కొత్త ఏడాదిలో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, మరికొన్ని కొత్త ఆశయాలు... ప్రపంచాన్ని గెలిచేందుకు, ప్రపంచానికి పరిచయమయ్యేందుకు మీ కోసమే అంటూ ఎన్నో వేదికలు, మరెన్నో ఆహ్వానాలు... క్రీడాకారులు అద్భుతాలు సృష్టించేందుకు ప్రతీ ఏడూ కొత్త రూపంలో అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి. గత పరాజయాలను మరచి విజయాల వైపు దూసుకెళ్లేవారు కొందరైతే, సాధించిన ఘనతలతో సరిపెట్టుకోకుండా ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేవారు మరికొందరు. అలాంటి క్షణాలను ఆస్వాదిస్తూ ఆటగాళ్ల గెలుపును తమ గెలుపుగా భావించే అభిమానులందరి కోసం కొత్త సంవత్సరం పసందైన క్రీడా సమరాలతో సిద్ధంగా ఉంది.
క్రికెట్ మాత్రమేనా అనుకునే భారత అభిమానులు ఆనందించేందుకు అటు కామన్వెల్త్ క్రీడలు, ఇటు ఆసియా క్రీడల సంబరం......లోకం మరిచి ఊగిపోయేందుకు ఫుట్‌బాల్ ప్రపంచ కప్...అసలు విరామమే లేకుండా ఏడాది పొడవునా కొత్త బ్యాడ్మింటన్ షెడ్యూల్... ఎప్పటిలాగే టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్ గలగలలు... మనింటి ఆట హాకీలో మరోసారి ప్రపంచ కప్ ఆతిథ్యం... ఇవి మాత్రమే కాదు ప్రతీ సంవత్సరం ఒకసారి నేనున్నానంటూ వేర్వేరు క్రీడాంశాల్లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లు... 2018లోనూ స్పోర్ట్స్‌ను ఎంజాయ్ చేసేందుకు మీరు రెడీనా...!
బ్యాడ్మింటన్
జనవరి 14: పీబీఎల్ ఫైనల్ (హైదరాబాద్)
జనవరి 16–21: మలేసియా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 4; కౌలాలంపూర్)
జనవరి 23–28: ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 4; జకార్తా)
జనవరి 30–ఫిబ్రవరి 4: అఖిలేశ్ దాస్ గుప్తా ఇండియా ఓపెన్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 4; న్యూఢిల్లీ)
ఫిబ్రవరి 6–11: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ (మలేసియా)
ఫిబ్రవరి 20–25: స్విస్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; బాసెల్)
మార్చి 6–11: జర్మన్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; ముల్హీమ్ యాండెరుర్)
మార్చి 14–18: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 2; బర్మింగ్‌హమ్)
ఏప్రిల్ 24–29: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (చైనా)
మే 1–6: న్యూజిలాండ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; ఆక్లాండ్)
మే 8–13: ఆస్ట్రేలియన్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5, సిడ్నీ)
మే 20–27: థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ (గ్రేడ్ 1 టీమ్ చాంపియన్‌షిప్; బ్యాంకాక్)
జూన్ 12–17: యూఎస్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; అనాహీమ్)
జూన్ 26–జూలై 1: మలేసియా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3; కౌలాలంపూర్)
జూలై 3–8: ఇండోనేసియా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 2; జకార్తా)
జూలై 10–15: థాయ్‌లాండ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; బ్యాంకాక్)
జూలై 17–22: సింగపూర్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; సింగపూర్)
జూలై 30–ఆగస్టు 5: ప్రపంచ చాంపియన్‌షిప్ (గ్రేడ్ 1 వ్యక్తిగత చాంపియన్‌షిప్, చైనా)
ఆగస్టు 28–సెప్టెంబరు 2: స్పానిష్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; గ్రనాడా)
సెప్టెంబర్ 4–9: హైదరాబాద్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 6; హైదరాబాద్)
సెప్టెంబర్ 11–16: జపాన్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3, టోక్యో)
సెప్టెంబర్ 18–23: చైనా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 2; చాంగ్‌జూ)
సెప్టెంబర్ 25–30: కొరియా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; సియోల్)
అక్టోబర్ 2–7: చైనీస్ తైపీ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; తైపీ సిటీ)
అక్టోబర్ 16–21: డెన్మార్క్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3; ఒడెన్స్)
అక్టోబర్ 23–28: ఫ్రెంచ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3; పారిస్)
అక్టోబర్ 30–నవంబర్ 4: మకావు ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; మకావు సిటీ)
నవంబర్ 5–18: ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ (గ్రేడ్ 1 టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్; కెనడా)
నవంబర్ 6–11: చైనా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 3; ఫుజూ)
నవంబర్ 13–18: హాంకాంగ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; హాంకాంగ్)
నవంబర్ 20–25: సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 5; లక్నో)
నవంబర్ 27–డిసెంబర్ 2: కొరియా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 5; క్వాంగ్‌జు)
టెన్నిస్
జనవరి 1–6: టాటా ఓపెన్ (పుణే)
జనవరి 15–28: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
మార్చి 8–18: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
మార్చి 21–ఏప్రిల్ 1: మయామి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ
ఏప్రిల్ 6–7: డేవిస్‌కప్ ఆసియా జోన్‌లో భారత్ రెండో రౌండ్ మ్యాచ్
ఏప్రిల్ 15–22: మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ
మే 6–13: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
మే 13–20: రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
మే 27–జూన్ 10: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
జూలై 2–15: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
ఆగస్టు 6–12: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
ఆగస్టు 12–19: సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టోర్నీ
ఆగస్టు 27–సెప్టెంబర్ 9: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
అక్టోబర్ 7–14: షాంఘై మాస్టర్స్ సిరీస్ టోర్నీ
అక్టోబర్ 29–నవంబర్ 4: పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
నవంబర్ 11–18: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ
ఫార్ములావన్
మార్చి 25: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (మెల్‌బోర్న్)
ఏప్రిల్ 8: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి (సాఖిర్)
ఏప్రిల్ 15: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై)
ఏప్రిల్ 29: అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి (బాకు)
మే 13: స్పెయిన్ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా)
మే 27: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో)
జూన్ 10: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్)
జూన్ 24: ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి (లె కాస్టెలెట్)
జూలై 1: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి (స్పీల్‌బెర్గ్)
జూలై 8: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్)
జూలై 22: జర్మనీ గ్రాండ్‌ప్రి (హాకెన్‌హీమ్)
జూలై 29: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్)
ఆగస్టు 26: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్పా ఫ్రాంకోర్‌చాంప్స్)
సెప్టెంబర్ 2: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా)
సెప్టెంబర్ 16: సింగపూర్ గ్రాండ్‌ప్రి (మరీనా బే)
సెప్టెంబర్ 30: రష్యా గ్రాండ్‌ప్రి (సోచి)
అక్టోబర్ 7: జపాన్ గ్రాండ్‌ప్రి (సుజుకా)
అక్టోబర్ 21: యూఎస్ గ్రాండ్‌ప్రి (ఆస్టిన్)
అక్టోబర్ 28: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ)
నవంబర్ 11: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి (సావోపాలో)
నవంబర్ 25: అబుదాబి గ్రాండ్‌ప్రి (యాస్ మరీనా)
చెస్
మార్చి 10–28: క్యాండిడేట్స్ టోర్నమెంట్ (బెర్లిన్)
ఏప్రిల్ 1–10: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (చైనా)
