
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ యువ సంచలనం ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్‌కు శుక్రవారం ఘనసన్మానం జరిగింది. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) యాజమాన్యం స్నేహిత్‌ను సన్మానించింది. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్నేహిత్ సభ్యునిగా ఉన్న భారత బృందం రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
మరోవైపు డబుల్స్ విభాగంలోనూ స్నేహిత్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ప్రదర్శనల పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏడబ్ల్యూఏఎస్‌ఏ నిర్వాహకులు భవిష్యత్‌లో జాతి గర్వించే మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment