highest grossing
-
అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు
-
ఆల్‌టైమ్ హయ్యస్ట్ గ్రాసర్ లిస్ట్‌లో ‘సంజు’!
రణ్‌బీర్ కపూర్ లుక్‌ను రిలీజ్ చేసినప్పటినుంచీ సంజు సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక సినీ అభిమానులు సంజు కోసం ఎదురుచూశారు. మొత్తానికి సినిమా విడుదలై రికార్డుల వేటను మొదలుపెట్టింది. సినిమా రిలీజ్ రోజు నుంచీ కలెక్షన్ల మోతమోగిస్తోంది. సంజు మూవీ కంటెంట్ పట్ల కొందరు వ్యతిరేకతను ప్రదర్శిస్నున్నా.. అవేమీ సినిమా కలెక్షన్లపై ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న వివాదాస్పద దర్శకుడు వర్మ ఈ సినిమాపై తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. నిజాల్ని దాచి సంజయ్‌దత్‌ను మంచిగా చూపించాడనే విమర్శలు వినిపిస్తోన్నా.. ఈ మూవీ మాత్రం బాలీవుడ్లో ఆల్‌టైమ్ హిట్‌గా నిలుస్తోంది. విడుదలైన ఐదో వారాంతం కూడా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయని ప్రముఖ ట్రేడ్ అనలిష్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. టైగర్ హై జిందాను దాటి.. పీకేను చేజ్ చేస్తూ.. ఇప్పటికి నాల్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా 339కోట్లతో వసూళ్లతో దూసుకెళ్తోందంటూ ట్వీట్ చేశారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ నటన ఈ మూవీకి హైలెట్‌గా నిలిచింది. #Sanju crosses *lifetime biz* of #TigerZindaHai... Now FOURTH HIGHEST GROSSING *Hindi* film... Chasing #PK *lifetime biz* now... [Week 5] Fri 45 lakhs, Sat 87 lakhs, Sun 1.15 cr. Total: ₹ 339.75 cr. India biz. ALL TIME BLOCKBUSTER. — taran adarsh (@taran_adarsh) July 30, 2018 -
సంపాదనలో అగ్రరాజు మనోడే!
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది నాలుగు సూపర్ టైటిళ్లు అందుకున్న ఈ గుంటూరు మిర్చి (230,423 యూఎస్‌డాలర్లు) 1.54 కోట్ల రూపాయలతో ఓవరాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సంపాదన లిస్టులో అగ్రస్థానం సంపాదించాడు. ఇంకొద్దిరోజుల్లోనే నెం.1 ర్యాంకు అందుకునే అవకాశమున్న ఈ నెం.2 ర్యాంకర్ మిగతా పురుషుల షట్లర్ల కన్నా అధికంగా ఆర్జిస్తున్నాడు. ఈ ఏడాది గెలిచిన నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్ల ప్రైజ్‌మనీ సంపాదనలో శ్రీకాంత్‌ను నెం.1గా నిలబెట్టాయి. తరువాతి స్థానంలో ఉన్న మలేషియా ప్లేయర్ లీ చాంగ్ వెయ్ కన్నా శ్రీకాంత్ సంపాదన మూడు రెట్లు అధికంగా ఉండటం విశేషం. ఈ మాజీ నెం.1 ర్యాంకర్ లీ చాంగ్ ఇంగ్లండ్ టైటిల్, రెండు సూపర్ సిరీస్‌ల్లో రన్నరప్‌గా 86,275 యూఎస్ డాలర్లు( రూ.56 లక్షలు) ఆర్జించాడు. ఇక ఉమెన్ షట్లర్స్ తై జూ యింగ్, పీవీ సింధూల కన్న శ్రీకాంత్ సంపాదనే ఎక్కువగా ఉండటం మరో విశేషం. కలలో కూడా ఉహించలేదు: గోపిచంద్ శ్రీకాంత్ ఘనతపై కోచ్ పుల్లెల గోపిచంద్ స్పందిస్తూ.. ‘మంచి రోజులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. శ్రీకాంత్ సాధించింది ఓ అద్భుతమైన ఘనత. ఓ భారత్ షట్లర్ సంపాదనలో నెం.1గా నిలుస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ శ్రీకాంత్ ఈ ఘనత సాధించి ఆశ్చర్యానికి గురిచేశాడు. -
దంగల్ @ 2000 కోట్లు... నాటౌట్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. అయితే ఇది నిన్నటి మాట. ఇప్పుడీ స్థానాన్ని హిందీ చిత్రం ‘దంగల్’ దక్కించుకుంది. రూ. 2,000 కోట్లు వసూళ్లు సాధించి, ఎక్కువ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా వరల్డ్‌లో ‘నంబర్ వన్’ స్థానంలో నిలిచింది ‘దంగల్’. ఇటీవల చైనాలో ఈ చిత్రాన్ని ‘షుయి జియావో బాబా’ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ మాత్రమే ఈ చిత్రం 1,200 కోట్లు రాబట్టింది. దాంతో ‘బాహుబలి’ రికార్డుని బీట్ చేసింది. ఇంకా ఈ సినిమా చైనాలో విజయవంతంగా దూసుకెళుతోందట. ఆ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి–2’ని వచ్చే నెల చైనాలో విడుదల చేయనున్నారు. మరి.. ఈ చిత్రం అక్కడ సాధించే వసూళ్లను బట్టి ఎక్కువ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఏది? అనేది డిసైడ్ అవుతుంది. ‘ఇండియన్ సినిమా నంబర్ వన్’ రికార్డు గురించి పక్కన పెడితే ‘దంగల్’ చైనీస్ కలెక్షన్స్ హాలీవుడ్ సినిమాలకు షాక్ ఇచ్చాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అయిన ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’, ‘ట్రాన్స్ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్’, ‘కుంగ్‌ఫూ ఫాండా’, ‘ది జంగిల్‌బుక్’లతోపాటు వరల్డ్ సూపర్‌హిట్ మూవీ ‘అవతార్’కు మించిన వసూళ్లను చైనా బాక్సాఫీసు వద్ద ‘దంగల్’ రాబట్టుకోవడం విశేషం. చైనాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన నాన్–ఇంగ్లీష్ మూవీగా ఐదో స్థానం దక్కించుకుంది. అక్కడ మిగతా నాలుగు స్థానాల్లో నిలిచిన నాన్–ఇంగ్లీష్ చిత్రాలు ఏంటంటే... ‘ది మెర్మైడ్’ (చైనా), ‘మాన్స్టర్ హాంట్’ (చైనా), ది ఇన్టచ్బుల్స్(ఫ్రాన్స్), యువర్ నేమ్ (జపాన్). ఐదో స్థానంలో ఇండియన్ మూవీ ‘దంగల్’ ఉండటం గర్వించదగ్గ విషయం. గ్రేట్ రెజ్లర్ మహావీర్‌సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా నితీష్ తివారీ డైరెక్షన్లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. -
కలెక్షన్ల రికార్డులను...'పీకే'స్తోంది
ఓవైపు విమర్శలు, వివాదాలు వెల్లువెత్తుతున్నా....మరోవైపు 'పీకే' చిత్రం బాలీవుడ్ పాత చిత్రాల కలెక్షన్ల రికార్డులను 'పీకే'స్తోంది. అత్యధిక కలెక్షన్లు వసూలు చేస్తున్న చిత్రంగా 'పీకే' దూసుకు వెళుతోంది. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ తన రికార్డును తాను బ్రేక్ చేశాడు. గతంలో ధూమ్ 3 చిత్రం రూ. 271.82 కోట్లు వసూలు చేయగా, పీకే విడుదల అయిన రెండు వారాలకే రూ. 278.52 కోట్లు వసూలు చేసింది. ట్రెండ్‌ను చూస్తుంటే పీకే చిత్రం ఓవరాల్‌గా రూ. 500కోట్లకు పైగానే వసూలు రాబట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమీర్ ఖాన్, అనుష్క శర్మ జంటగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన పీకే.. మూఢ నమ్మకాలు, దొంగస్వాముల చుట్టూ కేంద్రీకృతమై.. సునిశిత హాస్యంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. తొలి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉండటం, రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురుస్తోంది. గతంలో రాజ్‌కుమార్ హిరాణీ, ఆమీర్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన 3 ఇడియట్స్ రూ.202 కోట్లు వసూలు చేసింది. మరోవైపు పీకే చిత్రం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని దానిపై నిషేధం విధించాలని బజరంగ్ దళ్ ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. -
వసూళ్లలో నంబర్ ఫోర్ మేమే!
తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా మా ‘రేసు గుర్రం’ నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ కెరీర్లోనే ఇది నంబర్ వన్ సినిమా. అమెరికాలో కూడా ఒకటిన్నర మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది’’ అని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) చెప్పారు. అల్లు అర్జున్, శ్రుతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో డా.కె. వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన నిర్మించిన ‘రేసుగుర్రం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో పత్రికల వారితో బుజ్జి ముచ్చటించారు. ‘‘ఈ సినిమా విజయం మీద నాకు మొదట్నుంచీ నమ్మకం ఉంది. అందుకే చాలా ఏరియాల్లో మేమే సొంతంగా పంపిణీ చేశాం. విడుదలకు ముందే ఈ సినిమా లాభాలు చవిచూపించింది. నాలుగో వారంలోనూ మంచి షేర్స్ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో రియల్‌గా యాభై రోజులు ప్రదర్శితం కానున్న సినిమా ఇదే. త్వరలో భారీ ఎత్తున యాభై రోజుల వేడుక కూడా చేయనున్నాం’’ అని బుజ్జి తెలిపారు. ‘రేసు గుర్రం’ విజయానికి గల కారణాలను బుజ్జి విశ్లేషిస్తూ -‘‘ఈ కథలో దమ్ముంది. మంచి సెంటిమెంట్ ఉంది. బన్నీ, సురేందర్‌రెడ్డి ఈ సినిమా విజయానికి మూలస్తంభాలుగా నిలిచారు. ఛాయాగ్రహణం, సంగీతం కూడా బాగా కలిసొచ్చింది’’ అన్నారు. ఇతర ప్రాజెక్టుల గురించి బుజ్జి వివరిస్తూ -‘‘నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తీస్తున్న సినిమా సుమారు నలభై శాతం పూర్తయింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొత్త హీరో హీరోయిన్లతో ఓ సినిమా చేయబోతున్నాం. సునీల్ హీరోగా రచయిత విక్రమ్ సిరి దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్‌తో ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సూర్య-మురుగదాస్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ఓ సినిమా చేయబోతున్నా. వీటన్నిటికీ కూడా ‘ఠాగూర్’ మధు నిర్మాణ భాగస్వామి’’ అని తెలిపారు. మీపై పొగరుబోతు అనే ముద్ర ఉండటానికి గల కారణమేమిటని అడిగితే -‘‘ఇప్పుడు చాలామంది నిర్మాతలు కేవలం పెట్టుబడిదారులుగానే మిగిలిపోతున్నారు. నాలాంటి కొంతమంది మాత్రమే సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ జోక్యాన్ని చూసి చాలామంది పొగరు అనుకుంటున్నారు. అయినా ఏం ఫర్లేదు. సినిమా బాగా రావడానికి చివరి క్షణం వరకూ చిత్తశుద్ధితో పనిచేస్తాను’’ అని బుజ్జి సమాధానమిచ్చారు.