మే 25–జూన్ 3: ఆసియా జూనియర్ చాంపి యన్‌షిప్ (మంగోలియా)
సెప్టెంబర్ 4–16: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ (టర్కీ)
సెప్టెంబర్ 23–అక్టోబర్ 6: వరల్డ్ చెస్ ఒలింపియాడ్ (బాతూమి, జార్జియా)
అక్టోబర్ 19–నవంబర్ 1: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (గ్రీస్)
నవంబరు 2–12: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (ఫిలిప్పీన్స్)
నవంబరు 9–28: వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ (లండన్)
నవంబరు 24–డిసెంబరు 3: వరల్డ్ యూత్ చెస్ ఒలింపియాడ్ (టర్కీ)
ఆర్చరీ
మార్చి 2–9: ఆసియా కప్ (థాయ్‌లాండ్)
ఏప్రిల్ 23–29: వరల్డ్ కప్ స్టేజ్–1 (చైనా)
మే 21–26: వరల్డ్ కప్ స్టేజ్–2 (టర్కీ)
జూన్ 19–24: వరల్డ్ కప్ స్టేజ్–3 (అమెరికా)
జూలై 17–22: వరల్డ్ కప్ స్టేజ్–4 (జర్మనీ)
అథ్లెటిక్స్
మార్చి 2–4: వరల్డ్ ఇండోర్ చాంపియన్‌షిప్ (బర్మింగ్‌హమ్)
ఏప్రిల్ 16: బోస్టన్ మారథాన్
ఏప్రిల్ 22: లండన్ మారథాన్
మే 4: డైమండ్ లీగ్ మీట్–1 (దోహా)
మే 12: డైమండ్ లీగ్ మీట్–2 (షాంఘై)
మే 26: డైమండ్ లీగ్ మీట్–3 (యూజిన్, అమెరికా)
మే 31: డైమండ్ లీగ్ మీట్–4 (రోమ్)
జూన్ 7: డైమండ్ లీగ్ మీట్–5 (ఓస్లో)
జూన్ 10: డైమండ్ లీగ్ మీట్–6 (స్టాక్‌హోమ్)
జూన్ 30: డైమండ్ లీగ్ మీట్–7 (పారిస్)
జూలై 5: డైమండ్ లీగ్ మీట్–8 (లుజానే)
జూలై 13: డైమండ్ లీగ్ మీట్–9 (రాబట్, మొరాకో)
జూలై 20: డైమండ్ లీగ్ మీట్–10 (మొనాకో)
జూలై 21–22: డైమండ్ లీగ్ మీట్–11 (లండన్)
ఆగస్టు 18: డైమండ్ లీగ్ మీట్–12 (బర్మింగ్‌హమ్)
ఆగస్టు 30: డైమండ్ లీగ్ మీట్–13 (జ్యూరిక్)
ఆగస్టు 31: డైమండ్ లీగ్ మీట్–14 (బ్రస్సెల్స్)
హాకీ
జూన్ 23–జూలై 1: పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (అమ్‌స్టర్‌డామ్)
జూలై 21–ఆగస్టు 5: మహిళల ప్రపంచకప్ (లండన్)
నవంబర్ 17–25: మహిళల చాంపియన్స్ ట్రోఫీ (చైనా)
నవంబర్ 28–డిసెంబర్ 16: పురుషుల ప్రపంచకప్ (భువనేశ్వర్)
రెజ్లింగ్
ఫిబ్రవరి 27–మార్చి 4: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (కిర్గిస్తాన్)
జూలై 17–22: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ)
సెప్టెంబర్ 17–23: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (స్లొవేకియా)
అక్టోబర్ 20–28: ప్రపంచ సీనియర్ చాంపియన్ షిప్ (హంగేరి)
నవంబర్ 12–18: ప్రపంచ అండర్–23 చాంపియన్ షిప్ (రొమేనియా)
వెయిట్‌లిఫ్టింగ్
ఏప్రిల్ 20–30: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (ఉజ్బెకిస్తాన్)
జూలై 6–14: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఉజ్బెకిస్తాన్)
నవంబర్ 24–డిసెంబర్ 3: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (తుర్క్‌మెనిస్తాన్)
టేబుల్ టెన్నిస్
ఏప్రిల్ 6–8: ఆసియా కప్ (జపాన్)
ఏప్రిల్ 29–మే 6: వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (జర్మనీ)
డిసెంబర్ 2–9: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఆస్ట్రేలియా)
షూటింగ్
మార్చి 1–13: వరల్డ్ కప్–1 (రైఫిల్, పిస్టల్, షాట్‌గన్; మెక్సికో)
ఏప్రిల్ 20–30: వరల్డ్ కప్–2 (రైఫిల్, పిస్టల్, షాట్‌గన్; కొరియా)
మే 22–29: వరల్డ్ కప్–3 (రైఫిల్, పిస్టల్; జర్మనీ)
జూన్ 5–15: వరల్డ్ కప్–4 (షాట్‌గన్; మాల్టా)
జూలై 9–19: వరల్డ్ కప్–5 (షాట్‌గన్; అమెరికా)
ఆగస్టు 31–సెప్టెంబర్ 15: ప్రపంచ చాంపియన్‌షిప్ (కొరియా).
కామన్వెల్త్ క్రీడలు
ఏప్రిల్ 4–15 గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా
ఆసియా క్రీడలు
ఆగస్టు 18–సెప్టెంబర్ 2
జకార్తా, ఇండోనేసియా
ప్రపంచకప్ ఫుట్‌బాల్
జూన్ 14–జూలై 15 మాస్కో, రష్యా
యూత్ ఒలింపిక్స్
అక్టోబర్ 6–18 బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా.
స్పోర్ట్స్ క్యాలండర్ 2018
Published Mon, Jan 1 2018 3:52 AM | Last Updated on Mon, Jan 1 2018 3:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment