'నాది పగటి కలలు కనే పాత్ర కాదు'
లండన్:త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'పీకే' చిత్రంలో తనది పగటి కలలు కనే పాత్ర కాదని ఆ చిత్ర కథానాయకుడు అమిర్ ఖాన్(49) స్పష్టం చేశాడు. ఆ చిత్రంలో పగటి కలలకు సంబంధించి ఛాయలు ఎక్కడ కనబడవన్నాడు. ఆ చిత్రంలో తాను ఒక విలక్షమైన పాత్రలో కనిపిస్తానని అమిర్ తెలిపాడు. ఇప్పటివరకూ తాను నటించిన అత్యంత కఠినమైన పాత్రల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన్నాడు. పీకే చిత్రం వాస్తవిక జీవితానికి సరైన నిర్వచనంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. లండన్ లో యూటీవీ మోషన్ పిక్చర్స్ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ ద్వారా అమిర్ తన అభిప్రాయాల్ని పంచుకున్నాడు.
నగరానికి వచ్చిన ఓ కొత్త వ్యక్తికి సంబంధించి ప్రణాళికలను కామెడీగా చిత్రీకరించారనే దానిపై అమిర్ తనదైన శైలిలో స్పందించాడు. ఇటువంటి ప్రశ్నలు ఎక్కడ నుంచి వస్తున్నాయని ఎదురు ప్రశ్నించాడు. అంతకుముందు ఎప్పుడూ కూడా ఈ తరహా కామెంట్లు వినపడలేదని స్పష్టం చేశాడు. స్నేహితుల మధ్య ఉండే సద్భక్తి అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామని అమిర్ స్పష్టం చేశాడు. రాజ్ కుమార్ హిరానీ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 19వ తేదీన వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతోంది.