కలెక్షన్ల రికార్డులను...'పీకే'స్తోంది | aamir khan pk becomes highest grossing bollywood film | Sakshi
Sakshi News home page

కలెక్షన్ల రికార్డులను...'పీకే'స్తోంది

Published Sat, Jan 3 2015 1:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కలెక్షన్ల రికార్డులను...'పీకే'స్తోంది - Sakshi

కలెక్షన్ల రికార్డులను...'పీకే'స్తోంది

ఓవైపు విమర్శలు, వివాదాలు వెల్లువెత్తుతున్నా....మరోవైపు  'పీకే' చిత్రం బాలీవుడ్ పాత చిత్రాల కలెక్షన్ల రికార్డులను 'పీకే'స్తోంది. అత్యధిక కలెక్షన్లు వసూలు చేస్తున్న చిత్రంగా 'పీకే' దూసుకు వెళుతోంది. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ తన రికార్డును తాను బ్రేక్ చేశాడు. గతంలో ధూమ్ 3  చిత్రం రూ. 271.82 కోట్లు వసూలు చేయగా, పీకే విడుదల అయిన రెండు వారాలకే రూ. 278.52 కోట్లు వసూలు చేసింది. ట్రెండ్ను చూస్తుంటే పీకే చిత్రం ఓవరాల్‌గా రూ. 500కోట్లకు పైగానే వసూలు రాబట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆమీర్ ఖాన్, అనుష్క శర్మ జంటగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన పీకే.. మూఢ నమ్మకాలు, దొంగస్వాముల చుట్టూ కేంద్రీకృతమై.. సునిశిత హాస్యంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. తొలి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉండటం, రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురుస్తోంది. గతంలో రాజ్కుమార్ హిరాణీ, ఆమీర్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన 3 ఇడియట్స్ రూ.202 కోట్లు వసూలు చేసింది. మరోవైపు పీకే చిత్రం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని దానిపై నిషేధం విధించాలని బజరంగ్ దళ్ ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement