
సాక్షి, హైదరాబాద్: సాక్షి ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్–2017లో భాగంగా శనివారం బంజారాహిల్స్‌లోని మెరీడియన్ స్కూల్‌లో క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ (టీటీ), చెస్ పోటీలు ఉల్లాసంగా సాగాయి. దాదాపు 16 పాఠశాలల విద్యార్థులు ఆటల్లో పోటీ పడ్డారు. పోటీల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
టేబుల్ టెన్నిస్ జూనియర్స్ సింగిల్స్ బాలుర విభాగంలో కుశాల్ (ఎల్‌హెచ్‌ఎఫ్‌ఎల్) టైటిల్ నెగ్గగా... గోపాల్ (మెరీడియన్ స్కూల్, కూకట్‌పల్లి) రెండో స్థానాన్ని పొందాడు. జూనియర్స్ డబుల్స్ విభాగంలో కుశాల్–నజీబ్ (ఎల్‌ఎఫ్‌హెచ్‌ఎస్) జంట టైటిల్ దక్కించుకోగా... గోపాల్–రేవంత్ (మెరీడియన్, కూకట్‌పల్లి) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. టేబుల్ టెన్నిస్ సీనియర్స్ డబుల్స్ విభాగంలో టీపీ అనిరుధ్–ఆత్రేయ (మెరీడియన్ స్కూల్) జంట విజేతగా నిలిచింది. సీనియర్స్ సింగిల్స్ విభాగంలో అనిరుధ్ (మెరీడియన్ స్కూల్) టైటిల్ సాధించగా... చరణ్ (డీపీఎస్ స్కూల్) రన్నరప్‌గా నిలిచాడు. బాలికలు జూనియర్స్ సింగిల్స్ విభాగంలో పాలపర్తి మేరీ (హెచ్‌పీఎస్), రూహి త్రివేది (మెరీడియన్ స్కూల్) తొలి రెండు స్థానాలను సంపాదించారు. బాలికలు సీనియర్స్ విభాగంలో సాహితి (హిందూ పబ్లిక్ స్కూల్) ప్రథమ స్థానంలో, మిత్రవింద (మెరీడియన్) ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలికలు సీనియర్స్ డబుల్స్ విభాగంలో మేరీ–సాహితి (హిందూ పబ్లిక్ స్కూల్) జంట విజేతగా నిలువగా... మిత్రవింద–త్రిషా రెడ్డి (మెరీడియన్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. జూనియర్స్ డబుల్స్ విభాగంలో శ్రావ్య–రోహిణి (మెరీడియన్ స్కూల్) ద్వయం విజేతగా నిలిచింది.
చాంపియన్ కీర్తి...
చెస్ జూనియర్స్ బాలికల విభాగంలో గంటా కీర్తి (డీపీఎస్, నాచారం) విజేతగా నిలువగా... భువన (ప్రగతి స్కూల్) రన్నరప్‌గా నిలిచింది. జూనియర్ బాలుర విభాగంలో సృజన్ (మెరీడియన్ స్కూల్, బంజారాహిల్స్), ఆర్యన్ (డీపీఎస్, నాచారం) వరుసగా తొలి రెండు స్థానాలను సంపాదించారు. సీనియర్స్ బాలికల విభాగంలో శ్రుతిక (కెన్నడీ స్కూల్) అగ్రస్థానాన్ని పొందగా, ఉదయశ్రీ (నీరజ్ స్కూల్) రెండో స్థానాన్ని దక్కించుకుంది. బాలుర సీనియర్స్ విభాగంలో నేమన్ మెహరోత్రా (కెన్నడీ స్కూల్) ప్రథమ స్థానంలో, స్వప్నిల్ (కెన్నడీ స్కూల్) రెండో స్థానంలో నిలిచారు.
విజేత ప్రణవ్...
క్యారమ్స్ విభాగంలో జూనియర్ బాలురు సింగిల్స్ విభాగంలో ప్రణవ్ (డీపీఎస్, మహింద్రాహిల్స్) చాంపియన్ కాగా... మొహియుద్దీన్ (డీపీఎస్, నాచారం) రన్నరప్ అయ్యాడు. జూనియర్ బాలికలు సింగిల్స్ విభాగంలో జరీనా (ఎంఎస్ స్కూల్, టోలీచౌకీ) విజేతగా... హదియా (ఎంఎస్ స్కూల్) రన్నరప్‌గా నిలిచారు. సీనియర్స్ బాలుర సింగిల్స్ విభాగంలో తేజస్వి (పేస్ స్కూల్), ఇషాన్ (పేస్ స్కూల్) తొలి రెండు స్థానాలను పొందారు. జూనియర్ బాలికల విభాగంలో సత్య సాయిప్రియ (పేస్ స్కూల్) విజేతగా, ప్రీతి (పేస్ స్కూల్) రన్నరప్‌గా నిలిచారు. జూనియర్ బాలుర డబుల్స్ విభాగంలో డెల్లా రావు–సంజయ్ (పేస్ స్కూల్) జంట విజేతగా నిలువగా... ప్రణయ్–ఆకాశ్ (డీపీఎస్, నాచారం) జోడీ రన్నరప్‌గా నిలిచింది. సీనియర్ బాలురు డబుల్స్ విభాగంలో ఇషాన్–లలిత్ (పేస్ స్కూల్) జంట చాంపియన్ అయ్యింది. తేజస్వి–రోషన్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. సీనియర్ బాలికల విభాగంలో సత్య సాయిప్రియ–ప్రీతి జోడీ విజేతగా నిలిచింది. సబాత్–లామ్య (ఎంఎస్ స్కూల్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment