సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది నాలుగు సూపర్ టైటిళ్లు అందుకున్న ఈ గుంటూరు మిర్చి (230,423 యూఎస్‌డాలర్లు) 1.54 కోట్ల రూపాయలతో ఓవరాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సంపాదన లిస్టులో అగ్రస్థానం సంపాదించాడు. ఇంకొద్దిరోజుల్లోనే నెం.1 ర్యాంకు అందుకునే అవకాశమున్న ఈ నెం.2 ర్యాంకర్ మిగతా పురుషుల షట్లర్‌ల కన్నా అధికంగా ఆర్జిస్తున్నాడు. ఈ ఏడాది గెలిచిన నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్ల ప్రైజ్‌మనీ సంపాదనలో శ్రీకాంత్‌ను నెం.1గా నిలబెట్టాయి. తరువాతి స్థానంలో ఉన్న మలేషియా ప్లేయర్ లీ చాంగ్ వెయ్ కన్నా శ్రీకాంత్ సంపాదన మూడు రెట్లు అధికంగా ఉండటం విశేషం. ఈ మాజీ నెం.1 ర్యాంకర్ లీ చాంగ్ ఇంగ్లండ్ టైటిల్, రెండు సూపర్ సిరీస్‌ల్లో రన్నరప్‌గా 86,275 యూఎస్ డాలర్లు( రూ.56 లక్షలు) ఆర్జించాడు. ఇక ఉమెన్ షట్లర్స్ తై జూ యింగ్, పీవీ సింధూల కన్న శ్రీకాంత్ సంపాదనే ఎక్కువగా ఉండటం మరో విశేషం.
కలలో కూడా ఉహించలేదు: గోపిచంద్
శ్రీకాంత్ ఘనతపై కోచ్ పుల్లెల గోపిచంద్ స్పందిస్తూ.. ‘మంచి రోజులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. శ్రీకాంత్ సాధించింది ఓ అద్భుతమైన ఘనత. ఓ భారత్ షట్లర్ సంపాదనలో నెం.1గా నిలుస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ శ్రీకాంత్ ఈ ఘనత సాధించి ఆశ్చర్యానికి గురిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment