badmintion
-
శుభవార్త చెప్పిన పీవీ సింధు.. చిరకాల ఆశయానికి ముందడుగు(ఫొటోలు)
-
ఒలింపిక్స్‌లో పతకం మిస్.. లక్ష్యసేన్‌పై రణ్వీర్ సింగ్ ప్రశంసలు!
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్‌పై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. తాజాగా పారిస్‌లో జరుగుతన్న ఒలింపిక్స్‌లో కాంస్యపతకం దక్కకపోవడంపై స్పందించారు. పురుషుల బ్యాడ్మింటన్‌లో సెమీఫైనల్ చేరుకున్న తొలి భారత షట్లర్‌గా రికార్డ్ సృష్టించాడని రణ్వీర్ కొనియాడారు. ప్రస్తుతం నీ వయస్సు 22 ఏళ్లేనని.. మరో రోజు నువ్వు పోరాడాలంటూ మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.నువ్వు ఓడిపోయినప్పటికీ నీ ప్రయత్నం గొప్పదని రణ్వీర్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఒలింపిక్స్‌లో నీ చురుకుదనం, ప్రదర్శన, ఏకాగ్రత అద్భుతంగా ఉందన్నారు. నిన్ను చూసి గర్వపడుతున్నానని.. నువ్వు ఒక స్టార్.. నీ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని పోస్ట్‌లో రాసుకొచ్చారు. భవిష్యత్తులో రాబోయే యువతకు నువ్వు ఒక ఆదర్శమని రణ్వీర్ సింగ్ మద్దతుగా నిలిచారు. కాగా.. ఒలింపిక్స్‌లో జరిగిన కాంస్య పతక పోరులో మలేషియా ప్లేయర్ చేతిలో ఓటమి చెందారు. -
ఆయన గురించి చెప్పుకునేంత సీన్ లేదు: తాప్సీ ఆసక్తికర కామెంట్స్
హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కీల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నేరుగా ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తాప్సీ పన్ను వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు మథియాస్ బోను పెళ్లాడింది. డెన్మార్కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ఏడడుగులు వేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన భర్త మథియాస్ బో గురించి కొంతమందికి ఇంకా తెలియకపోవడం బాధకరమని తెలిపింది. అలాంటి వారి పట్ల విచారంగా ఉందని వెల్లడించింది.తాప్సీ మాట్లాడుతూ.." నా భర్త మథియాస్ బో ఎవరో తెలియని వారి గురించి నేను చాలా బాధపడ్డా. నేను బయటకు వచ్చి అతని గురించి ప్రజలకు చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను పెద్ద క్రికెటర్ కాదు.. బిజినెస్మెన్ అంతకన్నా కాదు. అతని గురించి మీకు నిజంగా తెలుసుకోవాలని అనిపించడం లేదు అంతే. ప్రపంచంలో బ్యాడ్మింటన్‌లో అతిపెద్ద విజయాలు సాధించిన వారిలో ఈయన ఒకరు " అని వెల్లడించింది. కాగా.. తాప్సీ 2024 మార్చిలో ఉదయపూర్‌లో మాజీ డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను వివాహం చేసుకుంది. కాగా.. ప్రస్తుతం తాప్సీ భర్త భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
Paris olympics: సత్తా చాటిన పీవీ సింధు.. తొలి మ్యాచ్‌లో ఘన విజయం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌పై పీవీ సింధు గెలుపొందింది.గ్రూప్ దశ మ్యాచ్‌లో సింధూకు రజాక్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు వరుస గేమ్‌ల్లో ప్రత్యర్ధిని 21-9, 21-6 తేడాతో చిత్తు చేసింది. ఇక, ఆట ప్రారంభమైన 29 నిమిషాల్లోనే సింధూ మ్యాచ్‌ను ముగించడం విశేషం. PV SINDHU REGISTERS A SOLID VICTORY AT THE PARIS OLYMPICS. 🏸 pic.twitter.com/bDT24lasyr— Cricfobia (@Cricfobia22) July 28, 2024 #Olympics | In her quest for 3rd medal in the Olympics at the trot, Indian ace shuttler PV Sindhu defeats Fathimath Nabaaha Abdul Razzaq of Maldives in straight sets of 21-9 & 21-6 to clinch her first victory at #Paris2024— ANI (@ANI) July 28, 2024 -
నాట్స్ బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ పోటీలకు విశేష స్పందన
భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాట్స్.. తెలుగు వేడుకలకు సిధ్దమైంది. ఇందులో భాగంగా నిర్వహించిన 'బ్యాడ్మింటన్ మరియు పికిల్‌బాల్' టోర్నమెంట్స్ కి విశేష స్పందన వచ్చింది. టెక్సాస్‌లోని లెవిస్విల్లేలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్లేయర్స్ పెద్ద ఎత్తున పాల్గొని క్రీడా స్పూర్తిని చాటారు. ఒపెన్ మెన్స్ డబుల్స్, సినీయర్ మెన్స్ డబుల్స్, ఒపెన్ ఉమెన్స్ డబుల్స్, సినీయర్ ఉమెన్స్ డబుల్స్ విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. మెన్స్ అండ్ ఉమెన్స్ డబుల్స్ విభాగాల్లో పికిల్‌బాల్ టోర్నమెంట్ జరిగింది. యూత్‌ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంత్యం ఆసక్తిగా సాగాయి. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్స్‌లో గెలిచిన విజేతలకు మెడల్స్ అందజేశారు. మార్చి 15,16 తేదీల్లో జరిగే నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో విజేతలకు ట్రోఫీలను అందించనున్నారు. ఈ పోటీలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నడిపించిన ప్రతిఒక్కరికి నాట్స్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. డల్లాస్ వేదికగా నాట్స్ తెలుగు వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
17 ఏళ్లకు జాతీయ స్థాయిలో దూసుకొచ్చిన కుర్రాడు.. బ్యాడ్మింటన్‌లో ప్రకాశం
దాదాపు యాభై ఏళ్ల క్రితం.. దక్షిణ భారతదేశంలో బ్యాడ్మింటన్ అంటే బాల్ బ్యాడ్మింటన్ మాత్రమే! దిగువ స్థాయిలో గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయి.. ఆటంటే బాల్ బ్యాడ్మింటన్ మాత్రమే అనేంతగా పరిస్థితి కనిపించేది. నగరాల్లో కూడా ‘షటిల్ బ్యాడ్మింటన్ ’ గా పిలుచుకునే ఆటకు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఇలాంటి స్థితిలో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడొకడు జాతీయ స్థాయిలో దూసుకొచ్చాడు. నేపథ్యం కారణంగా తొలి అవకాశం తొందరగానే లభించినా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు అతనికి పదేళ్లు పట్టింది. ఆ విజయం తర్వాత అతను ఆగలేదు. దేశంలో బాడ్మింటన్ ఆటకే దిక్సూచిగా మారాడు. ఒక దేశంలో ఒక క్రీడ గురించి చెప్పుకోవడం మొదలు పెట్టగానే అందరికంటే ముందుగా ఒక పేరు స్ఫురిస్తుందంటే ఆ ఆటగాడు సాధించిన ఘనత ఏమిటో, ఆ ఆటకు అతను తెచ్చిన గుర్తింపు ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. అతని పేరే ప్రకాశ్ పడుకోణ్.. భారత బ్యాడ్మింటన్‌కు తొలితరం చిరునామా. ప్రకాశ్ పడుకోణ్ కంటే ముందు కూడా భారత ఆటగాళ్లు అంతర్జాతీయ బ్యాడ్మింట¯Œ లో కొన్ని విజయాలు సాధించారు. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన దినేశ్ ఖన్నా తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన కెరీర్ ఎక్కువ భాగం ఆసియాకే పరిమితమైంది. 60, 70వ దశకాల్లో బ్యాడ్మింటన్ లో చైనా ఆధిపత్యం లేదు. అలాంటి సమయంలో దినేశ్ ఆసియా స్థాయిలో విజేతగా నిలిచినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అప్పట్లో బ్యాడ్మింటన్ అడ్డా యూరోప్ మాత్రమే. ఇంగ్లండ్, డెన్మార్క్‌లతో పాటు ప్రతిష్ఠాత్మక యూరోపియన్ లీగ్‌లు, క్లబ్‌లలో బ్యాడ్మింటన్ హవా నడిచేది. విజయాలు సాధించిన వారికే అక్కడ అందలం. సరిగ్గా ఇక్కడే ప్రకాశ్ పడుకోణ్ మిగతావారి కంటే భిన్నంగా నిలిచాడు. ఒక వైపు ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే యూరోప్‌లో సత్తా చాటడంతో ప్రకాశ్ ప్రత్యేకత కనిపించింది. కఠోర శ్రమతో.. ప్రకాశ్ తండ్రి మైసూరు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శిగా పని చేస్తుండటంతో సహజంగానే ప్రకాశ్‌కి ఆ ఆటపై ఆసక్తి కలిగింది. అయితే ఆటలో పదును ఉంటేనే మున్ముందు అవకాశాలు దక్కుతాయని త్వరలోనే ప్రకాశ్‌కి అర్థమైంది. 1962లో అమితోత్సాహంతో రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ బరిలోకి దిగిన అతను తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత మరో రెండేళ్ల శ్రమతో అదే టైటిల్ గెలుచుకున్నాడు. అయినా సరే, ప్రకాశ్ ఆట ఉత్తరాది షట్లర్లతో పోలిస్తే ఇంకా పేలవంగానే ఉండేది. జాతీయ స్థాయికి ఎదగాలంటే అది సరిపోదని గ్రహించాడు. అందుకే తన ఆట శైలిని మార్చుకున్నాడు. దూకుడును పెంచి ప్రత్యర్థిపై చెలరేగేందుకు తగిన అస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు. అయినా సరే.. రాష్ట్ర స్థాయి విజేత నుంచి జాతీయ స్థాయికి చేరేందుకు ప్రకాశ్‌కు చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో అతణ్ణి ఎన్నో పరాజయాలు పలకరించాయి. పట్టుదలగా నిలబడ్డాడు. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఫలితంగా.. దాదాపు ఏడేళ్ల తర్వాత తొలిసారి జాతీయ జూనియర్ టైటిల్ ప్రకాశ్ చేతికి చిక్కింది. అప్పటికే.. పదునెక్కిన ప్రకాశ్ ఆట సీనియర్లనూ నిలువరిస్తోంది. దాంతో జూనియర్ చాంపియన్ గా మారిన సంవత్సరమే పడుకోణ్ జాతీయ సీనియర్ చాంపియన్ గానూ మారాడు. అది మొదలు మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా ఏడు సంవత్సరాల పాటు ప్రకాశ్ జాతీయ చాంపియన్ గా నిలబడ్డాడు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో.. భారత బ్యాడ్మింటన్ లో శిఖరానికి చేరాక ప్రకాశ్ తర్వాతి అడుగు అంతర్జాతీయ టోర్నీల వైపే. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించినా.. వ్యక్తిగత విభాగంలో విజయాలకు హైదరాబాద్ నగరమే తొలి వేదికగా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆసియా చాంపియన్ షిప్లో 21 ఏళ్ల ప్రకాశ్ కాంస్యం సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకు కెనడాలోని ఎడ్మాంటన్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల సింగిల్స్‌లో స్వర్ణపతకంతో మెరిశాడు. వరుసగా రెండు వరల్డ్ కప్‌లలో పతకాలు, వరల్డ్ గేమ్స్‌తో పాటు ఆసియా చాంపియన్ షిప్లో మరో పతకంతో ప్రకాశ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అప్పటికే బ్యాడ్మింటన్ అంటే దేశంలో ఒక్క ప్రకాశ్ పడుకోణ్ పేరు మాత్రమే వినిపించేంతగా ప్రసిద్ధికెక్కాడు. యూరోప్ గడ్డపై.. వేర్వేరు అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లిన సమయంలో ప్రకాశ్ ప్రత్యర్థుల ఆటపై దృష్టి పెట్టాడు. ప్రధానంగా యూరోప్ ఆటగాళ్లతో పోలిస్తే తన ఆట చాలా వెనుకబడి ఉన్నట్లు గ్రహించాడు. అప్పటికే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా.. ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆటలో మార్పు తీసుకురాకపోతే వెనుకబడి పోతాననీ అర్థంచేసుకున్నాడు. యూరోప్ వెళ్లి శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే శిక్షణ అంటూ వెళితే ఫలితం ఉండదని.. వీలైనన్ని ఎక్కువ టోర్నీలకు ఆడటంతో ఆటను సానబెట్టుకోవచ్చని అత్యంత సన్నిహితులు అతనికి సూచించారు. దాంతో తన మకాంను యూరోప్‌కు మార్చుకున్నాడు ప్రకాశ్. ఇంగ్లండ్, డెన్మార్క్, స్వీడన్ , నెదర్లాండ్స్.. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి క్లబ్‌లలో ఆడుతూ పోయాడు. అతను ఆశించినట్లుగానే అతని ఆట పైస్థాయికి చేరుకుంది. 1979లో లండన్ లో ‘ఈవెనింగ్ ఆఫ్ చాంపియన్స్’ టోర్నీలో విజయంతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఆట చివరకు ఒక చరిత్రాత్మక గెలుపుకి బాటలు వేసింది. కొనసాగిన విజయపరంపర ఆల్ ఇంగ్లండ్ గెలిచిన తర్వాత ప్రకాశ్‌కు స్వదేశంలో లభించిన స్వాగతం, పెద్ద ఊరేగింపుతో జరిగిన పౌర సన్మానం అప్పట్లో పెద్ద సంచలనం. ఆ విక్టరీ తర్వాత అతని స్థాయి మరింత పెరిగిపోయింది. వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడంతో పాటు డెన్మార్క్‌లోని కోపెన్ హాగెన్ లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్‌లోనూ అతను కాంస్యం గెలుచుకున్నాడు. కోపెన్ హాగెన్ నగరంతో అనుబంధాన్ని ఆ తర్వాత కొనసాగిస్తూ ప్రకాశ్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండి లీగ్‌లలో పాల్గొన్నాడు (అతని కూతురు, పాపులర్ నటి దీపికా పడుకోణ్ అక్కడే పుట్టింది). 1986 సియోల్ ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో మరో పతకం అతని ఖాతాలో చేరింది. ప్రతిభను ప్రోత్సహిస్తూ.. అర్జున, పద్మశ్రీ పురస్కారాలు గెలుచుకున్న ప్రకాశ్ 90వ దశకం ఆరంభంలో ఆటకు దూరంగా జరిగినా, కోచ్‌గా కొత్త బాధ్యతను తీసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రకాశ్ పడుకోణ్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చి దిద్దుతోంది. ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ ప్రకాశ్ ముందుచూపుకి ప్రతిరూపం. వేర్వేరు క్రీడాంశాల్లో ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి వారికి శిక్షణ, తగిన డైట్నివ్వడం, టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుగా ఆర్థిక సహకారాన్ని అందించడం.. ఇలా అన్ని రకాలుగా వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ తనదైన రీతిలో అండగా ఉంటోంది. బిలియర్డ్స్ స్టార్ గీత్ సేథీతో కలసి ప్రకాశ్ నెలకొల్పిన ఈ ఫౌండేషన్ ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసింది. ఆల్ ఇంగ్లండ్ ఘనత... బ్యాడ్మింటన్ లో అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్. 1899లోనే మొదలైన ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడం అంటే అతి పెద్ద ఘనత. ఆ సమయంలో వరల్డ్ చాంపియన్ షిప్‌తో పాటు దానికి సమాన హోదా ఉన్న టోర్నమెంట్ ఇది. యూరోపియన్ సర్క్యూట్లో వరుస విజయాలతో ప్రకాశ్ మంచి ఊపు మీదున్నాడు. కొన్నాళ్ల క్రితమే పెద్ద టోర్నీలు డానిష్ ఓపెన్ , స్వీడిష్ ఓపెన్ లలో అతను టైటిల్ కూడా దక్కించుకున్నాడు. 1980 ఆల్ ఇంగ్లండ్ టోర్నీ మొదలయ్యాక ఏకపక్ష విజయాలతో ఫైనల్ వరకు దూసుకొచ్చాడు. అప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఏ గేమ్‌లోనూ ప్రత్యర్థులు గరిష్ఠంగా 12 పాయింట్లకు మించి సాధించలేకపోయారంటే ప్రకాశ్ దూకుడు ఎలా సాగిందో అర్థమవుతుంది. 15–7, 15–12, 15–0, 15–10, 15–4, 15–4, 15–8, 15–10.. ఇవీ స్కోర్లు! ఫైనల్లో ఇండోనేసియాకు చెందిన లీమ్ స్వీ కింగ్ ఎదురయ్యాడు. ఆ సమయంలో అతను అత్యద్భుత ఫామ్‌లో ఉండి చెలరేగిపోతున్నాడు. ‘స్మాష్ కింగ్’గా గుర్తింపు తెచ్చుకొని అంతకు ముందు వరుసగా రెండేళ్లు ఇదే టోర్నీలో విజేతగా నిలిచాడు. దాంతో ప్రకాశ్‌కు కష్టమే అనిపించింది. అయితే భారత స్టార్ ఎక్కడా తొణకలేదు. ప్రత్యర్థి గుర్తింపును పట్టించుకోలేదు. అన్నేళ్లుగా యూరోప్‌లో ఆడిన తన అనుభవాన్ని రంగరించాడు. ఫలితంగా 15–3, 15–10 తేడాతో ఘన విజయం.. ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు. ‘నన్ను ప్రకాశ్ హిప్నటైజ్ చేసినట్లు అనిపించింది’ అంటూ ఓటమి తర్వాత స్వీకింగ్ చేసిన వ్యాఖ్య ఈ గెలుపు ప్రత్యేకతను మరింత పెంచింది. 1980 నుంచి ఇప్పటి వరకు పుల్లెల గోపీచంద్ (2001) మినహా మరే భారత షట్లర్ పురుషుల, మహిళల విభాగాల్లో ఈ టోర్నీ గెలుచుకోలేకపోయారు. -
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత్ సరికొత్త చరిత్ర
-
PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధుకు పద్మభూషణ్
-
పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవి సింధు..
PV Sindhu conferred with Padma Bhushan: భారత్ దేశంలో ఉన్నత పౌరసత్కారాలుగా భావించే పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఆట్టహాసంగా జరిగింది. 2020లో మొత్తంలో 119మందికి ఈ అవార్డలును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ కార్య క్రమంలో తెలుగుతేజం బ్యాడ్మంటిన్ స్టార్ షట్లర్ పీవి సింధు రాష్ట్రపతి చేతుల మీదగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గోన్నారు. చదవండి: Gautam Gambhir: త్వరలో భారత్‌కు టీ20 ప్రపంచకప్ తీసుకువస్తాడు -
ఆమె కత్తి మహా పదును.. ఏకంగా రూ.10 కోట్లు దాటింది
-
షట్లర్లకు ఐఓసీ పరీక్షలు
న్యూఢిల్లీ: ఆటలన్నీ అటకెక్కాయి. లాక్‌డౌనే ముందంజ (పొడిగింపు) వేస్తోంది. స్టేడియాలు మూతపడ్డాయి. రాకెట్స్ ఓ మూలన పడ్డాయి. ఆటగాళ్లు గడపదాటే పరిస్థితి లేదాయే! దీంతో క్రీడల కోటాలో ఉద్యోగాలిచ్చిన సంస్థలు తమ ఆటగాళ్లకు ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సంస్థ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ ఖాళీ సమయంలో ఆన్లైన్లో కోర్సు చదివి పరీక్షలు రాయాల్సిందిగా కోరింది. సైబర్ సెక్యూరిటీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మెయింటెనెన్స్ తదితర కోర్సులు చదివి (ఆన్లైన్లో) అసెస్మెంట్ పరీక్షలు రాయాలని సూచించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల డబుల్స్ కాంస్య పతక విజేత సిక్కి రెడ్డి, సింగిల్స్ ఆటగాడు పారుపల్లి కశ్యప్, డబుల్స్ ప్లేయర్ చిరాగ్ షెట్టి తదితరులు ఐఓసీ సూచించిన అసెస్మెంట్ టెస్టులు రాసే పనిలో పడ్డారు. దీనిపై తెలుగమ్మాయి సిక్కి రెడ్డి మాట్లాడుతూ ‘మాకు కొన్ని కోర్సులు చదివి ఆన్లైన్లో పరీక్షలు రాయాలని ఐఓసీ మెయిల్ చేసింది. నిజంగా ఈ కోర్సులు చాలా ఆసక్తిగా, ఉపయోగకరంగా ఉన్నాయి. రాకెట్‌తో కసరత్తు, ఫిట్నెస్ కోసం వార్మప్ చేసే నేను ఇప్పుడైతే కోర్సు పూర్తిచేసే పనిలో ఉన్నాను. ఈ నెల 4న కోర్సు మొదలుపెట్టాను. ఇందులో సుమారు 40 నుంచి 50 టాపిక్స్ ఉంటాయి. కొన్ని 15 నిమిషాల్లో పూర్తయితే మరికొన్నింటికి 45 నిమిషాలు పడుతుంది. ఆ వెంటే పరీక్షలు కూడా రాయాలి. ఇందులో పాస్ కావాలంటే 80 శాతం మార్కులు రావాలి’ అని వివరించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ మాట్లాడుతూ ‘ఈ కోర్సు మెటీరియల్ చదివి తీరాలన్నంతగా ఆసక్తిగా ఉంది. ఐఓసీ కంపెనీ చేసే ప్రాసెసింగ్‌పై మాకు అవగాహన కల్పించేలా ఉంది. ఇంధన వనరుల ఉత్పాదకత, దీనికోసం తీసుకునే భద్రత చర్యలు, పెట్రోల్ బంకుల నిర్వహణ తీరు తెలిసింది. ఈ కోర్సుల ఆలోచన చాలా మంచి నిర్ణయం. పూర్తిస్థాయి అథ్లెట్లమైన మాకు ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల తెలియని విషయాలు నేర్చుకునే వీలు దొరికింది’ అని అన్నాడు. చిరాగ్ షెట్టి కూడా కోర్సులోని పాఠ్యప్రణాళిక, ఆన్లైన్ పరీక్షలు చాలా బాగున్నాయని చెప్పాడు. మహ మ్మారి విలయతాండవంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అన్ని టోర్నీలను జూలై వరకు రద్దు చేసింది. -
గెలిస్తే నాకౌట్ దశకు
నానింగ్ (చైనా): క్వార్టర్ ఫైనల్ బెర్త్ తొలి లక్ష్యంగా సుదిర్మన్ కప్‌లో భారత జట్టు తమ పోరాటాన్ని ప్రారంభించనుంది. ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ అయిన సుదిర్మన్ కప్‌లో భారత్ రెండుసార్లు (2011, 2017లలో) క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అయితే ఆ రెండుసార్లు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. మంగళవారం జరిగే గ్రూప్–డి మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడనుంది. ఇదే గ్రూప్ తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో మలేసియా ఓడిపోయింది. ఫలితంగా నేడు మలేసియాపై భారత్ గెలిస్తే నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన చైనాపై భారత్ గెలవాల్సి ఉంటుంది. దిగ్గజ ఆటగాడు లీ చోంగ్ వీ లేకపోవడంతో మలేసియా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలి. అయితే భారత విజయావకాశాలు డబుల్స్ జోడీల ప్రదర్శనపై ఆధారపడి ఉంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ లేదా సమీర్ వర్మ, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు లేదా సైనా నెహ్వాల్ బరిలోకి దిగి విజయం సాధిస్తే భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్తుంది. ఆ తర్వాత పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటి నెగ్గినా విజయం ఖాయమవుతుంది. 13 మంది సభ్యులుగల భారత బృందానికి ఈసారి ఎనిమిదో సీడింగ్ లభించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మలేసియా జట్టుపై నెగ్గి భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా భారత్ చెలరేగితే ముందంజ వేయడం ఖాయం. మలేసియాతో మ్యాచ్ అనంతరం బుధవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో పదిసార్లు చాంపియన్ చైనాతో భారత్ ఆడుతుంది. భారత జట్టు: కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ (పురుషుల సింగిల్స్), పీవీ సింధు, సైనా నెహ్వాల్ (మహిళల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి, మను అత్రి, ప్రణవ్ చోప్రా (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, మేఘన, పూర్వీషా రామ్ (మహిళల డబుల్స్). -
తొలి ప్రేయసిని కలిశాను
బ్యాడ్మింటన్ కోర్టులోకి మళ్లీ దిగారు హీరో సుధీర్‌బాబు. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున, ధ్యాన్‌చంద్, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆయన అప్పట్లో డబుల్స్ విభాగంలో మ్యాచ్‌లు కూడా ఆడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పుల్లెల గోపీచంద్‌పై ఓ బయోపిక్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్‌లో లీడ్ రోల్ చేయనున్నారు సుధీర్‌బాబు. ఇందుకోసం ఆయన తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘తొలిప్రేమ ఎప్పటికీ జీవించే ఉంటుందని అంటుంటారు. నా తొలి ప్రేయసి బ్యాడ్మింటన్ గేమ్నే. గోపీచంద్ బయోపిక్ కోసం మళ్లీ సాధన మొదలుపెట్టాను’’ అని పేర్కొన్నారు సుధీర్ బాబు. ఈ బయోపిక్కు ‘చందమామ కథలు, పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ బయోపిక్ రెండు పార్టులుగా విడుదలవుతుందని టాక్. -
సిల్వర్ సింధు
భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మళ్లీ నిరాశ తప్పలేదు. మరో మెగా ఈవెంట్లో ఆమె ఫైనల్లో పరాజయం పాలై రజత పతకంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. గత రెండేళ్ల వ్యవధిలో రియో ఒలింపిక్స్, రెండు వరల్డ్ చాంపియన్‌షిప్‌లు, వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్, కామన్వెల్త్ గేమ్స్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో తుది పోరులో విజయాన్ని అందుకోలేకపోయిన సింధు ఇప్పుడు ఆసియా క్రీడల ఫైనల్లోనూ ఓడింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) 21–13, 21–16తో సింధును ఓడించింది. ఈ మ్యాచ్ 34 నిమిషాల్లోనే ముగిసింది. అయితే ఆసియా క్రీడల చరిత్రలో రజత పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. సెమీస్‌లో ఓడిన సైనా నెహ్వాల్ కాంస్యం సాధించడంతో ఏషియాడ్‌లో తొలిసారి వ్యక్తిగత విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఫైనల్‌కు ముందు తై జుతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు ఈ సారైనా ఫలితం మార్చాలని పట్టుదలగా శ్రమించినా ఫలితం లేకపోయింది. తొలి గేమ్‌లో 5–0తో ముందంజలో నిలిచిన తై జు అదే జోరులో 16 నిమిషాల్లో గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్ ఆరంభంలో 4–4తో స్కోరు సమంగా ఉన్నా... తైపీ అమ్మాయి దూకుడుగా ఆడుతూ 15–10తో విజయంవైపు దూసుకెళ్లి వెనుదిరిగి చూడలేదు. ‘నాకు, తై జుకు మధ్య ఆటలో అంతరం మరీ ఎక్కువగా ఏమీ లేదు. ఆమెను కచ్చితంగా ఓడించగలను. నేను మరింత బాగా సన్నద్ధమై, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే అది సాధ్యమే. మానసికంగా కూడా బాగానే ఉన్నాను. నేను కాస్త ఓపిగ్గా ఆడి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది. రజతంతో కూడా సంతృప్తి చెందాను’ అని పీవీ సింధు వ్యాఖ్యానించింది. సింధుకు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: రజతం నెగ్గిన తెలుగు తేజం పీవీ సింధుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాడు తండ్రి... నేడు కూతురు... పీవీ సింధు తండ్రి పీవీ రమణ ఖాతాలోనూ ఆసియా క్రీడల పతకం ఉంది. ఇప్పుడు సింధు రజతం సాధించగా... టీమ్ ఈవెంట్ వాలీబాల్‌లో రమణకు కాంస్యం దక్కింది. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టులో రమణ సభ్యులుగా ఉన్నారు. తండ్రీ కూతుళ్లిద్దరూ ఆసియా క్రీడల పతకాలు గెలుచుకోవడం, రెండు వేర్వేరు క్రీడాంశాలు కావడం విశేషం. -
షటిల్ ‘శ్రీ’మంతుడు...
నాలుగేళ్ల క్రితం శ్రీకాంత్ జీవితంలో అనూహ్య ఘటన! అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న శ్రీకాంత్ ఒక రోజు తన బాత్రూమ్లో అచేతనంగా కనిపించాడు. చాలా సేపటి వరకు దానిని ఎవరూ గుర్తించలేదు. కొద్ది సేపటి తర్వాత అకాడమీ ఉద్యోగులు గుర్తించి అతడిని దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అది ‘బ్రెయిన్ ఫీవర్’గా తేలింది. అతను కోలుకోవాలని కోచ్ గోపీచంద్, సహచరులు చేసిన ప్రార్థనలు ఫలించి శ్రీకాంత్ ఎట్టకేలకు మృత్యుముఖం నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని టోర్నీల్లో తీవ్రంగా ఇబ్బంది పడిన శ్రీకాంత్ మళ్లీ చెలరేగేందుకు సమయం పట్టింది. అయితే ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్‌గా ఎదగడం వరకు శ్రీకాంత్‌ది అద్భుత ప్రస్థానం. అప్పటి వరకు రెండు గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్స్ మాత్రమే గెలిచిన శ్రీకాంత్ అనంతరం మరింత వేగంగా దూసుకుపోయాడు. కఠోర శ్రమ, శిక్షణతో తనను తాను అత్యుత్తమంగా తీర్చి దిద్దుకున్నాడు. అదే ఏడాది (2014) నవంబర్‌లో ప్రతిష్టాత్మక చైనా ఓపెన్‌ను గెలుచుకోవడంతో శ్రీ జోరు మళ్లీ మొదలైంది. ఫైనల్లో దిగ్గజ ఆటగాడు లిన్ డాన్‌పై సాధించిన గెలుపు కొత్త శ్రీకాంత్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత అతను తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోయాడు. 2015లో ఇండియా ఓపెన్‌తో అతని ఖాతాలో రెండో సూపర్ సిరీస్ టైటిల్ చేరింది. తర్వాతి ఏడాది రియో ఒలింపిక్స్ సమయానికి మంచి ఫామ్‌లో ఉన్నా... క్వార్టర్ ఫైనల్లో లిన్ డాన్ చేతిలో ఓటమి శ్రీకాంత్‌కు పతకావకాశాలను దూరం చేసింది. అయితే మళ్లీ తన ఆటలో లోపాలు సరిదిద్దుకున్న శ్రీకాంత్... 2017లో విశ్వరూపం చూపించాడు. ఏకంగా ఐదు సూపర్ సిరీస్ టోర్నీలలో ఫైనల్ చేరి వాటిలో నాలుగింటిలో విజేతగా నిలిచి అరుదైన ఘనతను లిఖించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మైదానంలో శ్రీకాంత్ ప్రదర్శనకు కేంద్రం ‘పద్మశ్రీ’తో సత్కరిస్తే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ పదవినిచ్చి గౌరవించింది. ఇప్పుడు పాతికేళ్ల వయసులో వరల్డ్ నంబర్‌వన్‌గా శిఖరాన నిలిచిన ఈ గుంటూరు అబ్బాయి భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం. 2009లో శ్రీకాంత్ తొలిసారి నా వద్దకు వచ్చిన రోజు బాగా గుర్తుంది. అప్పటికే అతని అన్న నందగోపాల్ నా వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఖాళీగా తిరుగుతున్నాడు, ఇతడిని కూడా కాస్త దారిలో పెట్టమంటూ అతని తల్లిదండ్రులు నాతో చెప్పడంతో కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాను. అయితే ఆ సమయంలో దేనిపై కూడా ఆసక్తి చూపించకుండా, చాలా సోమరిగా కనిపించేవాడు. మెల్లమెల్లగా మారడం మొదలు పెట్టిన అనంతరం డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఆడసాగాడు. కొన్ని చక్కటి విజయాలు కూడా లభించాయి. ఆ సమయంలోనే అతని ప్రతిభను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాను. 2012 చివర్లో శ్రీకాంత్‌ను పూర్తిగా సింగిల్స్‌కు పరిమితమయ్యేలా ప్రోత్సహించాను. మంచి ఫలితాలు వస్తున్న సమయంలో డబుల్స్‌ను వదిలేందుకు ఇష్టపడని శ్రీకాంత్ కాస్త అలిగాడు కూడా. అయితే తనలో అసలు సత్తా ఏమిటో తెలుసుకున్న తర్వాత పట్టుదలగా ఆడి దూసుకుపోయాడు. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ చాలా గొప్ప ఘనత. శ్రీకాంత్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. పవర్, అటాకింగ్ శ్రీకాంత్‌కు అతి పెద్ద బలం. కోర్టులో బుర్రకు పదును పెట్టి ఆడటం మరో అదనపు లక్షణం. నంబర్‌వన్ అయ్యాక దానిని నిలబెట్టుకునే క్రమంలో అతనికి ఇతర స్టార్ ఆట గాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావడం ఖాయం. అయితే వీటన్నంటిని తట్టుకొని మంచి విజయాలు సాధిస్తాడని నమ్ముతున్నా. – పుల్లెల గోపీచంద్, భారత కోచ్ -
స్పోర్ట్స్ క్యాలండర్ 2018
కొత్త ఏడాదిలో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, మరికొన్ని కొత్త ఆశయాలు... ప్రపంచాన్ని గెలిచేందుకు, ప్రపంచానికి పరిచయమయ్యేందుకు మీ కోసమే అంటూ ఎన్నో వేదికలు, మరెన్నో ఆహ్వానాలు... క్రీడాకారులు అద్భుతాలు సృష్టించేందుకు ప్రతీ ఏడూ కొత్త రూపంలో అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి. గత పరాజయాలను మరచి విజయాల వైపు దూసుకెళ్లేవారు కొందరైతే, సాధించిన ఘనతలతో సరిపెట్టుకోకుండా ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేవారు మరికొందరు. అలాంటి క్షణాలను ఆస్వాదిస్తూ ఆటగాళ్ల గెలుపును తమ గెలుపుగా భావించే అభిమానులందరి కోసం కొత్త సంవత్సరం పసందైన క్రీడా సమరాలతో సిద్ధంగా ఉంది. క్రికెట్ మాత్రమేనా అనుకునే భారత అభిమానులు ఆనందించేందుకు అటు కామన్వెల్త్ క్రీడలు, ఇటు ఆసియా క్రీడల సంబరం......లోకం మరిచి ఊగిపోయేందుకు ఫుట్‌బాల్ ప్రపంచ కప్...అసలు విరామమే లేకుండా ఏడాది పొడవునా కొత్త బ్యాడ్మింటన్ షెడ్యూల్... ఎప్పటిలాగే టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్ గలగలలు... మనింటి ఆట హాకీలో మరోసారి ప్రపంచ కప్ ఆతిథ్యం... ఇవి మాత్రమే కాదు ప్రతీ సంవత్సరం ఒకసారి నేనున్నానంటూ వేర్వేరు క్రీడాంశాల్లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లు... 2018లోనూ స్పోర్ట్స్‌ను ఎంజాయ్ చేసేందుకు మీరు రెడీనా...! బ్యాడ్మింటన్ జనవరి 14: పీబీఎల్ ఫైనల్ (హైదరాబాద్) జనవరి 16–21: మలేసియా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 4; కౌలాలంపూర్) జనవరి 23–28: ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 4; జకార్తా) జనవరి 30–ఫిబ్రవరి 4: అఖిలేశ్ దాస్ గుప్తా ఇండియా ఓపెన్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 4; న్యూఢిల్లీ) ఫిబ్రవరి 6–11: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ (మలేసియా) ఫిబ్రవరి 20–25: స్విస్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; బాసెల్) మార్చి 6–11: జర్మన్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; ముల్హీమ్ యాండెరుర్) మార్చి 14–18: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 2; బర్మింగ్హమ్) ఏప్రిల్ 24–29: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (చైనా) మే 1–6: న్యూజిలాండ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; ఆక్లాండ్) మే 8–13: ఆస్ట్రేలియన్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5, సిడ్నీ) మే 20–27: థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ (గ్రేడ్ 1 టీమ్ చాంపియన్‌షిప్; బ్యాంకాక్) జూన్ 12–17: యూఎస్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; అనాహీమ్) జూన్ 26–జూలై 1: మలేసియా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3; కౌలాలంపూర్) జూలై 3–8: ఇండోనేసియా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 2; జకార్తా) జూలై 10–15: థాయ్‌లాండ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; బ్యాంకాక్) జూలై 17–22: సింగపూర్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; సింగపూర్) జూలై 30–ఆగస్టు 5: ప్రపంచ చాంపియన్‌షిప్ (గ్రేడ్ 1 వ్యక్తిగత చాంపియన్‌షిప్, చైనా) ఆగస్టు 28–సెప్టెంబరు 2: స్పానిష్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; గ్రనాడా) సెప్టెంబర్ 4–9: హైదరాబాద్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 6; హైదరాబాద్) సెప్టెంబర్ 11–16: జపాన్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3, టోక్యో) సెప్టెంబర్ 18–23: చైనా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 2; చాంగ్జూ) సెప్టెంబర్ 25–30: కొరియా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; సియోల్) అక్టోబర్ 2–7: చైనీస్ తైపీ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; తైపీ సిటీ) అక్టోబర్ 16–21: డెన్మార్క్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3; ఒడెన్స్) అక్టోబర్ 23–28: ఫ్రెంచ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3; పారిస్) అక్టోబర్ 30–నవంబర్ 4: మకావు ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; మకావు సిటీ) నవంబర్ 5–18: ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ (గ్రేడ్ 1 టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్; కెనడా) నవంబర్ 6–11: చైనా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 3; ఫుజూ) నవంబర్ 13–18: హాంకాంగ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; హాంకాంగ్) నవంబర్ 20–25: సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 5; లక్నో) నవంబర్ 27–డిసెంబర్ 2: కొరియా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 5; క్వాంగ్జు) టెన్నిస్ జనవరి 1–6: టాటా ఓపెన్ (పుణే) జనవరి 15–28: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మార్చి 8–18: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మార్చి 21–ఏప్రిల్ 1: మయామి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ ఏప్రిల్ 6–7: డేవిస్‌కప్ ఆసియా జోన్లో భారత్ రెండో రౌండ్ మ్యాచ్ ఏప్రిల్ 15–22: మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 6–13: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 13–20: రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 27–జూన్ 10: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జూలై 2–15: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆగస్టు 6–12: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆగస్టు 12–19: సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆగస్టు 27–సెప్టెంబర్ 9: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అక్టోబర్ 7–14: షాంఘై మాస్టర్స్ సిరీస్ టోర్నీ అక్టోబర్ 29–నవంబర్ 4: పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నవంబర్ 11–18: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ ఫార్ములావన్ మార్చి 25: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (మెల్బోర్న్) ఏప్రిల్ 8: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి (సాఖిర్) ఏప్రిల్ 15: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) ఏప్రిల్ 29: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి (బాకు) మే 13: స్పెయిన్ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) మే 27: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) జూన్ 10: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్) జూన్ 24: ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి (లె కాస్టెలెట్) జూలై 1: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి (స్పీల్బెర్గ్) జూలై 8: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్) జూలై 22: జర్మనీ గ్రాండ్‌ప్రి (హాకెన్‌హీమ్) జూలై 29: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్) ఆగస్టు 26: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్పా ఫ్రాంకోర్చాంప్స్) సెప్టెంబర్ 2: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) సెప్టెంబర్ 16: సింగపూర్ గ్రాండ్‌ప్రి (మరీనా బే) సెప్టెంబర్ 30: రష్యా గ్రాండ్‌ప్రి (సోచి) అక్టోబర్ 7: జపాన్ గ్రాండ్‌ప్రి (సుజుకా) అక్టోబర్ 21: యూఎస్ గ్రాండ్‌ప్రి (ఆస్టిన్) అక్టోబర్ 28: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) నవంబర్ 11: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి (సావోపాలో) నవంబర్ 25: అబుదాబి గ్రాండ్‌ప్రి (యాస్ మరీనా) చెస్ మార్చి 10–28: క్యాండిడేట్స్ టోర్నమెంట్ (బెర్లిన్) ఏప్రిల్ 1–10: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (చైనా) మే 25–జూన్ 3: ఆసియా జూనియర్ చాంపి యన్షిప్ (మంగోలియా) సెప్టెంబర్ 4–16: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ (టర్కీ) సెప్టెంబర్ 23–అక్టోబర్ 6: వరల్డ్ చెస్ ఒలింపియాడ్ (బాతూమి, జార్జియా) అక్టోబర్ 19–నవంబర్ 1: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (గ్రీస్) నవంబరు 2–12: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (ఫిలిప్పీన్స్) నవంబరు 9–28: వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ (లండన్) నవంబరు 24–డిసెంబరు 3: వరల్డ్ యూత్ చెస్ ఒలింపియాడ్ (టర్కీ) ఆర్చరీ మార్చి 2–9: ఆసియా కప్ (థాయ్‌లాండ్) ఏప్రిల్ 23–29: వరల్డ్ కప్ స్టేజ్–1 (చైనా) మే 21–26: వరల్డ్ కప్ స్టేజ్–2 (టర్కీ) జూన్ 19–24: వరల్డ్ కప్ స్టేజ్–3 (అమెరికా) జూలై 17–22: వరల్డ్ కప్ స్టేజ్–4 (జర్మనీ) అథ్లెటిక్స్ మార్చి 2–4: వరల్డ్ ఇండోర్ చాంపియన్‌షిప్ (బర్మింగ్హమ్) ఏప్రిల్ 16: బోస్టన్ మారథాన్ ఏప్రిల్ 22: లండన్ మారథాన్ మే 4: డైమండ్ లీగ్ మీట్–1 (దోహా) మే 12: డైమండ్ లీగ్ మీట్–2 (షాంఘై) మే 26: డైమండ్ లీగ్ మీట్–3 (యూజిన్, అమెరికా) మే 31: డైమండ్ లీగ్ మీట్–4 (రోమ్) జూన్ 7: డైమండ్ లీగ్ మీట్–5 (ఓస్లో) జూన్ 10: డైమండ్ లీగ్ మీట్–6 (స్టాక్‌హోమ్) జూన్ 30: డైమండ్ లీగ్ మీట్–7 (పారిస్) జూలై 5: డైమండ్ లీగ్ మీట్–8 (లుజానే) జూలై 13: డైమండ్ లీగ్ మీట్–9 (రాబట్, మొరాకో) జూలై 20: డైమండ్ లీగ్ మీట్–10 (మొనాకో) జూలై 21–22: డైమండ్ లీగ్ మీట్–11 (లండన్) ఆగస్టు 18: డైమండ్ లీగ్ మీట్–12 (బర్మింగ్హమ్) ఆగస్టు 30: డైమండ్ లీగ్ మీట్–13 (జ్యూరిక్) ఆగస్టు 31: డైమండ్ లీగ్ మీట్–14 (బ్రస్సెల్స్) హాకీ జూన్ 23–జూలై 1: పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (అమ్‌స్టర్‌డామ్) జూలై 21–ఆగస్టు 5: మహిళల ప్రపంచకప్ (లండన్) నవంబర్ 17–25: మహిళల చాంపియన్స్ ట్రోఫీ (చైనా) నవంబర్ 28–డిసెంబర్ 16: పురుషుల ప్రపంచకప్ (భువనేశ్వర్) రెజ్లింగ్ ఫిబ్రవరి 27–మార్చి 4: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (కిర్గిస్తాన్) జూలై 17–22: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ) సెప్టెంబర్ 17–23: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (స్లొవేకియా) అక్టోబర్ 20–28: ప్రపంచ సీనియర్ చాంపియన్ షిప్ (హంగేరి) నవంబర్ 12–18: ప్రపంచ అండర్–23 చాంపియన్ షిప్ (రొమేనియా) వెయిట్‌లిఫ్టింగ్ ఏప్రిల్ 20–30: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (ఉజ్బెకిస్తాన్) జూలై 6–14: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఉజ్బెకిస్తాన్) నవంబర్ 24–డిసెంబర్ 3: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (తుర్క్మెనిస్తాన్) టేబుల్ టెన్నిస్ ఏప్రిల్ 6–8: ఆసియా కప్ (జపాన్) ఏప్రిల్ 29–మే 6: వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (జర్మనీ) డిసెంబర్ 2–9: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఆస్ట్రేలియా) షూటింగ్ మార్చి 1–13: వరల్డ్ కప్–1 (రైఫిల్, పిస్టల్, షాట్‌గన్; మెక్సికో) ఏప్రిల్ 20–30: వరల్డ్ కప్–2 (రైఫిల్, పిస్టల్, షాట్‌గన్; కొరియా) మే 22–29: వరల్డ్ కప్–3 (రైఫిల్, పిస్టల్; జర్మనీ) జూన్ 5–15: వరల్డ్ కప్–4 (షాట్‌గన్; మాల్టా) జూలై 9–19: వరల్డ్ కప్–5 (షాట్‌గన్; అమెరికా) ఆగస్టు 31–సెప్టెంబర్ 15: ప్రపంచ చాంపియన్‌షిప్ (కొరియా). కామన్వెల్త్ క్రీడలు ఏప్రిల్ 4–15 గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా ఆసియా క్రీడలు ఆగస్టు 18–సెప్టెంబర్ 2 జకార్తా, ఇండోనేసియా ప్రపంచకప్ ఫుట్‌బాల్ జూన్ 14–జూలై 15 మాస్కో, రష్యా యూత్ ఒలింపిక్స్ అక్టోబర్ 6–18 బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా. -
కోచ్ హండోయో కొనసాగుతాడు: బాయ్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ పదవి నుంచి ముల్యో హండోయో తప్పుకోనున్నట్లు వచ్చిన వార్తలను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తోసిపుచ్చింది. ‘హండోయో సెలవులకు స్వదేశమైన ఇండోనేసియాకు వెళ్లాడు. కోచ్‌గా వైదొలగనున్నట్లు అతడి నుంచి మాకెలాంటి సమాచారం లేదు. బహుశా ఇది వదంతి కావొచ్చు’ అని బాయ్ కార్యదర్శి, అధికార ప్రతినిధి అనూప్ నారంగ్ పేర్కొన్నారు. అయితే... భారత కోచ్‌గా కొనసాగడంపై హండోయో భార్య, కుమారుడితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పారితోషికంపైనా సంతృప్తిగా లేడని సమాచారం. ఇదే సమయంలో సింగపూర్ నుంచి అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ‘బాయ్’తో హండోయో మూడేళ్ల ఒప్పందం 2020 వరకు ఉంది. సింగిల్స్ కోచ్‌గా సుదీర్ఘ శిక్షణా పద్ధతులను ప్రవేశపెట్టి ఆటగాళ్ల శారీరక దృఢత్వం మెరుగుపడటంలో కీలక పాత్ర పోషించాడు. దీని ఫలితమే పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌లు అద్భుత ప్రదర్శనలు చేయగలిగారు. గతంలో ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన ఇండోనేసియా బ్యాడ్మింటన్ దిగ్గజం తౌఫీక్ హిదాయత్‌కు కూడా హండోయో కోచ్‌గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ విజయం గువాహటి: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్త జట్టు అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ జట్టు శుభారంభం చేసింది. నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ 4–3తో గెలిచింది. అహ్మదాబాద్ తరఫున పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ 15–10, 15–7తో ప్రతుల్ జోషిపై, హెచ్ఎస్ ప్రణయ్ 15–10, 15–14తో జు వీ వాంగ్‌పై... మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ 15–6, 15–10తో మిచెల్లి లీపై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ మ్యాచ్‌ల్లో అహ్మదాబాద్‌కు ఓటమి ఎదురైంది. -
సంపాదనలో అగ్రరాజు మనోడే!
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది నాలుగు సూపర్ టైటిళ్లు అందుకున్న ఈ గుంటూరు మిర్చి (230,423 యూఎస్‌డాలర్లు) 1.54 కోట్ల రూపాయలతో ఓవరాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సంపాదన లిస్టులో అగ్రస్థానం సంపాదించాడు. ఇంకొద్దిరోజుల్లోనే నెం.1 ర్యాంకు అందుకునే అవకాశమున్న ఈ నెం.2 ర్యాంకర్ మిగతా పురుషుల షట్లర్ల కన్నా అధికంగా ఆర్జిస్తున్నాడు. ఈ ఏడాది గెలిచిన నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్ల ప్రైజ్‌మనీ సంపాదనలో శ్రీకాంత్‌ను నెం.1గా నిలబెట్టాయి. తరువాతి స్థానంలో ఉన్న మలేషియా ప్లేయర్ లీ చాంగ్ వెయ్ కన్నా శ్రీకాంత్ సంపాదన మూడు రెట్లు అధికంగా ఉండటం విశేషం. ఈ మాజీ నెం.1 ర్యాంకర్ లీ చాంగ్ ఇంగ్లండ్ టైటిల్, రెండు సూపర్ సిరీస్‌ల్లో రన్నరప్‌గా 86,275 యూఎస్ డాలర్లు( రూ.56 లక్షలు) ఆర్జించాడు. ఇక ఉమెన్ షట్లర్స్ తై జూ యింగ్, పీవీ సింధూల కన్న శ్రీకాంత్ సంపాదనే ఎక్కువగా ఉండటం మరో విశేషం. కలలో కూడా ఉహించలేదు: గోపిచంద్ శ్రీకాంత్ ఘనతపై కోచ్ పుల్లెల గోపిచంద్ స్పందిస్తూ.. ‘మంచి రోజులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. శ్రీకాంత్ సాధించింది ఓ అద్భుతమైన ఘనత. ఓ భారత్ షట్లర్ సంపాదనలో నెం.1గా నిలుస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ శ్రీకాంత్ ఈ ఘనత సాధించి ఆశ్చర్యానికి గురిచేశాడు. -
సిల్వర్ సింధుకు జేజేలు
విజయవాడ స్పోర్ట్స్ : ‘బేటీ బచావో,...బేటీ పడావో మాత్రమే కాదు... ‘బేటీ ఖేలావో’ (ఆడపిల్లల్ని ఆడించండి) అంటూ రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో తన అసమాన ప్రతిభాపాటవాలతో రజత పతక విజేతగా నిలిచిన ‘సింధు’ ఒక క్రీడా నాగరికతగా చాటిచెప్పిందని రాజధాని అమరావతి ప్రజలు కీర్తించారు. రియో ఒలింపిక్స్‌లో శుక్రవారం నిర్వహించిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌ను నగర ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. నగరంలో దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం, ట్రెండ్‌సెట్, పీవీఆర్ మాల్, విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, పుష్కరఘాట్లు, విజయవాడ క్లబ్, టీస్టాల్స్ ఇలా దాదాపు అన్ని చోట్ల టీవీలోప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. మొదటి సెట్లో సింధు విజేతగా నిలవడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువిరిసింది. తరువాత రెండు సెట్లను సీనియర్ క్రీడాకారిణిగా, వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న రెండు సార్లు ఒలింపియన్ పతక విజేతగా కరోలినా మారిన్ విజయం సాధించింది. అయినా కూడా సింధుకు అభిమానులు నీరాజనాలు పలికారు. ‘సింధు, సింధు గో గోల్డ్’ అంటూ చేసిన నినాదాలు మార్మోగాయి. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా తెలుగుతేజానికి జేజేలు పలికారు. నగర ప్రేక్షకుల మాదిరిగానే ఎంతో ఉత్కంఠతతో ్రçపభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలోని ఎల్ఐసీ కాలనీలో సింధు మేనత్తలు శ్రీలక్ష్మి, ప్రసన్న, దుర్గాదేవితో పాటు వారి కుటుంబ సభ్యలంతా టీవీలో లైవ్ మ్యాచ్‌ను వీక్షించారు. సోదరుడు రమణ తండ్రికి తగ్గ తనయిగా వారు అభివర్ణించారు. స్వర్ణపతకం చేజారినా కూడా ఒకింత నిరాశ చెందినా సింధు చూపిన సత్తాకు రజత పతకం కూడా గొప్పదే అని సంతోషం వ్యక్తం చేశారు. సింధుకు చాలా భవిష్యత్తు ఉందని కనీసం మరో రెండు ఒలింపిక్స్‌లో సింధునే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మేనత్తలు ఆకాంక్షించారు. చిన్నారుల ర్యాలీ.. సింధు స్వర్ణపతకం సాధించాలని కోరుతూ దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ చిన్నారులు బందరు రోడ్డు నుంచి సీఎం క్యాంపు ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించింది. ర్యాలీలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.పట్టాభిరామ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్.రామ్మోహన్, డాక్టర్ ఇ.త్రిమూరి,్త క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కేరింతల మధ్య ఫైనల్ మ్యాచ్‌ను తిలకించారు. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. క్రీడా సంఘాల అభినందల వెల్లువ రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి కొత్త రికార్డు సృష్టించిన పీవీ సింధుకు క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో శాప్ వీసీ అండ్ ఎండీ జి.రేఖారాణి, ఓఎస్డీ పి.రామకృష్ణ, ఎంబీ సిరాజుద్దీన్, ఏపీ ఆర్చరీ అసోసియేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శులు చెరుకూరి సత్యనారాయణ, ఆకుల రాఘవేంద్రరావు, కేపీరావు, టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రంభా ప్రసాద్, త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి ఇ.సులోచన, అర్జా పాండు రంగారావు ఉన్నారు. బస్టాండ్‌లో ఉత్కంఠ వీక్షణం విజయవాడ(బస్‌స్టేçÙన్) : బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన సింధు ఆటను వీక్షించేందుకు పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రెండు భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించారు. భారత్‌కు రెండో పతకం రావడంతో కేరింతలతో అభినందనలు తెలిపారు.