్ది నెలల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఓ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు ఇన్నాళ్లు మౌనం పాటించిన ఆయన సస్పెన్స్‌ను బ్రేక్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. బిహార్ వ్యాప్తంగా ప్రజలను కలిసేందుకంటూ ‘జన్ సూరాజ్ అభియాన్’ ఏర్పాటు చేసిన క్రమంలో ఆయనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఓ ఇంటర్వ్యూలో మీరు ఎన్నికల బరిలో నిలుస్తున్నారా? అని అడిగి ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? నాకు అలాంటి ఆకాంక్షలు లేవు’ అని తేల్చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ సందర్భంగా జేడీయూ, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. తాను స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించుకున్న తర్వాత జేడీయు నేతలు తనను తిట్టేందుకు ఇష్టపడుతున్నారని ఆరోపించారు. తనకు రాజకీయ అవగాహన లేకపోతే నితీశ్ కుమార్ వెంట రెండేళ్లు ఏం పని చేశానో ఆయననే ప్రశ్నించాలని సూచించారు. జేడీయూ-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్. వారు ఇచ్చిన హామీని నెరవేరుస్తే తన పాదయాత్రను ఆపేస్తానని సవాల్ చేశారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు కిషోర్. ఈ సందర్భంగా జన్ సూరాజ్ కార్యక్రమం పార్టీగా మారనుందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే.. -
ఆమిర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టిన ‘‘సంజు’’
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ సినిమా అగ్రకథానాయకుల రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘‘టైగర్ జిందా హై’’ రికార్డును తుడిచిపెట్టిన ‘సంజు’ మూడవ స్థానంలో ఉన్న ఆమిర్ ఖాన్ ‘‘పీకే’’ రికార్డును సైతం బద్దలుకొట్టింది. విడుదలైన 5 వారాల్లో 341కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా సంజు నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా మొదటి రెండు స్థానాల్లో బాహుబలి-2(510కోట్లు), దంగల్(387కోట్లు) ఉన్నాయి. కొత్తగా విడుదలవుతున్న సినిమాలకు సంజు గట్టిపోటీ ఇస్తోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన సంజు సినిమాలో రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. -
పీకేను బీట్ చేసిన టైగర్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లు నటించిన టైగర్ జిందా హై వసూళ్లలో దుమ్మురేపింది. 2012లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఏక్ థా టైగర్‌కు సీక్వెల్‌గా వచ్చిన టైగర్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే గర్జించింది. ఓవరాల్ వసూళ్లలో ఈ మూవీ హిందీ మూవీస్‌లో అమీర్‌ఖాన్ నటించిన పీకేను వెనక్కినెట్టి టాప్ 3 ప్లేస్‌ను ఆక్రమించింది. ప్రముఖ మూవీ విశ్లేషకులు రమేష్ బాల ఈ విషయం వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన హిందీ సినిమాల్లో బాహుబలి 2 అగ్రస్ధానంలో ఉండగా, దంగల్ రెండో స్ధానంలో, టైగర్ జిందా హై మూడవ స్ధానంలో నిలిచాయని చెప్పారు. పీకే నాలుగోస్ధానంలో భజరంగీభాయ్‌జాన్ టాప్ 5లో చోటుదక్కించుకున్నాయని తెలిపారు. టైగర్ జిందా హై ఇప్పటికే గత ఏడువారాల్లో రూ 339 కోట్ల వసూళ్లు రాబట్టి సల్మాన్ మూవీల్లో అత్యధిక గ్రాసర్‌గా నిలిచింది. -
మేకప్ తీసి చూపిస్తున్నారు..!
భారతీయ సినిమాల్లో ఫాంటసీలే ఎక్కువగా కనిపిస్తాయి. వంద మందిని ఒంటి చేత్తో ఎదిరించే హీరో. ఎంతటి మగాడినైనా ఫిదా చేసే హీరోయిన్, ప్రపంచాన్ని శాసించినా.. హీరో ముందు చిత్తైపోయే విలన్. ఆరు పాటలు,నాలుగు ఫైట్లు, మరో నాలుగు కామెడీ సీన్లు. చాలా కాలంగా మన సినిమా అంటే ఇదే. కమర్షియల్ విలువల పేరుతో సినిమాను ఈ హద్దుల్లో కట్టి పడేశారు. అప్పుడప్పుడు కొత్త ప్రయత్నాలు జరిగినా.. రొటీన్ సినిమాలతో పోలిస్తే ఆ సంఖ్య నామమాత్రమే. అయితే ఇటీవల కాలంలో పరిస్థితిలో మార్పులు వస్తున్నాయి. మూస ఫార్ములాలను పక్కన పెట్టి దేశంలోని పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం నటీనటులు సాంకేతిక నిపుణులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా భారతీయ సినిమా మేకప్ తీసేసి రియలిస్టిక్ గా ప్రజెంట్ చేసిన సినిమాలు కూడా అడపాదడపా తారస పడుతూనే ఉన్నాయి. ఓ సామాజిక సమస్యను సినిమా కథగా రూపొందించిన తాజా చిత్రం టాయిలెట్. కేంద్ర ప్రభుత్వ నినాదం స్వచ్ఛ భారత్ కు మద్ధతుగా తెరకెక్కించిన ఈ సినిమా దేశంలోని పరిస్థితులను వెండితెర మీద ఆవిష్కరించింది. సామాజికంగా ఎంత అభివృద్ది చెందుతున్నప్పటికీ ఇంకా దేశంలోని సగం జనాభా టాయిలెట్ లను వాడటం లేదన్న నిజాన్ని బయటపెట్టింది ఈ సినిమా. ఓ పల్లెటూరి అబ్బాయిని పెళ్లి చేసుకున్న చదువుకున్న అమ్మాయి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. (సాక్షి స్పెషల్) ఇంట్లో టాయిలెట్ ఏర్పాటు చేయకపోతే విడాకులు ఇస్తానని కండిషన్ పెట్టిన అమ్మాయి తను అనుకున్నది సాధించిందా లేదా అన్నదే ఈ సినిమా కథ. అయితే ఈ తరహా సినిమాలు చేయటం కాస్త ఇబ్బందికరమైన విషయంలో.. నిజాన్ని అంగీకరించడానికి మన సమాజం సిద్ధంగా ఉండదు. సమస్యను ఎత్తి చూపిస్తే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. వివాదాలు మొదలవుతాయి. కానీ ఆ సమస్యలన్ని దాటి గెలిచిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ఓ ప్రయత్నమే 'రాజ్ నీతి'. హిందీ సినిమాల్లో రాజకీయాల ప్రస్థావన తరుచూ కనిపిస్తుంటుంది. అయితే ఓ చిన్న గ్రామంలోని రాజకీయ కుటుంబం నేపథ్యంలో భారత రాజకీయ వ్యవస్థ ప్రతిభింబించేలా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ప్రకాష్ ఝా, ప్రస్తుతం వ్యవస్థలోని జాతీయ నాయకులను పోలిన పాత్రలు సృష్టించి వాటి చుట్టూ కథను నడిపించే సాహసం చేశారు. ఈ సినిమా మన రాజకీయ వ్యవస్థ మూలంగా జరుగుతున్న ఆరాచకాలను, దుర్మార్గాలను చూపించింది. సామజిక స్ఫృహ కలిగిన చిత్రాలను తెరకెక్కించటంలో బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ ఎపుడూ ముందే ఉంటాడు. అందుకే తారే జమీన్ పర్, దంగల్ అద్భుత చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి. అయితే ఈ తరహాలో ఆమిర్ చేసిన ఓ భారీ సాహసం పీకే. నమ్మకాలకు ఎంతో విలువనిచ్చే మన దేశంలో ఆ నమ్మకాలను ప్రశ్నిస్తూ సినిమాను రూపొందించాడు ఆమిర్.(సాక్షి స్పెషల్) దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఆమిర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా పీకే. ఈ సినిమాలో మతపరమైన నమ్మకాలను, ఆచారాలను కాస్తం వ్యంగ్యం చూపించిన చిత్రయూనిట్ దైవ దూతలుగా చెప్పుకునే వారిని ప్రత్యక్షంగానే విమర్శించాడు. కొత్త దర్శకుడు చైతన్య తంహనే తెరకెక్కించిన మరాఠి సినిమా కోర్టు కూడా ఈ జాబితాలోనిదే. మన న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా.. ఎన్నో అవార్డులు రివార్డులు సాధించింది. (సాక్షి స్పెషల్) ఓ ప్రజాగాయుకుడు తన పాటలతో ఓ వ్యక్తి ఆత్మ హత్యకు కారకుడయ్యాడన్న కారణంతో అతన్ని కోర్డు ముందు హజరు పరుస్తారు. తరువాత కోర్టులో ఇరు పక్షాల వాదోపవాదనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కొత్త దర్శకుడు ఏకంగా న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే సాహసం చేయటం.. ఆ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించటం నిజంగా సంచలనమే. -
బాహుబలి 2.. ఆ రెండు దాటితే క్లీన్ స్వీప్
బాహుబలి 2 బాలీవుడ్ టాప్ స్టార్స్‌కు కూడా చెమటలు పట్టిస్తోంది. ఇప్పట్లో బ్రేక్ చేయడం సాధ్యం కాదనిపించే ఎన్నో రికార్డ్ లను బాహుబలి అవలీలాగా చెరిపేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి జోరు మామూలుగా లేదు. ఖాన్ త్రయం సెట్ చేసిన ఎన్నో రికార్డ్లను బాహుబలి ఇప్పటికే బద్ధలు కొట్టింది. అత్యధిక థియేటర్ల రిలీజ్, అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ లాంటి రికార్డ్‌లు బాహుబలి పేరు మీదకు మారిపోయాయి. అయితే ఓవర్ సీస్లో బాహుబలి ముందున్నవి కేవలం రెండు రికార్డ్‌లు మాత్రమే. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పీకే ఓవర్ సీస్లో 10.56 మిలియన్ డాలర్లు వసూళు చేయగా, దంగల్ సినిమా 12.36 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అయితే పీకే రికార్డ్‌ను సోమవారం దాటేయనున్న బాహుబలి 2, దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి. అత్యంత సమీపంలో ఉన్న ఈ రెండు రికార్డ్లను చెరిపేసి బాహుబలి 2 ఓవర్ సీస్ రికార్డ్లను క్లీన్ స్వీప్ చేయటం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఫుల్ రన్లో బాహుబలి 2, 20 మిలియన్ల మార్క్‌ను సైతం అందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం హాలీవుడ్ సినిమా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ రిలీజ్ అవుతుండటంతో బాహుబలి 2 థియేటర్లకు కోత పడనుంది. కానీ తరువాత మరో నెలన్నర పాటు పెద్ద సినిమాలేవి లేక పోవటం బాహుబలి 2కి కలిసొచ్చే అంశం. మరి ముందు ముందు ఈ విజువల్ వండర్ ఓవర్ సీస్లో ఇంకెన్నీ రికార్డ్‌లు సెట్ చేస్తుందో చూడాలి. -
ఎన్టీఆర్ సినిమాకు టాప్ టెక్నీషియన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాల సక్సెస్‌లతో సత్తా చాటిన జూనియర్ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు పవర్ ఫేం బాబీ దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం కాస్టింగ్, టెక్నిషియన్స్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తుండటంతో గ్రాఫిక్స్, షూటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరమవుతుందని భావిస్తున్నారు. జాతీయ స్థాయి సినిమాటోగ్రాఫర్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన యూనిట్ సభ్యులు ఓ టాప్ టెక్నిషియన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. బాలీవుడ్లో పీకే, త్రీ ఇడియట్స్, మొహెంజొదారో లాంటి భారీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సీకె మురళీధరన్‌ను ఈ సినిమాకు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న మురళీధరన్‌ను భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసైనా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. -
జీకే సన్నాఫ్ పీకే
‘‘డాడీ... నేను మీలాగే భూగ్రహానికి వెళ్లాలనుకుంటున్నాను. నన్ను దీవించండి’’ అన్నాడు జీకే. ‘‘నేను వెళ్లి నానా చావు చచ్చాను కదా సన్. మళ్లీ నువ్వు వెళ్లడం ఎందుకు?’’ అడిగాడు పీకే. ‘‘మీరు 2014లో వెళ్లారు. భూ గోళంలో ప్రతి నెలకూ ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయని చెప్పారుగా. ఇన్నేళ్లలో ఎంతో మార్పు వచ్చి ఉంటుంది. అక్కడి సరికొత్త విశేషాలను మన గ్రహవాసులతో పంచుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు జీకే. ‘‘అయితే ఓకే’’ ఆశీర్వదించాడు పీకే. గత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి పీకేని. ‘‘డియర్ సన్. నువ్వు ఎక్కడికైనా వెళ్లుగానీ ఆ రాజస్థాన్ ఎడారుల్లోకి మాత్రం వెళ్లకు. అక్కడే ఒక దొంగోడు నా మెడలో ఉన్న స్పేస్‌షిప్ రిమోట్ కంట్రోల్ దొబ్బేశాడు. ఆ భూమి మీద ఉండలేక, మన గ్రహానికి రాలేక ఎన్నెన్ని కష్టాలు పడ్డానో మీకు చెప్పాను కదా’’ అని వారించాడు పీకే. ‘‘రిమోట్‌ను మీలాగా అందరికీ కని పించేలా మెడలో వేసుకుంటానా ఏంటి? చక్కగా నడుముకు కట్టుకొని, మీరు భూ గోళం నుంచి తెచ్చిన షర్ట్ వేసుకుంటాను. ఇక అది ఎవరికీ కనబడదు. ఎవరూ దాన్ని కొట్టుకెళ్లే చాన్స్ లేదు’’.. ధీమాగా చెప్పాడు జీకే. ‘‘అయితే ఓకే!’’ అన్నాడు పీకే. ఆ మరుసటి రోజు స్పేస్‌షిప్ ఎక్కాడు జీకే. ‘‘డియర్ సన్... క్షేమంగా వెళ్లి లాభంగా రాకపోయినా ఫరవాలేదు గానీ... లబోదిబోమని మాత్రం రాకు’’ అంటూ వీడ్కోలు పలికాడు పీకే. స్పేస్‌షిప్ ఒక అర్ధరాత్రి హైదరా బాద్‌లోని చింతల్‌బస్తీ క్రికెట్ గ్రౌండ్లో దిగింది. ‘‘వారం రోజుల్లో వచ్చేయాలి. రిమోట్ గానీ పోగొట్టుకున్నావంటే శాశ్వతంగా ఇక్కడే ఉండాల్సి వస్తుంది జాగ్రత్త’’ అని హెచ్చరించి వెళ్లిపోయారు స్పేస్‌షిప్ డ్రైవర్లు.తెల్లారిపోయింది. రోడ్లమీద తిరగడం ప్రారంభించాడు జీకే. మధ్యాహ్నమైంది. నోరు పిడచకట్టింది. అమీర్‌పేట్‌లోని ఒక సందులో ‘శ్రీ మహంకాళి కల్లు కాంపౌండ్’ అనే బోర్డ్‌తో ఒక రేకుల షెడ్డు కని పించింది. అందులో నుంచి వస్తున్నవాళ్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం జీకేను ఆశ్చర్యపరిచింది. ఆసక్తితో లోనికి వెళ్లాడు. ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పక్క నున్న వ్యక్తి జీకే భుజం మీద చేయివేసి ‘‘తమ్ముడూ... నాపేరు తోటరాముడు. నాకు ఒక బుల్లి చెల్లి ఉంది అనే కవిత రాసింది నేనే. నిన్ను చూస్తే నా సొంత తమ్ముడు గుర్తుకు వస్తున్నాడు. నీకు కల్లు తాగించాలని డిసైడ్ చేసిన’’ అని, ‘‘రెండు సీసాల కల్లు’’ అంటూ అరిచాడు. దాహంతో ఉన్న జీకే రెండు కాదు, ఏకంగా ఇరవై సీసాల కల్లు తాగేశాడు. ‘‘గాడ గూసోని కల్లు తాగుతున్నది నా కజిన్ బ్రదరే. వాడే నా బిల్లు, వాడి బిల్లు రెండూ కడతడు’’ అని క్యాషియర్‌కి చెప్పి మాయమైపోయాడు తోటరాముడు. ‘‘దుకాణం బంద్ చేస్తున్నాం. లేచి బిల్లు కట్టు’’ అన్నాడు క్యాషియర్. జీకేకు అర్థం కాలేదు. ‘ఆకాశం నుంచి కిందికి వచ్చాను’ అని సైగలు చేశాడు. ‘‘బిల్లు అడిగితే చుక్కలు చూపెడుతున్నడు. వీడి బట్టలు విప్పి బజారు పాలు చేయండి’’ అని అరిచాడు క్యాషియర్. ఇద్దరు వచ్చి జీకే చొక్కా చించేశారు. వెంటనే ఇద్దరూ గట్టిగా అరిచారు, ‘‘అన్నా వీడి నడుము మీద ఏదో మెరుస్తుంది’’ అని. క్యాషియర్ పరిగెత్తుకు వచ్చాడు.‘‘ఇది డైమండ్ వడ్డాణం. దాన్ని నొక్కేసి వీడిని గప్‌చుప్‌గా ఎక్కడైనా పడేసి రండి’’ అన్నాడు. మరుసటి రోజు: సత్యం థియేటర్ ముందు ఉన్న మురికికాలువ పక్కన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు జీకే. చుర్రుమని ఎండ తగలడంతో లేచి చూచాడు. తలంతా భారంగా ఉంది. కళ్లు మండు తున్నాయి. ‘వామ్మో... ఈ భూగ్రహం మీద ఒక్క క్షణం కూడా ఉండకూడదు. రిమోట్ నొక్కి వెంటనే మా గ్రహానికి వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకోవాలి’ అనుకుంటూ నడుం తడుముకున్నాడు. ఖాళీ!!! ‘ఓరి నాయనో’ అని అరుస్తూ ఆకాశం కేసి చూశాడు జీకే. కన్నపేగు కదిలి గాఢ నిద్రలో ఉన్న పీకే టక్కుని లేచాడు. ‘నా సన్... నాయనో అని పిలిచినట్లు వినిపించింది. నాలాగే రిమోట్ పోగొట్టు కుని ఉంటాడు’ అనుకుంటూ కొడుకు జాడ కోసం స్పేస్‌షిప్ ఎక్కి అర్జంటుగా భూగ్రహానికి పయనమాయ్యడు పీకే! - యాకూబ్ పాషా -
'ఆ విషయం నన్నెంతో బాధిస్తోంది'
ముంబయి: ప్రస్తుతం పబ్లిక్‌గా ఏ అంశంపై మాట్లాడినా సెలబ్రిటీలు హెచ్చరికలకు కేంద్రాలుగా మారుతున్నారని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ అన్నారు. అందుకే, ఇటీవల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. దేశంలో అసహన పరిస్థితులపై తమ అభిప్రాయాలను ప్రముఖ బాలీవుడ్ నటులు అమిర్ ఖాన్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్ వంటి వారు సోషల్ మీడియా ద్వారా, నాయకుల ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భావ వ్యక్తీకరణ భారత్‌లో కష్టంగా మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. గతాన్ని పక్కనపెడితే ఇప్పుడు మాత్రం తాను మాట్లాడే ప్రతి పదం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని చెప్పారు. 'ఇప్పుడు ప్రతి చిత్ర నిర్మాత, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతంగా మారుతుంది కనుక' అని ఆయన చెప్పారు. 'మనకు ఏదైనా అభిప్రాయం ఉంటే అది సమతుల్యంతో ఉండాలి. అవతలి వైపువారు కూడా గర్వించేదిగా ఉండాలి' అని ఆయన చెప్పారు. అసహ్యభావంతో ప్రారంభమైన ఒక అంశం తొలుత చివరకు సొసైటీలో నేడు అనేక చీలికలు తీసుకొచ్చి ముగుస్తుందని, ఇది తనను ఎంతో బాధిస్తుందని చెప్పారు. కృత్రిమంగా సృష్టించిన వాతావరణమేమిటో మనుషులుగా ప్రతి ఒక్కరం తెలుసుకొని బతికితే బాగుంటుందని చెప్పారు. -
'త్రి ఇడియట్స్'ను దాటేసిన 'ధన్‌పాయో'!
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. తాజాగా 'త్రి ఇడియట్స్' సినిమా భారత్‌లో రాబట్టిన కలెక్షన్ల మొత్తాన్ని ఈ చిత్రం అధిగమించింది. దేశియంగా 'త్రి ఇడియట్స్' మొత్తంగా రూ. 202 కోట్లు వసూలు చేయగా, ఈ నెల 12న విడుదలైన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' ఇప్పటికే రూ. 203.53 కోట్లు వసూలు చేసి ఆ చిత్రాన్ని దాటేసింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత సల్మాన్-సూరజ్ బర్జాత్యా కలిసి తీసిన సినిమా 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో'. 'మైనే ప్యార్ కియా' 'హమ్ ఆప్కే హై కౌన్', 'హమ్ సాథ్ సాథ్ హై' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో మళ్లీ సినిమా రావడంతో ఊహించినట్టే 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' భారీ వసూళ్లు సాధిస్తున్నది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ ద్విపాత్రాభినయంతో తన అభిమానులను ఆకట్టుకున్నాడు. -
ఓవర్సీస్లోనే 300 కోట్లు..!
2014 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన పికె ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అమీర్‌ఖాన్, అనుష్క శర్మ, బోమన్ ఇరనీ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు. ఇప్పటికే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాదించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన పికె తాజాగా ఓవర్సీస్లోనూ ఓ అరుదైన ఘనత సాదించింది. మూఢనమ్మకాలపై సెటైరికల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలో రూ. 348 కోట్ల వసూళ్లు సాదించగా, ఓవర్సీస్లో కూడా రూ. 300 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హాంకాగ్, తైవాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఇప్పటికీ నడుస్తున్న పికె, భవిష్యత్తులో మరిన్ని రికార్డ్‌లు నెలకొల్పే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. విధూ వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాలో అమీర్‌ఖాన్ గ్రహాంతరవాసిగా నటించాడు. పొరపాటున భూమి మీదకు వచ్చిన ఓ ఏలియన్ తిరిగి తన గ్రహానికి వెళ్లటానికి కావల్సిన కీ పోగొట్టుకోవటం, ఆ కీని వెతుక్కునే ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే పాయింట్‌ను సెటైరికల్ కామెడీ జానర్లో తెరకెక్కించారు. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే కథ కావటంతో ఇప్పటికీ ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాస్తూనే ఉంది. -
హవా చూపిస్తున్న సెటైరికల్ కామెడీలు
బాలీవుడ్ తెర మీద కమర్షియల్ సినిమాకు పోటీగా నిర్మాణం జరుపుకొంటున్న మరో జానర్ సెటైరికల్ కామెడీ. సందేశాత్మక చిత్రాలను వ్యంగ్యంగా తెరకెక్కిస్తున్న దర్శకులు ఆ సినిమాలకు కాస్త కామెడీ టచ్ ఇచ్చి కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతున్నారు. చాలా రోజులుగా బాలీవుడ్ తెర మీద ఈ తరహా సినిమాలు దర్శనమిస్తున్నా ఇటీవల కాలంలో మాత్రం వీటి హవా బాగా ఎక్కువైంది. రికార్డ్ వసూళ్లను రాబట్టగలగిన సూపర్ స్టార్స్ నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోస్ వరకు అందరూ సెటైరికల్ కామెడీల మీదే దృష్టిపెడుతున్నారు. మంచి విజయాలు కూడా సాదిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'కౌన్ కిత్నే పానీ మే' సినిమా సక్సెస్ తో ఈ జానర్ మరోసారి చర్చకు వచ్చింది. నీలా మదబ్ పాండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఒరిస్సా ప్రాంతంలోని కరువు పరిస్థితులను వ్యంగ్యంగా చూపించారు. 'ఐయామ్ కలాం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పాండ బాలీవుడ్ తెర మీద కామెడీ సినిమాలకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని సందేశాత్మక చిత్రాలను కూడా సెటైరికల్ కామెడీలుగా రూపొందిస్తున్నారు. అంతేకాదు ప్రజలు కూడా ఈ తరహా చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారంటున్న పాండ, 1983 లో కుందన్ షా తెరకెక్కించిన జానే బిదోయారో మూవీ నుంచే ఈ ట్రెండ్ మొదలైందన్నారు. పాక్, ఇండియా వివాదం లాంటి సున్నితమైన విషయాలపై కూడా సెటైరికల్ కామెడీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్..ఇటీవల విడుదలైన బంగిస్థాన్ మూవీ ఈ కోవ లోకే వస్తుంది. అయితే ఇంత సెన్సిటివ్ పాయింట్ ను కథాంశంగా ఎంచుకున్నకొత్త దర్శకుడు కరణ్ అన్షుమన్, సందేశం కన్నా హాస్యం మీదే ఎక్కువగా దృష్టిపెట్టడంతో ఆ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా వివాదాలకు ఆస్కారం ఉన్న కాన్సెప్ట్ కావటంతో చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలనే ఆలోచనలో అసలు విషయాన్ని వదిలిపెట్టడం సినిమాకు నష్టం కలిగించింది. 'వెల్ కం టూ కరాచీ', 'ధరమ్సంకట్' చిత్రాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ ను సున్నితమైన హాస్యం ద్వార తెరకెక్కించటంలో విఫలమైన దర్శకులు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టారు. అయితే సెటైరికల్ కామెడీ సినిమాల లిస్ట్‌లో భారీ విజయం 'పికె'.. సెన్సేషల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించటం. అమీర్ ఖాన్ లాంటి సూపర్‌స్టార్ హీరోగా నటించటంతో పాటు కేవలం కామెడీ పై మాత్రమే ఆధారపడకుండా అన్ని రకాల ఎమోషన్స్ తో తెరకెక్కించిన 'పికె' భారతీయ సినీ చరిత్రలోనే అదిపెద్ద విజయంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు 735 కోట్లకు పైగా వసూళు చేసిన ఈ సినిమా సరైన విధంగా ప్రజెంట్ చేస్తే సెటైర్ ను కూడా ఆడియన్స్ పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటారని నిరూపించింది. అయితే 'పికె' విజయంతో చాలా మంది దర్శకులు సెటైరికల్ సినిమా అంటే మతపరమైన అంశాలనే చర్చించాలనే ప్రయత్నం చేశారు. పికె సినిమా కన్నా ముందే రిలీజ్ అయిన 'ఓ మై గాడ్' విషయంలోనూ ఈ ఫార్ములా పనిచేసినా, 'పికె' సక్సెస్ తరువాత మాత్రం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక బాలీవుడ్ స్క్రీన్ మీద కాసుల కోసమే రూపొందుతున్న మరో రకం సెటైరికల్ సినిమాలు అడల్ట్ కామెడీ.. గతంలో ఈ తరహా సినిమాలు కాస్త హద్దుల్లోనే ఉన్నా 'గ్రాండ్ మస్తీ' సక్సెస్ తరువాత మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. అడల్ట్ కామెడీలను రూపొందిచటంలో హాలీవుడ్ తో పోటి పడుతోంది ఇండియన్ సినిమా. కేవలం బాలీవుడ్ తెర పైనే కాదు ప్రాంతీయ చిత్రాల్లో కూడా సెటైరికల్ కామెడీల హవా బాగానే కనిపిస్తుంది. హద్దులు దాటనంత వరకు ఎలాంటి విమర్శనైన ప్రేక్షకుల ఆదరిస్తారు. ఆ తరహా సినిమాలకు ఘనవిజయాలను అందిస్తారు. -
'నాకు 'పీకే' అంతగా నచ్చలేదు'
న్యూఢిల్లీ: బాహుబలి చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరకానున్న టాలీవుడ్ హీరో ప్రభాస్ హిందీ సినిమాలను కూడా ఎక్కువగానే చూస్తాడట. అయితే ప్రభాస్ కు ఇటీవల వచ్చి సంచలనం విజయం సాధించిన అమిర్ ఖాన్ 'పీకే' సినిమా నచ్చలేదట. తాను మొత్తంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ చిత్రాలను ఇష్టపడతానని.. కాగా, ఆయన దర్శకత్వంలో వచ్చిన పీకే మూవీ మాత్రం తనను అంతగా ఆకట్టుకోలేదన్నాడు. అంతకుముందు రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, అరౌండ్ 20 టైమ్స్ చిత్రాలు తనకు బాగా నచ్చాయన్నాడు. బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ పై ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కరణ్ జోహార్ గొప్ప వ్యక్తి అని..అటువంటి వ్యక్తి తమ సినిమా గురించి, రాజమౌలి గురించి గొప్పగా మాట్లాడటం ఆనందంగా ఉందని ప్రభాస్ తెలిపాడు. -
పీకే సక్సెస్ మీట్..
-
చైనాలోనూ... 100 కోట్లు పీకేశారు!
ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రం మనదేశంలోనే కాదు... ఇప్పుడు విదేశంలోనూ సంచలనం రేపుతోంది. చైనాలో ఏకంగా రూ. 100 కోట్ల వసూళ్ళు సాధించి, కొత్త చరిత్ర సృష్టించింది. గత ఏడాది మన దగ్గర వసూళ్ళ వర్షం కురిపించిన ‘పీకె’ ఆలస్యంగా ఈ మధ్యే చైనాలో రిలీజైంది. కేవలం పదహారు రోజుల్లో అక్కడ ‘ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్’ భారతీయ సినిమాగా నిలిచింది. మన కరెన్సీ లెక్క ప్రకారం వంద కోట్ల పైగా వసూలు చేసింది. మన దేశంలో పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న గాడ్‌మెన్ సంస్కృతిపై వ్యంగ్యబాణాలు విసురుతూ, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ‘పీకే’ ఎన్నో నిరసనలు తట్టుకొని, మన దేశంలోని భారీ కమర్షియల్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు చైనాలోనూ కాసులు కురిపిస్తూ, ఆ ఘనత సాధించిన అతి కొద్ది హిందీ చిత్రాల్లో ఒకటైంది. -
నిర్మాతగా ఆమిర్..?
‘పీకే’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ తన దగ్గర మేనేజర్‌గా పనిచేసిన అద్వైత్ చందన్ దర్శకత్వం వహించబోయే ఓ చిత్రానికి నిర్మాతగా మారనున్నారట. గాయకురాలు కావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓ యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుందట. -
సెంచరీ సాధించాలని ఉంది!
‘‘అగ్ర నిర్మాత రామానాయుడిగారి స్ఫూర్తితో నిర్మాతగా వంద సినిమాలు పూర్తి చేసి, సెంచరీ సాధించాలని ఉంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. ఆయన తాజాగా అనువదించిన ‘పిశాచి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సి. కల్యాణ్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘తమిళనాట ‘పీకే’తో పాటు విడుదలైన ఈ సినిమా అక్కడ విజయ విహారం చేసింది. ప్రముఖ దర్శకుడు బాల ఈ సినిమాను ఎంతో ఇష్టపడ్డారు. ఎక్కడా డబ్బింగ్ సినిమా అనే భావన కలగదు’’ అని తెలిపారు. తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి సి. కల్యాణ్ వివరిస్తూ -‘‘మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్, మంజుభార్గవి కాంబినేషన్లో మా సంస్థలో ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మితో మేం చేయనున్న ‘జ్యోతిలక్ష్మి’ షూటింగ్ మార్చి మొదటివారంలో మొదలవుతుంది. సినిమా పరిశ్రమలోని అమ్మాయి అంటే చిన్న చూపు చూసేవారికి ఈ సినిమా సరైన సమాధానం చెబుతుంది. ఏప్రిల్‌లో వరుణ్‌తేజ్‌తో సినిమా ఉంటుంది. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన తమిళ ‘మయూరి’ని తెలుగులో నేనే విడుదల చేస్తున్నా’’ అన్నారు. -
ఆమిర్‌పై పూజాభట్ చిర్రుబుర్రులు
వివాదాస్పదమైన ‘ఏఐబీ’ రోస్ట్ వీడియో బాలీవుడ్లో చీలికలను తెచ్చిపెట్టింది. ఆలియా భట్, సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ వంటి వాళ్లంతా ‘ఏఐబీ’ వీడియోకు అనుకూలంగా మాట్లాడుతుంటే, ‘పీకే’ కథానాయకుడు ఆమిర్ ఖాన్ వంటి వాళ్లు ‘ఏఐబీ’పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ‘ఏఐబీ’ వీడియో హింసాత్మకంగా ఉందని ఆమిర్ చేసిన వ్యాఖ్యలపై పూజాభట్ మీడియా వద్ద చిర్రుబుర్రులాడింది. ‘ఢిల్లీ బెల్లీ’లో ‘భాగ్ డీకే బోస్’ వంటి ద్వంద్వార్థ గీతానికి స్టెప్పులేసిన గతాన్ని, ‘పీకే’ పోస్టర్లో ఆచ్ఛాదన లేకుండా దర్శనమిచ్చిన వైనాన్ని మరచి, ‘ఏఐబీ’ వీడియోపై ఆమిర్ సుద్దులు వల్లించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసింది. ఆమిర్‌ఖాన్ వంటి స్వయంప్రకటిత కుహనా నైతికవాదులే దేశానికి ఎక్కువ ప్రమాదకరమంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
పీకే తెలుగు, తమిళ్ రీమేక్‌లో కమల్
-
పీకే రీమేక్ లో కమల్ హాసన్?
చెన్నై: కమలహాసన్ అద్భుతమైన నటుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. విలక్షణమైన నటనతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్న కమల్.. వైవిధ్యభరితమైన పీకే రీమేక్ లో నటించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈమధ్యనే బాలీవుడ్ లో తెరెకెక్కి సంచలన విజయాన్ని నమోదు చేసిన పీకే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాణం సంస్థ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కమల్ హాసన్ ను ఆ సంస్థ సంప్రదించినట్లు.. అందుకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర దర్శకుడు కమల్ ను పిలిచే చర్చించారని.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతున్నట్లు తెలుస్తోంది. -
'పీకే' నిర్మాత, దర్శకులకు నోటీసులు
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన 'పీకే' హిందీ సినిమా కథ తన నవల నుంచి కాపీ కొట్టిందేనంటూ ఓ రచయిత పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత, దర్శకులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. తన హిందీ నవల 'ఫరిస్తా'లోని పాత్రలు, సన్నివేశాలను పీకే సినిమాలో వాడుకుని భావచౌర్యానికి పాల్పడ్డారని కపిల్ ఇసాపురి అనే రచయిత కోర్టుకు తెలిపారు. తన నవలలోని పాత్రలు, 17 సన్నివేశాలను తెలివిగా కాపీకొట్టారని ఆరోపించారు. తనకు ఆ సినిమా రచయితగా గుర్తింపు ఇవ్వడంతో పాటు కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. తాను నవలను 2009లో పూర్తి చేశానని, అది 2013లో ప్రచురితమైందని వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం పీకే సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, స్క్రిప్టు రచయిత అభిజత్ జోషీలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 16న తన ముందు హాజరై పిటిషనర్ ఆరోపణలపై స్పందించాలని న్యాయమూర్తి నజ్మీ వజీరి నోటీసుల్లో ఆదేశించారు. ఇదిలా ఉండగా, సినిమా విడుదలై ఇంతకాలమైన తరువాత ఈ పిటిషన్ దాఖలు చేయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. -
ఎండమావుల్లో తేలిన ‘పీకే’ దర్శకుడు
విశ్లేషణ ‘ముస్లిం’ అంటేనే మోసగాడుగా జమకట్టడం పొరపాటనే ఇతివృత్తంతో నిర్మించిన హిందీ చిత్రం ‘పీకే’ ఈ చిన్న వాస్తవాన్ని నిరూపించడానికి కథా రచయితకు, దర్శకునికి మనిషిలాంటి గ్రహాంతరవాసి (ఏలియన్) అవసరం కావడం చూసి జాలిపడాల్సిందే. ఈ ఏలియన్ చక్కగా హిందీలో మాట్లాడగలడు, ఇంగ్లిష్‌లో ‘ఐ లవ్ యూ’ అని రాయగలడు. ఇట్టే ఓ ముసలాయన భార్య ఆసుపత్రిలో ఎలా ఉందో చెప్పేయగలడు. హీరోయిన్ ప్రేమించిన ముస్లిం యువకుని వివరాలు పసిగట్టేయనూ గలడు. కానీ తనను సొంత గ్రహానికి తీసుకెళ్లగల రిమోట్ యంత్రాన్ని లాక్కెళ్లిన దొంగను మాత్రం కనిపెట్టలేడు. అదే తెలుసుకోగలిగి ఉంటే ఈ సినిమాయే లేదు. మత పక్షపాతం లేదని నిరూపించు కునే ప్రయాసలో దర్శకుడు అన్ని మత విశ్వాసాల మీదా, మత గురువుల మీదా గురిలేని బాణాలను కురిపించాడు. ప్రజలను మూర్ఖులను చేసి డబ్బును రాల్చుకోవడంలో సినిమా రంగానికి ఎవరూ సాటిరారని నిరూపించాడు. రంగం ఏదైనా మోసగాణ్ణి మోసగాడని నిందించేకంటే, మోసపోయినవాళ్ల మూర్ఖ త్వాన్ని బయటపెడితే కాసింత ఉపకారి కావచ్చనేదే నా ఆవేదన. కుహనా మతగురువులను, కుహనా మతవిశ్వాసా లను ఎండగడుతూ సినిమాలు తీయని, కథలు రాయని భాష లేదు. ఇదే అంశంపై ‘పీకే’ కంటే బలంగా ప్రేక్షక హృదయాలపై బలమైన ముద్ర వేయగలిగిన ఎన్నో సిని మాలు మన దేశంలోనే వచ్చాయి. కానీ, ఒక బాబా మోసగాడని తెలియగానే మరో బాబానూ, ఒక గురువు నీచుడని తేలితే మరో గురువునూ వెదుక్కునే బేల తనాన్ని అడ్డుకోవడం ఏ దేశంలోనూ, ఏ చిత్రానికి సాధ్యం కాలేదు. మన దేశంలో ఆ వెర్రి మరింత పెరిగిం ది కూడా. కాబట్టి ఈ దిశగా ‘పీకే’తో దర్శకుడు సాధిం చగలిగిన పరమార్థం ఎండమావే. యూరోపియన్ దేశం బెల్జియంలో బ్లాకులో సిని మా టికెట్లను అమ్మడం వంటి అసంబద్ధతలను పక్కకు నెట్టేస్తే, ఈ సినిమా ధ్యేయం హిందూ-ముస్లిం ప్రేమా యణం, మత సౌహార్ద్రతలే. మతాంతర ప్రేమలూ, వాటి పర్యవసానాల గురించి ‘ఛెమ్మీన్’ అనే మలయాళ చిత్రం మొదలు చాలా సినిమాలే చూశాను, వందలాది కథలు చదివాను. వాటికి మించిన సామాజిక జీవితం గానీ, కొత్తదనంగానీ ‘పీకే’లో లేవు. ఇక హిందూ- ముస్లిం సౌహార్ద్రత విషయంలో వాస్తవ దూరమైన సాం ఘిక జీవితపు కృత్రిమ ఉత్పత్తి అయిన ఈ చిత్రాన్ని, జీవ నసారం వడబిండిన కళాఖండాల సరసన నిలపనూ లేము, వాటితో పోల్చనూ లేము. అయినా సినీ అభిమా నుల జ్ఞాపకాలను తట్టి లేపడానికి రెండే రెండు ఉదా హరణలను ప్రస్తావించడం దేశ ఆరోగ్యానికి మంచిదని పిస్తోంది. ఒకటి, గోవింద నిహ్లానీ టీవీ సీరియల్ ‘తమస్’ దేశ విభజన నేపథ్యంలో నిర్మించినది. మత విద్వేషాలు తీవ్ర స్థాయిలో పెల్లుబికిన సమయంలోనూ మానవత్వం ఏదో ఒక మూల బ్రతికి ఉండటం మానలే దని దర్శకుడు గొప్పగా నిరూపించాడు. ‘ముస్లిం’ అని తెలిస్తే హిందువులు, ‘హిందువు’ అని తెలిస్తే ముస్లింలు హతమార్చే మారణహోమంలో తీవ్రవాదులైన భర్త, కుమారుల కంట పడకుండా ఒక ముస్లిం యువతి తనను ఆశ్రయించిన హిందూ వృద్ధ దంపతులను కాపాడి, ఊరి బయటికి సాగనంపుతుంది. ‘ధన్యవా దాలు భేటీ, ఈ ముసలివాళ్ల ప్రాణాలు కాపాడావు’ అం టున్న వృద్ధులతో ఆ యువతి ‘‘బ్రతికిస్తున్నానో, చావ డానికే పంపిస్తున్నానో నాకే తెలియడం లేదు’’ అంటుం ది. ఆ సన్నివేశం చూసి నేనైతే మొహం కప్పుకుని ఏడుస్తూ ఎంతసేపో కూచున్నాను. ఇక రెండో కళాఖండం కేతన్ మెహ్రా ‘మిర్చ్ మసా లా’ (కారంపొడి). చలన చిత్రాభిమానులు పదివేలకు ఒకరు కూడా ఆ సినిమా చూసి ఉండరు. బ్రిటిష్ హయాంలో సామాన్యులపై విచ్చలవిడిగా సాగిన అమా నుష పీడన నేపథ్యంగా రూపొందిన జీవన చిత్రమది. తెల్ల దొరలను మించి నల్లదొరలు చేసే దాష్టీకమే గుం డెలు పిండేది. వాటిని చిత్రించడానికి దర్శకుడు ఒక సుగాలీ గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఎలిపైరు ఆధారంగా జీవించే ఆ గ్రామంలో జొన్న, మిరప ప్రధాన పంటలు. పన్ను వసూళ్లకు ఆ గ్రామానికి పటాలంతో వచ్చిన సుబేదారు గుడారంలో విడిది చేస్తాడు. ఉద్యోగం కోసం భర్త ఊరు విడిచివెళ్లిన ఒక వివాహిత స్త్రీపై అతగాడి కన్ను పడుతుంది. మానరక్షణ కోసం ఆమె కారంపొడి తయారీ కార్ఖానాలో దూరుతుంది. దాని చౌకీదారు, చూపు మందగించిన ముదుసలి ముస్లిం. ఒక హిందూ ఆడపడుచు మానరక్షణ కోసం అతడు తన యజమాని దర్వాజా తెరవమని ఆజ్ఞాపించినా నిరాకరిస్తాడు. సుబే దార్ బెదిరింపులకు గ్రామంలోని పురుషులంతా లొంగి పోతారు. గ్రామపెద్ద ‘ముఖియా’ నాయకత్వంలో కార్ఖా నాకు వస్తారు. ‘‘అబూమియా, ఇది గ్రామం సమస్య. నువ్వు దర్వాజా తెరిచి తీరాలి’’ అంటాడు ముఖియా. ‘‘ఊరు మొత్తం మీద ఈ ఆడపడుచుకు తోడొచ్చే మగా డు ఒక్కడైనా మిగల్లేదా?’’ అని అబూమియా అడుగు తాడు. చెడుగా ప్రవర్తించేవాళ్లను ‘‘సైతాన్ కా ఔలాద్’’ అనడం ఉర్దూ నానుడి. ముఖియా వచ్చింది చెడు పనికి కాదు, నీచమైన పనికి, ఊరి ఆడపడుచును తార్చడానికి వచ్చాడు. ఆ పతనాన్ని సూచిస్తూ - ‘‘సైతాన్ కే సాలే బన్కర్ ఆయాహో, ఔర్ షరంబీ నహీ ఆతీ’’ (దయ్యా నికి బావమరిదిగా వస్తున్నావ్, అయినా నీకు సిగ్గనిపిం చడం లేదా?) అంటాడు అబూమియా. ఒక హిందూ స్త్రీ మానరక్షణ కోసం అబూమియా బ్రిటిష్ తుపాకులకు బలైపోతాడు. తన గొప్ప మనసును మాత్రం తాకట్టు పెట్టుకోడు. ఈ సినిమాలు రెండింటినీ పైసా ఖర్చు లేకుండా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసి, ప్రతి అంగుళాన్ని ఆస్వాదించగల మనసులకు చిత్రపరిశ్రమ రుణపడిపోతుంది. (వ్యాసకర్త రాయలసీమ విమోచన సమితి వ్యవస్థాపకులు, మొబైల్ నం: 9440280655) -
‘పీకే’ మేకింగ్ శ్రమయేవ జయతే
‘పీకే’ సినిమాకు 635 కోట్ల రూపాయల వసూళ్లు!ఇది నిజంగా షాకింగ్ న్యూస్! బ్రేకింగ్ న్యూస్!!ఒక భారతీయ చిత్రానికి ఇంతటి స్థాయి వసూళ్లంటే కలో నిజమోసినిమా పండితులకే అర్థం కావడం లేదు.భారతీయ సినిమాకు మున్ముందు ఇంకా మంచి రోజులు రానున్నాయనడానికి ‘పీకే’ ఓ ఆశాదీపం.అసలు ఈ సినిమాకు ఇంత క్రేజ్ ఎందుకొచ్చింది? ఈ వసూళ్లకు కారణాలేంటి?ఆమిర్‌ఖాన్‌తో రాజ్‌కుమార్ హిరానీ దీన్ని తెరకెక్కించడానికి ఎన్ని కసరత్తులు చేశారు?‘పీకే’ స్పెషల్ స్టోరీ మీకోసం... ఆమిర్ ఖాన్‌తో ‘3 ఇడియట్స్’ వంటి బ్లాక్ బస్టర్ తీశాక రాజ్‌కుమార్ హిరానీ వెంటనే మరో సినిమా మొదలుపెట్టేయలేదు. కథ కోసం నెలల తరబడి శ్రమించి, ఫైనల్‌గా దాన్ని తన సన్నిహితులకు చెప్పారు. కథ మొత్తం విని వాళ్లు... హాలీవుడ్ చిత్రం ‘ఇన్సెప్షన్’లా ఉందనడంతో హిరానీ ఖంగుతిన్నారు. దాంతో ఆ కథను పక్కనపెట్టేశారు. మళ్లీ ఇంకో కథ మొదలుపెట్టారు. అదే ‘పీకే’. కథ విన్న హిరానీ సన్నిహితులు బ్రహ్మాండం అన్నారు.. కానీ వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువు కాదని హెచ్చరించారు. మామూలు వ్యక్తుల పాత్రలంటే, ఇలా ప్రవర్తిస్తారనీ, వేషధారణ ఇలా ఉంటుందని ఊహించవచ్చు. కానీ, ఈ చిత్రంలో పీకే ఓ గ్రహాంతరవాసి. ఆ పాత్ర ‘ఇలా ఉంటుంది’ అని ఓ ఊహకు రావడం కష్టమే. పోనీ.. ఈ పాత్రకు రిఫరెన్స్ తీసుకుందామా? అంటే.. ఏ పుస్తకంలోనూ లేదు. నిజజీవితంలో కూడా హిరానీకి ఈ లక్షణాలున్న వ్యక్తులు తారసపడలేదు. దాంతో పాత్ర తీరుతెన్నులు, శారీరక భాష ఎలా ఉండాలి? అనే విషయమై ఆయన చాలా రోజులు తర్జన భర్జన పడ్డారు. ఈ పాత్ర అమాయకంగా కనిపించాలి.. చిన్నపిల్లాడి తరహాలో ఉండాలి. ఈ లక్షణాలను ఆవిష్కరించగల నటుడు ఎవరు? ఇంకెవరూ.. ‘ఆమిర్‌ఖాన్’ అని ఫిక్స్ అయిపోయారు. ఆమిర్ మొత్తం కథ విని, ఉద్వేగానికి గురయ్యారు. అప్పటికప్పుడు పీకేగా మారిపోవాలన్నంత ఉద్వేగం. ఆ తర్వాత పీకే లుక్ ఎలా ఉండాలి? అనే విషయంపై బోల్డన్ని చర్చలు. ఆకుపచ్చరంగు కళ్లు, తమలపాకుతో ఎర్రబడిన పెదాలు, సాదాసీదా దుస్తులు, చెప్పులు... షూటింగ్ ఆరంభించకముందే ఆమిర్‌పై మేకప్ టెస్ట్ చేశారు. ఆమిర్ దుస్తుల కోసం మనోషి నాథ్, రుచీ శర్మ అనే ఇద్దరు కాస్ట్యూమ్ డిజైనర్లను నియమించారు. అయితే ఈ ఇద్దరూ ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయలేదు. ఈ చిత్రంలో ఆమిర్ రాజస్థాన్ ప్రింట్ చొక్కాల్లో కనిపిస్తారు. వాటిని, రాజస్థాన్ వీధుల్లో ఫుట్‌పాత్ మీద కొన్నారు. కొన్ని చొక్కాలైతే అక్కడి స్థానికులు వాడేవి డబ్బిచ్చి మరీ కొన్నారు. కొంతమందైతే తమంతట తాము చొక్కాలివ్వడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారట. పీకే హెయిర్ స్టయిల్ వినూత్నంగా ఉండాలనుకున్నారు హిరానీ. ముందుగా హెయిర్ జెల్ రాసి ఓ రకమైన హెయిర్ స్టయిల్ చేశారు. అది అంత సంతృప్తినివ్వకపోవడంతో స్పైక్స్ (ఒక రకమైన స్టయిల్) ట్రై చేశారు. అదీ నచ్చకపోవడంతో జుత్తుని బంగారు వర్ణానికి మార్చారు. అది చూడ్డానికి స్టయిల్‌గా ఉన్నా పాత్రకు తగ్గట్టుగా లేదు. చివరకు ఆమిర్ ఒరిజినల్ హెయిర్ స్టయిల్‌నే సినిమాలో కంటిన్యూ చేయాలనుకున్నారు. ఈ చిత్రంలో ఆమిర్ చెవులు సాసర్లా, కళ్లు హెడ్‌లైట్స్‌ని తలపించేలా ఉంటాయి. చెవులు పెద్దగా కనిపించడం కోసం ఆమిర్ ‘బ్లూ టాక్’ వాడారు. స్పాంజ్ తరహాలో చాలా తేలికగా ఉండే బ్లూ టాక్ వల్లే ఆమిర్ చెవులు అలా కనిపించాయి. కళ్లకేమో ఆకుపచ్చ రంగు లెన్స్ వాడారు. అమాయకంగా కనిపించడం కోసం కనుబొమలను తీర్చిదిద్దారు. సినిమాలో ఆమిర్‌ఖాన్ తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చివరికి ఏడ్చే సీన్లో కూడా కళ్లు ఆర్పరు. ఈ పాత్రకు ఆ కళ్లు ఓ ప్లస్ పాయింట్ కాబట్టి, లెన్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఆమిర్‌ఖాన్ ఎక్కువ సన్నివేశాల్లో పాన్ తింటూ కనిపిస్తారు. ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు.. ఓ పాన్‌వాలాను నియమించుకున్నారు. ఆమిర్ పాన్ తినాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడు అతను పాన్ రెడీ చేసే ఇచ్చేవాడట. సరైన రంగు రావడంకోసం ఒక్కో సీన్ తీసే ముందు పది నుంచి పదిహేను పాన్లను ఆమిర్ నమిలేవారు. ఆ విధంగా రోజుకి ఏకంగా వంద పాన్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ను ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్‌ల్లో జరిపారు. 2013 ఫిబ్రవరి 1న ఢిల్లీలో షూటింగ్ ఆరంభించారు. 45 రోజుల పాటు ఓ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో! ఢిల్లీ చాందినీ చౌక్ ఏరియాలో శివుడు పాత్రధారి ఇద్దరు ముస్లిం మహిళలున్న రిక్షా తొక్కే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. వివాదం మొదలైంది. అక్కడి స్థానికులు హిందువుల మనోభావాలు తీసే విధంగా ఈ సీన్ ఉందంటూ కేస్ పెట్టారు. కొన్ని వివాదాలు, మరికొన్ని ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. తొలుత ఈ చిత్రానికి ‘ఏక్ థా టల్లి’ అనే టైటిల్ పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘ఏక్ థా టైగర్’ విడుదలైంది. దాంతో ‘ఏక్ థా’ తీసేసి, జస్ట్ ‘టల్లి’ అని పెట్టారు. ఆ తర్వాత మనసు మార్చుకుని ‘పీకే’ అని పెట్టారు. ఇదేం టైటిల్ విచిత్రంగా ఉంది అందరూ అన్నారు. పైగా, పీకే అంటే మందు తాగడమని అర్థం కాబట్టి, ఇందులో హీరో తాగుబోతు అయ్యుంటాడని అనుకున్నారు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దాదాపు 85 కోట్ల రూపాయలకు అమ్మారు. ‘పీకే’ 300 కోట్ల రూపాయలు వసూలు సాధించడం ఖాయం అనే నమ్మకంతో చిత్ర నిర్మాతలు విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ శాటిలైట్ హక్కుల విషయంలో రాజీపడలేదు. చివరకు తాము అనుకున్నట్లు 85 కోట్లు దక్కించుకున్నారు. ఈ స్థాయిలో అమ్ముడుపోయిన తొలి హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. చివరికి ఆమిర్‌కి బాగా కలిసొచ్చిన డిసెంబర్లో తెరపైకొచ్చింది. ఆమిర్ కెరీర్లో సంచలనాత్మక విజయం సాధించిన ‘గజిని’, ‘3 ఇడియట్స్’ ఈ నెలలో విడుదలైనవే. ఆమిర్, హిరానీల కాంబినేషన్ వేల్యూతో పాటు విడివిడిగా వారిద్దరి ట్రాక్ రికార్డుని చూసి, బయ్యర్లు ఈ చిత్రాన్ని ఎగబడి కొన్నారు. ప్రేక్షకులు థియేటర్‌కి రావడానికి కారణం కూడా ఈ క్రేజీ కాంబినేషనే. మొత్తానికి ఆమిర్-హిరానీల మేజిక్ రిపీట్ అయ్యింది. 2014 డిసెంబర్ 19న ఈ చిత్రం విడుదలైంది. ‘దేవుడు మిస్సింగ్’ అంటూ ఈ చిత్రంలో ఆమిర్ పోస్టర్లు అంటిస్తాడు. అలాగే, మత గురువులపై సెటైర్లు వేశారు. ఇవి హిందూ, ముస్లిమ్‌ల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ వివాదం మొదలైంది. అయితే, వాటికి అతీతంగా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది. భారతీయ బాక్సాఫీస్ పరంగా ఈ చిత్రం 300 కోట్లు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికి 635 కోట్లు సాధించింది. ఆమిర్ నటించిన ‘ధూమ్ 3’ ప్రపంచవ్యాప్తంగా 540 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘పీకే’ భారీ వసూళ్లతో ఆమిర్ తన రికార్డ్‌ని తానే బద్దలు కొట్టారు. ఇప్పటివరకు పాకిస్థాన్‌లో రికార్డ్ స్థాయి వసూళ్లు కురిపించిన చిత్రం ‘వార్’. ఈ పాకిస్థానీ యాక్షన్ థ్రిల్లర్ 23 కోట్లు వసూలు చేసింది. ఏడాదిన్నర క్రితం విడుదలైన ఈ చిత్రం వసూళ్లను ఏ చిత్రమూ అధిగమించలేదు. ఆ రికార్డ్‌ని ‘పీకే’ బద్దలు కొట్టబోతోందని అక్కడి ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. ‘పీకే’ ఇప్పటివరకు 18 కోట్లకు పైగా వసూలు చేసిందనీ, ఈ నెలాఖరు వరకు ఆడుతుంది కాబట్టి, ‘వార్’ రికార్డ్‌ని బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు.బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంతో సంచలనం సృష్టించిన ఆమిర్‌ఖాన్ ‘శ్రమయేవ జయతే’ అంటూ ‘పీకే’ చేసి సంచలనాలకే సంచలనంగా మారారు! - డి.జి. భవాని -
'పీకే' చూడకుండా ఎవరూ విమర్శించొద్దు
బాలీవుడ్ చిత్రం 'పీకే'పై కొన్ని మతవర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో... ఊహించని మద్దతు లభించింది. ఈ చిత్రాన్ని చూడకుండా ఎవరూ వ్యతిరేకించవద్దని ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ అన్నారు. ' పీకే' లాంటి సినిమాను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని పేర్కొన్నారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని స్వామి అగ్నివేశ్ సూచించారు. ఈ చిత్రం ఎవరి మనోభావాలకు వ్యతిరేకంగా కాదని అభిప్రాయపడ్డారు. 'పీకే' చిత్రానికి యూపీ, బీహార్‌లో పన్ను మినహాయింపు ఇచ్చారు. -
బాక్సాఫీసు వద్ద 'పీకే' కాసుల వర్షం
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం 'పీకే'పై ఓ వైపు వివాదాలు, నిరసనలు కొనసాగుతున్నా.. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. రెండువారాల్లోనే ఈ కలెక్షన్లు వచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా 600 కోట్ల రూపాయలను వసూలు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ మార్క్‌ను దాటితే 600 కోట్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా పీకే సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. -
కలెక్షన్ల రికార్డులను...'పీకే'స్తోంది
ఓవైపు విమర్శలు, వివాదాలు వెల్లువెత్తుతున్నా....మరోవైపు 'పీకే' చిత్రం బాలీవుడ్ పాత చిత్రాల కలెక్షన్ల రికార్డులను 'పీకే'స్తోంది. అత్యధిక కలెక్షన్లు వసూలు చేస్తున్న చిత్రంగా 'పీకే' దూసుకు వెళుతోంది. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ తన రికార్డును తాను బ్రేక్ చేశాడు. గతంలో ధూమ్ 3 చిత్రం రూ. 271.82 కోట్లు వసూలు చేయగా, పీకే విడుదల అయిన రెండు వారాలకే రూ. 278.52 కోట్లు వసూలు చేసింది. ట్రెండ్‌ను చూస్తుంటే పీకే చిత్రం ఓవరాల్‌గా రూ. 500కోట్లకు పైగానే వసూలు రాబట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమీర్ ఖాన్, అనుష్క శర్మ జంటగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన పీకే.. మూఢ నమ్మకాలు, దొంగస్వాముల చుట్టూ కేంద్రీకృతమై.. సునిశిత హాస్యంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. తొలి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉండటం, రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురుస్తోంది. గతంలో రాజ్‌కుమార్ హిరాణీ, ఆమీర్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన 3 ఇడియట్స్ రూ.202 కోట్లు వసూలు చేసింది. మరోవైపు పీకే చిత్రం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని దానిపై నిషేధం విధించాలని బజరంగ్ దళ్ ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. -
‘పీకే’ పైరసీ సినిమా చూసిన అఖిలేశ్!
లక్నో: బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించే క్రమంలో అఖిలేశ్ మాట్లాడుతూ ‘కొన్ని రోజుల కిందట ఈ సినిమాను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా దీన్ని చూసేందుకు మాత్రం గత రాత్రే సమయం లభించింది’ అని అన్నారు. అఖిలేశ్‌పై కేసు పెట్టాలని తహ్రీర్ అనే హక్కుల సంఘం నేత సంజయ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూఎఫ్‌వో మూవీజ్ ద్వారా సినిమాలను డౌన్లోడ్ చేసుకునేందుకు అఖిలేశ్ లెసైన్స్ కలిగి ఉన్నారని సీఎం కార్యాలయం తెలిపింది. -
పీకే బీట్స్..!
ఆమిర్‌ఖాన్ లేటెస్ట్ సెన్సేషన్ ‘పీకే’ గల్లా పెట్టెను పరుగులెత్తిస్తోంది. సీక్వెల్ సినిమా ‘ధూమ్ 3’... సల్మాన్‌ఖాన్ సూపర్ హిట్ ‘కిక్’... షారూఖ్‌ఖాన్ మెగా హిట్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ లను దాటేసి దూసుకుపోతోంది. ఇప్పటికే డొమెస్టిక్ మార్కెట్లో హయ్యస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డులు తిరగరాసింది. పదమూడు రోజుల్లో మొత్తం 263 కోట్ల రూపాయలు వసూలు చేసి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ధూమ్ 3 (రూ.261 కోట్లు), కిక్ (రూ.212 కోట్లు), చెన్నై ఎక్స్‌ప్రెస్ (రూ.208 కోట్లు), త్రీ ఇడియట్స్ (రూ.201 కోట్లు)ను క్రాస్ చేసింది. కాగా.. ఒక మతానికి సంబంధించిన సెంటిమెంట్స్‌ను కించపరిచేలా సినిమా ఉందంటూ ‘పీకే’పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. -
పీకే సినిమా డౌన్లోడ్ చేసి చూశా: సీఎం
అమీర్‌ఖాన్ సంచలనాత్మకంగా తీసిన 'పీకే' సినిమా అనేక వివాదాలకు కారణం అవుతోంది. తాజాగా ఓ ముఖ్యమంత్రి ఈ సినిమాకు సంబంధించిన వివాదంలో పీకల్లోతు కూరుకుపోయారు. సినిమా గురించి బాగా చెప్పాలనుకున్నారో ఏమో గానీ.. ఎత్తెత్తి ఎంగిలాకులో కాలేసినట్లు.. తాను సినిమాను డౌన్లోడ్ చేసుకున్నానని, కానీ చూడటానికి మాత్రం సమయం చిక్కడంలేదని అన్నారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరని చూస్తున్నారా? ఇటీవలే పీకే సినిమాకు పన్ను రాయితీలు ప్రకటించిన యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుందని, అందుకే తమ రాష్ట్రంలో దానికి వినోద పన్ను మినహాయింపు ఇచ్చామని చెబుతూ.. అదే సందర్భంలో నోరు జారారు. చాలా రోజులనుంచి తనను ఈ సినిమా చూడాల్సిందిగా చెబుతున్నారని, అందుకే తాను కొన్ని రోజుల క్రితమే సినిమా డౌన్ లోడ్ చేసుకున్నానని, కానీ ఇన్నాళ్ల బట్టి సమయం దొరక్క గత రాత్రి మాత్రమే చూశానని చెప్పారు. వెంటనే సినిమా నచ్చడంతో దానికి పన్ను రాయితీ ప్రకటించానని, దానివల్ల మరింతమంది సినిమా చూసే అవకాశం దొరుకుతుందని సెలవిచ్చారు. -
ఓ వైపు వివాదాలు.. మరోవైపు కాసుల వర్షం!
-
'గోపాలా గోపాలా'కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దు
-
'గోపాలా గోపాలా'కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దు
హైదరాబాద్ : 'పీకే' చిత్రంపై వివాదం ఇంకా కొనసాగుతుంటే... మరోవైపు వెంకటేశ్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న 'గోపాలా గోపాలా' చిత్రంపై వీహెచ్‌పీ ఆందోళన చేపట్టింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వీహెచ్‌పీ కార్యకర్తలు బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ ధర్నా చేపట్టారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకోవటంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. -
‘పీకే’పై చర్యలకు సర్కార్ ఆదేశం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాపై నానాటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి రామ్ షిండే మాట్లాడుతూ.. సినిమాను చూసి భాంతి భద్రత లకు భంగం కలిగించే అంశాలేమైనా ఉంటే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఐజీ (లా అండ్ ఆర్డర్) దేవన్ భర్తీని ఆదేశించామన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్చిట్ ఇచ్చింది. కాగా, సినిమాలో కొన్ని సన్నివేశాలు మతవిశ్వాసాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆరోపిస్తూ పలు సంస్థలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మూడు, నాలుగు రోజుల్లో ఈ సినిమాపై పోలీసు శాఖ నుంచి తగిన నివేదిక వస్తుందని, తర్వాత దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని షిండే స్పష్టం చేశారు. -
అన్ని మతాలను గౌరవిస్తాం: పీకే దర్శకుడు హిరాణీ
ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమా ద్వారా ఏ మతాన్ని అగౌరవపరచలేదని ఆ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ వివరణ ఇచ్చారు. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. రాందేవ్ డిమాండ్‌కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా మద్దతు పలికింది. అత్యధికుల మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు చిత్రం నుంచి తొలగించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బీ) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ కోరారు. మత సామరస్యానికి హాని కలిగించే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించాలని ఆయన అన్నారు. పీకే చిత్రంలోని ఎటువంటి సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే చిత్రం విడుదలైన నేపథ్యంలో ఎటువంటి సీన్స్ లను తొలగించేందుకు బోర్డు సిద్ధంగా లేదని సెన్సార్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్ పర్సన్ లీలీ శాంసన్ చెప్పారు. అన్ని మతాలను తాము గౌరవిస్తామని హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. ఈ చిత్రాన్ని తన హిందూ స్నేహితులు చూశారని, వారెవరూ అటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదన్నారు. సినిమాలో హిందూ దేవతలను హాస్యాస్పదంగా చిత్రీకరించి, తమ మనోభావాలను కించపరచారని భోపాల్, అహ్మబాదాద్‌లలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై సోమవారం బజరంగ్దళ్ సభ్యులు దాడి చేశారు. అహ్మదాబాద్‌లో కర్రలు, రాడ్లతో వచ్చిన పాతిక మంది రెండు థియేటర్ల అద్దాలు పగలగొట్టి, పోస్టర్లు చింపేశారు. ఈ రోజు కూడా ఢిల్లీలో బజరంగ్దళ్ కార్యకర్తలు చిత్రప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో సినిమా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ సినిమా యూనిట్ తరపున వివరణ ఇచ్చారు. తాము అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవిస్తామని చెప్పారు. -
‘పీకే’ థియేటర్లపై బజరంగ్ దాడి
హిందూ దేవతలను కించపరచారని ఆందోళన అహ్మదాబాద్/భోపాల్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాలో హిందూ దేవతలను హాస్యాస్పదంగా చిత్రీకరించి, తమ మనోభావాలను కించపరచారని భోపాల్, అహ్మబాదాద్‌లలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై సోమవారం బజరంగ్దళ్ సభ్యులు దాడి చేశారు. అహ్మదాబాద్‌లో కర్రలు, రాడ్లతో వచ్చిన పాతిక మంది రెండు థియేటర్ల అద్దాలు పగలగొట్టి, పోస్టర్లు చింపేశారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ దాడికి తామే బాధ్యులమని, పీకేను నిలిపేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని భోపాల్ బజరంగ్దళ్ చీఫ్ జ్వలిత్ మెహతా హెచ్చరించారు. ఆమిర్ ఉద్దేశం సరైందైతే ఆయన మతానికి చెందిన దేవుళ్లను ఎందుకలా చిత్రీకరించరని ప్రశ్నించారు. అయితే అంతకుముందే ఇలాంటి వ్యాఖ్యల్ని ఆమిర్ కొట్టిపడేశారు. తనకు అన్ని మతాలు సమానమేనని, తన సినిమా సిబ్బందిలో 99 శాతం మంది హిందువులేనని పేర్కొన్నారు. -
'పీకే'పై ఆందోళన, థియేటర్లపై రాళ్లదాడి
న్యూఢిల్లీ : ఆమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీకే సినిమాపై ఉత్తరాది రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. భోపాల్, అహ్మదాబాద్‌లోని "పీకే' సినిమా ఆడుతున్న పలు థియేటర్లను వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ముట్టడించారు. ఓ మతాన్ని కించపరచారంటూ వారు...సినిమా థియేటర్లపై రాళ్లదాడి చేశారు. ఈ సంఘటనల్లో థియేటర్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా 'పీకే'పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. మరోవైపు ఈ చిత్రంపై వివాదం రేగినా అందులోని సన్నివేశాలను తొలగించేందుకు మాత్రం సెన్సార్ బోర్డు నిరాకరించింది. -
'పీకే మూవీ నుంచి ఎటువంటి సీన్స్ తొలగించం'
ఢిల్లీ: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలో అభ్యంతకరమైన సీన్స్ ఉన్నాయని.. వాటిని తక్షణమే తొలగించాలని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు స్పందించింది. పీకే చిత్రంలోని ఎటువంటి సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. దీనిపై సెన్సార్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్ పర్సన్ లీలీ శాంసన్ మాట్లాడుతూ.. ఇప్పటికే చిత్రం విడుదలైన నేపథ్యంలో ఎటువంటి సీన్స్ లను తొలగించేందుకు బోర్డు సిద్ధంగా లేదని పేర్కొన్నారు. డిసెంబర్ 19వ తేదీన విడుదలైన 'పీకే' చిత్రంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ ఆదివారం పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. -
పికే చిత్రం పై వివాదాలు
-
ఆమిర్‌ఖాన్ 'పీకే'పై పెరుగుతున్న వివాదాలు!
న్యూఢిల్లీ/లక్నో: బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీకే'పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ ఆదివారం పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. హిందూ సంస్కతిని తక్కువ చేసి చూపే వారి చిత్రాలను ప్రజలు చూడరాదన్నారు. ఇస్లాం, క్రై స్తవ మతాల గురించి ఏదైనా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించే వ్యక్తులు హిందూ మతం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారికి తోచిన విధంగా మాట్లాడటమో లేదా వారికి నచ్చినట్లుగా సినిమాల్లో చూపించడమో చేయడం మంచి పద్దతి కాదన్నారు. రాందేవ్ డిమాండ్‌కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా మద్దతు పలికింది. అత్యధికుల మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు చిత్రం నుంచి తొలగించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బీ) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ కోరారు. భావస్వేచ్చ అంటే ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం కాదని అయన పేర్కొన్నారు. మత సామరస్యానికి హాని కలిగించే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించాలని ఆయన అన్నారు. ఈ చిత్రంపై వివాదం రేగినా ఇందులోని సన్నివేశాలను తొలగించేందుకు మాత్రం సెన్సార్ బోర్డు నిరాకరించింది. మరోవైపు ఈ వివాదంపై ఆమిర్‌ఖాన్ స్పందిస్తూ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. ఈ చిత్రాన్ని తన హిందూ స్నేహితులు చూశారని, వారెవరూ అటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదన్నారు. -
భారత్‌లోనే రూ. 214 కోట్ల కలెక్షన్లు
న్యూఢిల్లీ : రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్‌ఖాన్, అనుష్కాశర్మ జంటగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పీకే' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు భారత్‌లోనూ 214 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి. కాగా ఓవర్సీస్ వసూళ్ల విషయం ఇంకా చెప్పలేదు. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో పాటు అమీర్ నటనకు ప్రశంసలు రావడంతో ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటించారు. -
అబ్బో... ఆమిర్!
తాజాగా రిలీజ్ అయిన ‘పీకే’ సినిమా హిట్‌తో హీరో ఆమిర్‌ఖాన్‌పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆమిర్ అదని... ఇదని... అసలేం చేసినా సూపరనీ తెగ మోసేస్తున్నారు బాలీవుడ్ జనాలు. రొమాంటిక్ భామ మల్లికా షెరావత్ అయితే ఓ అడుగు ముందుకేసింది. అసలు విషయం వదిలేసి... ఆమిర్ సొసైటీకి ఎంతో సేవ చేసేస్తున్నాడంటూ కితాబిచ్చేసింది. ‘ఐ లవ్ దట్ మూవీ. ఈ ఏడాదికి అద్భుతమైన ముగింపు ఇది. అంతే కాదు... సమాజ శ్రేయస్సులో ఆమిర్ భాగస్వామ్యం అమూల్యం. నిస్వార్థం’ అంటూ సినిమా క్యారెక్టర్‌ను నిజ జీవితానికి ముడిపెట్టేసింది. అందుకు తన ట్విట్టర్ పేజీని వేదికగా చేసుకుందీ చక్కని చుక్క! -
నాలుగు రోజుల్లో రూ. 136 కోట్లు!
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్‌ఖాన్, అనుష్కాశర్మ జంటగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పీకే'ను ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. విడుదలైన నాలుగు రోజులకే ఈ సినిమా రూ. 136 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని బాలీవుడ్ బాక్సాఫీసు లెక్కలు చూసే నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కేవలం భారతదేశంలోనే. ఓవర్సీస్ వసూళ్ల విషయం ఇంకా చెప్పలేదు. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు. (పీకే సినిమాపై మరో ఎఫ్ఐఆర్) ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను చూసి హీరోయిన్ అనుష్కాశర్మ పొంగిపోతోంది. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూసి కళ్ల వెంబడి నీళ్లు ఆగడంలేదని ట్విట్టర్ ద్వారా చెప్పింది. హృదయపూర్వకంగా తాను అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు అందులో పేర్కొంది. I am literally in tears reading the overwhelming love & response you guys have shown for PK & us .Thank you from the bottom of my heart ❤️ — JAGAT JANANI (@AnushkaSharma) December 22, 2014 -
పీకే సినిమాపై మరో ఎఫ్ఐఆర్!
అమీర్‌ఖాన్ ప్రయోగాత్మకంగా తీసిన 'పీకే' సినిమాను వివాదాలు వదలడం లేదు. ఈనెల 19వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ. 135 కోట్లు వసూలు చేసినా.. పలు వివాదాల్లో కూరుకుపోయింది. హిందూ దేవుడైన శివుడిని ఈ సినిమాలో చెడుగా చూపించారని హిందూ లీగల్ సెల్ కార్యదర్శి అమీర్‌ఖాన్ మీద, సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీద, నిర్మాతలు సిద్ధార్థ రాయ్ కపూర్, విధు వినోద్ చోప్రా మీద కేసు పెట్టారు. హిందూ ఆచారాలను కించపరిచేలా ఈ సినిమాలో కొన్ని వ్యాఖ్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. 'భయపడేవాడే గుడికి వెళ్తాడు' లాంటి డైలాగులను కూడా ఆయన తన ఎఫ్ఐఆర్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత ట్విట్టర్లో ఇప్పటికే 'బోయ్కాట్పీకే' పేరుతో ఓ ప్రచారం జరుగుతోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో దీనికి పోటీగా 'వుయ్ సపోర్ట్ పీకే' అనే హ్యాష్ టాగ్‌తో మరో ప్రచారం కూడా జరుగుతోంది. -
‘పీకే’ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు
తాండూరు: బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ నటించిన చిత్రం ‘పీకే’ను నిలిపివేయాలని కోరుతూ సోమవారం రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్లు సుమిత్‌కుమార్‌గౌడ్, లింగదళ్లి రవికుమార్, భీంసింగ్ రాథోడ్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులు అర్బన్ ఎస్ఐ అభినవ చతుర్వేదికి ఫిర్యాదు చేశారు. ‘పీకే’ చిత్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సన్నివేశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడితోపాటు నిర్మాతపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నాయకులు తమ ఫిర్యాదులో డిమాండ్ చేశారు. బషీరాబాద్‌లో కూడా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక వివేకానంద యువజన సంఘం సభ్యులు ‘పీకే’ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆమిర్ 'పీకే' రికార్డుల పరంపర..!
-
ఆమిర్ 'పీకే' .. 2 రోజుల్లో రూ. 50 కోట్లు
ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం 'పీకే' బాక్సాఫీసు వద్ద విజయఢంకా మోగిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. పీకే చిత్రం తొలి రెండు రోజుల్లో 50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆమిర్ ఖాన్ నటన, రివ్యూలు పాజిటీవ్‌గా ఉండటం, తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కలెక్షన్లు ఓవరాల్‌గా 300 కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకోవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో విధు వినోద్చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆమిర్ సరసన అనుష్క శర్మ నటించారు. -
ఆమీర్ ఖాన్ 'పీకే'కు తొలిరోజు భారీ వసూళ్లు
ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం 'పీకే' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. భారత్‌లోనే 26.63 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ చిత్రానికి తొలిరోజే హిట్ టాక్ వచ్చింది. దీంతో వీకెండ్స్‌లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ సినిమా వసూళ్లు ఓవరాల్‌గా 300 కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకోవచ్చని చెబుతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో విధు వినోద్చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆమీర్ సరసన అనుష్క శర్మ నటించారు. గత శీతాకాలంలో విడుదలయిన ఆమీర్ సినిమా 'ధూమ్-3' కూడా భారీ వసూళ్లు సాధించింది. -
గురితప్పని... పీకే 47
‘పీకే’... ఇటీవలి కాలంలో దేశమంతటా అందరి నోటా నానుతున్న పేరు ఇది. కించిత్ కథ కానీ, కనీసం పాత్రల వివరాలు కానీ వెల్లడించకుండా అంతా గుట్టుగా అట్టిపెడుతూనే, విశేష ప్రచారం పొందిన సినిమా అంటే ఇదే. హీరో ఆమిర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, నిర్మాత విధు వినోద్చోప్రా - ఇలా ముగ్గురు దిగ్దంతుల కలయికలో వస్తున్న సినిమా అయినప్పుడు ఆ మాత్రం హల్చల్ సహజమే. రైలు పట్టాల మధ్య నగ్నంగా, ట్రాన్సిస్టర్‌ను అడ్డుపెట్టుకొని నిలబడ్డ ఆమిర్‌ఖాన్ ఫస్ట్‌లుక్ ఫోటో నుంచి ఇవాళ్టి దాకా ఆ సినిమా మీద ఆసక్తి పెరగడమే తప్ప తగ్గింది లేదు. మరి, ఇంతగా జనం నోట నానిన ‘పీకే’లో అసలింతకీ ఏముంది! 2014 దాదాపుగా ముగింపునకు వచ్చిన వేళ ఈ ఏడాది కాలంలో విడుదలైన హిందీ చిత్రాలను గమనిస్తే, ఏ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందన్న దగ్గరే చర్చ మొదలై, అక్కడే ఆగిపోతోంది. ఎన్ని లక్షలమంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది, ఎంత వినూత్న కథాంశంతో వచ్చిందన్న చర్చ జరగడానికే అవకాశం లేకుండా తామరతంపరగా సినిమాలొచ్చాయి. తీరా, ఏడాది చివరలో ఒక్కసారిగా వెండితెరపై వచ్చిన కుదుపు - ‘పీకే’. కథాంశం ఎంతో సమకాలీనమైనదే కాక, అంతకు అంత ఆలోచించాల్సిన విషయం కావడం విశేషం. అంతరిక్ష పరిశోధనలో భాగంగా గ్రహాల పైకి వ్యోమనౌకల్ని పంపి, జీవరాశి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఒక గ్రహాంతరవాసి (ఆమిర్‌ఖాన్) మన భూమండలం మీదకు వస్తే? మనిషికే కాక మనసుకు కూడా దుస్తుల ముసుగులు లేని అలాంటి వ్యక్తికి ఇక్కడి మోసాలు, అబద్ధాలు ఎదురైతే? తన వ్యోమనౌక తాలూకు రిమోట్‌గా పనికొచ్చే పచ్చల పతకాన్ని ఇక్కడి జనం కొట్టేస్తే? సరిగ్గా అదే జరుగుతుందీ సినిమాలో. దుస్తులు కానీ, భాష కానీ లేని అతనెలా భాష నేర్చాడన్నది ఆసక్తికరమనిపిస్తుంది. పోయిన పచ్చల పతకాన్ని వెతుక్కుంటూ తిరిగే అతనిలోని మంచితనం, అతడు అడిగే అమాయకపు ప్రశ్నలు చూసి, ‘పీకే’ హై క్యా (తాగి ఉన్నావా) అని అందరూ అడుగుతుంటారు. ‘పోయిన వస్తువు దక్కాలంటే... దేవుడే దిక్కు’ అన్నప్పుడు అతను మనస్ఫూర్తిగా దేవుడి కోసం పడే ఆరాటం కథను మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది. ఈ క్రమంలో అతనికి జగజ్జనని అలియాస్ జగ్గు (అనుష్క శర్మ) అనే టీవీ జర్నలిస్టు తారసపడుతుంది. ఒకరు వినాయకుడు, మరొకరు లక్ష్మీదేవి, ఇంకొకరు శంకరుడు - ఇలా ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి ప్రార్థించడం పీకేకు ఒక విచిత్రంగా కనిపిస్తుంది. అలాగే, మతాల సారం ఒకటేననీ, అందరి దేవుడూ ఒకడేననీ చెప్పే ఈ దేశంలో మనిషికో మతం ఉండడం, ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన విశ్వాసం కావడం లాంటివి పీకేను గందరగోళానికి గురి చేస్తాయి. కట్టెదుట కనిపించని దేవుడు కరుణించకపోవడంతో ‘కనిపించుట లేదు’ అంటూ దేవుళ్ళ బొమ్మలు ముద్రించి పంచే పీకే ఆసక్తిరేపే న్యూస్‌స్టోరీ అవుతాడని భావిస్తుంది జగ్గు. అతని వెంట పడి, అసలు కథ తెలుసుకుంటుంది. ఇంతలో అందరూ ఆరాధించే ‘గాడ్ మన్’ (సౌరభ్ శుక్లా) దగ్గర ఆ పచ్చల పతకం ఉన్నట్లు గ్రహిస్తారు. ఇక అక్కడ నుంచి పీకే తన గ్రహానికి తిరిగి వెళ్ళేందుకు తోడ్పడే ఆ పతకాన్ని తిరిగి సంపాదించుకొనే ప్రయత్నంతో సినిమా నడుస్తుంది. జగ్గు ప్రేమకథ... గ్రహాంతరవాసి అయిన పీకెలో చిగురించే అనురాగం... దేవుడి మీద మనుషుల్లో ఉన్న భక్తిని భయంగా మార్చి, వారి నమ్మకాలను వ్యాపారంగా మార్చుకొనే గాడ్మన్ల వ్యవహారం... టీవీ న్యూస్ చానల్లో సాగే డిస్కషన్ షో... ఇలా సాగుతుంది సినిమా. ఆఖరుకు పీకే ఆ పతకం ఎలా సాధించాడు, అతని అనురాగం ఏమైంది లాంటివన్నీ ఆకట్టుకొనే రీతిలో నడుస్తాయి. నిజం చెప్పాలంటే, ఈ సినిమాకు ఒకరు కాదు - ఇద్దరు హీరోలు. ఆమిర్ కాక, రెండో హీరో ఎవరయ్యా అంటే - దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. ‘మున్నాభాయ్ ఎం.బి. బి.ఎస్’లో వైద్య విధానాన్ని ప్రశ్నించి, ‘లగే రహో మున్నాభాయ్’లో గాంధీగిరిని ప్రస్తావించి, ‘3 ఇడియట్స్’లో విద్యావిధానాన్ని నిలదీసిన హిరానీ ఇప్పుడు దేశంలో ‘భగవంతుడికి మేనేజర్లు’గా చలామణీ అవుతున్న గాడ్‌మన్లపై కెమేరా గురిపెట్టారు. ఈ చిత్రం అతని చేతిలో ‘ఏకె 47’. దేవుడనే భావన, నేటి సమాజంలో దైవస్వరూపులుగా తమను తాము ప్రచారం చేసుకుంటున్న సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తల వైఖరిని హిరానీ చర్చనీయాంశాలు చేశారు. మతం, విశ్వాసాల గురించి మాట్లాడడమే పాపం... దుస్సహమైపోతున్న సమకాలీన సందర్భంలో ఇది కత్తి మీద సాము. అయినా, అనేక అంశాలను చాలా నేర్పుగా, వ్యంగ్యాత్మకంగా ప్రస్తావించారు దర్శక, రచయితలు. సున్నితమైన మతపరమైన అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఏ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ పాటించారు. ఈ క్రమంలో డైలాగ్స సెటైరికల్‌గా వినోదం అందిస్తూనే, వివేచనను మేల్కొల్పుతాయి. ఈ కథను ఆలోచించడానికీ, ఆలోచించినదాన్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా నైసుగా తెరపై చెప్పడానికి హిరానీ చాలా శ్రమించారని అర్థమవుతుంది. అంత శ్రమ ఉంది కాబట్టే, ‘3 ఇడియట్స్’ తరువాత అయిదేళ్ళ విరామంతో వచ్చిన హిరానీ సినిమా వచ్చినా, జనం సీట్లకు అతుక్కుపోయి చూస్తారు. కథలోని ప్రతి పాత్రకూ ఒక ప్రాధాన్యం... ప్రతి సంఘటనకూ కథలో ఒక లింకు కుదిరేలా ఈ స్క్రిప్టును అల్లుకోవడం చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. చక్కటి స్క్రీన్‌ప్లే పాఠం అనిపిస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధంలో జిగిబిగి కొంత తగ్గిందేమో అన్న అనుమానం కలిగినప్పటికీ... ప్రేక్షకులు సంతృప్తిగా హాలులో నుంచి బయటకు వస్తారు. పరేశ్ రావల్ నటించిన ‘ఒ మై గాడ్’ (రానున్న ‘గోపాల గోపాల’కు మాతృక)తో కొద్దిపాటి పోలిక కనిపించినా, దీని అనుభూతి వేరు. వాస్తవానికి, బాక్సాఫీస్ ఫార్ములా శంక మనసును పట్టి పీడిస్తున్నప్పుడు దాని నుంచి బయటపడడం ఎవరికైనా అంత సులభం కాదు. కానీ, ప్రేక్షకుల తెలివితేటల్నీ, అవగాహననూ, అభిరుచినీ తక్కువగా అంచనా వేయడమనే మానసిక దౌర్బల్యం నుంచి బయట పడి, దర్శక - నిర్మాతలు సినిమా తీస్తే ఎంత మంచి ఇతివృత్తాలు తెరపైకి వస్తాయో చెప్పడానికి ‘పీకే’ ఒక ఉదాహరణ. ఈ సినిమా చూశాక బుద్ధిజీవులు ఈ ‘పీకే’తో ప్రేమలో పడతారు. దర్శక, రచయితల నిబద్ధత మీద, నమ్మి ఈ కథ కోసం ప్రాణం పెట్టిన ఆమిర్ లాంటి నట, సాంకేతికుల మీద గౌరవం పెరుగుతుంది. ఔత్సాహికులకే కాదు... వసూళ్ళే పరమావధిగా ఆరు పాటలు మూడు ఫైట్ల వరదలో కొట్టుకుపోతున్న అన్ని భాషల్లోని అనేకమంది సీనియర్ సినీ పెద్దలకూ ‘పీకే’ తాజా పాఠం అనిపిస్తుంది. ఏళ్ల తరబడి మనం తీస్తున్న, చూస్తున్న సినిమాల్లో ఇలాంటివి కదా రావాల్సిందనే భావన కలుగుతుంది. అందుకే, మంచి కథ, కథనం, ఐటమ్ సాంగులు -ఫైట్లు లేని ఆహ్లాదకరమైన వినోదం ఆశించేవారికి ‘పీకే’ ఒక మరపురాని జ్ఞాపకం. వినోదం అందిస్తూనే, మన ప్రవర్తన మీద మనకే ఆలోచన రేపే అనుభవం. ఏ సృజనాత్మక కృషికైనా అంతకు మించి పరమార్థమేముంటుంది! - రెంటాల జయదేవ -
గీత అద్భుతం! - ఆమిర్
సిటీకి ఎంతో మంది వస్తుంటారు...పోతుంటారు. కానీ ఆమిర్‌ఖాన్ మాత్రం స్పెషల్... ఇతను ఆ....రడుగుల బుల్లెట్ కాడు... ఐదున్నర అడుగుల మిసైల్! 42 ఏళ్ళ వయస్సులో 18 ఏళ్ళ కుర్రతనం చూపాడు.. వినోదంలోనూ వివేకం కనబరుస్తాడు. సమాజాన్ని నిద్రలేపుతూ సాక్షాత్తూ పార్లమెంట్‌నే దడదడలాడించాడు. ఇవన్నీ ఆమిర్ గురించి తెలిసిన విషయాలు. కానీ స్వయంగా కలిస్తేనే తెలిసే సంగతులు, కలిగే స్ఫూర్తి మాటల్లో చెప్పడం కష్టం. చాలా మంది స్టార్స్‌ని చూస్తూంటాం కానీ, ఆమిర్‌ఖాన్ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ తన పరిధిలోకి వచ్చిన వారందరినీ బహుశా తాకుతుందేమో. పదిమంది బాడీగార్డుల మధ్య ఈ కాంతికిరణం నడుచుకుంటూ వచ్చింది. మొదటిసారి ఆమిర్‌ని నేరుగా చూసాను. కళ్ళల్లో చిలిపితనం, సహజమైన మంచితనం, బాడీ లాంగ్వేజ్‌లో కాన్ఫిడెన్స్... ప్రవర్తనలో మనిషితనం.. స్పందనలో స్థిత ప్రజ్ఞత... ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనిపించుకున్నాడు ఆమిర్... ఇంతకీ...‘పీకే’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమిర్‌ఖాన్, అనుష్కాశర్మ ఇంకే పికే బృందం హైదరాబాద్ వచ్చారు. నేను రేడియో జాకీగా పనిచేస్తున్న బిగ్ ఎఫ్ఎమ్ నిర్వహించిన కాంటెస్ట్‌లో భాగంగా ఆమిర్‌ని కలిసే అవకాశం వచ్చింది. బిగ్ ఎఫ్ఎమ్ టీంతోపాటు ఆమిర్ ఎక్స్‌క్లూజివ్ చిట్‌చాట్ చేద్దామని వెళ్ళాను. ఆ సందర్భంగా వెలికి తీసిన కొన్ని సంగతులు... హైదరాబాద్ మీకు వెల్కమ్ చెప్తోంది. ఆమిర్: ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మేం కేవలం ఒక స్టార్‌గా చూడట్లేదు. మీరు ఒక వ్యక్తిత్వం ఆమిర్! ఆమిర్: నాపై ఇక్కడివారు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. థాంక్యూ! రాజూ హిరానితో మళ్ళీ పనిచేయడం ఎలా అనిపించింది? ఆమిర్: మేము అనుకున్నది చేయగల్గుతామా, తెరపైకి తీసుకురాగల్గుతామా అన్నది ఒక్కటే నిత్యం మాముందుండే సవాల్. అంతకుమించి అంతా బావుంది. ఏమంటారు రాజూ? (రాజువైపు చూస్తూ) రాజు: నిజమే! అంతిమంగా మనం తీసిన సినిమాని చూసి మనం గర్వపడాలి. అది అందరికీ నచ్చాలి. కనుక గతంలో తీసిన సినిమాకంటే బాగా రావాలన్న తపన ఉంటుంది. అనుష్కా, ఆమిర్ నగ్నంగా ఉండే ఆ వివాదాస్పద పోస్టర్‌పై మీరు లేరేం? అనుష్క: (ఉలిక్కిపడి)...ఉన్నానుగా... మిగిలినవాటిపై (నవ్వు) అవును ఆ పోస్టర్లో కూడా ఉండాల్సిందేమో! ‘పీకే’లో కళ్ళార్పకుండా నటించడం కష్టమనిపించిందా? ఆమిర్: అవును. ిపీకేలో నా పాత్ర కళ్ళార్పకుండా ఉండడం.. కొంచెం కష్టమయ్యింది. అందులోనూ నేను కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. ఇలా చేయాలని సూచించింది విధువినోద్‌చోప్రా. రిహార్సల్స్‌లో తను చెప్పిన తర్వాత నా పాత్రకి కావలసిన మూలం దొరికింది. ....అదే కళ్ళార్పకపోవడం. ‘ప్రొడ్యూసర్ ఈజ్ కింగ్’ అంటారు. మరి మీరు? వినోద్: నేను ప్రొడ్యూసర్ని కాను, మేమంతా కో-వర్కర్స్, అందరం సమానం. అది వాళ్ళంతా నాకు పెట్టిన పేరు మాత్రమే. అనుష్కా! ఆమిర్‌తో నటించిన అనుభవం? అనుష్క: వండర్ఫుల్, మొదట్లో ఇబ్బంది పడ్డాను. ఆమిర్ అసలు మాట్లాడడు- ఎంతో అవసరమైనప్పుడు తప్ప. ఆమిర్: (వెంటనే) దాట్స్ అబ్సర్డ్! నేను చాలా రిలాక్స్డ్గా ఉంటాను. మే బీ... మీ ఆవిడ చూస్తారని భయమా ఆమిర్? (అందరూ పగలబడి నవ్వు..) అనుష్క: నేను ఆర్మీ వాతావరణంలో పెరిగాను కనుక సీనియర్లకి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నాను. నా అంతట నేనే సరదాగా ఉండటం చేతకాదు. కానీ మెల్లగా చనువు పెరిగింది. ఆమిర్‌ది చాలా తెలివైన, షార్ప్ బ్రెయిన్. ఆమిర్: ఆల్సో వెరీ లవ్వింగ్, డేరింగ్... అండర్స్టాండింగ్ (నవ్వుతూ) అనుష్కా ... ఇందులో మీ పాత్ర? అనుష్క: పీకేలో నేనొక జర్నలిస్ట్ పాత్ర వేసాను. నా పాత్రపేరు జగత్జనని. ఇంతకు మించి ఇప్పుడే ఏం చెప్పను. కానీ మీరందరూ చూసి గర్వపడతారు. ఇంతకీ సినిమా కథ? రాజు: చెప్తే... వీళ్ళందరూ నన్ను చంపేస్తారు!! ఒకటి మాత్రం నిజం. గతంలో మేం చేసిన ఫిలింస్లాగా ఇది కూడా కాన్సెప్ట్ ఫిల్మ్. చాలా భిన్నమైన కథాంశం. హైదరాబాద్‌కి రావడం ఎలా అనిపిస్తోంది? ఆమిర్: నేను షూటింగ్ కోసం గతంలో హైదరాబాద్ వచ్చాను. నాకిష్టమైన సిటీ హైదరాబాద్. ఇక్కడ బిరియానీ, హలీమ్ చాలా ఇష్టపడతాను. వినోద్: నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి పెళ్ళి ఇక్కడే ఫలక్‌నుమాలో చేసాను. జస్టిస్ చలం నా వియ్యంకుడు. ఆమిర్: నా సినిమాలు చూసి ఇక్కడి వాళ్ళు చాలా బాగా స్పందించారు. ఆ విధంగానూ హైదరాబాదు నా మనసుకి చాలా క్లోజ్. తెలుగువారందరికీ నా ప్రేమ! అనుష్క: చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. మోడలింగ్ డేస్‌లో, అలాగే ప్రమోషన్స్ కోసం కూడా వచ్చాను. భగవద్గీతని జాతీయగ్రంథం చేయాలన్న ప్రతిపాదనపై మీ కామెంట్? ఆమిర్: నేను రెండుసార్లు స్వయంగా భగవద్గీత చదివాను. గీత చాలా అద్భుతమైన గ్రంథం. కానీ ఈ అంశం పై నేను చెప్పలేను. నేను మహాభారతం అంతా చదివాను. చాలా ఉన్నతమైన తాత్వికగ్రంథం అని నమ్ముతాను. బహుశా... దీనిపై నిర్ణయం తీసుకోవలసింది సామాజిక, తత్వవేత్తలు. సత్యమేవజయతే వెనుక ఉన్న సంకల్పం? ఆమిర్: మన సమాజాన్ని ప్రతిబింబించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. వీలైతే దానివల్ల కొంత మార్పు వస్తుందన్న ఆశ. హీరోకన్నా హీరోయిన్ పొడుగ్గా ఉంటే సినిమా సూపర్‌హిట్ అనే నమ్మకం ఉంది. నిజమా ఆమిర్? ఆమిర్: వావ్! అవునా? అందుకేనేమో - నా సినిమాలన్నీ హిట్టయ్యాయి (నవ్వుతూ) అనుష్క: నేను ఆమిర్ కంటే పొడుగు కాబట్టి పీకే ఖచ్చితంగా హిట్!! -
అవకాశం కుదిరితే రాజమౌళి దర్శకత్వంలో...
‘‘రికార్డులు బ్రేక్ చేయాలనే లక్ష్యంతో నేను సినిమాలు ఎంపిక చేసుకోను. కథ నన్ను కదిలించాలి. నా హృదయాన్ని హత్తుకోవాలి. అలాంటి కథలకు పచ్చజెండా ఊపేస్తా’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. ‘త్రీ ఇడియట్స్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్ నటించిన ‘పీకె’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్, చిత్రకథానాయిక అనుష్క శర్మ, రాజ్‌కుమార్ హిరాని, నిర్మాతలు విధు వినోద్ చోప్రా, అభిజిత్ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమిర్ ఈ విధంగా సమాధానాలిచ్చారు. ‘పీకె’ అంటే ఏంటి? మీ పాత్ర ఎలా ఉంటుంది? సినిమా విడుదల వరకు దాని గురించి చెప్పకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకు ఏ సినిమాకీ పడనంత కష్టం ఈ సినిమా కోసం పడ్డాను. నేను నవ్వకుండా ఎదుటి వ్యక్తిని నవ్వించాలి. అదెంత కష్టమో ఊహించుకోండి. పీకె మీ పాత్ర పేరా? నిజం చెప్పనా?... ఈ సినిమాలో నా పేరేంటో నాకే తెలియదు. అందరూ నన్ను పీకె... పీకె అని పిలుస్తుంటారు. అలా ఎందుకు పిలుస్తారో కూడా తెలియదు. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఈ చిత్రం ఒప్పుకోవడానికి ప్రధాన కారణం? దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. సందేశం, వినోదం రెంటికీ ప్రాధాన్యం ఇస్తారు. ఆయన గొప్ప రచయిత, దర్శకుడు. ఈ చిత్రానికి ఆయనే హీరో అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో మీరు భోజ్‌పురి భాష మాట్లాడారట.. ఆ భాష మీకు వచ్చా? రాదు. ఈ సినిమా కోసం ఓ మూడు, నాలుగు నెలలు నేర్చుకున్నాను. భోజ్‌పురి అందరికీ అర్థం అయ్యే అవకాశం లేదు కాబట్టి.. సింపుల్ భాషలోనే సంభాషణలు ఉంటాయి. ఈ చిత్రం పోస్టర్లో రేడియో అడ్డం పెట్టుకుని.. అర్ధనగ్నంగా కనిపించడంపై కొన్ని విమర్శలు ఎదురయ్యాయి కదా? సినిమా చూస్తే ఆ సీన్‌కి ఉన్న ప్రాధాన్యం ఏంటో తెలుస్తుంది. కథకు అవసరం లేకుండా ఏదీ చేయలేదు. ‘ఓ మై గాడ్’ చిత్రానికీ, దీనికీ దగ్గర పోలికలున్నాయనే వార్త ప్రచారంలో ఉంది? అది నిజం కాదు. కానీ, ఈ చిత్రంలో మతపరంగా, మూఢనమ్మకాలపై సెటైర్లు ఉన్నాయి. అయితే అవి ఎవర్నీ కించపరిచే విధంగా ఉండవు. ఈ చిత్ర నాయిక అనుష్క శర్మ కన్నా మీరు పొట్టిగా కనిపిస్తున్నారు కదా! అవునా.. అలా అనిపిస్తోందా? (...అంటూ అనుష్క శర్మను నిలబడమని, తన పక్కనే నిలబడ్డారు ఆమిర్). చూడండి.. నేనే హైట్‌గా ఉన్నాను కదా! కానీ, ఈ చిత్రం పోస్టర్లో మీరు పొట్టిగా కనిపిస్తున్నారు.. పొట్టివాడు గట్టివాడు అనే మాటతో ఏకీభవిస్తారా? అస్సలు ఏకీభవించను. ఎవరి సత్తా వారిది. మీకు పోస్టర్లో నేను పొట్టిగా కనిపిస్తే.. అది నా తప్పు కాదు (నవ్వుతూ). నేను మాత్రం అనుష్కకన్నా హైటే. నచ్చిన వ్యక్తులపై ప్రేమ వ్యక్తపరచడానికి పబ్లిక్‌లో ముద్దులు పెట్టుకోవచ్చనే కాన్సెప్ట్ కొచ్చిలో మొదలైంది. ‘కిస్ ఆఫ్ లవ్’ పేరుతో సాగుతున్న ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం? అది హద్దులు దాటనంత వరకూ ఓకే. కానీ, హద్దులు దాటితే అసహ్యంగా ఉంటుంది. మా అమ్మ, నా భార్య కిరణ్, పిల్లలపై నా ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడానికి నేను వెనకాడను. ఇతరులు కూడా వాళ్లకి నచ్చినవాళ్లపై ఆ విధంగా వ్యక్తపరిస్తే.. నేను కామెంట్ చేయను. ఎవరిష్టం వాళ్లది. మనది స్వతంత్ర భారత దేశం. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు ఉండొచ్చు. కానీ, అది ఇతరులను ఇబ్బందిపెట్టకుండా చూసుకోవాలి. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి, ఇతర సమస్యల గురించి ఇప్పటికే ‘సత్యమేవ జయతే’లో చాలా విషయాలు చెప్పారు... ఈ సినిమాలో ఆ అంశం గురించిన ప్రస్తావన ఉందా? ఈ సినిమా కథకూ, ఆ అంశానికీ సంబంధం లేదు. కానీ, మన చట్టం గురించి ఒక్కటి చెబుతాను. నిర్భయ కేసు జరుగుతున్న సమయంలో ఒక న్యాయవాది అమెరికా వెళ్లారు. అక్కడ కూడా నిర్భయ సంఘటన జరిగింది. నిర్భయ కేసుతో పాటు అమెరికాలో జరిగిన సంఘటన గురించి అక్కడి లాయర్లతో ఆమె చర్చించారు. అప్పుడు జరిగిన ఓ విషయాన్ని ఆమె నాతో పంచుకున్నారు. అదేంటంటే... ‘ఈ రెండు ఘోరాలూ ఒకేసారి జరిగాయి. కానీ, ఇక్కడ కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉంది. అక్కడి వ్యక్తికి మాత్రం 120 ఏళ్ల జైలు శిక్ష పడింది’ అని ఆమె అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ వ్యక్తి అన్నేళ్లు బతుకుతాడా లేదా అనేది తర్వాతి సంగతి. అతను చేసిన పనికి అన్నేళ్ల శిక్ష అవసరం అని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మన చట్టం పనితీరు ఎలా ఉందో? దీన్నిబట్టి ఊహించుకోవచ్చు. తెలుగులో సినిమా చేయమంటే చేస్తారా? ఎందుకు చెయ్యను? బలమైన కథ ఉంటే కచ్చితంగా చేస్తాను. ఆ మధ్య ఓ సందర్భంలో నేను, రాజమౌళి కలుసుకున్న విషయం తెలిసిందే. సినిమా చేయాలనే ఆలోచనతో కలవలేదు. కానీ, రాజమౌళి మంచి విషయం ఉన్న దర్శకుడు. తనతో అవకాశం వస్తే, తప్పకుండా చేస్తాను. -
హైద్రాబాద్‌లో 'పీకే' సందడి చేశాడిలా..!
-
'నాది పగటి కలలు కనే పాత్ర కాదు'
లండన్:త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'పీకే' చిత్రంలో తనది పగటి కలలు కనే పాత్ర కాదని ఆ చిత్ర కథానాయకుడు అమిర్ ఖాన్(49) స్పష్టం చేశాడు. ఆ చిత్రంలో పగటి కలలకు సంబంధించి ఛాయలు ఎక్కడ కనబడవన్నాడు. ఆ చిత్రంలో తాను ఒక విలక్షమైన పాత్రలో కనిపిస్తానని అమిర్ తెలిపాడు. ఇప్పటివరకూ తాను నటించిన అత్యంత కఠినమైన పాత్రల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన్నాడు. పీకే చిత్రం వాస్తవిక జీవితానికి సరైన నిర్వచనంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. లండన్ లో యూటీవీ మోషన్ పిక్చర్స్ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ ద్వారా అమిర్ తన అభిప్రాయాల్ని పంచుకున్నాడు. నగరానికి వచ్చిన ఓ కొత్త వ్యక్తికి సంబంధించి ప్రణాళికలను కామెడీగా చిత్రీకరించారనే దానిపై అమిర్ తనదైన శైలిలో స్పందించాడు. ఇటువంటి ప్రశ్నలు ఎక్కడ నుంచి వస్తున్నాయని ఎదురు ప్రశ్నించాడు. అంతకుముందు ఎప్పుడూ కూడా ఈ తరహా కామెంట్లు వినపడలేదని స్పష్టం చేశాడు. స్నేహితుల మధ్య ఉండే సద్భక్తి అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామని అమిర్ స్పష్టం చేశాడు. రాజ్ కుమార్ హిరానీ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 19వ తేదీన వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతోంది. -
దోస్త్.. మేరా దోస్త్!
బాలీవుడ్లో ఖాన్ త్రయం ఇప్పుడు స్నేహ గీతికలు ఆలపిస్తోంది. నిన్నమొన్నటి దాకా కొట్టుకుని మళ్లీ ఒకటైన షారూఖ్- సల్మాన్లిద్దరూ ఒకరి కోసం ఒకరన్నట్టుగా తిరిగేస్తున్నారు. వీళ్లిద్దరితో పాటు ఆమిర్‌ఖాన్ జతవడంతో... జోష్‌కు అంతే లేకుండా పోతోంది. సల్మాన్ చెల్లి అర్పిత పెళ్లి దగ్గరి నుంచే సీన్ ఇలా మారిపోయింది. ఇటీవల ఓ టీవీ షోలో అంతా కలసి ‘టవల్ డ్యాన్స్’ చేసేసి హుషారెత్తించేశారు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే... తన రాబోయే చిత్రం ‘పీకే’ తొలి కాపీని షారూఖ్, సల్మాన్‌లకు చూపాలని ఉబలాటపడుతున్నాడట ఆమిర్. ప్రొడక్షన్ టీమ్ ఇందుకోసం ఏర్పాటు చేస్తోందట. దోస్తుల ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలని ఆమిర్ కూడా ఆతృతగా ఉన్నాడట. -
రజనీ రోల్ ఆమిర్‌కు!
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగానే మరో ఆఫర్‌కు ఓకే చెప్పాడట. అది కూడా రజనీకాంత్ ‘రోబో’కు సీక్వెల్! సూపర్ డెరైక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ ‘రోబో 2’కు తొలుత రజనీనే అనుకున్నా... ఎందుకో ఆ ప్రతిపాదన ఓకే కాలేదు. అయితే ఆమిర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ న్యూస్. ‘రోబో’లో బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ కథానాయిక. మరి సీక్వెల్లో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
విరాట్, అనుష్కల 'లవ్'పై అమీర్ తడబాటు!
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ తార అనుష్క శర్మల ప్రేమ వ్యవహారం గురించి చాలానే విన్నాం..చదివాం. అయితే ప్రస్తుతం 'పీకే' చిత్రంలో మిస్టర్ ఫర్ పెక్ట్ సరసన అనుష్క నటిస్తోంది. 'పీకే' షూటింగ్ సెట్లో విరాట్ ఎక్కువ సార్లు కనిపించడంపై అమీర్ ఖాన్ ను రిపోర్టర్లు స్పందించమని కోరితే. మిస్టర్ ఫర్ ఫెక్ట్ తడబాటుకు గురవ్వక తప్పలేదు. దాంతో ఏం చెప్పాలో తెలియక పీకే చిత్రంలోని 'థర్కీ చోక్రో' అనే పాటలోని ఓ లైన్ పదే పదే పాడి అమీర్ వినిపించారట. 'అలా చేయకు.. అలా చేయకు' అని అర్థం వచ్చేలా పాట పాడి అమీర్ స్పందించారు. అంతేకాకుండా.. అనుష్కతో పనిచేయడం చాలా నచ్చింది. ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది అని అమీర్ కితాబిచ్చారు. -
పీకే టీజర్ హల్చల్
-
రిలీజ్‌కు ముందే 85 కోట్లు వసూళ్లు....
-
ఆమిర్‌కు డ్రెస్!
హమ్మయ్య... ఆమిర్‌ఖాన్ చూడాలంటే ఇక ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు ‘పీకే’ పోస్టర్లపై నగ్నంగా దర్శనమిచ్చిన ఈ స్టార్... తాజాగా మరో స్టిల్ రిలీజ్ చేశాడు. అందులో ఫుల్లుగా బట్టలు వేసుకుని కనిపించాడు. అదీ పోలీస్ ఆఫీసర్ స్టిల్‌లో.. గంభీరంగా. ముందున్న దానికి... లేటెస్ట్గా విడుదల చేసిన స్టిల్కు ఏమాత్రం పొంతన లేదు. మరో విశేషమేమంటే సూపర్ హీరో సంజయ్‌దత్ కూడా ‘పీకే’ పోస్టర్‌పైకి ఎక్కాడు. బ్యాండ్ మేళం డ్రెస్‌లో బూర ఊదుతూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. -
ముచ్చటగా మూడో లుక్!
సినిమానే శ్వాసించే అతికొద్దిమంది భారతీయ నటుల్లో ఆమిర్‌ఖాన్ ఒకరు. 24 శాఖలపై ఆమిర్కున్న అవగాహన అపారం. సినిమా కోసం ఎంతటి కష్టాన్నయినా అనుభవించడం ఆయన నైజం. ప్రస్తుతం ఆయన ‘పీకె’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌లుక్ వివాదాలకు తెరలేపింది. ఆమిర్లాంటి సూపర్‌స్టార్ ఇలా నగ్నంగా నటించడమేంటని విమర్శలు కూడా తలెత్తాయి. కానీ... ఆయన అలాంటివాటిని లెక్క చేయరు. ఆమిర్‌కి పాత్రే ప్రాణం. పంజాబీ వాయిద్యకారునిగా ‘పీకె’ సెకండ్ లుక్ దేశవ్యాప్తంగా ఆమిర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడో స్టిల్‌ని మీడియాకు విడుదల చేశారు ఆమిర్. పోలీస్ యూనిఫాంలో ఆమిర్ కనిపిస్తున్న ఈ థర్డ్లుక్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. డ్రస్‌ని బట్టి చూస్తే... ఆ యూనిఫాం తనది కాదని చూడగానే పట్టేయొచ్చు. లూజ్‌గా, భారీ కొలతలతో ఉన్న యూనిఫామ్‌ని, బెల్డ్ సహాయంతో బిగించి మరీ తొడిగి కనిపిస్తున్నారు ఆమిర్. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే కథ తెలియాల్సిందే. ఇందులో ఆమిర్‌ది గ్రహాంతరవాసి పాత్రట. గ్రహాంతర వాసి మానవరూపం ధరించడానికి కారణమేంటనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం. అనుష్కశర్మ ఇందులో కథానాయిక. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న విడుదల చేయనున్నారు. -
థర్డ్ లుక్ తో అమీర్ ఖాన్ మళ్లీ ఝలక్
విడుదలకు ముందే పోస్టర్లతో 'పీకే' చిత్రం సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఫస్ట్ లుక్ లో నగ్నంగా దర్శనమిచ్చి సంచలనంతో వివాదం రేపిన అమీర్ ఖాన్.. సెకండ్ లుక్ లో భోజ్ పూరి డ్రస్ లో బ్యాండ్ వాలాగా కనిపించారు. సెప్టెంబర్ 16 తేది మంగళవారం విడుదల చేసిన థర్డ్ లుక్ పోస్టర్ లో ఈసారి అమీర్ తో పాటు సంజయ్ దత్ కూడా ఉన్నారు. తాజా పోస్టర్ లో అమీర్ ఖాన్ యాంగ్రీ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా డిఫరెంట్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు. ఈ థర్డ్ లుక్ లో ట్రాన్సిస్టర్ ను కూడా వెంట తెచ్చుకున్నారు. థర్డ్ లుక్ వీడియోను సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. తొలుత 'సత్యమేవ జయతే' కార్యక్రమ ప్రోమోను పోస్ట్ చేసి అభిమానులకు భోజ్ పూరి భాషలో ఝలక్ ఇచ్చారు. పొరపాటున టీవీ ప్రోగ్రాం యాడ్ వేసాను. ఇప్పుడు చూడండి పీకే వీడియో అంటూ రెండవ ట్వీట్ లో తెలిపారు. -
బాలీవుడ్‌కు 'పీకే' భయం!
బాలీవుడ్‌కు 'పీకే' భయం పట్టుకుందా? పీకేతో పోటీ పడేందుకు ఇతర సినిమాలు భయపడుతున్నాయా? మిస్టర్ పర్ఫెక్ట్ను బీట్ చేసేందుకు బాలీవుడ్ ఎందుకు జంకుతోంది? రిలీజ్‌కు ముందే సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ పీకే బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్లో పీకే ని ప్రేక్షకుల ముందు నిలబెట్టాలన్నది మిస్టర్ పర్ఫెక్ట్ ఆలోచన. డిసెంబర్ లో విడుదలైన అమీర్ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. పీకే కూడా డిసెంబర్లో రానుండటంతో బాలీవుడ్ అంతా షేక్ అవుతోంది. చాలా మంది నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను ప్రీపోన్, పోస్టు పోన్ చేసుకుంటున్నారు. అభిషేక్ - అసిన్ సినిమా ఆల్ ఈజ్ వెల్‌ను నిర్మాతలు డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు. అమీర్‌తో పోటీ పడటం కంటే సినిమా రిలీజ్‌లను వాయిదా వేసుకోవడం మంచిదనే వాదన బాలీవుడ్లో వినిపిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, కంగనా రనౌత్ సినిమా ఉంగ్లి, అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా 'యాక్షన్ జాక్సన్' కూడా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 9 విడుదల చేయాలనుకున్న థెవర్ను ముందుకు జరిపారు. సంజయ్ కపూర్ నిర్మాతగా అర్జున్ కపూర్-సోనాక్షి సిన్హా జంటగా నటించిన ఈ సినిమా కూడా డిసెంబర్ 5న సిల్వర్ స్క్రీన్‌ను తాకనుంది. సైఫ్- ఇలియానా నటించిన హ్యాపీ ఎండింగ్‌కు కూడా పీకే భయం పట్టుకున్నట్లుంది. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను నవంబర్ 21న విడుదల చేయనున్నారు. అమీర్ ఖాన్ నగ్న పోస్టర్‌తో దేశవ్యాప్తంగా వివాదానికి తెరతీసిన పీకే చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ రాజకీయ వ్యంగ్య చిత్రంలో అమీర్‌ఖాన్ సరసన అనుష్కాశర్మ నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్‌కు సంబంధించి నిర్మాతలపై అభిషేక్ భార్గవ అనే యువకుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అమీర్ నటిస్తున్న ‘పీకే’ చిత్రం న్యూడ్ పోస్టర్ అభ్యంతరకరంగా ఉందని, సమాజంలో అసభ్యతకు తగిన ప్రచారం కల్పించేట్లుగా ఉందని ఆ యువకుడు పేర్కొన్నాడు. అయితే నిర్మాతపై దాఖలైన ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కళలు, వినోదానికి సంబంధించిన విషయాలలో జోక్యం పనికిరాదని కోర్టు చెప్పింది. ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్‌కు సలహా ఇచ్చింది. అంతేకాకుండా ఇటువంటి విషయాలలో మతపరమైన అంశాలు తీసుకురావద్దని కూడా సుప్రీం కోర్టు పిటిషనర్‌కు సలహా ఇచ్చింది. సినిమా విడుదలపై ఆంక్షలు విధిస్తే నిర్మాత హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టు తెలిపింది. ఈ రకంగా విడుదలకు ముందే విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన పీకే సినిమాలో కథాపరంగా అమీర్ ఖాన్ వింతవింత దుస్తులు ధరించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న విడుదల కాబోతుంది. దీనితోపాటు ఆ రోజు విడుదలయ్యే మరో సినిమా ఏదీ లేకపోవడం విశేషం. అయితే వరదలా డిసెంబర్ 5న విడుదలయ్యే సినిమాలలో దేనిని ప్రేక్షకులు ఆదరిస్తారో వేచిచూడాలి. - శిసూర్య -
అమీర్ ఈసారి నిండుగా బట్టలేసుకున్నాడు!
పీకే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అమీర్ ఖాన్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా అమీర్ ఖాన్ అందరికి ధీటుగా జవాబిచ్చారు. తాను పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ విడుదల చేయలేదని.. సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్ధమవుతుందని సమాధానమిచ్చారు. ఆగస్టు 20 తేదిన విడుదల చేసే రెండవ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా అడ్డుగా ఉండదంటూ చమత్కరించిన అమీర్ ఖాన్.. అందర్ని ఆశ్చర్య పరిచారు. బుధవారం విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో అమీర్ ఖాన్ పూర్తిగా, నిండుగా బట్టలేసుకుని బ్యాండ్ మేళం చేతిలో పట్టుకుని నిలుచున్నాడు. ఈ పోస్టర్ తో బట్టలేసుకోలేదని విమర్శల వర్షం కురిపించిన క్రిటిక్స్ నోళ్లకు తాళం వేశారు. ఈ పోస్టర్ పై క్రిటిక్స్ ఏమని విమర్శలు చేస్తారో వేచి చూడాల్సిందే. -
రేపు ముంబై కోర్టులో ఆమీర్ ఖాన్ పీకే వివాదం!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీ.కే' చిత్ర పోస్టర్ పై వివాదం కొనసాగుతునే ఉంది. పీకే చిత్ర పోస్టర్, అసభ్యత, అశ్లీల అంశాలపై ముంబై కోర్టులో ఇటీవల నమోదైన కేసు మంగళవారం విచారణకు రానుంది. పీ.కే చిత్రంలో అశ్లీల పోస్టర్లు తొలగించాలని, దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలను ఆపివేయాలని సామాజిక కార్యకర్త హేమంత్ పాటిల్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించనుంది. ఈ కేసులో నటుడు అమీర్ ఖాన్, నిర్మాత విదూ వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ, సెన్సార్ బోర్డులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అశ్లీలంగా, నగ్నంగా ఉన్న అమీర్ ఖాన్ పోస్టర్ తో దేశవ్యాప్తంగా ప్రచారం చేశారని, ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని పిటిషన్ దాఖలు చేశారు. సత్యమేవ జయతే లాంటి టెలివిజన్ కార్యక్రమాన్ని నిర్వహించి క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్న అమీర్ నటుడు నగ్నంగా ఉండే పోస్టర్ ను పబ్లిసిటీ వినియోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. -
పీకే పోస్టర్ లో అసభ్యతా.. ఎక్కడా?
జోథ్ పూర్: తాను విడుదల చేసిన పీకే(ప్యార్‌కే) పోస్టర్ లో అశ్లీలత ఏమీ లేదని ఆ సినిమా హీరో అమీర్ ఖాన్ తెలిపాడు. ఈ మధ్య విడుదల చేసిన ఆ సినిమా పోస్టర్ లో అమీర్ నగ్నంగా ఫోజులివ్వడంతో అది వివాదాలకు దారి తీసింది. దీనిపై శనివారం మాట్లాడిన అమీర్.. ఆ పోస్టర్ లో అశ్లీలత అనేది ఏమీ లేదని పేర్కొన్నాడు. 'నేను నటించిన ఈ సినిమాను ప్రజలు చూస్తారు. అందులో ఉన్న వాస్తవాన్ని వారే గ్రహిస్తారు' అని అమీర్ స్పష్టం చేశాడు. ముందుగానే పీకే చిత్రంపై తాను అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని తెలిపాడు. అనుష్క శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తన కెరీర్ కే ఒక సవాల్ వంటిందని అమీర్ అన్నాడు. పీకే సినిమా తన భవిష్యత్తుపైనే కాకుండా తాను చేసే పనిపై కూడా కచ్చితంగా ప్రభావం చూపుతుందన్నాడు. ఈ సినిమా వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు ఈ మధ్యనే తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ సగ్నత్వం ప్రదర్శించారని సినిమా నిర్మాతపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కళలు, వినోదానికి సంబంధించిన విషయాలలో జోక్యం పనికిరాదని కోర్టు పేర్కొంది. ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ కు సలహా ఇచ్చింది. -
పీకే 2వ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా ఉండదట!
ఆమీర్ ఖాన్ నటించిన 'పీ.కే' పోస్టర్ దేశవ్యాప్తంగా సంచలనాలకు, వివాదాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. పీ.కే పోస్టర్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. పీ.కే పోస్టర్ వివాదంపై మిస్టర్ కూల్ సానుకూలంగానే స్పందించారు. పబ్లిసిటీ కోసం తాము ఈ పోస్టర్ విడుదల చేయలేదని.. ఈ చిత్రం చూసిన తర్వాత విమర్శకులు తమ వాదనల్ని మార్చుకుంటారని అమీర్ ఖాన్ ఘాటుగా స్పందించారు. పీ.కే చిత్రానికి సంబంధించిన రెండవ పోస్టర్ ఆగస్టు 20 తేదిన విడుదల కానుంది. పీకే రెండవ పోస్టర్ లో ట్రానిస్టర్ కూడా అడ్డుగా ఉండదు. ఇక మీరే చెప్పండి అంటూ మీడియాకు ఓ ప్రశ్నను అమీర్ సంధించారు. ట్రాన్సిస్టర్ అడ్డుగా ఉంటేనే ఇన్ని వివాదాలు చెలరేగాయి. ఇక ట్రాన్సిస్టర్ అడ్డు లేకుంటే ఏమైంతుందో ఓసారి ఊహించుకోవాల్సిందే. -
'పీకే' సినిమాపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన వివాదస్పద 'పీకే' (ప్యార్‌కే) సినిమాపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు కళాకారులకు గొప్ప ఊరట కలిగించాయి. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సగ్నత్వం ప్రదర్శించారని సినిమా నిర్మాతపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కళలు, వినోదానికి సంబంధించిన విషయాలలో జోక్యం పనికిరాదని కోర్టు చెప్పింది. ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ కు సలహా ఇచ్చింది. అంతేకాకుండా ఇటువంటి విషయాలలో మతపరమైన అంశాలు తీసుకురావద్దని కూడా సుప్రీం కోర్టు పిటిషనర్‌కు సలహా ఇచ్చింది. సినిమా విడుదలపై ఆంక్షలు విధిస్తే నిర్మాత హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టు తెలిపింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన 'పీకే' విడుదలకు ముందే వివాదాలు సృష్టించిన విషయం తెలిసిందే. సినిమా యూనిట్ వారు ఇటీవల విడుదల చేసి పీకే పోస్టర్‌పై అమీర్ ఖాన్ ఒంటిమీద నూలు పోగులేదు. పూర్తినగ్నంగా ఉన్నారు. రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్లో అమీర్ ఖాన్ ఒక పాత టేప్ రికార్డర్‌ను మాత్రమే అడ్డుపెట్టుకున్నారు. ఈ పోస్టర్‌పై దేశమంతటా విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంటు సభ్యులు కూడా విమర్శించారు. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ, పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్‌ను విడుదల చేయలేదని చెప్పారు. సినిమా చూస్తే ఆ పోస్టర్ ఏమిటో అర్థం అవుతుందన్నారు. దీనిని కళాత్మకంగా రూపొందించామేగానీ, ఇందులో అశ్లీలత ఏమీ లేదని తెలిపారు. -
అమీర్‌ఖాన్‌కు బిఎస్పీ ఎంపి మిశ్రా చురకలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌కు బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పి) ఎంపి సతీష్ చంద్ర మిశ్రా పరోక్షంగా చురకలంటించారు. అమీర్ తన తదుపరి చిత్రం ‘పీకే’కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లలో దాదాపు నగ్నంగా కనిపించడాన్ని తప్పుబట్టారు. సామాజికాంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ తనను తాను గొప్ప సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఓ ప్రముఖ బాలీవుడ్ హీరో ఈ చర్యకు పాల్పడ్డారని పరోక్షంగా ఆమీర్ ఖాన్‌ను విమర్శించారు. చట్టం ఇటువంటి చర్యలను నిషేధించిందని, వాటిని ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆమీర్ ఖాన్ 'పీకే' పోస్టర్ కాపీనా?
ఆమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' చిత్రం పోస్టర్ వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. అయితే పీకే పోస్టర్ తాజగా మరో వివాదానికి తెర తీసింది. నగ్నంగా అమీర్ ఖాన్ ఓ టేప్ రికార్డర్ ను పట్టుకుని రైలు పట్టాలపై నిలుచున్న పోస్టర్ మరో పోస్టర్ నుంచి కాపీ కొట్టాడనే అంశం నేషనల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 1973 సంవత్సరంలో తన ఆల్బమ్ ప్రమోషన్ కోసం పోర్చుగీస్ సంగీత కారుడు క్విమ్ బారీయోరోస్ రూపొందించిన పోస్టర్ ను పోలీవుందని ఇంటర్నెట్ లో కథనాలు వెలువడ్డాయి. క్విమ్ పోస్టర్ ను స్పూర్తిగా తీసుకుని పీకే పోస్టర్ రూపొందించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో 'డార్క్ నైట్' చిత్రం పోస్టర్ ను కాపీ చేసి 'ధూమ్3' పోస్టర్ ను రూపొందించారనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. -
తెరపై నగ్నంగా అమీర్!
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో త్వరలోనే తెరకెక్కనున్న ‘పీకే’ చిత్రంలో అమీర్ ఖాన్ నగ్నంగా నటించనున్నట్లు సమాచారం. ఈ రాజకీయ వ్యంగ్య చిత్రంలో అమీర్‌ఖాన్ సరసన అనుష్కాశర్మ నటించనుంది. భూమిపైకి దిగే గ్రహాంతరవాసి పాత్రలో కనిపించనున్న అమీర్, ఈ చిత్రంలో అనుష్కాశర్మతో హాట్‌హాట్ ముద్దు సీన్లలో కూడా కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల భోగట్టా. మల్లికలా ఉంటానట... ‘నేను మల్లికా షెరావత్లా ఉంటానట.. మా మేకప్ మ్యాన్ సహా చాలామంది నాతో ఈ మాట చెబుతున్నారు’ అంటూ హొయలు పోతోంది టీవీ నటి సోనాల్ వెంగుర్లేకర్. ‘దిల్ దోస్తీ డ్యాన్స్, ది బడ్డీ ప్రాజెక్ట్’ వంటి టీవీ సిరీస్‌లతో యువతను ఆకట్టుకున్న సోనాల్.. తాజాగా ‘శాస్త్రి సిస్టర్స్’లో కనిపించనుంది. నా పెదవులు, ముఖం అచ్చం మల్లికా షెరావత్లానే ఉంటాయని చాలామంది అంటుంటారంటూ సంబరపడుతోంది. -
డిసెంబర్ 19న అమీర్ ఖాన్ 'పీకే' విడుదల!
ముంబై: బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం ముందునుకున్న తేది కంటే వారం రోజుల ముందే విడుదలకు సిద్దమవుతోంది. రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. క్రిస్మస్ కానుకగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బోమన్ ఇరానీ, సంజయ్ దత్ లు నటిస్తున్నారు. -
ఆమిర్, అనుష్కల ‘రికార్డ్’ లిప్‌లాక్!
ఇప్పటివరకు బాలీవుడ్లో ఎన్నో కలక్షన్ల రికార్డ్లను సొంతం చేసుకున్న ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమిర్‌ఖాన్ తాజాగా మరో రికార్డ్ సాధించనున్నారు. అయితే ఇది వసూళ్లకు సంబంధించినది కాదు. ‘ముద్దు’కి సంబంధించిన రికార్డ్. గతంలో ‘రాజా హిందుస్తానీ’లో కరిష్మాకపూర్తో ఆమిర్ చేసిన లిప్‌లాక్ సీన్ అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ సన్నివేశం ఏడు నిమిషాల పాటు సాగుతుంది. తాజాగా అనుష్కశర్మ పెదవులను ముద్దాడటానికి అంగీకరించారు ఆమిర్. ఈ ఇద్దరూ జంటగా ‘పీకే’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో వీరి మధ్య సాగే పెదవి ముద్దు సన్నివేశం రసవత్తరంగా ఉండబోతోందని బాలీవుడ్ టాక్. భారతీయ చలన చిత్రపరిశ్రమలో ఇప్పటివరకు హాట్ టాపిక్ అయిన పెదవి ముద్దు సన్నివేశాలను తలదన్నే విధంగా ‘పీకే’లోని ముద్దు సీన్ ఉంటుందని సమాచారం. భారతీయ సినీ చరిత్రలో నంబర్‌వన్ సుదీర్ఘ ముద్దు ఇదే అవుతుందనే అంచనాలు ఉన్నాయి.