పలక్, రిత్విక్‌లకు టైటిల్స్ | palak, ritwik clinch table tennis titles | Sakshi
Sakshi News home page

పలక్, రిత్విక్‌లకు టైటిల్స్

Published Sun, Sep 18 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

palak, ritwik clinch table tennis titles

స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్


 
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బోడెపూడి శ్రీకాంత్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పలక్, రిత్విక్ విజేతలుగా నిలిచారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం క్యాడెట్ బాలికల విభాగంలో జరిగిన ఫైనల్లో జి. పలక్ (జీఎస్‌ఎం) 9-11, 11-5, 5-11, 11-5, 11-9తో ఆశ్లేష సింగ్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా... బాలుర విభాగంలో స్టాగ్ అకాడమీకి చెందిన రిత్విక్ 13-15, 11-5, 5-11, 11-4, 11-5తో త్రిశూల్ మెహ్రా (ఎల్‌బీఎస్)ను ఓడించి టైటిల్స్‌ను దక్కించుకున్నారు.

అంతకు ముందు జరిగిన బాలికల సెమీస్‌లో పలక్  6-11, 11-7, 14-12, 11-7తో పూజ (ఏడబ్ల్యూఏ)పై, ఆశ్లేష సింగ్ 11-8, 11-7, 11-5తో ప్రియాంక రాజ్ (హెచ్‌వీఎస్)పై విజయం సాధించారు. బాలుర సెమీస్‌లో త్రిశూల్ 7-11, 12-10, 11-6, 11-1తో వేణు మాధవ్ (జీఎస్‌ఎం)పై, రిత్విక్ 11-7, 11-6, 11-6తో కుషాల్ (జీటీటీఏ)పై నెగ్గారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఆయుషి (జీఎస్‌ఎం) 11-7, 11-3, 11-9, 11-2తో కీర్తన (హెచ్‌వీఎస్)పై నెగ్గి విజేతగా నిలిచింది.

 ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

 జూనియర్ బాలుర ప్రిక్వార్టర్స్: స్నేహిత్ (జీటీటీఏ 11-2, 11-5, 11-9, 11-5తో గోవింద్ (స్టాగ్ అకాడమీ)పై, సారుు (జీఎస్‌ఎం) 11-5, 11-9, 9-11, 11-9, 11-6తో వెంకట ధనుష్ (ఏడబ్ల్యూఏ)పై, అరవింద్ (ఏడబ్ల్యూఏ) 11-5, 11-7, 11-2, 11-8తో రఘురాం (నల్గొండ)పై, హరికృష్ణ (జీటీటీఏ) 11-9, 11-8, 11-6, 11-4తో అనూప్ అమర (స్టాగ్ అకాడమీ)పై, అలీ మొహమ్మద్ (స్టాగ్ అకాడమీ) 12-10, 11-2, 11-7, 11-9తో రుత్విక్ (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు.


 జూనియర్ బాలికల క్వార్టర్స్: నైనా (ఎల్‌బీఎస్) 11-8, 13-11, 11-7, 8-11, 10-12, 11-9తో ఆయుషి (జీఎస్‌ఎం)పై, ప్రణీత (హెచ్‌వీఎస్) 5-11, 11-5, 11-3, 8-11, 11-5, 11-8తో అంజలి (జీఎస్‌ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 11-3, 8-11, 8-11, 6-11, 11-7, 11-8, 11-4తో భవిత (జీఎస్‌ఎం)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 11-8, 11-7, 11-7, 11-5తో దేవయాని (జీఎస్‌ఎం)పై విజయం సాధించారు.

 మహిళల రెండో రౌండ్: మౌనిక (జీఎస్‌ఎం) 11-6, 11-3, 7-11, 11-4, 11-8తో గాయత్రి (హెచ్‌వీఎస్)పై, నిఖత్ బాను (జీఎస్‌ఎం) 11-5, 11-6, 11-4, 11-7తో రచన (జీఎస్‌ఎం)పై, ఆకుల శ్రీజ (జీటీటీఏ) 11-1, 11-4, 11-2, 11-2తో నవ్య (ఖమ్మం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 11-1, 11-3, 11-5, 11-8తో హనీఫ (స్టాగ్ అకాడమీ)పై, లాస్య (11-5, 11-4, 11-7, 11-7తో పలక్ షా (స్టాగ్ అకాడమీ)పై నెగ్గారు.

 సబ్ జూనియర్ బాలుర క్వార్టర్స్: వరుణ్ (జీటీటీఏ) 7-11, 12-10, 11-7, 11-8, 11-8తో విశాల్ (జీఎస్‌ఎం)పై, కేశవన్ కన్నన్ (జీటీటీఏ) 7-11, 11-9, 7-11, 11-5, 8-11, 11-4, 11-4తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై, ధనుష్ (ఏడబ్ల్యూఏ) 11-8, 11-9, 11-6, 11-13,11-9తో రితేశ్ థామస్ (జీటీటీఏ)పై కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 11-4, 9-11, 11-7, 7-11, 11-4, 11-8తో సారుునాథ్ రెడ్డి (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు.

 యూత్ బాలుర ప్రిక్వార్టర్స్: స్నేహిత్ (జీటీటీఏ) 11-7, 11-4, 11-6, 11-3తో అభయ్ (ఏడబ్ల్యూఏ)పై, హర్ష్ లహోటి (హెచ్‌వీఎస్) 13-11, 11-7, 11-9, 11-9తో సౌరభ్ (జీఎస్‌ఎం)పై, పీయూష్ (స్టాగ్ అకాడమీ) 11-9, 12-10, 11-5, 8-11, 7-11, 7-11, 12-10తో అలీ మొహమ్మద్ (స్టాగ్ అకాడమీ)పై విజయం సాధించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement