ఆమిర్, అనుష్కల ‘రికార్డ్’ లిప్‌లాక్!
ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఎన్నో కలక్షన్ల రికార్డ్‌లను సొంతం చేసుకున్న ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ ఆమిర్‌ఖాన్ తాజాగా మరో రికార్డ్ సాధించనున్నారు. అయితే ఇది వసూళ్లకు సంబంధించినది కాదు. ‘ముద్దు’కి సంబంధించిన రికార్డ్. గతంలో ‘రాజా హిందుస్తానీ’లో కరిష్మాకపూర్‌తో ఆమిర్ చేసిన లిప్‌లాక్ సీన్ అప్పట్లో సంచలనం అయ్యింది.
ఆ సన్నివేశం ఏడు నిమిషాల పాటు సాగుతుంది. తాజాగా అనుష్కశర్మ పెదవులను ముద్దాడటానికి అంగీకరించారు ఆమిర్. ఈ ఇద్దరూ జంటగా ‘పీకే’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో వీరి మధ్య సాగే పెదవి ముద్దు సన్నివేశం రసవత్తరంగా ఉండబోతోందని బాలీవుడ్ టాక్.
భారతీయ చలన చిత్రపరిశ్రమలో ఇప్పటివరకు హాట్ టాపిక్ అయిన పెదవి ముద్దు సన్నివేశాలను తలదన్నే విధంగా ‘పీకే’లోని ముద్దు సీన్ ఉంటుందని సమాచారం. భారతీయ సినీ చరిత్రలో నంబర్‌వన్ సుదీర్ఘ ముద్దు ఇదే అవుతుందనే అంచనాలు ఉన్నాయి.