బాలీవుడ్కు 'పీకే' భయం! | 'PK' fear to Bollywood! | Sakshi
Sakshi News home page

బాలీవుడ్కు 'పీకే' భయం!

Published Sat, Sep 13 2014 3:16 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్కు 'పీకే' భయం! - Sakshi

బాలీవుడ్కు 'పీకే' భయం!

బాలీవుడ్‌కు 'పీకే' భయం పట్టుకుందా? పీకేతో పోటీ పడేందుకు ఇతర సినిమాలు భయపడుతున్నాయా? మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ను బీట్‌ చేసేందుకు బాలీవుడ్‌ ఎందుకు జంకుతోంది?  రిలీజ్‌కు ముందే సూపర్‌స్టార్ అమీర్‌ ఖాన్‌ పీకే బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.  డిసెంబర్‌లో పీకే ని ప్రేక్షకుల ముందు నిలబెట్టాలన్నది మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆలోచన.  డిసెంబర్‌ లో విడుదలైన అమీర్‌ సినిమాలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్టయ్యాయి.

పీకే కూడా డిసెంబర్‌లో రానుండటంతో బాలీవుడ్‌ అంతా షేక్‌ అవుతోంది. చాలా మంది నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను ప్రీపోన్‌, పోస్టు పోన్ చేసుకుంటున్నారు. అభిషేక్‌ - అసిన్‌ సినిమా ఆల్‌ ఈజ్‌ వెల్‌ను నిర్మాతలు డిసెంబర్‌ 5న రిలీజ్‌ చేస్తామని ముందు ప్రకటించారు. అమీర్‌తో పోటీ పడటం కంటే  సినిమా రిలీజ్‌లను వాయిదా వేసుకోవడం మంచిదనే వాదన బాలీవుడ్‌లో వినిపిస్తోంది.  ఇమ్రాన్‌ హష్మీ,  కంగనా రనౌత్‌ సినిమా  ఉంగ్లి, అజయ్‌ దేవగన్, సోనాక్షి సిన్హా 'యాక్షన్‌ జాక్సన్‌' కూడా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 జనవరి 9 విడుదల చేయాలనుకున్న థెవర్‌ను ముందుకు జరిపారు. సంజయ్‌ కపూర్ నిర్మాతగా  అర్జున్ కపూర్‌-సోనాక్షి సిన్హా  జంటగా నటించిన ఈ సినిమా కూడా డిసెంబర్‌ 5న సిల్వర్‌ స్క్రీన్‌ను తాకనుంది.  సైఫ్‌- ఇలియానా నటించిన హ్యాపీ ఎండింగ్‌కు కూడా పీకే భయం పట్టుకున్నట్లుంది.  డిసెంబర్‌ 5న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాను  నవంబర్‌ 21న విడుదల చేయనున్నారు.

అమీర్ ఖాన్ నగ్న పోస్టర్తో దేశవ్యాప్తంగా వివాదానికి తెరతీసిన పీకే చిత్రానికి  రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు.  ఈ రాజకీయ వ్యంగ్య చిత్రంలో అమీర్‌ఖాన్ సరసన అనుష్కాశర్మ నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్కు సంబంధించి నిర్మాతలపై  అభిషేక్ భార్గవ అనే యువకుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.  అమీర్ నటిస్తున్న ‘పీకే’ చిత్రం న్యూడ్ పోస్టర్ అభ్యంతరకరంగా ఉందని, సమాజంలో అసభ్యతకు తగిన ప్రచారం కల్పించేట్లుగా ఉందని ఆ యువకుడు పేర్కొన్నాడు.

అయితే  నిర్మాతపై దాఖలైన ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కళలు, వినోదానికి సంబంధించిన విషయాలలో జోక్యం పనికిరాదని కోర్టు చెప్పింది. ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్కు సలహా ఇచ్చింది.  అంతేకాకుండా ఇటువంటి విషయాలలో మతపరమైన అంశాలు తీసుకురావద్దని కూడా సుప్రీం కోర్టు  పిటిషనర్కు సలహా ఇచ్చింది. సినిమా విడుదలపై ఆంక్షలు విధిస్తే నిర్మాత హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టు తెలిపింది.

ఈ రకంగా విడుదలకు ముందే విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన పీకే సినిమాలో కథాపరంగా అమీర్ ఖాన్ వింతవింత దుస్తులు ధరించారు.  ఈ చిత్రం డిసెంబర్‌ 19న  విడుదల కాబోతుంది. దీనితోపాటు ఆ రోజు విడుదలయ్యే మరో  సినిమా ఏదీ లేకపోవడం విశేషం.  అయితే వరదలా డిసెంబర్‌ 5న విడుదలయ్యే  సినిమాలలో దేనిని ప్రేక్షకులు ఆదరిస్తారో వేచిచూడాలి.
- శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement