TT
-
శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు ఆటగాళ్ల నిరాకరణ
లాక్డౌన్ కాలంలో శిక్షణను పునరుద్ధరించేందుకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా జూన్ చివర్లో శిక్షణా శిబిరం నిర్వహించేందుకు సమాఖ్య సిద్ధం కాగా, మరోసారి ఆటగాళ్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సురక్షితం కాని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణించేందుకు తాము సిద్ధంగా లేమని భారత స్టార్ ప్లేయర్లు శరత్ కమల్, జి.సత్యన్ పునరుద్ఘాటించారు. లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో భారత 16 మంది మేటి క్రీడాకారులను జూన్ మొదటి వారంలో శిక్షణ కోసం ఢిల్లీ, సోనేపట్, పాటియాలా కేంద్రాల్లో ఏదైనా ఒక వేదిక వద్దకు రావాల్సిందిగా సమాఖ్య గతంలోనే ఆటగాళ్లను కోరింది. అయితే ఆంక్షల నేపథ్యంలో ప్రయాణం చేసేందుకు ఆటగాళ్లు నిరాకరించారు. ప్రస్తుతం శిబిరాన్ని జూన్ చివరికి పొడిగించినా ప్లేయర్లు ముందుకు రావడం లేదు. ‘కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి చక్కబడే వరకు ఇంటి నుంచే ప్రాక్టీస్ చేయడం మంచిది. శిబిరాల నిర్వహణ జూలైలో ప్రారంభిస్తే బాగుంటుంది’ అని శరత్ కమల్ అన్నాడు. సత్యన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ సూచనల ప్రకారమే ఆటగాళ్లను ఒక్క చోట చేర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్న టీటీఎఫ్ఐ కార్యదర్శి ఎంపీ సింగ్... ప్యాడ్లర్ల నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. -
సుతీర్థ ముఖర్జీ ‘డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో హరియాణా క్రీడాకారిణి సుతీర్థ ముఖర్జీ సత్తా చాటింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోరీ్నలో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి ఆమె రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో హర్మీత్ దేశాయ్ (పీఎస్‌పీబీ) చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ (హరియాణా) 11–4, 11–5, 11–8, 11–4తో క్రితిక సిన్హా రాయ్ (పీఎస్‌పీబీ)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో హర్మీత్ దేశాయ్ 11–4, 11–13, 14–12, 9–11, 11–8, 5–11, 11–5తో మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ)ని ఓడించాడు. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మానవ్ ఠక్కర్ 11–9, 16–14, 7–11, 15–13, 6–11, 11–9తో జి. సత్యన్ (పీఎస్‌పీబీ)పై, హరీ్మత్ దేశాయ్ 11–9, 11–7, 11–4, 8–11, 14–12తో సౌమ్యజిత్ ఘోష్ (హరియాణా)పై గెలుపొందారు. సెమీస్‌లో ఓడిన సత్యన్, సౌమ్యజిత్‌లకు కాంస్యాలు లభించాయి. మహిళల సింగిల్స్ సెమీస్‌లో సుతీర్థ 12–10, 8–11, 11–9, 11–5, 11–5తో ఐహిక ముఖర్జీ (ఆర్బీఐ)ని, క్రితిక సిన్హా రాయ్ 11–9, 11–6, 15–13, 11–7తో అంకిత దాస్ (బెంగాల్)ని ఓడించారు. సెమీస్‌లో ఓడిన ఐహిక, అంకిత దాస్ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల డబుల్స్ ఫైనల్లో సుతీర్థ–రితి శంకర్ (హరియాణా) ద్వయం 11–7, 11–7, 8–11, 11–8తో సురభి పటా్వరీ–పోమంతీ బైస్యా (బెంగాల్) జోడీపై గెలుపొందగా... పురుషుల డబుల్స్ తుదిపోరులో జుబిన్ కుమార్–సౌమ్యజిత్ ఘోష్ (హరియాణా) జంట 11–7, 8–11, 11–3, 11–7తో మనుశ్ షా–ఇషాన్ హింగోరాణి (గుజరాత్) జోడీని ఓడించి చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకున్నాయి. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రోనిత్ భాంజా–మౌసుమీ పాల్ (బెంగాల్) 15–13, 8–11, 12–10, 13–11తో సౌరవ్ సాహా–సుతీర్థ ముఖర్జీ (హరియాణా) జంటపై నెగ్గింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్ఐ) కార్యదర్శి ఎంపీ సింగ్, తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం (టీఎస్‌టీటీఏ) అధ్యక్షులు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి పి. ప్రకాశ్ రాజు పాల్గొన్నారు. -
తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు కాంస్యాన్ని సాధించింది. సరూర్‌నగర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది. బుధవారం సెమీస్ మ్యాచ్‌లో పీఎస్‌పీబీ 3–0తో తెలంగాణపై గెలుపొందింది. మొదట మ్యాచ్‌లో శరత్ కమల్ (పీఎస్‌పీబీ) 3–1తో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (తెలంగాణ)పై, రెండో మ్యాచ్‌లో సతియాన్ (పీఎస్‌పీబీ) 3–0తో అమన్‌పై, హర్మీత్ దేశాయ్ (పీఎస్‌పీబీ) 3–0తో మొహమ్మద్ అలీపై గెలుపొందడంతో పీఎస్‌పీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు క్వార్టర్స్ మ్యాచ్‌లో తెలంగాణ 3–1తో తమిళనాడు జట్టుపై గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్‌లో స్నేహిత్ (తెలంగాణ) 3–0తో ప్రభాకరన్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో మొహమ్మద్ అలీ (తెలంగాణ) 1–3తో నితిన్ చేతిలో ఓడిపోయాడు. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అమన్ (తెలంగాణ) 3–2తో నిఖిల్‌పై, స్నేహిత్ 3–1తో నితిన్‌పై గెలుపొంది జట్టుకు విజయాన్నందించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకం సాధించిన తెలంగాణ పురుషుల జట్టును తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి అభినందించారు. -
విజేతలు మనోహర్ కుమార్, నటరాజ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: వెటరన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో బి. మనోహర్ కుమార్ చాంపియన్‌గా నిలిచాడు. ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో 40 ప్లస్ పురుషుల సింగిల్స్ విభాగంలో మనోహర్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మనోహర్ కుమార్ 11–13, 11–2, 11–4, 11–8తో రామారావుపై గెలుపొందాడు. 50 ప్లస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో పి. సురేశ్ 11–7, 10–12, 11–4, 7–11, 11–9తో ఎంవీఎన్ కిశోర్ కుమార్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. 60–64 వయో విభాగంలో నటరాజ్ శర్మ 14–12, 11–6, 11–3తో ఉపేంద్రనాథ్‌పై గెలుపొందాడు. 65 ప్లస్ పురుషుల ఫైనల్లో జీవీ రంగారావు 11–1, 11–3, 11–5తో కేఆర్ శ్రీనివాస రావుపై గెలుపొందగా.. 70 ప్లస్ పురుషుల టైటిల్‌పోరులో సి. శ్రీనివాస్ 12–10, 11–2, 12–8తో రమణ ప్రసాద్‌ను ఓడించాడు. -
విజేతలు స్నేహిత్, ప్రణీత, జతిన్ దేవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్టాగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (జీటీటీఏ), జి. ప్రణీత (హెచ్‌వీఎస్) సత్తా చాటారు. బండ్లగూడలోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో వీరిద్దరూ పురుషులు, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. బుధవారం పురుషుల ఫైనల్లో స్నేహిత్ 11–0, 11–7, 6–11, 12–10, 6–11, 11–6తో అమన్ (సీఆర్‌ఎస్‌సీబీ)పై గెలుపొందాడు. మహిళల టైటిల్‌పోరులో ప్రణీత 11–7, 11–4, 14–12, 7–11, 8–11, 8–11, 11–7తో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో వరుణి జైస్వాల్ 11–9, 11–9, 13–11, 11–7తో మోనిక (జీఎస్ఎం)పై, ప్రణీత (హెచ్‌వీఎస్) 11–7, 11–13, 11–9, 6–11, 12–10, 11–7తో నైనా జైస్వాల్ (ఎల్బీఎస్)పై, బి. అమన్ 11–5, 11–6, 6–11, 15–13, 11–5తో అమాన్ ఉర్ రహమాన్ (ఏవీఎస్‌సీ)పై, స్నేహిత్ 11–4, 11–1, 8–11, 11–5, 11–8తో సరోజ్ సిరిల్‌పై గెలుపొందారు. క్యాడెట్ విభాగంలో జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్), శ్రీయ (ఏడబ్ల్యూఏ) చాంపియన్లుగా నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌ల్లో జతిన్ దేవ్ 6–11, 5–11, 11–8, 13–11, 11–4, 11–8తో ఆరుశ్ (ఏపీజీ)పై గెలుపొందగా... శ్రీయ 11–9, 11–4, 11–8, 11–8తో పి. జలాని (వీపీజీ)ని ఓడించింది. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషన్ సాయి (ఎంఎల్ఆర్) 11–3, 4–11, 11–3, 11–7, 11–9తో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్)పై నెగ్గాడు. బాలికల తుదిపోరులో గౌరి (ఎంఎల్ఆర్) 5–11, 7–11, 14–12, 13–11, 9–11, 11–4, 11–8తో పూజ (ఏడబ్ల్యూఏ)ను ఓడించింది. జూనియర్ కేటగిరీలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్), ఎన్. భవిత విజేతలుగా నిలిచారు. ఫైనల్లో కేశవన్ M 7–11, 7–11, 12–10, 11–7, 8–11, 11–4, 11–4తో ప్రణవ్ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై, భవిత 11–3, 15–17, 11–9, 11–8, 11–13, 9–11, 11–5తో కీర్తన (హెచ్‌వీఎస్)పై గెలిచారు. యూత్ బాలుర ఫైనల్లో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 11–9, 5–11, 11–8, 11–3, 11–9తో స్నేహిత్‌పై గెలుపొందగా... బాలికల తుదిపోరులో రాగ నివేదిత 6–11, 4–11, 11–9, 11–9, 11–8, 9–11, 12–10తో నైనా జైస్వాల్ (ఎల్బీఎస్)ను ఓడించింది. -
హైదరాబాద్ జట్లకు రెండు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్టాగ్ అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు సత్తా చాటాయి. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల, జూనియర్ బాలుర టీమ్ విభాగంలో హైదరాబాద్ జట్లు విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. మహిళల టీమ్ విభాగంలో రంగారెడ్డి జట్టు చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జూనియర్ బాలుర టీమ్ ఫైనల్లో హైదరాబాద్ 3–0తో రంగారెడ్డిపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున జషన్ సాయి 3–1తో అథర్వ మోఘేపై, కేశవన్ కన్నన్ 3–1తో వివేక్‌పై, ఎస్ఎస్కే కార్తీక్ 3–0తో ఇషాంత్‌పై గెలుపొందారు. పురుషుల టీమ్ ఫైనల్లో హైదరాబాద్ 3–2తో రంగారెడ్డి జట్టును ఓడించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో యశ్ 3–1తో శాశ్వత్ సామల్పై, రెండో మ్యాచ్‌లో సరోజ్ సిరిల్ 3–2తో సాయినాథ్ రెడ్డిపై గెలుపొందడంతో రంగారెడ్డి 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే తర్వాతి మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన హైదరాబాద్ విజేతగా నిలిచింది. మూడో సింగిల్స్ మ్యాచ్‌లో వత్సిన్ (హైదరాబాద్) 3–1తో విశాల్‌పై, నాలుగో మ్యాచ్‌లో శాశ్వత్ సామల్ 3–0తో సరోజ్ సిరిల్‌పై, ఐదో మ్యాచ్‌లో సాయినాథ్ రెడ్డి 3–1తో యశ్‌పై నెగ్గి జట్టును విజేతగా నిలిపారు. మహిళల టీమ్ ఫైనల్లో రంగారెడ్డి 3–2తో హైదరాబాద్ జట్టును ఓడించింది. రంగారెడ్డి తరఫున తొలి మ్యాచ్‌లో భవిత 3–1తో సృష్టిపై, రెండో మ్యాచ్‌లో 3–0తో రాగ నివేదితపై గెలుపొందగా... మూడో మ్యాచ్‌లో వినిచిత్ర 3–1తో సృష్టిపై నెగ్గింది. హైదరాబాద్ జట్టులో రాగ నివేదిత 3–2తో వినిచిత్రపై గెలుపొందగా... సృష్టి–నివేదిత జోడీ 3–2తో భవిత–వినిచిత్ర జంటను ఓడించింది. వ్యక్తిగత విభాగాల మ్యాచ్‌ల ఫలితాలు ∙క్యాడెట్ బాలికల క్వార్టర్స్: సత్య (జీఎస్ఎం) 3–0తో తేజస్విని (ఏడబ్ల్యూఏ)పై, శ్రేయ సత్యమూర్తి 3–2తో శ్రేష్టారెడ్డి (జీఎస్ఎం)పై, శ్రీయ (ఏడబ్ల్యూఏ) 3–1తో శరణ్య (హెచ్‌పీఎస్)పై, జలాని (వీపీజీ) 3–0తో వత్సల (హెచ్‌పీఎస్)పై గెలుపొందారు. -
సెమీస్‌లో సృష్టి గుప్తా, వరుణి జైస్వాల్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ఎంవీ శ్రీధర్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో సృష్టిగుప్తా (ఏవీఎస్‌సీ), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం), జి. ప్రణీత (హెచ్‌వీఎస్), బి. రాగనివేదిత (జీటీటీఏ) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సృష్టి 10–12, 11–5, 11–4, 9–11, 11–6, 8–11, 11–3తో సస్య (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా... వరుణి 4–12, 13–15, 11–7, 11–9, 11–9తో లాస్య (ఏడబ్ల్యూఏ)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణీత 11–6, 11–7, 11–5, 11–6తో దియా వోరా (హెచ్‌వీఎస్)పై, రాగ నివేదిత 6–11, 11–8, 11–9, 1–11, 11–8, 11–7తో మోనిక (జీఎస్ఎం)పై గెలుపొందారు. యూత్ బాలికల విభాగంలో రాగ నివేదిత, సస్య, ప్రణీత, వరుణి జైస్వాల్ సెమీస్‌కు చేరుకున్నారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రాగ నివేదిత 11–8, 9–11, 11–5, 11–2, 11–4తో ఇక్షిత (ఏడబ్లూఏ)పై, ప్రణీత 12–10, 11–8, 11–7, 11–7తో హనీఫా ఖాతూన్ (వీపీజీ)పై, సస్య 11–8, 11–7, 11–7, 11–4తో కీర్తన (హెచ్‌వీఎస్)పై, వరుణి జైస్వాల్ 6–11, 11–7, 10–12, 10–12, 11–3, 11–9, 11–9తో సృష్టి గుప్తా (ఏవీఎస్‌సీ)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ∙క్యాడెట్ బాలుర క్వార్టర్స్: ధ్రువ్సాగర్ (జీఎస్ఎం) 3–0తో అక్షయ్ (ఏడబ్ల్యూఏ)పై, జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్) 3–0తో చిరంతన్ (ప్రొ టీటీ)పై, శౌర్యరాజ్ సక్సేనా (ఏవీఎస్‌సీ) 3–1తో రిషభ్ సింగ్ (వైసీఏఎక్స్టీటీఏ)పై, ఆరుశ్ (ఏపీజీ) 3–0తో సాయి హర్ష (ఎస్పీహెచ్ఎస్)పై నెగ్గారు. ∙యూత్ బాలుర ప్రిక్వార్టర్స్: సాయినాథ్ రెడ్డి 4–1తో విశాల్‌పై, వరుణ్ శంకర్ 4–1తో యశ్‌పై, అమన్ 4–1తో ఐనేశ్పై, అరవింద్ 4–1తో వత్సిన్పై, జషాన్ సాయి 4–3తో గోవింద్ షాపై, కేశవన్ కన్నన్ 4–0తో రాఘవ్ లోయాపై, అలీ మొహమ్మద్ 4–2తో సరోజ్ సిరిల్‌పై, మొహమ్మద్ అలీ 4–0తో త్రిశూల్ మెహ్రాపై గెలుపొందారు. ∙పురుషుల ప్రిక్వార్టర్స్: అలీ మొహమ్మద్ 4–1తో మొహమ్మద్ అలీపై, వరుణ్ శంకర్ 4–3తో కేశవన్‌పై, సరోజ్ 4–0తో అంకిత్‌పై, పీయూశ్ 4–0తో సాయినాథ్ రెడ్డిపై, అమన్ 4–1తో విశాల్‌పై, అరవింద్ 4–0తో జుబేర్‌పై, విఘ్నయ్ 4–0తో శాశ్వత్‌పై గెలుపొందారు. ∙పురుషుల క్వార్టర్స్: విఘ్నయ్ 4–0తో స్వర్ణేందుపై, సరోజ్ 4–1తో పీయూశ్ పై, అరవింద్ 4–2తో అమన్‌పై, వరుణ్ శంకర్ 4–2తో అలీ మొహమ్మద్‌పై విజయం సాధించారు. ∙క్యాడెట్ బాలికల క్వార్టర్స్: జలాని 3–0తో వత్సలపై, శ్రీయ సత్యమూర్తి 3–2తో శ్రేష్టారెడ్డిపై, శ్రీయ 3–1తో తేజస్వినిపై, ప్రజ్ఞాన్ష 3–0తో శరణ్యపై నెగ్గారు. -
ఐదో స్థానమైనా అదే రికార్డు
యోగ్యకార్త: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో మనకిదే అత్యుత్తమం కావడం విశేషం. బుధవారం 5–6 స్థానాల కోసం ఇక్కడ జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 3–0తో హాంకాంగ్‌పై నెగ్గింది. దీంతోపాటు చాంపియన్స్ డివిజన్లో ఇరాన్‌ను 3–0తో ఓడించి స్వర్ణం గెల్చుకుంది. వర్గీకరణ మ్యాచ్‌లో తొలుత శరత్ కమల్ 9–11, 11–6, 7–11, 11–7, 11–7తో లామ్ స్యు హంగ్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో అమల్ రాజ్ 9–11, 11–4, 11–6, 11–7 స్కోరుతో ఎన్జీ పాక్నమ్పై గెలిచాడు. మూడో దాంట్లో సత్యన్ 11–5, 11–13, 11–7, 14–12తో క్వాన్ మన్ హొపై నెగ్గాడు. దీంతో తదుపరి రెండు మ్యాచ్‌లు నిర్వహించాల్సిన అవసరం లేకుండానే భారత్ జయభేరి మోగించినట్లైంది. టీమ్ విభాగంలో సత్యన్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం విశేషం. వ్యక్తిగత విభాగం పోటీలు గురువారం మొదలవుతాయి. -
వరుణి జైస్వాల్‌కు రెండు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) ఆకట్టుకుంది. ఆమె మహిళల, యూత్ బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. జూనియర్ బాలికల విభాగంలో ఎన్. భవిత (జీఎస్ఎం), పురుషుల విభాగంలో అమన్ (సీఆర్‌ఎస్‌సీబీ), యూత్ బాలుర కేటగిరీలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (జీటీటీఏ), జూనియర్ బాలుర విభాగంలో బి. వరుణ్ శంకర్ (ఎంఎల్ఆర్) చాంపియన్లుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వరుణి జైస్వాల్ 7–11, 11–9, 11–8, 10–12తో నిఖత్ బాను (ఆర్బీఐ)పై గెలుపొందింది. ఐదో గేమ్‌లో నిఖత్ బాను గాయం కారణంగా వైదొలగడంతో వరుణిని విజేతగా ప్రకటించారు. పురుషుల తుదిపోరులో అమన్ 11–8, 7–11, 11–8, 8–11, 11–9, 11–9తో స్నేహిత్ (జీటీటీఏ)ను ఓడించాడు. యూత్ బాలికల ఫైనల్లో వరుణి 8–11, 11–9, 11–13, 11–7, 11–5, 8–11, 11–7తో రాగ నివేదిత (జీటీటీఏ)పై గెలుపొందగా... బాలుర విభాగంలో స్నేహిత్ 11–4, 11–7, 11–7, 11–4తో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్)ను ఓడించాడు. జూనియర్ బాలికల టైటిల్‌పోరులో భవిత 11–1, 11–3, 4–11, 11–2, 11–8తో మెర్సీ (హెచ్‌వీఎస్)పై నెగ్గింది. బాలుర తుదిపోరులో వరుణ్ శంకర్ 11–2, 11–8, 11–7, 11–4తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్)పై విజయం సాధించాడు. సబ్ జూనియర్ బాలుర విభాగంలో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్), జషాన్ సాయి (ఎంఎల్ఆర్) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్‌ల్లో కరన్ సప్తర్షి (ఎంఎల్ఆర్)పై, త్రిశూల్ మెహ్రా, ఇషాంత్ (ఎస్పీహెచ్ఎస్)పై జషాన్ సాయి నెగ్గారు. బాలికల విభాగంలో మెర్సీ (హెచ్‌వీఎస్), పలక్ (జీఎస్ఎం), శ్రీయ (జీఎస్ఎం), అనన్య (జీఎస్ఎం) సెమీస్‌కు చేరుకున్నారు. క్యాడెట్ బాలబాలికల్లో జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్), ధ్రువ్ సాగర్, శౌర్య రాజ్ (ఏవీఎస్‌సీ), స్మరణ్, శ్రీయ, శ్రీయ, ప్రజ్ఞాన్ష (వీపీజీ), పి. జలానీ (వీపీజీ) సెమీస్‌కు చేరారు. -
క్వార్టర్స్‌లో స్నేహిత్, మొహమ్మద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (జీటీటీఏ), మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో స్నేహిత్ 4–1తో వరుణ్ శంకర్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందగా... మొహమ్మద్ అలీ 4–3తో చంద్రచూడ్‌ను ఓడించి ముందంజ వేశారు. మహిళల విభాగంలో ఎం. మోనిక (జీఎస్ఎం), నిఖత్ బాను, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) సెమీఫైనల్లో అడుగు పెట్టారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మోనిక 4–0తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, నిఖత్‌బాను 4–0తో సస్య (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ 4–0తో భవిత (జీఎస్ఎం)పై విజయం సాధించారు. యూత్ బాలికల విభాగంలో జి. ప్రణీత (హెచ్‌వీఎస్), ఎన్. భవిత (జీఎస్ఎం), బి. రాగ నివేదిత (జీటీటీఏ), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ప్రణీత 4–0తో హనీఫా ఖాటూన్ (వీపీజీ)పై, భవిత 4–2తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, రాగ నివేదిత 4–1తో వినిచిత్రపై, వరుణి జైస్వాల్ 4–1తో సస్య (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. -
క్వార్టర్స్‌లో రాగ నివేదిత, ప్రణీత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బి. రాగ నివేదిత (జీటీటీఏ), జి. ప్రణీత (హెచ్‌వీఎస్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రాగ నివేదిత 4–3తో సృష్టి (ఏవీఎస్‌సీ)పై గెలుపొందగా... ప్రణీత 4–0తో ప్రాచీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో మోనిక (జీఎస్ఎం) 4–1తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, వరుణి (జీఎస్ఎం) 4–0తో కీర్తనపై, భవిత (జీఎస్ఎం) 4–0తో వినిచిత్ర (జీఎస్ఎం)పై, లాస్య 4–0తో నిఖితపై, సస్య 4–1తో దియా వోరాపై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. యూత్ బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రాగ నివేదిత 4–1తో సృష్టిపై, ప్రణీత 4–0తో నిఖిత (వైఎంసీఏఎక్స్‌టీటీఏ)పై, సస్య 4–0తో విధి జైన్‌పై, లాస్య 4–0తో కీర్తనపై, భవిత 4–1తో ఇక్షితపై, హనీఫా 4–1తో శరణ్యపై గెలుపొందారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాలానీ గ్రూప్ చైర్మన్, ఎండీ పురుషోత్తమ్ పోటీలను ప్రారంభించారు. -
విజేతలు విష్ణు, దియా
సాక్షి, హైదరాబాద్: సీఐఎస్సీఈ ఏపీ, తెలంగాణ రీజినల్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బి. విష్ణు (గీతాంజలి స్కూల్), దియా ఎన్ వోరా (నాసర్ స్కూల్) ఆకట్టుకున్నారు. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ (ఆబిడ్స్) ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 బాలబాలికల సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ చాంపియన్లుగా నిలిచి టైటిళ్లను అందుకున్నారు. యశ్పాల్ రాజ్ పురోహిత్ (ఫ్యూచర్‌కిడ్స్, రాజమండ్రి) రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోగా... హృదయ్ షా (గీతాంజలి, బేగంపేట్) మూడోస్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో అషితా అగర్వాల్ (గీతాంజలి), ఉరినా ఖాన్ (నాసర్ స్కూల్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. టీమ్ విభాగంలో గీతాంజలి స్కూల్ (బేగంపేట్) జట్లు బాలబాలికల విభాగంలో చాంపియన్లుగా నిలిచాయి. అండర్–17 బాలుర సింగిల్స్‌లో కె. వరుణ్ (జాన్సన్ గ్రామర్ స్కూల్), యజ్ఞేశ్ (సెయింట్ జోసెఫ్), అర్జున్ (ఫ్యూచర్‌కిడ్స్)... బాలికల కేటగిరీలో నిషా గణేశ్ (హెచ్‌పీఎస్, బేగంపేట్), లెహర్ అగర్వాల్ (నాసర్ స్కూల్), అమూల్య (గీతాంజలి)... అండర్–14 బాలుర సింగిల్స్‌లో ఒమర్ మంజూర్ (నాసర్ స్కూల్), ఆదిత్య (సెయింట్ జోసెఫ్), సోహమ్ (ఫ్యూచర్ కిడ్స్).... బాలికల విభాగంలో దిత్య (గీతాంజలి), నష్రా షేక్ (నాసర్ స్కూల్), అమ్తుల్ నూర్ (నాసర్ స్కూల్) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్– 14 బాలుర టీమ్ చాంపియన్‌షిప్‌ను గీతాంజలి స్కూల్... బాలికల టీమ్ టైటిల్‌ను నాసర్ స్కూల్ (ఖైరతాబాద్) గెలుచుకున్నాయి. అండర్–17 టీమ్ చాంపియన్‌షిప్‌ను హెచ్‌పీఎస్ బేగంపేట్ (బాలుర), నాసర్ స్కూల్ (బాలికల) జట్లు సాధిం చాయి. బహుమతి ప్రదాన కార్యక్రమంలో మెదక్ చర్చి బిషప్ సోలోమన్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
జాడ లేని భారత టీటీ కోచ్!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు మరో ఏడాది ఉన్న తరుణంలో భారత టేబుల్ టెన్నిస్ శిబిరాన్ని కోచ్ లేమి కలవరపెడుతోంది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, జకార్తా ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలను అందించిన కోచ్ మసిమో కోస్టాంటిని వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో డేజన్ పాపిక్ను మార్చిలో చీఫ్ కోచ్‌గా నియమించారు. అయితే ఇప్పటివరకు పాపిక్ భారత జట్టుతో చేరకపోవడంతో క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. కటక్‌లో సోమవారం ముగిసిన కామన్వెల్త్ టోర్నీకే పాపిక్ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడంతో ఆటగాళ్లంతా సొంత ప్రాక్టీస్‌తోనే ఈ టోర్నీ బరిలో దిగారు. మరోవైపు భారత టీటీ సమాఖ్య (టీటీఎఫ్ఐ) కూడా పాపిక్ స్పందన కోసం వేచిచూస్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ‘సాయ్ అతని నియామకాన్ని ధ్రువీకరించింది. ఈ మేరకు సంబంధిత పత్రాలను ఐదు రోజుల క్రితమే అతనిని పంపించాం. అతని సమాధానం కోసం వేచి చూస్తున్నాం’ అని ఆయన తెలిపారు. -
వరుణి జైస్వాల్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: సామ్రెడ్డి సుదర్శన్ రెడ్డి స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణి జైస్వాల్ సత్తా చాటింది. బండ్లగూడ మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో వరుణి జైస్వాల్ యూత్ బాలికలు, మహిళల కేటగిరీలలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. బుధవారం యూత్ బాలికల తుదిపోరులో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 11–8, 6–11, 11–8, 7–11, 11–5, 11–6తో నైనా (ఎల్బీ స్టేడియం)పై, మహిళల ఫైనల్లో 11–9, 10–12, 11–9, 10–12, 11–9, 8–11, 11–4తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో అమన్ (సీఆర్‌ఎస్‌సీబీ) 11–7, 11–9, 11–5, 4–11, 12–14, 7–11, 15–13తో విఘ్నయ్ రెడ్డి (ఆర్బీఐ)ని ఓడించి విజేతగా నిలిచాడు. యూత్ బాలుర ఫైనల్లో సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ) 12–14, 11–8, 11–3, 11–3, 11–7తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్)పై గెలిచాడు. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషన్ సాయి 6–11, 11–9, 8–11, 11–2, 11–6, 11–8తో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్)పై, జూనియర్ బాలుర ఫైనల్లో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్) 11–8, 11–6, 11–8, 7–11, 9–11, 11–7తో జషన్ సాయి (ఎంఎల్ఆర్)పై గెలుపొందారు. మరోవైపు సబ్ జూనియర్ బాలికల తుదిపోరులో అనన్య (జీఎస్ఎం) 8–11, 11–8, 11–9, 11–6, 11–5తో పలక్ (జీఎస్ఎం)పై, జూనియర్ బాలికల ఫైనల్లో భవిత (జీఎస్ఎం) 11–9, 11–8, 10–12, 10–12, 11–4, 11–8తో పలక్‌పై గెలుపొంది టైటిళ్లను కైవసం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం (టీఎస్‌టీటీఏ) అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. -
జతిన్‌దేవ్, కావ్యలకు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో కావ్య (ఏడబ్ల్యూఏ), జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్) విజేతలుగా నిలిచారు. వ్యాసపురి బండ్లగూడ వేదికగా జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన క్యాడెట్ బాలుర ఫైనల్లో జతిన్‌దేవ్ 3–0తో పార్థ్ భాటియా (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా, బాలికల తుది పోరులో కావ్య 3–1తో నిఖిత (వీపీజీ)ని ఓడించింది. సబ్ జూనియర్ బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్), ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్‌ల్లో కేశవన్ 4–0తో క్రిష్ సింఘ్వీ (ఏడబ్ల్యూఏ)పై, కార్తీక్ 4–0తో ప్రణవ్ (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు. బాలికల సెమీస్‌లో భవిత (జీఎస్ఎం) 4–0తో నిఖిత (వీపీజీ)ని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు జూనియర్ బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వరుణ్ శంకర్ (జీటీటీఏ) 4–1తో యశస్విన్ (జీఎస్ఎం)పై, అమన్ (ఏవీఎస్‌సీ) 4–0తో వత్సిన్ (ఏడబ్ల్యూఏ)పై, కేశవన్ 4–1తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై, కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 4–1తో సాయినాథ్‌రెడ్డి (ఎంఎల్ఆర్)పై గెలిచారు. బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఐశ్వర్య (ఏడబ్ల్యూఏ) 4–1తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, అంజలి (జీఎస్ఎం) 4–1తో రమ్యపై, భవిత (జీఎస్ఎం) 4–0తో విధి (జీఎస్ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 4–1తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందారు. యూత్ బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 4–3తో నైనాపై, శ్రీజ (ఎంఎల్ఆర్) 4–0తో రాగ నివేదిత (జీటీటీఏ)పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు. -
విజేతలు విఘ్నయ్, నిఖత్ బాను
సాక్షి, హైదరాబాద్: ఎంవీ శ్రీధర్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆర్బీఐ ప్లేయర్లు నిఖత్ బాను, విఘ్నయ్ రెడ్డి విజేతలుగా నిలిచారు. ఖైరతాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విఘ్నయ్ రెడ్డి 4–2తో బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై, మహిళల టైటిల్ పోరులో నిఖత్ బాను 4–0తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. యూత్ బాలికల ఫైనల్లో జి. ప్రణీత 4–1తో నైనా (ఎల్బీ స్టేడియం)పై, బాలుర ఫైనల్లో వరుణ్ శంకర్ 4–0తో పీయూష్ అగర్వాల్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందారు. ఎంఎల్‌ఆర్‌కు చెందిన కేశవన్ కన్నన్ సబ్ జూనియర్, జూనియర్ బాలుర విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకున్నాడు. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో కేశవన్ 4–3తో కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది, జూనియర్ బాలుర ఫైనల్లో కేశవన్ 4–1తో వరుణ్ శంకర్‌ను ఓడించాడు. జూనియర్ బాలికల తుదిపోరులో లాస్య (ఏడబ్ల్యూఏ) 4–3తో ఎన్. అంజలి (జీఎస్ఎం)పై, సబ్ జూనియర్ బాలికల తుదిపోరులో భవిత (జీఎస్ఎం) 4–0తో విధి జైన్ (జీఎస్ఎం)పై గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. క్యాడెట్ బాలబాలికల సింగిల్స్ విభాగంలో జతిన్‌దేవ్(ఎస్పీహెచ్ఎస్), నిఖిత టైటిళ్లను సొంతం చేసుకున్నారు. -
త్రిశూల్, అనూప్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో త్రిశూల్, అనూప్ సెమీఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగిన జూనియర్ బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో త్రిశూల్ (ఎస్పీహెచ్ఎస్) 3–0తో యశ్ (పీఎస్ఎం)పై, అనూప్ (ఎస్పీహెచ్ఎస్) 3–2తో రాజు (పీవీఎన్‌హెచ్‌ఎస్)పై గెలిచారు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో అథ ర్వ (చిరెక్) 3–0తో యశ్ చంద్ర (ఎస్పీహెచ్ఎస్)పై, సాయికిరణ్ (పీవీఎన్‌హెచ్‌ఎస్) 3–1తో ప్రణవ్ (చిరెక్)పై నెగ్గారు. మరోవైపు జూనియర్ బాలుర టీమ్ ఈవెంట్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సెయింట్‌పాల్స్ హైస్కూల్ 3–0తో చిరెక్ ఐసీఎస్‌సీపై, చిరెక్ సీబీఎస్ఈ 3–0తో భారతీయ విద్యా భవన్‌పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. -
ప్రణీత డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో జి. ప్రణీత రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదిలాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ భవన్ కలెక్టర్ చౌక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆమె యూత్ బాలికల, మహిళల కేటగిరీల్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన యూత్ బాలికల ఫైనల్లో ప్రణీత (హెచ్‌వీఎస్) 11–2, 10–12, 11–5, 11–9, 10–12, 11–7తో అంజలి (జీఎస్ఎం)పై విజయం సాధించింది. మహిళల తుదిపోరులో ప్రణీత 11–2, 10–12, 11–5, 10– 12, 11–5, 8–11, 11–6తో మౌనిక (జీఎస్ఎం)ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. -
స్నేహిత్‌కు ఘనసన్మానం
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ యువ సంచలనం ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్‌కు శుక్రవారం ఘనసన్మానం జరిగింది. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) యాజమాన్యం స్నేహిత్‌ను సన్మానించింది. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్నేహిత్ సభ్యునిగా ఉన్న భారత బృందం రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు డబుల్స్ విభాగంలోనూ స్నేహిత్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ప్రదర్శనల పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏడబ్ల్యూఏఎస్‌ఏ నిర్వాహకులు భవిష్యత్‌లో జాతి గర్వించే మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
టైటిల్ పోరుకు లాస్య, నైనా
సాక్షి, హైదరాబాద్: ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యలో జరుగుతోన్న స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో లాస్య (ఏడబ్ల్యూఏ), నైనా (ఎల్బీ స్టేడియం) ఫైనల్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో లాస్య 7–11, 7–11, 11–6, 11–9, 7–11, 11–4, 11–6తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై గెలుపొందగా, నైనా 9–11, 11–1, 6–11, 11–7, 11–9, 11–5తో ఎం. మౌనిక (జీఎస్ఎం)ను ఓడించింది. పురుషుల విభాగంలో మొహమ్మద్ అలీ (ఎల్బీ స్టేడియం), అమన్ రహమాన్ (ఏవీఎస్‌సీ) తుదిపోరుకు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్‌ల్లో మొహమ్మద్ అలీ 11–8, 11–4, 12–10, 8–11, 11–8తో అలీ మొహమ్మద్‌పై, అమన్ 11–8, 13–11, 11–8, 11–13, 11–13, 12–10తో వి. చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందారు. ఇతర కేటగిరీ సెమీఫైనల్ మ్యాచ్‌ల ఫలితాలు క్యాడెట్ బాలికలు: నిఖిత (వీపీజీ) 11–6, 11–5, 11–5, 11–3తో ధ్రితి (జీఎస్ఎం)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 6–11, 12–10, 11–7, 11–5, 11–7తో ప్రగ్యాన్ష (వీపీజీ)పై నెగ్గారు. బాలురు: జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్) 11–6, 11–7, 11–6, 11–4తో కార్తీక్ (నల్లగొండ)పై, శౌర్యరాజ్ సక్సేనా (ఎంఎల్ఆర్) 11–2, 11–7, 5–11, 11–4, 8–11, 11–4, 11–3తో పార్థ్ భాటియా (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. సబ్‌జూనియర్ బాలికలు: ఎన్. భవిత (జీఎస్ఎం) 11–7, 11–7, 11–9, 11–8తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, విధి జైన్ (జీఎస్ఎం) 11–5, 11–7, 11–9, 11–9తో ప్రియాన్షి (జీఎస్ఎం)పై విజయం సాధించారు. బాలురు: కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్)11–7, 9–11, 12–10, 11–8, 11–6తో అథర్వ (ఏడబ్ల్యూఏ)పై, ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 11–8, 11–6, 11–8, 11–6తో ప్రణవ్ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై ఆధిక్యం సాధించారు. జూనియర్ బాలికలు: ఐశ్వర్య డాగా (ఏడబ్ల్యూఏ) 11–9, 9–11, 2–11, 11–6, 11–4, 11–7తో అంజలి (జీఎస్ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 9–11, 11–7, 11–9, 11–5, 11–7తో భవిత (జీఎస్ఎం)పై గెలుపొందారు. బాలురు: అద్వైత్ (ఏడబ్ల్యూఏ) 11–5, 11–7, 11–2, 11–7తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్)పై, బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11–6, 4–11, 7–11, 11–8, 11–7, 11–7తో అమన్ రహమాన్ (ఏవీఎస్‌సీ)పై నెగ్గారు. యూత్ బాలికలు: జి. ప్రణీత (హెచ్‌వీఎస్) 12–10, 11–5, 7–11, 11–7, 11–9తో నైనా (ఎల్బీఎస్)పై, రచన (జీఎస్ఎం) 11–5, 8–11, 12–10, 5–11, 11–3, 1–11, 14–12తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. -
చాంప్స్ విష్ణు, దియా
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రీజినల్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బి. విష్ణు, దియా చాంపియన్లుగా నిలిచారు. సీనియర్ బాలుర ఫైనల్లో జ్ఞాన రేవంత్ (ఫ్యూచర్ కిడ్స్)పై విష్ణు (గీతాంజలి) గెలుపొందాడు. హృదయ్ షా (గీతాంజలి) మూడో స్థానంలో నిలిచాడు. బాలికల ఫైనల్లో మధుమాల (నాసర్ స్కూల్, ఖైరతాబాద్)పై దియా (నాసర్ స్కూల్) నెగ్గింది. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్‌కోఠికి చెందిన దిశా సంఘ్వి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు జూనియర్ బాలురు: 1. ఫణీంద్ర (సెయింట్ ఆన్స్, రాజమండ్రి), 2. ఒమర్ మంజూర్ ఖాన్ (నాసర్ స్కూల్, గచ్చిబౌలి), 3. రవివర్మ (సెయింట్ జాన్స్, వైజాగ్); బాలికలు: 1. ఛార్వి ఫల్గుణ్ (ఫ్యూచర్ కిడ్స్, రాజమండ్రి), 2. టి. అంకిత (టింపనీ స్కూల్, వైజాగ్), 3. టి. ఆశ్రిత (టింపనీ స్కూల్, వైజాగ్). జూనియర్ బాలుర డబుల్స్: 1. కృషాల్– లక్ష్య (ఫ్యూచర్‌కిడ్స్), 2. జి.మోహిత్– ఆకర్ష్ (ఫ్యూచర్‌కిడ్స్), 3. శ్రీవాస్తవ–మహంతి (హెచ్‌పీఎస్, బేగంపేట్); బాలికలు: ఫాతిమా–రషిక (నాస ర్ స్కూల్), 2. అమారా– ఈషా (నాసర్ స్కూల్), 3. హితశ్రీ–సాత్విక (టింపనీ స్కూల్). సీనియర్ బాలుర డబుల్స్: 1. ఆర్యన్–అనికేత్ (గీతాంజలి), 2. బిస్మాన్–గౌరవ్ (ఫ్యూచర్ కిడ్స్), 3. కుంజ్ గుప్తా–వన్‡్ష (గీతాంజలి); బాలికలు: ఉర్వా– హన్నా రెహమాన్ (నాసర్ స్కూల్), 2. ఖుషి–స్మృతి (నాసర్ స్కూల్), 3. ముస్కాన్–సంస్కృతి (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్). -
స్నేహిత్ బృందానికి రజతం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జోర్డాన్ జూనియర్, క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ యువతార సురావజ్జుల స్నేహిత్ టీమ్ విభాగంలో రజతాన్ని సాధించాడు. మనుశ్ షా, స్నేహిత్, జీత్ చంద్రలతో కూడిన భారత్ ‘ఎ’ జూనియర్ టీమ్ ఫైనల్లో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. టైటిల్ పోరులో చైనీస్ తైపీ బృందం 3–1తో భారత్ ‘ఎ’పై విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో స్నేహిత్ 0–3తో సిన్ యాంగ్లీ చేతిలో పరాజయం పాలయ్యాడు. తర్వాతి మ్యాచ్‌లో మనుశ్ 3–1తో మింగ్ వీ తైయ్పై గెలుపొందడంతో 1–1తో స్కోరు సమమైంది. అనంతరం డబుల్స్ పోరులో భారత్ 2–3తో తృటిలో ఓటమిపాలవడంతో చైనీస్ తైపీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి సింగిల్స్ మ్యాచ్‌లో మనుశ్ ఒత్తిడికి చిత్తుకాగా భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–0తో ఇరాన్ ‘ఎ’ టీమ్‌పై, క్వార్టర్స్‌లో ఇరాన్ ‘బి’ జట్టుపై గెలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్యాలను భారత క్రీడాకారులు సాధించారు. -
విజేతలు జతిన్, నిఖిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్, ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో జతిన్‌దేవ్, కార్తీక్, నిఖిత, భవిత విజేతలుగా నిలిచారు. క్యాడెట్ బాలుర సింగిల్స్ విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్లో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్) 1–6, 11–6, 13–11, 11–3తో పార్థ్ భాటియా (ఏడబ్ల్యూఏ)పై గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. అంతకుముందు సెమీఫైనల్లో జతిన్ 11–5, 11–7, 11–3, 11–3తో అరుష్ (ఏపీజీ)పై; పార్థ్ భాటియా 11–7, 11–7, 11–6, 11–5తో ఎ. మహేశ్ (జీటీటీఏ)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించారు. సబ్ జూనియర్ బాలుర విభాగం ఫైనల్లో ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 11–4, 11–6, 12–10, 11–9తో కేశవన్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో కేశవన్ 11–5, 11–6, 11–7, 7–11, 7–11, 11–3తో ప్రణవ్ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై; కార్తీక్ 11–5, 11–7 11–4, 11–7తో యశ్ చంద్ర (ఏడబ్ల్యూఏ)పై గెలిచి ఫైనల్‌కు చేరారు. క్యాడెట్ బాలికల విభాగం ఫైనల్లో హెచ్ఎస్ నిఖిత (వీపీజీ) 11–5, 11–6, 11–5, 11–8తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై గెలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో నిఖిత 11–4, 11–3, 11–6, 11–6తో సమీక్ష రెడ్డి (ఎన్ఎల్జీ)పై; కావ్య 11–5, 11–1, 10–12, 11–2, 11–8తో జలని (వీపీజీ)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించారు. సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో ఎన్. భవిత (జీఎస్ఎమ్) 11–5, 11–4, 11–5, 11–4తో విధి జైన్ (జీఎస్ఎమ్)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్లో విధిజైన్ 11–9, 11–8, 11–9, 11–5తో కె. ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై; భవిత 11–3, 11–4, 11–5, 11–4తో ప్రియాంషి (జీఎస్ఎమ్)పై గెలిచి ఫైనల్ చేరారు. ఇతర విభాగాల మ్యాచ్‌ల వివరాలు జూనియర్ బాలుర క్వార్టర్ ఫైనల్స్: సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్) 11–5, 5–11, 12–10, 11–6, 11–8తో అమన్ (ఏవీఎస్‌సీ)పై, వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11–5, 11–9, 11–8, 11–5తో బి. వత్సిన్ (ఏడబ్ల్యూఏ)పై, కేశవన్ (ఎంఎల్ఆర్) 14–12, 11–7, 11–3, 9–11, 11–9తో కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై, అద్వైత్ (ఏడబ్ల్యూఏ) 9–11, 10–12, 11–5, 11–8, 11–5, 12–10తో యశస్విన్ (జీఎస్ఎమ్)పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టారు. యూత్ బాలుర క్వార్టర్ ఫైనల్స్: కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 14–12, 12–10, 9–11, 12–10, 11–7తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్)పై; పియూష్ అగర్వాల్ 11–5, 12–14, 11–4, 5–11, 11–7, 12–10తో సరోజ్ సిరిల్‌పై, అరవింద్ (ఏడబ్ల్యూఏ) 2–11, 11–8, 12–10, 13–11, 12–14, 11–6తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై గెలిచి సెమీస్ చేరారు. పురుషుల క్వార్టర్ ఫైనల్స్: మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 11–8, 12–10, 11–8, 10–12, 11–6తో అలీ మొహమ్మద్‌పై, అమన్ 7–11, 11–8, 4–11, 11–5, 9–11, 11–5, 12–10 తో చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై గెలిచారు. జూనియర్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: ఎన్. భవిత (జీఎస్ఎమ్) 9–11, 6–11, 11–1, 8–11, 11–7, 11–8, 11–6తో జె. వినిచిత్ర (జీఎస్ఎమ్)పై, టి. రమ్య 8–11, 11–8, 11–5, 11–8, 11–8తో ప్రియాన్షి (జీఎస్ఎమ్)పై విజయం సాధించారు. యూత్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: వి. లాస్య (ఏడబ్ల్యూఏ) 11–4, 11–3, 11–6, 9–11, 11–7తో ఐశ్వర్య (ఏడబ్ల్యూఏ)పై, ప్రణీత (హెచ్‌వీఎస్) 11–4, 11–8, 11–5, 11–5తో హనీఫా ఖాతూన్ (వీపీజీ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎమ్) 11–6, 11–3, 11–3, 11–4తో రమ్యపై గెలిచారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్: నిఖ్ఖత్ బాను (ఆర్బీఐ) 11–8, 11–5, 11–8, 11–9తో పలక్ షా (ఏవీఎస్‌సీ)పై, వరుణి జైస్వాల్ 6–11, 12–10, 12–10, 11–9, 11–8తో మౌనిక (జీఎస్ఎమ్)పై విజయం సాధించారు. -
గీతాంజలి జట్టుకు టీమ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: సెయింట్ పాల్స్ వార్షిక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్, ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో గీతాంజలి దేవాశ్రయ్ జట్టు సత్తా చాటింది. శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీలో బాలికల టీమ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో గీతాంజలి దేవాశ్రయ్ 3–0తో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ‘ఎ’ కొండాపూర్‌పై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. తొలుత జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో విధి జైన్ 9–11, 11–6, 8–11, 11–9, 15–13తో ఐశ్వర్యపై, రెండో మ్యాచ్‌లో భవిత 11–8, 11–7, 11–7తో అనన్యపై గెలిచి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్‌లోనూ విధి జైన్– భవిత ద్వయం 11–8, 11–9, 11–6తో ఐశ్వర్య– పూజపై నెగ్గి గెలుపును పరిపూర్ణం చేసింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో గీతాంజలి దేవాశ్రయ్ 3–0తో సెయింట్ పాల్స్ హైస్కూల్‌పై గెలుపొందగా, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ 3–0తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంను ఓడించింది. మరోవైపు బాలుర టీమ్ విభాగంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ ‘ఎ’, చిరెక్ ‘బి’ జట్లు టైటిల్‌పోరుకు సిద్ధమయ్యాయి. సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సెయింట్ పాల్స్ హైస్కూల్ 3–0తో చిరెక్ ‘ఎ’పై, చిరెక్ ‘బి’ జట్టు 3–2తో సెయింట్ పాల్స్ హైస్కూల్ ‘బి’ జట్టుపై విజయం సాధించాయి. పోటీలకు ముందు జరిగిన టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంజీ ప్లేయర్ మెహదీ హసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రెవరెండ్ బ్రదర్ రాయప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యశ్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్లామ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో సి. యశ్ గోయెల్ సత్తా చాటాడు. నారాయణగూడలోని వైఎంసీఏ టేబుల్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్లో యశ్ అండర్–14, 17 బాలుర విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన అండర్– 17 బాలుర సింగిల్స్ ఫైనల్లో యశ్ 11–6, 5–11, 11–3, 10–12, 11–5తో దివేశ్‌పై విజయం సాధించాడు. అండర్–14 బాలుర కేటగిరీలో యశ్ 11–7, 11–9, 12–10తో ఆకర్‡్షను ఓడించి విజేతగా నిలిచాడు. అండర్–17 బాలికల కేటగిరీలో విధి జైన్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో విధి 11–4, 5–11, 11–4, 4–11, 11–4తో భవితపై గెలుపొందింది. సబ్‌జూనియర్ బాలికల కేటగిరీలో పలక్ 11–6, 11–6, 11–6తో నిఖితపై నెగ్గింది. అండర్–12 కేటగిరీలో జె. గౌరి, తరుణ్ ముకేశ్ టైటిళ్లను గెలుచుకున్నారు. బాలుర ఫైనల్లో తరుణ్ 11–6, 11–8, 11–6తో రిషభ్ సింగ్‌పై, బాలికల టైటిల్‌పోరులో గౌరి 11–4, 11–4, 8–11, 11–6తో శ్రీవత్సపై విజయం సాధించారు. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో గోల్డ్‌స్లామ్ స్పోర్ట్స్ ఎండీ ఎం. తిరుమల రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం (టీఎస్‌టీటీఏ) ఉపాధ్యక్షుడు అమ్రుల్లా దస్తాని, రిఫరీ ప్రమోద్ చంద్ర పాల్గొన్నారు.