సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్టాగ్ అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు సత్తా చాటాయి. మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల, జూనియర్ బాలుర టీమ్ విభాగంలో హైదరాబాద్ జట్లు విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. మహిళల టీమ్ విభాగంలో రంగారెడ్డి జట్టు చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జూనియర్ బాలుర టీమ్ ఫైనల్లో హైదరాబాద్ 3–0తో రంగారెడ్డిపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున జషన్ సాయి 3–1తో అథర్వ మోఘేపై, కేశవన్ కన్నన్ 3–1తో వివేక్‌పై, ఎస్‌ఎస్‌కే కార్తీక్ 3–0తో ఇషాంత్‌పై గెలుపొందారు. పురుషుల టీమ్ ఫైనల్లో హైదరాబాద్ 3–2తో రంగారెడ్డి జట్టును ఓడించింది.
తొలి సింగిల్స్ మ్యాచ్‌లో యశ్ 3–1తో శాశ్వత్ సామల్‌పై, రెండో మ్యాచ్‌లో సరోజ్ సిరిల్ 3–2తో సాయినాథ్ రెడ్డిపై గెలుపొందడంతో రంగారెడ్డి 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే తర్వాతి మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన హైదరాబాద్ విజేతగా నిలిచింది. మూడో సింగిల్స్ మ్యాచ్‌లో వత్సిన్ (హైదరాబాద్) 3–1తో విశాల్‌పై, నాలుగో మ్యాచ్‌లో శాశ్వత్ సామల్ 3–0తో సరోజ్ సిరిల్‌పై, ఐదో మ్యాచ్‌లో సాయినాథ్ రెడ్డి 3–1తో యశ్‌పై నెగ్గి జట్టును విజేతగా నిలిపారు. మహిళల టీమ్ ఫైనల్లో రంగారెడ్డి 3–2తో హైదరాబాద్ జట్టును ఓడించింది. రంగారెడ్డి తరఫున తొలి మ్యాచ్‌లో భవిత 3–1తో సృష్టిపై, రెండో మ్యాచ్‌లో 3–0తో రాగ నివేదితపై గెలుపొందగా... మూడో మ్యాచ్‌లో వినిచిత్ర 3–1తో సృష్టిపై నెగ్గింది. హైదరాబాద్ జట్టులో రాగ నివేదిత 3–2తో వినిచిత్రపై గెలుపొందగా... సృష్టి–నివేదిత జోడీ 3–2తో భవిత–వినిచిత్ర జంటను ఓడించింది.
వ్యక్తిగత విభాగాల మ్యాచ్‌ల ఫలితాలు
∙క్యాడెట్ బాలికల క్వార్టర్స్: సత్య (జీఎస్‌ఎం) 3–0తో తేజస్విని (ఏడబ్ల్యూఏ)పై, శ్రేయ సత్యమూర్తి 3–2తో శ్రేష్టారెడ్డి (జీఎస్‌ఎం)పై, శ్రీయ (ఏడబ్ల్యూఏ) 3–1తో శరణ్య (హెచ్‌పీఎస్)పై, జలాని (వీపీజీ) 3–0తో వత్సల (హెచ్‌పీఎస్)పై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment