
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో త్రిశూల్, అనూప్ సెమీఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగిన జూనియర్ బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో త్రిశూల్ (ఎస్‌పీహెచ్‌ఎస్) 3–0తో యశ్ (పీఎస్‌ఎం)పై, అనూప్ (ఎస్‌పీహెచ్‌ఎస్) 3–2తో రాజు (పీవీఎన్‌హెచ్‌ఎస్)పై గెలిచారు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో అథ ర్వ (చిరెక్) 3–0తో యశ్ చంద్ర (ఎస్‌పీహెచ్‌ఎస్)పై, సాయికిరణ్ (పీవీఎన్‌హెచ్‌ఎస్) 3–1తో ప్రణవ్ (చిరెక్)పై నెగ్గారు. మరోవైపు జూనియర్ బాలుర టీమ్ ఈవెంట్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సెయింట్‌పాల్స్ హైస్కూల్ 3–0తో చిరెక్ ఐసీఎస్‌సీపై, చిరెక్ సీబీఎస్‌ఈ 3–0తో భారతీయ విద్యా భవన్‌పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment